కేదార్నాథ్
కేదార్నాథ్ ఆదిశంకరులచే స్థాపించబడిన శివాలయం. జ్యోతిర్లింగాలలో ఇది ఒకటి. హిమాలయాల్లోని చార్ధామ్ పుణ్యక్షేత్రాలలో ఇది ఒకటి. ఆదిశంకరులు ఈక్కడ ఈశ్వర సాన్నిధ్యం చెందటం ఇక్కడి ప్రత్యేకత. అతి పురాతన శివలింగాలలో ఇది ఒకటి.
హిందువుల ముఖ్య పుణ్యక్షేత్రాలలో ఒకటి. ఇది భారతదేశంలోని ఉత్తరా ఖండ్ లోని రుద్రప్రయాగ జిల్లా లోని ఒక నగర పంచాయితీ. కేదార్నాథ్ సముద్రమట్టానికి 3584 మీటర్ల ఎత్తులో ఉంది. మందాకినీ నది పైభాగంలో మంచు కప్పిన కొండల మధ్య ఉంది. హిందువుల పవిత్ర ఆలయమైన కేదార్నాథ్ శివాలయం ఉన్న పుణ్య క్షేత్రం. శివభక్తుల ముఖ్య పుణ్యక్షేత్రం కేదార్నాథ్.కేదార్నాథ్ గుడి పవిత్రమైన శైవ క్షేత్రం. గర్హ్వాల్ కొండల పైభాగంలో ఉంది. ప్రతికూల వాతావరణం కారణంగా అక్షయతృతీయ నుండి దీపావళి వరకు భక్తుల సందర్శనార్ధం ఈ గుడిని తెరచి ఉంచుతారు. ఇక్కడ పూజలు నిర్వహించడానికి అధికారమున్న కుటుంబం అంటూ ఏదీ లేదు. గుడిలో ప్రతిష్టితమయిన లింగం యొక్క కాలం ఇదమిద్దంగా ఇంతవరకు నిర్ణయించబడలేదు. గుడి చేరటానికి రోడ్డు మార్గం లేదు. గౌరికుండ్ నుండి గుర్రాలు, డోలీలు మరియు కాలినడకన మాత్రం గుడిని చేరవచ్చు. ఈ గుడిని ఆదిశంకరులు నిర్మించినట్లు విశ్వసిస్తున్నారు. కేదార్నాథ్గుడి వెనుక భాగంలో ఆదింకరుల సమాధికి ఉంది. 12 జ్యోతిర్లింగాలలో ఇది ఒకటి. ఉత్తరాఖండ్ లోని చార్ధామ్లలో ఇది ఒకటి. గంగోత్రి, యమునోత్రి, బద్రీనాథ్ మరియు కేదార్నాధ్ లను చార్ ఉత్తరాఖండ్ ధామ్లుగా వ్యవహరిస్తారు.
ఆలయం ముందరి భాగంలో కుంతీ దేవి, పంచ పాండవులు, శ్రీకృష్ణుని మూర్తులు వరుసగా కుడ్య శిలలుగా దర్శనమిస్తాయి. గర్భగుడిలో కేదారీశ్వరుడు స్వయంభువుడుగా దర్శనం ఇస్తాడు. ఇక్కడ కురుక్షేత్ర యుద్దానంతరం సగోత్రీకుల హత్యాపాతకం నుండి బయట పడటానికి పాండవులు శివుని కోసం గాలిస్తూ ఇక్కడికి చేరిన పాండవులను చూసి శివుడు భూగర్భంలోకి వెళ్ళగా పాండవులు విడవకుండా వెన్నంటి శివుని వెనుకభాగాన్ని స్పర్శించి పాపవిముక్తులైనట్లు పురాణ కథనం. తలభాగం నేపాల్ లోని పసుపతినాధుని ఆలయంలో ఉన్నట్లు స్వయంగా శివుడు పార్వతీతో చెప్పినట్లు స్థల పరాణం చెప్తుంది. పాండవులు కుంతీ దేవితో ఇక్కడ ఈశ్వరుని పూజించినట్లుగా ఆ కారణంగా వారి విగ్రహాలు ఆలయంలో ఉన్నట్లు కొందరు విశ్వసిస్తారు. ఆలయ ప్రాంగణంలో యాత్రీకులకు కావలసిన పూజా సామగ్రి దుకాణాలలో లభిస్తుంది. ఆలయ మార్గంలో ప్రయాణించే సమయంలో వృక్షాలతో కూడిన పచ్చని పర్వతాలు జలపాతాలు యాత్రీకులను అలరిస్తాయి. హిమపాతం వర్షం ఏ సమయంలోనైనా సంభవం. ఆలయం పర్వత శిఖరాగ్రంలో ఉంటుంది కనుక భక్తులు శిఖరాగ్రాన్ని చేరి దర్శించి కిందకు రావడం ఒక వింత అనుభూతి.
పూర్వం కురుక్షేత్ర యుద్ధం ముగిసిన తర్వాత కృష్ణుడు సలహా మేరకు పాండవులు హిమాలయాలకు వెళ్లారు. అయితే మంచుకొండల్లో శివయ్య దాగుకొని పాండవులకు దర్శనమివ్వలేదు.
ఇంకా శివపరమాత్ముడు వృషభరూపంలో మంచుకొండల్లో దాక్కున్నాడు. దీంతో భీముడు వృషభుడిని బయటికి లాగడంతో వృషభం భాగాలు పడ్డాయి. ఇలా మూపుర భాగం పడిన చోటే కేదార్ నాథ్గా ప్రసిద్ధి చెందింది. సుమారు 400 సంవత్సరాలు మంచు కిందే కేదార్నాథ్ ఆలయం ఉన్నదని, ఆలయాన్ని మంచు సైతం ఏమీ చేయలేకపోయిందని చరిత్ర కారులు అంటున్నారు. ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఐదవ జ్యోతిర్లింగక్షేత్రం ‘కేదార్ నాథ్’. ఉత్తర భారతదేశంలో నెలకొని ఉన్న గంగోత్రి .. యమునోత్రి .. కేదార్ నాథ్ ... బదరీ నాథ్ క్షేత్రాలను 'చార్ ధామ్'గా వ్యవహరిస్తుంటారు. ఇక్కడికి వచ్చే యాత్రీకులు ఈ నాలుగింటిని దర్శించుకుని వెళుతుంటారు.

అత్యంత శక్తివంతమైన క్షేత్రంగా అలరారుతోన్న ఈ
క్షేత్రాన్ని .. దేవతులు, ఋషులు అదృశ్యరూపంలో అర్చిస్తూ ఉంటారని భక్తుల
విశ్వాసం.
No comments:
Post a Comment