21 Aug 2015

నువ్వుల నూనె తో ఉపయోగాలు


1. గుండె ఆరోగ్యానికి :  నువ్వుల నూనెలో కొన్ని ఎలిమెంట్స్ సీసమోలో అనే యాంటీఆక్సిడెంట్స్ మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి .. సీసమోలో గుండె సంబంధిత వ్యాధులకు చాలా మేలు చేస్తుంది.

2. ప్రోటీనులు అధికం: నూనెల్లో ప్రోటీనులు కలిగి ఉండటం చాలా అరుదు. కానీ, నువ్వుల నూనెలో ఒక ఔన్స్ లో 4.5 నుండి 5గ్రాముల ప్రోటీనులు ఉంటుంది. ఇది వెజిటేరియన్స్ మరో అదనపు ప్రయోజనం.


3. మధుమేహ నివారణకు:  011లో ప్రచురించబడిని ఓ అద్యయనం ప్రకారం టైప్ 2 మధుమేహ గ్రస్తులకు ఉపయోగపడుతుందని చెబుతున్నాయి. అధిక మూత్ర వ్యాధితో బాధపడేవారు నువ్వులు పొడిచేసి, గోరువెచ్చటి నీటిలో కలిపి సేవిస్తూ వుంటే మంచి ఉపశమనం పొందడమే కాకుండా ఎముకల వ్యాధులు, కీళ్ళనొప్పులు, చర్మ రోగాలు దూరమవుతాయి.

4. ఎముకల ఆరోగ్యానికి: ఎముకల బలహీనతతో బాధ పడే పెద్ద వారు, ఆస్టియోపొరాసిస్‌ వంటి చికాకులతో ఉన్నవారు కూడా చెంచాడు నువ్వుల్ని నానబెట్టి ఉదయాన్నే పాలలో కలిపి సేవిస్తే ఈ రుగ్మతల నుంచి బయట పడవచ్చు. పిల్లలకిగానీ, పెద్దవారికి గానీ, రక్త హీనత తగ్గి రక్తం బాగా వృద్ధిచెందాలంటే, టీస్పూన్‌ నువ్వులు నానబెట్టి నిత్యం మూడునెలలపాటు తీసుకుంటే రక్తం వృద్ధిచెందడమే కాకుండా ఉదర సంబంధవ్యాధుల్ని నిర్మూలిస్తుంది.నువ్వుల నూనె క్యాల్షియంను అధికంగా అంధించడం వల్ల కీళ్ళ ను కాపాడుతుంది.

5. జీర్ణ సంబంధిత సమస్యలు: 
కొబ్బరినూనె లేదా మస్టర్డ్ వంటి ఇతర నూనెలతో పోల్చినప్పుడ, నువ్వులు నూనె చాలా తేలికగా మరియు మరింత సులభంగా జీర్ణం అవుతుంది. ఈ నూనె మీ పెద్దప్రేగు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది.

6. ఆంటీ స్పాస్మోడిక్ ఆయిల్: నువ్వుల నూనె యాంటీస్పాస్మోడిక్ లక్షణాలున్నాయి. ఫలితంగా ఇది శ్వాసనాళ లో కండరాల నొప్పులు ఉపశమనాన్ని కలిగిస్తుంది. ముఖ్యంగా ఆస్తమాటిక్స్ కు నువ్వులు నూనె యొక్క లక్షణం ద్వారా ప్రయోజనం పొందుతున్నాయి.

7. బ్లడ్ ప్రెజర్ ను తగ్గిస్తుంది:  నువ్వుల నూనెలో ఉన్న మెగ్నీషియం ఆస్తమా, లోయర్ బ్లడ్ ప్లజర్, బ్లడ్ వెజల్స్ ను వంటి వాటిని తగ్గిస్తుంది. మెగ్నీషియం, బ్లడ్ ప్రెజర్ ను తగ్గించడంలో బాధ్యత వహిస్తుంది. ఒక వేళ మధుమేహగ్రస్తుల్లో హైబ్లడ్ ప్రెజర్ ఉన్నప్పుడు నువ్వుల నూనె చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.

8. ఓరల్ హెల్త్:  నువ్వులు దంత క్షయాన్ని పోగొడుతుంది. దంత సమస్యలు, చిగుళ్ళ సమస్యలను, చిగుళ్ళ నుండి రక్తం కారుట, థ్రోట్ ఇన్ఫెక్షణ్ తొలగించి, పళ్ళకు బలాన్ని చేకూర్చుతుంది . నువ్వుల నూనెతో ఆయిల్ పుల్లింగ్ కూడా చేయ్యొచ్చు.

9. క్యాన్సర్ నుండి రక్షణ కల్పిస్తుంది:  యాంటీయాక్సిడెంట్స్ లక్షణాలు కలిగి ఉండటమే కాకుండా, నువ్వుల నూనెలో ఫైటేట్ ఇవి క్యాన్సర్ సెల్స్ తో పోరాడే గుణాలను కలిగి ఉంటుంది.

10. చర్మ ఆరోగ్యానికి: నువ్వుల నూనెలో విటమిన్ మరియు విటమిన్ బి లు పుష్కలంగా ఉన్నందున, చర్మం పాడవకుండా కాపాడుతుంది. మరయు మీరు యవ్వనంగా కనబడేలా , చర్మంలో కొత్త మెరుపులను అంధిస్తుంది. చర్మాన్ని సంరక్షించడంలో నువ్వులనూనె ప్రాధాన్యత చాలానే ఉంది. నువ్వల నూనెలో ఉన్న ఇ మరియు బి విటమిన్ లు చర్మానికి సంబంధిచిన అన్నిరకాల సమస్యలను దూరం చూసే గుణం ఇందులో పుష్కలంగా ఉంది. నువ్వులన నూనెను చర్మ సంరక్షణలో ఉపయోగించడం ద్వారా ముఖంను ఫ్రెష్ గా, యవ్వనంగా మెరుస్తూ ఉండేట్లు చేస్తుంది.

11. జుట్టుకు: నువ్వులను నూనెను: జుట్టు సంరక్షించుకోవడానికి కూడా ఉపయోగిస్తారు. కాబట్టి పల్లేరు కాయలు, నువ్వుపువ్వులు, తేనె, నెయ్యి సమంగా తీసుకొని మెత్తని ముద్దగా నూరి కేశాలు రాలినచోట ప్రయోగించి రుద్దితే తిరిగి జుట్టు పెరుగుతుంది. నువ్వుల నూనెను తలకు మర్ధన చేయడం వల్ల చుండ్రును సులభంగా వదలగొడుతుంది.

12. జలుబు:  సాధారణంగా వచ్చే జలుబు తగ్గిస్తుంది. జలుబు ఎక్కువగా ఉన్నప్పుడు సింపుల్ గా నువ్వుల నూనె వాసన చూస్తే చాలు జలుబును తగ్గించి, శ్వాసతీసుకోవడానికి సులభం చేస్తుంది.

13. బాడీ మసాజ్: నువ్వుల నూనెను శరీరానికి మసాజ్ చేయడం వల్ల శరీరానికి రిలీఫ్ ను ఇచ్చి ఘాడంగా నిద్రపోయేలా చేస్తుంది. నువ్వుల నూనెతో బాడీ మసాజ్ చేయడం వల్ల ప్రతి రోజూ ఒత్తిడికి గురవుతుంటే నువ్వుల నూనె ఒత్తిడి తగ్గించి, టెంషన్ నుండి బయటపడేలా చేస్తుంది .

No comments:

Post a Comment