16 Jul 2015

శివలింగాలలోని ప్రత్యేకత

 Picture


  శివలింగము లో మూడు భాగాలు ఉంటాయి.  

బ్రహ్మ భాగము భూమిలో , 

విష్ణు భాగం పీఠం లొ, 

శివ భాగం మనకు కనిపించే పూజా భాగము గా 

శిల్పులు ఆగమ శాస్త్రాలలో సూచించిన విధముగ సరియైన రాతిలో గాని ఇతర            పదార్ధాలతో నిర్మిస్తారు.


శివ లింగములు - రకములు :
  • స్వయం భూ లింగములు: స్వయముగా వాటి అంతట అవే వెలసినవి.
  • దైవిక లింగములు:              దేవతా ప్రతిష్టితాలు.
  • రుష్య లింగములు:              ఋషి ప్రతిష్టితాలు.
  • మానుష లింగములు:       ఇవి మానవ నిర్మిత లింగములు.
  • బాణ లింగములు:              ఇవి నర్మదా నదీతీరాన దొరికే(తులా పరిక్షకు నెగ్గిన)                                                         బొమ్మరాళ్ళు.
  •  
    పంచభూతలింగాలు :
           పంచభూతాలు అనగా పృథివి, జలం ,అగ్ని, వాయువు, ఆకాశం. శివుడు ఈ పంచభూతాల స్వరూపాలైన లింగరూపాలతో ఐదు క్షేత్రాలలో ప్రతిష్టితుడై ఉన్నాడు.

    కొన్ని విశేషాలు :
    • శ్రీకాళహస్తి లోని శివలింగాన్ని అభిషేకించేటపుడు ఎవరూ లింగాన్ని తాకరు. కేవలం లింగం యొక్క కింద భాగమైన పానువట్టాన్ని మాత్రమే తాకుతారు.
    • కంచి లోని శివలింగం మట్టి తో చేసినది(పృధ్వీ లింగం) కాబట్టి లింగానికి అభిషేకము జరగదు.నూనెను మాత్రం పూస్తారు.
    • శివరాత్రి నాడు జాగరణ చేసి లింగోద్భవ దర్శనం చేసుకుంటే మోక్షం సిద్ధిస్తుందని విశ్వాసం.

పరమశివుడికి సంబంధించిన ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒక్కొక్క లింగానికి ఒక్కొక్క ప్రత్యేకత వుంటుంది. కొంతమంది వీటిలో తమకిష్టమైన వాటిని ఎంచుకుని నిరంతరం వాటినే పూజిస్తుంటారు. అలాగే ప్రతిఒక్కరూ రకరకాలుగా తమకు అనుగుణంగా వుండే విధంగా, తమకు నచ్చిన సమయంలో పూజించుకుంటుంటారు.

అయితే ఏ లింగాన్ని, ఎప్పుడు, ఎలా పూజించాలి...? వాటివల్ల వచ్చే నష్టాలేంటి, లాభాలేంటి దాని గురించి మనం ఇక్కడ తెలుసుకుందాం....

ఏ లింగాన్ని ఎవరు పూజించాలి...?

లింగపురాణాల ప్రకారం బ్రహ్మవేత్తలు రసలింగాన్నీ, శౌర్య ప్రధానులైన క్షత్రియులు బాణలింగాన్నీ, వాణిజ్య ప్రధానలైన వైశ్యులు స్వర్ణలింగాన్నీ పూజించుకోవాలి. అయితే స్ఫటికలింగాన్ని మాత్రం ఎవరైనా ఎటువంటి భేదాభిప్రాయం లేకుండా పూజించుకోవచ్చు.

భర్తజీవించి వున్న స్త్రీలయితే స్ఫటిక లింగాన్ని, భర్తలేనివారు రసలింగాన్నికాని, స్ఫటికలింగాన్ని గాని అర్చిస్తే ఎంతో మంచిదని లింగపురాణంలో పేర్కొనబడింది.

వాటివల్ల వచ్చే ఫలితం ఏమిటి...?

ఏ లింగాన్ని పూజిస్తే ఏ ఫలితం లభిస్తుందోనన్న విషయాలు లింగపురాణంలో వివరించి వున్నాయి. అందులో రత్నాజ శివలింగాన్ని పూజించడం వల్ల ఐశ్వర్యంతోపాటు వైభవం సిద్ధించి పరిపూర్ణత కలుగుతుంది. అలాగే ధాతుజలింగం భోగ విలాసాలను అందిస్తుంది. మృత్తికాలింగం కూడా శిలా లింగంలాగానే పరిపూర్ణతనునిస్తుంది.

ఏది అతి పవిత్రమైన లింగం..?

శివునికి సంబంధించిన లింగాలలో అత్యంత పవిత్రమైన లింగం బాణలింగం. ఇవి తెల్లగా, చిన్న అండాకారలంలో నదీప్రవాహం వల్ల సహజంగా నునుపుదేలి వుంటాయి. ఇది నర్మదా నదిలో ఎక్కువగా లభిస్తుంది.

ఎప్పుడు పూజించుకోవాలి..?

వైశాఖంలో వజ్రలింగాన్ని, జ్యేష్ట౦లోమరకత లింగాన్ని, శ్రావణంలో నిలపు లింగాన్ని, భాద్రపదంలో పద్మరాగ లింగాన్ని, ఆశ్వయుజంలో గోమేధికలింగాన్ని, కార్తికంలో ప్రవాళలింగాన్ని, మార్గశిరంలో వైడూర్య లింగాన్ని, పుష్యమాసంలో పుష్పరాగ లింగాన్ని, మాఘమాసంలో సూర్యకాంత లింగాన్ని, ఫాల్గుణ౦లో స్పటిక లింగాన్ని పూజించాలి. వీటికి ప్రత్యామ్నాయంగా వెండి, రాగి లింగాలను కూడా పూజించవచ్చు.

చివరగా.... లింగపూజ చేసుకునేవారు ఉత్తరముఖంగా కూర్చొని వుండాలి. అలాగే రుద్రాక్ష, భస్మం, మారేడు అనే మూడువస్తువులు తమతోపాటు తప్పనిసరిగా పూజలో వుంచుకోవాలని శివపురాణంలో చెప్పబడింది.
http://telugubhaktiblog.blogspot.in/2015/04/blog-post_63.html#.VaiAd6OCam4

No comments:

Post a Comment