24 Jul 2015

సంధ్యావందనము


మార్జనము

శ్లో || అపవిత్రః పవిత్రోవా సర్వావ స్దాంగా తో పివా
యస్స్మరేత్సుండరీకాక్షం సబాహ్యా భన్తర శ్శుచిహ్
పుండరీకాక్ష ! పుండరీకాక్ష ! పుండరీకాక్ష !

టీ అపవిత్రః = స్నానము మొదలైనవి ఆచరింపక శుద్దముగా నున్నవాడైననూ, ఎట్టి దురాచారములు, దుర్గుణములు కలవాడైననూ,
పవిత్రః వా = స్నానము మొదలైనవి ఆచరించి శుచిగా నున్నవాడైననూ,సదాచారములు గలవాడైననూ,
సర్వావ స్దాంగా తో పివా = ఎట్టి అవస్ధలో నున్నవాడైననూ, పుండరీకాక్ష = సర్వ వ్యాపకుండైన ఆ పరమాత్మను, యః = ఎవడు,
స్మరేత్ = స్మరించునో ,
సః = అట్టి పురుషుడు,
సభాహ్యాభ్యన్తరః = వెలుపలలో పలకూడ ,
శుచిహ్ = మహా పవిత్రుడు,
భవతి = అగును.

ఆచమనము

1 . కుడి చేతి నాల్గు వ్రేళ్ళనూ దగ్గరగా బెట్టి ,
ఓం కేశవాయస్వాహా,
ఓం నారాయణాయస్వాహా,
ఓం మాధవయస్వాహా అని నోటితో ఉచ్చరించుచు,

బొటన వ్రేలు మధ్య వ్రేలు మొదటి నుండి , గోకర్ణముగా హస్తమును పెట్టి అర చేతి గుంటలో నురుగుగాని, బుగ్గలు గాని లేకుండ మినపగింజమునుగునంత నీరు ఉంచుకొని, చిటికెన వ్రేలు, దానిప్రక్క వ్రేలును వదులుగ వదిలిపెట్టి ముడుసారులు లోపలకు త్రాగవలెను. బ్రాహ్మణులు అయినవారు మొదట త్రాగిన నీరు బొడ్డు దగ్గరకు పోయిన తరువాత గాని రెండవ సారి త్రాగరాదు. క్షత్రియులు మొదటిసారి త్రాగిన నీరు కంటము దిగిన తరువాత త్రాగవలయును. వైశ్యులు కంటముదాక బోయిన తరువాత త్రాగవచ్చును.

2 . ఓం గోవిందాయనమః,
ఓం విష్ణవేనమః అని చెప్పుచు అర చేతులను రెండింటిని కడుగుకొనవలయును.

3 . ఓం మధుసూదనాయనమః,
ఓం త్రివిక్రమాయనమః అని చెప్పుచు పెదవులు తుడుచుకోవలయును.

4 . ఓం వామనాయనమః ఓం శ్రీధరాయనమః అని చెప్పుచు శిరస్సుపై ఉదకము చల్లుకోవలెను.

5 . శ్రీ హృషీకేశాయనమః అని అనుచు వామహస్తమున నీళ్ళు చల్లవలెను.

6 . ఓం పద్మనాభాయనమః అని చెప్పుచు పాదములచై నీళ్ళు చల్లుకొ వలయును.

7 . ఓం దామోదరాయనమః అని చెప్పుచు శిరస్సుపై ఉదకమును చల్లుకొనవలయును.

8 . ఓం సంకర్షణాయనమః అని చెప్పుచు చేతి వ్రేళ్ళను గిన్నె వలె ఉంచి గడ్డమును తుడుచుకోవలయును.

9 . వాసుదే వాయనమః,
ఓం ప్రద్యుమ్నాయనమః అనుచు వ్రేళ్ళతో ముక్కును వదులుగ పట్టుకోవలయును.

