19 Jul 2015

పిల్లల ఆరోగ్యం మీద కెఫిన్ ఫుడ్స్ ఎలా ప్రభావం చూపుతాయి.

Caffeine-Foods Your Kids Must Avoid in Telugu  కెఫిన్ ఫుడ్స్ వల్ల ఆరోగ్యానికి కలిగే ప్రమాధాలను గురించి మీకు తెలుసా? ముఖ్యంగా కెఫిన్ కలిగిన ఆహారా పదార్థాలు పిల్లల ఆరోగ్యం మీద చాలా చెడు ప్రభావం ను కలిగిస్తాయి. పిల్లలు తినేటటువంటి చాలా ఆహారపదార్థాల్లో కెఫిన్ ఎక్కువగా ఉంటుందన్న విషయం మీకు తెలుసా? పిల్లలు తినేటటువంటి అనేక ఆహారాలు కెఫిన్ తో తయారు చేయబడి ఉంటుందని తెలుసుకొన్నట్లైతే ఆశ్చర్యం కలగక మానదు. పిల్లలు తినే ఆహారాల్లో కెఫిన్ దాగి ఉన్నది అనడానికి కొన్ని ప్రత్యక్ష సాక్షాలు కూడా ఉన్నాయి . ముఖ్యంగా సూపర్ మార్కెట్లో మీ పిల్లల కోసం మీరు కొనుగోలు చేసి ఆహార పదార్థాల ప్యాకెట్స్ ను కొనుగోలు చేయడానికి ముందుగా ప్యాకెట్ మీద ఉన్న సమాచారాన్ని పూర్తిగా క్షుణంగా పరిశీలించాలి.
 
 పిల్లలకోసం తయారుచేయబడే ఆహారాల పదార్థాలు ప్యాకెట్స్ మీద చాలా వరకూ ఎలాంటి సమాచారం కానీ, లేబుల్స్ కానీ ఉండవు అలాంటి పరిస్థిలుల్లో ఏం చేయాలి? అయితే మీరు కెఫిన్ కలిగిన పదార్థాలను ముందుగా తెలుసుకొని వాటిని పిల్లలకు కొనివ్వకపోవడమే మంచిది. కెఫిన్ ఎంతటి ప్రమాధకరమైనదో మనందరికీ తెలిసిన విషయమే. ఇది పిల్లల్లో అజీర్తి, నిద్రలేమి, మరియు తలనొప్పికి గురి చేస్తుంది. మరి అలాంటి కెఫిన్ కలిగిన ఆహారపదార్థాల గురించి కొన్ని మీకోసం.... 
 
 కెఫిన్ దాగి ఉన్న పదార్థాలు
Caffeine-Foods Your Kids Must Avoid in Telugu
Caffeine-Foods Your Kids Must Avoid in Telugu
 
సోడ: సోడా లేదా కార్బొనేటెడ్ డ్రింక్స్ అంటే చిన్న పిల్లల నుండి పెద్ద వారి వరకూ అందరూ ఎక్కువగా ఇష్టపడుతుంటారు . ఇది పిల్లలో తలనొప్పి, నరాల బలహీనత మరియు బ్లడ్ ప్రెజర్ వంటి సమస్యలకు దారితీస్తుంది.  చాక్లెట్స్: పిల్లలు చాలా ఇష్టంగా మరియు ఎక్కువగా తినే ఆహారాపదార్థం చాక్లెట్స్. చాక్లెట్స్ లో కూడా కెఫిన్ అధికంగా ఉంటుంది . ఇది పిల్లలకు చాలా ప్రమాధకరమైనది. కాబట్టి, సాధ్యమైనంత వరకూ చాక్లెట్స్ కు దూరం చేయడం మంచిది.  ఐస్ క్రీమ్స్: కొన్ని రకాల ఫ్లేవర్ ఐస్ క్రీమ్స్ లో కెఫిన్ అధికంగా ఉంటుంది. కాబట్టి పిల్లల కోసం ఐస్ క్రీమ్ కొనుగోలు చేసేప్పుడు జాగ్రత్తలు తీసుకోవడం చాలా మంచిది. హాట్ చాక్లెట్స్: మీ పిల్లలు హాట్ చాక్లెట్ ను ఎక్కువగా ఇష్టపడుతున్నట్లైతే కనుక అందులో కెఫిన్ కలిగి ఉన్నదన్న విషయాన్ని మర్చిపోకండి . కాబట్టి పిల్లలు తీసుకొనే ఫుడ్స్ లో కెఫిన్ ఫుడ్స్ ను నివారిచండం వారి ఆరోగ్యానికి చాలా ఉత్తమం.

No comments:

Post a Comment