17 Aug 2015

కొన్ని (స్త్రీల) వ్యాధులకు వంటింటి వైద్యం

1. బాగా మగ్గిన అరటిపండ్లు రెండు లేక మూడు తీసుకుని వాటిలో పేరిన నెయ్యి 30 గ్రాములు, చిన్న ఏలకుల పొడి 3 గ్రాములు కలిపి పిసికి ఉదయం,సాయంత్రం తింటుంటే అతి ఋతురక్తస్రావం రెండు మూడు రోజుల్లొ ఆగిపోతుంది

2. అతిమధురంపొడి 5 గ్రాములు, ఎండు ద్రాక్షపండ్లు 20 గ్రాములు కలిపి మెత్తగా దంచి రెండుపూటలా చప్పరించి తింటుంటే అతిఋతురక్తం క్రమంగా తగ్గి ఆగిపోతుంది.


3. పచ్చివక్కలపొడి 50 గ్రాములు, పిస్తా పప్పు 50 గ్రాములు, పటిక బెల్లం 30 గ్రాములు కలిపి మెత్తగా నూరి నిలవజెసుకోవాలి. పూటకు 10 గ్రాములు మోతాదుగా మూడుపూటలా సేవిస్తుంటే ఆగకుండా ప్రవహించే ఋతురక్తం ఆగిపోతుంది.


4. ధనియాలతో కషాయం కాచుకొని తాగుతూ వుంటే అతి బహిష్టు వ్యాధులు హరించిపోతయ్.

5. స్త్రీల తెల్లబట్ట వ్యాధికి (white discharge) :
ఉసిరిక పండ్లలో (పెద్ద ఉసిరి) వుండే గింజలను దంచి పొడి చేసి సమంగా పటికబెల్లం పొడి కలిపి రెండు పూటలా పూటకు ఒక చెంచా మోతాదుగా మంచి నీటితో సేవిస్తుంటే తెల్లబట్ట వ్యాధి తగ్గిపోతుంది.

6. స్త్రీల ఎర్ర బట్ట వ్యాధికి (over bleeding):
ఉసిరక కాయల పొడి ఒక చెంచా, మంచి తేనె ఒక చెంచా కలిపి తింటూ వుంతే ఎర్రబట్ట వ్యాధి తగ్గిపోతుంది.

thanks to http://www.intivaidyam.in

No comments:

Post a Comment