10 . ఓం అనిరుద్దాయనమః,
ఓం పురుషోత్తమాయనమః,
ఓం అదోక్షజాయనమః,
నార సింహాయ నమః అని చెప్పుచు నె త్రములను, చెవులను తాకవలెను.

11 . ఓం అచ్యుతాయనమః అని చెప్పుచు బొడ్డు సృశింపవలెను.

12 . ఓం జనార్ధనాయనమః అని అనుచు చేతివ్రేల్లతో వక్ష స్ధలమును, హృదయమును తాకవలె.
13 . ఓం ఉపెంద్రాయనమః ఓం కృష్ణాయనమః అని అనుచు చేతితో కుడి మూపురమును, ఎడమ మూపురమును తాకవలయును. అనంతరము భూతోచ్చాటన చేయవలెను.

భూతోచ్చావ

శ్లో || ఉత్తిష్ఠన్తు భూత పిశాచాః ఏతే భూమిభారకాః,

ఏతే షా మవిరోదేన బ్రహ్మకర్మ సమారభే .

టీ . ఉత్తిష్ఠ న్త్సు నాయందుండు చెడుగుణములు నశించుగాక ,
భూత పిశాచాః కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యములను చెడుగుణములు,
భూమిభారకాః ఈ జీవితమునకు అపకీర్తి కలుగజేయుచున్నటువంటి ,
ఏతే షాం: ఈ చెడుగుణములు,
ఏతే: ఇవి,
అవిరోధేన: చెడు గుణములు నశించునట్లు,
బ్రహ్మకర్మ: ఈ సంధ్యావందనమును, అహం నేను
సమారభే: ఆచరిచుచున్నాను.

ప్రాణాయామము

తన హృదయములో పరమాత్మ ధ్యానమే తప్ప యితర ఆలోచనలు కలుగ కుండునట్లు చేయుటయే ప్రాణాయామ మనబడును. అట్టి ప్రాణాయామము, వూరకము, కుంభకము, రేచకము అని మూడు విధములు, సప్తవ్యా హృతులలో తోడను శిరస్సు తోడను కూడిన పూర్తి గాయత్రిని జపము చేయుచు, కుడి ముక్కున వాయువును పూరించుట వూరకమనబడును. మూడు సారులు గాయత్రిని జపము చేయుచు వాయువును బంధించి పరమాత్మను ధ్యానము చేయుట కుంభకము. మరల గాయత్రి మంత్రమును ఒకసారి జపము చేసి ఎడమ ముక్కు ద్వారా గాలిని విడుచుట రేచకమనబడును. ఈ మూడును కలసి ఒక ప్రాణాయామమగును. ఈ ప్రాణాయామమును ఉదరము సాయంత్రము మూడు సారులు చేయవలయును. అర్ఘ్యమూ ఇచ్చునప్పుడు కూడ ప్రాణాయామము చేయవలయును. గాయత్రి జపము చేయుటకు ముందు ఒక సారి చేయవలయును.

ఓం భూహ్-ఓం భువః - ఓగ్ o సువః ఓం మహః- ఓం జనః-
ఓం తపః- ఓగ్ ౦ సత్యమ్- ఓం తత్ సవితుర్వరేణ్యంభర్గో దేవస్య
ధీ మహి, ధీ యోయోనః- ప్రచోదయాత్ , ఓమాసోజ్యోతి
రసోమృతం బ్రహ్మ భూర్భువస్సువరోమ్

