10 Aug 2015

పీతల ఇగురు- పులుసు


కావలసిన పదార్థాలు:
 
పీతలు - 2 (శుభ్రం చేసి, 4 ముక్కలుగా కట్ చేసి, కాళ్లను విడిగా ఉంచాలి). అల్లం వెల్లుల్లి పేస్టు - ఒకటిన్నర స్పూను, పసుపు - అర టీ స్పూను, కారం - 2 టీ స్పూన్లు, పచ్చిమిర్చి - 3, కరివేపాకు - 4 రెబ్బలు, కొత్తిమీర తరుగు - గుప్పెడు, ఉప్పు - రుచికి తగినంత, నూనె - 5 టీ స్పూన్లు.
తయారుచేసే విధానం:
గసగసాలు - ఒకటిన్నర స్పూను, యాలకులు - 2, దాల్చినచెక్క - అంగుళం ముక్క, జీలకర్ర - 1 టీ స్పూను, లవంగాలు - 3, ధనియాలు - 2 టీ స్పూన్లు, ఉల్లిపాయలు - 4 (అన్నీ ముద్దగా నూరిపెట్టుకోవాలి). తయారుచేసే విధానం: నూనెలో పచ్చిమిర్చి, కరివేపాకు వేగాక మసాల ముద్ద, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు వేసి 7 నిమిషాలు వేగించాలి. పీతల ముక్కలు, కారం,ఉప్పు కలిపి అరకప్పు నీటిని జతచేసి చిన్నమంటపై నీరంతా ఇగిరిపోయి నూనె పైకి తేలేదాక ఉడికించి, కొత్తిమీర చల్లి దించేయాలి.
----------------------------------------------------------------------------------------------------------

పీతల పులుసు
కావలసిన పదార్థాలు:  
(శుభ్రం చేసిన) పీతలు - 4, 
ఉప్పు - రుచికి తగినంత, 
కారం - 2 టీ స్పూన్లు, 
ఉల్లిపాయ -1, 
పచ్చిమిర్చి - 2, 
చింతపండు - గుప్పెడు (రెండు కప్పుల వేడి నీటిలో నానబెట్టి ఉంచాలి), 
కొత్తిమీర తరుగు - అర కప్పు, 
నూనె - ఒకటిన్నర టేబుల్ స్పూన్లు.

తయారుచేసే విధానం:
కొబ్బరి తరుగు - 2 టేబుల్ స్పూన్లు, ఉల్లిపాయలు - 4 (పొడుగ్గా కట్ చేయాలి), దనియా, జీరా, గరం మసాలా పొడి - 1 టీ స్పూను చొప్పున, అల్లంవెల్లుల్లి పేస్టు - 1 టీ స్పూను (అన్నీ ముద్దలా నూరిపెట్టుకోవాలి) తయారుచేసే విధానం: నూనెలో ఉల్లి, పచ్చిమిర్చి తరుగు, మసాల ముద్ద, కారం ఒకటి తర్వాత ఒకటి వేగించాలి. శుభ్రం చేసిన పీతల్ని వేసి మూతపెట్టి మగ్గనివ్వాలి. చింతపండు రసం, ఉప్పు వేసి 5 నిమిషాలు ఉడికించి, మంట బాగా తగ్గించి పులుసు చిక్కబడేదాక (కనీసం 30 నిమిషాలు) ఉంచి కొత్తిమీర చల్లి దించేయాలి.

Thankyou http://ruchulapage.blogspot.in



No comments:

Post a Comment