బేక్‌ఫాస్ట్‌లో... పండ్లు, తేనె, కిస్‌మిస్, బెర్రీ వంటి పండ్లు, భోజనంలో... క్యారట్, బీట్‌రూట్ (పచ్చిగా తినగలిగినవి), తాజా కాయగూరలు ఉండాలి. వెల్లుల్లి, ఉల్లిపాయలు, ఆలివ్ ఆయిల్, బాదం, సోయా, కొవ్వు తీసిన పాలు రోజూ తీసుకోవచ్చు. కిస్‌మిస్, వాల్‌నట్స్, బొప్పాయి, ఆపిల్, పాలకూర, కాకరకాయ, గుమ్మడికాయ, అరటి (కూరగాయ), మొలకెత్తిన గింజలు, రాగులు, సజ్జలు వంటి పొట్టుతో కూడిన చిరుధాన్యం, విటమిన్ ‘సి, ఇ, బీటాకెరోటిన్’ పుష్కలంగా ఉండే పదార్థాలు తీసుకోవాలి. ఊపిరితిత్తుల పనితీరును నియంత్రించడం, మెరుగుపరడచంలో విటమిన్లు, మినరల్స్ ప్రధానమైనవి. కాబట్టి ఇవి ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి.
ధనియాలు, లవంగం, దాల్చిన చెక్క, ఏలకులు, జీలకర్ర, ఇంగువ, అల్లం, పసుపు వంటి సహజమైన మసాలాదినుసులు ఆస్త్మా తీవ్రతను తగ్గిస్తాయి.
ఇలా కూడా తీసుకోవచ్చు...
పసుపు కలిపిన పాలు తాగాలి. స్పూన్ పసుపులో స్పూన్ తేనె కలిపి పరగడుపున తీసుకోవాలి. ఇది ఆస్త్మా నివారణి కూడ. - పాలు లేదా టీలో అరస్పూన్ అల్లం పొడి లేదా మిరియాల పొడి వేసి తాగాలి.
ఇవి వద్దు!
పెరుగు, అరటిపండు, కమలాలు, నిమ్మ, బత్తాయి వంటి పుల్లటి పండ్లు, కూల్‌డ్రింకులు, ఊరగాయలు, స్వీట్లు, గుడ్లు, రంగులు వేసిన ఆహారం, ప్రిజర్వేటివ్స్‌తో కూడిన ఆహారం, బ్రెడ్, ఆవుపాలు. ఉప్పు తగ్గించాలి.
‘బాల్యంలో ఆహారపుటలవాట్లు పెద్దయ్యాక ఆస్త్మా రావడానికి కారణమవుతున్నాయి’ అన్న అధ్యయనాన్ని ప్రతి ఒక్కరూ గమనించి పిల్లలకు ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను చేయాలి.
- డాక్టర్ సుజాతాస్టీఫెన్, న్యూట్రిషనిస్ట్, అవేర్ గ్లోబల్ హాస్పిటల్
No comments:
Post a Comment