టీ . ఓం - ఓంకార శబ్దము పరమాత్మ స్వరూపము,
భుహ్ - సకల సంపదలతో కూడిన వాడు,
భువః - పూజ్యుడును,
సువః - సకల ప్రపంచకమునకు ఆధార భూతుడును,
మహః - విశేష ప్రభావము గలవాడును,
జనః - సకలలో కములను సృష్టించినవాడను,
తప - జ్ఞాన స్వరూపుడను,
సత్యం ఓం - జ్ఞానానంద స్వరూపుడును,
దేవస్య - దివ్యమైన జ్యోతి రూపమయిన టువంటియు, 
సవితుహ్ - సృష్టి స్దితిలయములకు కారణమైనట్టిదియు, 
వరేణ్యం - పవి త్ర మైనటువంటిదియు, 
భార్గః - అజ్ఞానమును పారద్రోలునదియు, 
యః - ఏ తేజస్సు , 
సః - మా యొక్క, 
దీయః - జ్ఞానమును, 
ప్రచోదయాత్ - కలిగించుచున్నదో, 
తత్ - ఆ తేజస్సు, 
ధీ మహి - ఆ తేజోరూపుడైన పరమాత్మను ధ్యానము చేయుదును, 
ఆపః - సకలమును కాపాడుచుందునడియు, 
జ్యోతి - స్వయంప్రకాశమైనటువంటియు, 
రసః - సుఖమయి కలుగ జేయునదియు, 
అమృతం - ముక్తిని కలుగాజేయునదియు, 
బ్రహ్మ - పరిపూర్ణ మైనదియు, 
భూహ్ - సకల ప్రపంచమునకు ఆధారమైనదియు, 
భువః -సకల సృష్టికి ఆధారమైనటువంటియు, 
సువః - జీవన్మక్తి ని పొందుటకు కారణముగానున్నది. 

శ్రీ గోవింద ! గోవింద ! గోవింద ! శ్రీ మహావిష్ణోరాజ్ఞయా ప్రవర్త మానస్య అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్దె శ్వేత వరాహకల్సే వైవ సవత మన్వంతరే కలియుగే ప్రదం పాదే , జంబూద్వీపే, భరతవర్షే భారత ఖండే మేరోహ్ దక్షిణదిగ్భాగే శ్రీ శైలస్య ఈశాన్య ప్రదేశీ మధ్య దేశే సమస్త దేమో బ్రాహ్మణా హరి హరి సన్నిధౌ అస్మిన్వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన .........సంవత్సరే ..........ఆయనే ........ఋతౌ........మాసే ..........పక్షే .........తిధౌ , వాసరే శుభ యోగే శుభ కరణ ఏవంగుణ విశేషణ విశిష్టాయాం శుభా తిధౌ , శ్రీమాన్ .....గేత్రః శర్మా శ్రీమతః ....గోత్రస్య శరణస్య ధర్మపత్ని సమెత స్య మమోపాత్త ది రి ట క్ష యద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్ధం ........సంధ్యాముపాసిశ్యే , అని సంకల్పము చెప్పవలయును.

మార్జనము

ఓమ్ ఆపోహిష్టామయోభువః తానుర్జే ద ధాతన
మహేరణాయ చక్షసే, యోవశ్శివ త మోర సః, తస్య యస్యక్ష యాయజిస్వధ ఆసో జన యాధాచనః.
టీ అప - పరమాత్మా, హి - ఎందుచేత , మయోభువః - జ్ఞాన కారణములు, స్ధ - నిలయమై ఉన్నావో, తాః - అట్టి నీవు, నః - మాకు, ఊర్జే - ఆహారమును, ద ధాతన - ప్రసాదింపుము, మహె - పూజింపదగినట్టి, రణాయ - నిలయమై, వెక్షసే - దర్శనము చేయుట, ద ధాతన - ప్రసాదింపుము, భో ఆపః - ఓ పరమాత్మ స్వరూపుడా ! నః - నీ యొక్క,యః - ఏది , ర సః - దయా స్వరూపము, శివ తమః - మిగుల శుభకరమైనదో, తస్య - అట్టి వానికి , ఉశతీ - ప్రేమతోనుండు, మాతరః - తల్లులవలె , ఇహ - ఈ జన్మయందు, నః - మాకు, భాజయత - కలుగజేయుము,యస్యక్ష మాయ - నీ దయా స్వరూపమును చూచుటకు, జిన్వధ -కోరుచున్నారో, తంర సం - ఆదయాస్వరూపమును, అర - ఆలస్యముచేట్టి శ్రమపెట్టక, గమామ - కలుగజేయుము, ఆపః - ఓ దయా స్వరూపుడా !సః - నన్ను , జనయధ - నీ దివ్య స్వరూపమును పొందునట్లు అనుగ్రహింపుము.
ప్రాతర్మన్త్రాచమన (జలపాన) మునకు చెప్పవలసిన మంత్రము

సూర్యశ్చ మామన్యుశ్చ మన్యుపతిశ్చ మాన్యుకృతేభ్యః,పాపేభ్యో రక్షన్తాం, యద్రాత్యా త్సా పమకార్షం, మనసా వాచాహస్తాభ్యాం, పద్భ్యా ముద రేణ శిశ్ఘ్చా, రాత్రి స్తదవలుమ్బతుసూర్యే జ్యోతిష జుహొ మి స్వాహా

టీ సూర్యః - సూర్య మండంమును అంతర్యామియైయుండు పరమాత్మయు, మన్యుశ్చ - జ్ఞాన స్వరూపుడును, మన్యుపతయ - సుగ్ననమును కలుగజేయు యత్కంచ దుంతే మయి, ఇద మహం మామమృత యోనౌ వాడును, మాం - నన్ను, మన్యు కృతేభ్య - పాపాత్ముడ నైన నన్ను, పాపేభ్యః - సకల పాపములనుండి , రక్షాన్తాన్ - రక్షించుగాక , రాత్ర్యా - గతించిన రాత్రియందు, మనసా - మనస్సు చేతను, ఉదరేణ - భోజనము చేయునప్పుడు ఉదరముచేతను, శిశ్గ్చా - అన్య స్త్రీ సంపర్కములును, యత్ - ఏ పాపములను,ఆకార్షమ్ - ఆచరింతునో, తత్ - ఆ పాపములనన్నిటిని రత్రిహ్ - రాత్రియందు చేటిన ఆ పాపములను పరమాత్మ, అవలుమ్సతు - నశింపజేయునుగాక, యత్కించ - యింకను, మయి - నాయందు,యత్ దురితమ్ - నేను తెలియక చేటిన పాపములన్నిటినీ, ఇదమ్ -వాటిని, మాంచ -నాది అను అహంభావమును, అహం - నే న నెది అహంకారమును, సూర్యే - మోక్ష మిచునట్టి నీ యందు, అమృత యోనౌ - దయాస్వరూపుడవైన నీ యొక్క, జ్యోతిషి - తేజస్సు నందు, జుహొమి - భస్మముచేయుచున్నాను, స్వాహా - ఆ పాపములన్నియు పూర్తిగాభస్మము అగునుగాక - అని మంత్రించి ఆజలమును త్రాగవలయును.

మధ్యాహ్నము చెప్పవలసిన మంత్రము

ఆపః పునస్తు పృదీవీం పృదీవీం పూతా పునాతుమాం,
పునస్తు బ్రాహ్మణ స్సతిర్బహ్మా పూతా పునాతుమాం,
జ్ఞాన స్వరూపు యదుచ్చిష్ట మభోజ్యం యద్వా దుశ్చరి తంమమ,
పునస్తు మామాపోసతాంచ ప్రతిగ్ర హగ్గ్ ౦స్వాహా.
టీ ఆపః - ఆ పరమాత్మ, పృధీవీమ్ - నా శరీరమును, పునస్తు - పవిత్రము చేయుగాక, పృధీవీమ్ - నా దేహము, పూతా - మంచి కర్మలు చేయుగార, మామ్ - నన్ను, పునాతు - పవిత్రము చేయుగాక, ఉచ్చిష్టమ్ - ఇతరుల ఎంగిలి తినిన పాపమును, అభోజ్యమ్ - తినగూడని పదార్దములు తినుట వలన కలిగిన పాపమును, యద్వాదుశ్చరితమ్ మయ - ఇట్టి పాపములు, అపవిత్రమైన పనులు చేసినందు వలన కలిగిన నా పాపములను, అవతాం - తిలదానము మొదలగు పట్ట కూడని నిదానములు నేను పట్టినందున కలిగిన పాపములను, ప్రతిగ్రహంచ - చెడ్డ దానములు పట్టుటి లన కలిగిన పాపములను, మామ్ - నన్ను, అప - దయామయుడైన ఆ పరమాత్మ, సర్వమ్ - నేను చేసిన సకల పాపములను నశింపజేసి, పునస్తు - మరల పవిత్రునిగను, పుణ్యాత్మునిగను చేయుగాక.


సాయంకాలమున మంత్రాచ మనమునకు చెప్పవలసిన మంత్రము
అగ్నిశ్చ మామన్యుశ్చ మన్యుపత యశ్చ మాన్యుకృతేభ్యః
పాపేభ్యో, రక్షిన్తా, యదహ్నాత్సాపమకార్షం మనసావాతాహస్తాబ్యాం పద్భ్యా ముద రేణ శిశ్గ్చా అహస్త ద వలుమ్పతుసత్యే జ్యోతిషి జుహొ మి స్వాహా.
టీ అగ్నిశ్చ = అగ్నిసాక్షియైన పరమాత్మయు, మన్యుశ్చ = జ్ఞాన స్వరూపుడును, మన్యుపతయశ్చః = గురువును, మన్యుకృతేభ్యః = అజ్ఞానముతో నున్న, పాపేభ్య = సమస్త పాపములనుండి, రక్షన్తాం = రక్షించునుగాక, ఆహ్నా = ప్రతి దినమును, మనసా = మనసు చేత, వాచా = మాటల చేత, హస్తాభ్యామ్ = చేతులతో, పద్భ్యామ్ = పాదములచే, ఉద రేణ = భోజనాదులచే, శిశ్గ్చా = వ్యభిచారము మొదలగు పాపకార్యములవలనను, యత్ = ఆ పాపములన్నింటినీ, అహః = దయస్వరూపుడైన ఆ పరమాత్మ, అవలుమ్పతు = నశింపజేయుకు ప్రార్ధించు చున్నాను, కించ = మరియును, మయి = నాది యను మమకారమును అహం = నన్ను అను అహంకారమును, సత్యే = కాలత్ర యమందుండు, అమృత యోనౌ = ఈ జగత్తునకు కారణభూతుడైన, జ్యోతిషి = స్వయం ప్రకాశ మానమున, జుహొమి = నశింపజేయుచున్నాను, స్వాహా = నా పాపములన్నియు నీ జ్యోతియందు పూర్తిగా భస్మమగుగాక. ద ధీ క్రావ్ ణ్నోఅకారిషం, జిష్ణో రశ్వస్యవాజినః, సురభినో ముఖా కరతృణ ఆయూగ్ ౦ షి తారి షత్ ఆపోహిష్టా మయోభువః తాన ఊర్జే ద ధాతన, మహేరణాయ చక్ష సేయోవ శ్శివ త మోర నః, తస్య భాజయతే హనః ఉశ తీ రి వ మాతరః, తస్మా అరంగ మామవో, 
యస్యక్ష మాయ జిన్వధ అపోజన యధాచనః
టీ ద ధీ క్రావ్ ణ్నో = మహా ప్రభావము గలవాడైన ఆ పరమాత్మను, జిష్ణో = జయప్రదుడును, అశ్వస్య = సర్వాంత ర్యావి
యు, వాజినః = భక్తులను సదా కాపాడుచుండు వాడును అయిన ఆ పరమాత్మను, అకారిషమ్ = నేను ఎల్లప్పుడు
ధ్యానము చేయుదును, నః = నా యొక్క, ముఖా = మనస్సును, సురభి = పవిత్రమైనది గా కరత్ = చేయుగాక,
ఆయూగ్ ౦ షి = నేను ఆచరించు పనులన్నియు ఈశ్వర ప్రీతి అగునట్లు, తారిషత్ = అనుగ్రహించునుగాక.


మరలమార్జనము


హిరణ్యవర్ణాశ్శుచ  యః పావకాః యా సుజాతః క శ్యపోయా
స్వి న్ద్రః అగ్నిం యాగర్భంద ధీ రే విరూ పాస్తాన ఆపశ్శాగ్ ౦
స్యోనాభనస్తు యాసాగ్ ౦ రాజా వరుణో యాతి మధ్యే
సత్యానృతే ఆవ సశ్యంజనానాం మధుశ్చ్యుత శ్శుచ యోయాః
పావకాస్తాన అపశ్శగ్ o స్యోనాభవస్తు, యాసాం దేవాః
ది వికృణ్వన్తి భక్షం యాఆన్త రీ రి క్షే బహు భాభ వన్తియాః పృధీవీం
వయ సోస్ధన్తి శుక్రాస్తా నా పశ్శగ్ సోన్యా భవస్తు శివే న మాచ
క్షుషా వ శ్యతాపశ్శివ యా త్వక్ వో పృశత త్వంచమే.
సర్వాగ్ ౦ అగ్నీగ్ oర ప్సుత షదో హువేలో మయివర్చోబలమోజో నిర త.


టీ హిరణ్యవర్ణా = బంగార పురంగు గలిగినటువంటియు, శుచయః = పవిత్రమైనటువంటియు, పావకాః = పవిత్రముచెయునట్టియు, యాసు = వేటియందు, కశ్యప = సర్వసాక్షి యైన సూర్యుడు, జాతః = ఉద్భవించెనో, యాః = ఏపరమాత్మ, అగ్నిమ్ = అగ్నిని, గర్భం = గర్భమున , దధీరెహ్ = ధరించెనో,  విరూపాః = విశ్వరూపుడైన, తాన్ ఆపః =పరమాత్మ , నః = నా యొక్క , శమ్ = కష్టములను తొలగించునదియు, స్యోనాః = శుభమును కలుగజేయునదియు,భవస్తు = అగుగాక, యాసాగ్ o రాజావరుణో యాతిమధ్యే = ఏ బుద్ది యందు, రాజా = ప్రకాశించునట్టి , వరుణః = చైతన్యము, జనానామ్ = ప్రకాశింపజేయుచున్నదో, యాః = ఏది, మధుశ్చ్యత = అమృతము కలుగచేయుచున్నదో, శుచయ = శుచియైనదో , పావకా = అన్నిటినీ పవిత్రము చేయునదిగయున్నదో, తాన్ ఆపః = ఆ పరమాత్మ, సః = నా యొక్క, శమ్ = దుఖములను పోగొట్టి, స్యోనాః = సుఖమును కలుగ జేయుననియు, భవస్తు = ఆగుగాక, దేవాః = ఇంద్రియములు, ది వి = వినోదముగా, యాసామ్ దేవాః ది వికృణ్వన్తిభక్షం = వేనిని ఆహారముగా చేయుచున్నవో, యాః =ఏవి, అన్తరక్షే =  హృదయమను ఆకాశమందు, బహొధా = అనేక మార్గాములుగ, భవన్తి = అగుచున్నవో, యాః = ఏవి, పృధివీమ్ = శరీరమును, వయసా = అమృత గుణముచే, ఉన్దన్తి = తృప్తి పొందుచున్నవో, శుక్రాః = పవిత్రమైన, 
తాఃఆపః = ఆ పరమాత్మ, సః = నా యొక్క, శమ్ =సమస్త దుఖములను పోగొట్టి, స్యోనాః = సుఖమును కలుగజే
యునది, భవస్తు = అగుగాక, భో ఆపః = ఓ పరమాత్మా, శివేన = శుభకరములైన, చక్షుసా = దయతో, మామ్ =
నన్ను, పశ్యత = అనుగ్రహించి చూడుము, శివయా = ఆనందమైన, అనువా = రూపముతో, మే = నా యొక్క, త్వక్ = దేహమును, ఉపసృశిత = వ్యాపించుటచే పవిత్రము చేయుము, హేఆపః = ఓ దైవమా, వః = నీ యొక్క, అప్సుషద =అన్నిటినిపాలించు రూపమునందున్న, సర్వా = సమస్త, అగ్నీన్ = తేజస్సులను, వర్చః = బ్రహ్మవర్చస్సులను, బలమ్ =శక్తికి, ఓజహ = సంతోషమును, మయి = నా యందు, నిధత్త = స్ధిరముగ నుండునట్లు అనుగ్రహించుమని, హువే = వెడుచున్నాను.


పాపవిమోచన మంత్రము


ద్రుపదాది న ముఘ్చతు, ద్రుపదాది వేన్ముచానః, స్విన్నస్స్నాత్వీమలా మలాది ప, పూతం పవిత్రేణే వాజ్యం,
అపశ్శువస్తు మైస్ధనః టీ ద్రుపదాత్ ఇవ = బండ కొయ్యనుండి విడి పించినట్లుగ, ముంచుతు =నన్ను విదిపించుము, ద్రుపదాత్ = బండ కొయ్యనుండి, ముచానః ఇవ = విడువబడిన వాని వలె, స్విన్నః = చెమటపట్టిన వాడు, స్నాత్వా = స్నాన మాచరించి, విమలాత్ ఇవ = మురికిని పోగొట్టుకొనినట్లు, పవిత్రేణ = జ్ఞానముచే, ఆజ్యమ్ = మూలప్రకృతి, పూతం ఇవ = తొలగునట్లు, ఆపః = ఆపరమాత్మ, మాం = నన్ను, శునస్తు = సకల పాపములనుండి విముక్తి గలుగునట్లు జేయుగాక. తరువాత మరల ప్రాణాయామము చేయవలయును.

అర్ఘ్య ప్రదానము

పూర్వోక్టై వంగుణ..... తిధౌ ముఖ్య కాలాతిక్రమణ దోష పరిహారార్ధం ప్రాయశ్చిత్తార్ఘ్య ప్రదాన పూర్వక సాయమర్ఘ్య

ప్రదానం కరిష్యే.
ప్రాతః కాల మంత్రము

ఉద్యన్త మస్తం యన్త మాది తం మభిధ్యాయన్ కుర్వన్బ్రా

హ్మణో విద్వాన్ స్సక లంభ ద్రమశ్నుతే సావాది త్యో
బ్రహ్మేతి బ్రహ్మేవ సన్ బ్రహ్మాస్మేతియ
ఏవం వేద అసావా


టీ ఉద్యస్తమ్ = ఉదయించుచున్న, అస్తంయన్తమ్ = అస్తమించుచున్నట్టి, ఆదిత్యమ్ = స్వయంప్రకాశమానుడైన
సూర్యుని, అభిధ్యాయన్ = ప్రకాశమే, బ్రహ్మేతి = భగవంతునిగా, విద్వాన్ = తెలుసుకొనునట్టి, బ్రాహ్మణః = జ్ఞాని,
సకలమ్ = సమస్త విధములైన, భద్రమ్ = శుభములను, అశ్నుతే = పొందుచున్నాడు, యః = ఎవరు, ఎవమ్ = ఏ విధముగా, వేద = జ్ఞానమును పొందుచున్నాడో, బ్రహ్మేవ సన్ = పరబ్రహ్మరూపుడైన, బ్రహ్మ = భగవంతుని, ఏతి =పొందుచున్నాడు, అసౌ = ఈ, ఆదిత్య = స్వయం ప్రకాశ మానుడైన సూర్యుడే, బ్రహ్మ = బ్రహ్మము.
ప్రాతః కాలమున యీ మంత్రమే పటించ వలయును.


మధ్యాహ్న కాల అర్ఘ్యమంత్రము


హమ్ ౦ సశ్శుచి షద్వ సుర న్త రిక్ష సద్దోతా వేది షద
తిధిర్డురోణసత్ నృషద్వర ససదృత సద్బ్యోమ పనబ్జాగో జా ఋత జా
ఋత జా ఆద్రి జా బూతం బృహత్టీ . శుచిషత్ = పవిత్రమైన మనస్సునందుడువాడును, వసుహ్ = భూమండలమును తన ఉదరమున గలవాడును, అన్తరిక్ష సత్ = సూర్యచంద్ర నక్షత్రములలో అంత ర్యామియై వ్యాపించి యున్నవాడును, హొతా = అగ్నియందుగల తేజో రూపుడును, వేది షత్ = వ్యాపించియున్నవాడును, అతిధిహ్ దురోణసత్ = ధర్మ స్వరూపుడై బ్రహ్మాండ మంతయు వ్యాపిన్చియుండువాడును, నృషత్ = వైశ్వానర రూపుడై మనుష్యులయందుండువాడును, రససత్ = జ్ఞాన రూపుడై బ్రహ్మజ్ఞానము కలవారియందుండువాడును, రుతవత్తు = నిష్పాదకుడై యుండువాడును, వ్యోమసత్తు = సకలాంత ర్యామియై హృదయాకాశమున సంచరించువాడును, ఆజ్ఞాః = నీటియందు మొసళ్ళు మొదలగు రూపములతో నుండువాడును, గో జాః = పశువులు, పక్షులు మొదలగు సర్వ ప్రానులయండును అంత ర్యామియై యుండువాడును రుత జాః = వేదములచే కొనియాడు బడుచుండువాడును, ఆద్రీ జాః = ప్రపంచ మంతటను వ్యాపించియుండువాడును, బృహత్ = శ్రేష్టుడును, రుతమ్ = స్వరూపుడును.

సాయంకాల మంత్రము

ఓం భూర్భువస్సువః, త త్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య
ధీ మహిధి యోయోనర్గో ప్రచోదయాత్తు.ప్రాయశ్చిత్తార్ఘ్యమునకు : ఓం భుహ్ ఓం భువః ఓగ్ ౦ సువః ఓం మహః ఓం జన హః ఓం తపః ఓగ్ ౦ సత్యం ఓం త త్స వితుక్వరేణ్యం భర్గో దేవస్యధీ వహిధి యోయోనః ప్రచోదయాత్తు ఓమాపోజ్యో తిర సోమృతం బ్రహ్మ భూర్భువస్సువరోమ్ అని మంత్రము చెప్పవలయును. దోసిలిలో నీరు పోసుకొని యీ మంత్రముతో అభి మంత్రించి అంగుష్టము తర్జుని వ్రేళ్ళు కలియకుండ మూడు పర్యాయములు గో శృంగాకార ముగ ఎత్తి అర్ఘ్యము యీయవలయును. దీనికి ముందు వ్యాహృతులు శిరస్సు వీ నితో పూర్తిగా గాయత్రి మంత్రమును చెప్పి ప్రాయశ్చిత్తార్ఘ్యము వి డువ వలయును, తరువాత ప్రాయశ్చిత్తార్ఘ్యముతో గూడ ఉదయము సాంత్రము నాలుగు అగుచున్నవి. మధ్యాహ్నము ప్రాయశ్చిత్తార్ఘ్యము ప్రధానా(హంసా)ర్ఘ్యము పిదప మరల ఉదయము వలె ఒక అర్ఘ్యము కలసి మూడు అగుచున్నవి. ఉదయము, మధ్యాహ్నము, ప్రాజ్ఞ్మాఖముగ నిలువబడి అర్ఘ్యము యీయవలయును. సాయంకాలము పశ్చిమ ముఖముగా కూర్చుండి యీయవలయును. సాయంకాలము జలములో విడువరాదు. తరువాత ఆచమనముచేసి సంధ్యాంగ తర్పణము చేయవలెను.
 http://telugubhaktiblog.blogspot.in

No comments:

Post a Comment