పిల్లలకు అన్నం తినిపించడమంటే...
పే...ద్ద పని. చందమామను చూపుతూ తినిపిస్తే వెంటనే తినేయడానికి ఇప్పటి పిల్లలు అమాయకులు కాదు. తినడం ఎలా ఎగ్గొట్టాలో వాళ్లకు బాగా తెలుసు. ఇంట్లో పనులన్నీ చేసుకోవడం ఓ ఎత్తై అల్లరి పిల్లలకు అన్నం తినిపించడం మరో ఎత్తు. ఏదో టైమ్‌కు తినిపించాలి కాబట్టి బలవంతంగా పిల్లల నోట్లో పెట్టేస్తుంటాం. కానీ ఎలాంటి ఆహారం పిల్లలు ఇష్టంగా తింటారు? పిల్లలు ఆరోగ్యంగా ఉండాలంటే ఏయే ఆహారం ఎంత మోతాదులో ఇవ్వాలి? నిపుణుల సూచనలు మీకోసం.
ఎదిగే పిల్లలకు సంపూర్ణ సమతుల ఆహారం తప్పనిసరి. అందుకే కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, కొవ్వు, విటమిన్స్, మినరల్స్, నీరు ఇలా అన్నీ తగిన మోతాదులో కలిపిన పౌష్టికాహారం ఇవ్వాలి.
రైస్, బ్రెడ్, చపాతీ, ఇడ్లీ లాంటివి తినిపించాలి. తప్పనిసరిగా పండ్లు, తాజా కూరగాయలు ఉండేలా చూసుకోవాలి. ఇక పప్పు ధాన్యాలు, మాంసం కూడా పెట్టాలి. పాలు, పాల ఉత్పత్తులు ఎక్కువగా ఇవ్వాలి. మినరల్స్‌తో కూడాని కొవ్వు పదార్థాలు, స్వీట్స్ తినిపించాలి. రోజుకు 6 నుంచి 8 గ్లాసుల నీళ్లను తప్పనిసరిగా తాగించాలి. ఇవన్నీ తగిన మోతాదుల్లో తీసుకోవడంవల్ల పిల్లలలో ఎదుగుదల బాగుంటుంది.
కార్బొహైడ్రేట్స్ :
పిల్లలకు ఇచ్చే ఆహారంలో కార్బొహైడ్రేట్స్‌ది ప్రధాన పాత్ర. అయితే ఆ కార్బొహైడ్రేట్స్ ఏ రూపంలో ఇస్తున్నామనేది ముఖ్యం. తీయని పండ్ల రసాలు, చాక్లెట్స్, బ్రేక్‌ఫాస్ట్‌లో ప్రాసెస్‌డ్ ఫుడ్స్, గోధుమలతో తయారు చేసిన బ్రెడ్, ఎక్కువగా పాలిష్ చేయని బియ్యంలాంటి వాటిలో కార్బొహైడ్రేట్స్ పుష్కలంగా లభిస్తాయి.
ప్రొటీన్స్ :
గుడ్లు, పాలు, వెన్న, చికెన్, చేపలు, మాంసం, పప్పు ధాన్యాలలో ప్రోటీన్స్ అధికంగా ఉంటాయి. పిల్లల ఆహారంలో ఇవి కచ్చితంగా ఉండేలా చూసుకోవాలి.
ఫ్యాట్
పిల్లలకు తప్పనిసరిగా ఇవ్వాల్సిన ఆహారంలో కొవ్వు కూడా ముఖ్యం. కొవ్వులో ఒమెగా-3, ఒమెగా-6 ప్రధానం. టునా, సాల్మన్ చేపలు, నువ్వులు, వేరుశనగ, కాజూ, బాదంలలో ఒమెగా -3 ఎక్కువగా దొరుకుతుంది. వెన్నపండు, పొద్దుతిరుగుడు గింజలు, మొక్కజొన్న, బాదంలో ఒమెగా -6 లభిస్తుంది.
కాల్షియం
తప్పనిసరిగా తీసుకోవాల్సిన మరో విటమిన్ కాల్షియం. ఇది ఎముకలు, దంతాలను ఆరోగ్యంగా ఉంచుతుంది. నరాల వ్యవస్థ సరిగా పనిచేయడానికి, కండరాల బలోపేతానికి తోడ్పడుతుంది. ప్రతీరోజూ పిల్లలకు కాల్షియం అవసరం ఉంటుంది. అందుకే ఎక్కువ కాల్షియం ఎక్కువగా ఇవ్వాలి. పాల ఉత్పత్తులు, నువ్వులు, రాగులలో కాల్షియం పుష్కలంగా ఉంటుంది.
ఐరన్
రోగనిరోధక శక్తి పెరగడానికి, పిల్లలలో ఎదుగుదలకు, పునరుత్పత్తి విధులకు ఐరన్ తప్పనిసరి. బాడీలో ఐరన్ తక్కువగా ఉంటే పిల్లలు ఎనీమియా బారిన పడే అవకాశం ఉంది. ఆకు కూరలు, ఎండిన పళ్లు, పుచ్చపండు, బియ్యం, మాంసం, లివర్‌లలో ఎక్కువగా దొరుకుతుంది.
ఆహార వేళలు
మీ పిల్లలకు ఉదయం బ్రేక్‌ఫాస్ట్ తప్పనిసరిగా పెట్టాలి. రాత్రి నుంచి ఏం తినకుండా ఉండటం వల్ల ఉదయం శక్తి తక్కువగా ఉంటుంది. అందుకే పిల్లలను ఖాళీ కడుపుతో స్కూల్‌కు పంపిం చకూడదు. ఆయిల్ ఫుడ్ కాకుండా సులభంగా జీర్ణమయే లైట్ ఫుడ్ బ్రేక్‌ఫాస్ట్‌గా పెట్టాలి.
మూడు పూటలా ఇచ్చే ఆహారంతోపాటు మరో రెండుసార్లు స్నాక్స్ తినిపించండి. స్నాక్స్ అనగానే అందరూ నూనెతోచేసే వంటకాల వైపు చూస్తారు. కానీ డ్రై ఫ్రూట్స్, పాప్‌కార్న్, బ్రెడ్ వంటివి తినిపించడం మంచిది.
పిల్లలకు ఫుడ్ టైమ్ పెట్టండి. దాని ప్రకారమే ఇవ్వండి.
అంతేకాదు మీరు ఫుడ్ తయారు చేసేటప్పుడు వారికీ చూపించండి. షాప్‌కు తీసుకెళ్లడం తెచ్చినవి స్టెప్ బై స్టెప్ ఎలా వండుతున్నారో చెప్పండి. దీనివల్ల పిల్లలు ఫుడ్ గురించి ఎక్కువగా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది.
రోజూ మీరే తినిపించడం కాకుండా వారికి తినడం తొందరగా నేర్పండి. వాళ్లు మొదట తినకపోయినా తరువాత తరువాత వాటిని అలవాటు చేసుకుంటారు.
ఫ్రై కాకుండా ఉడకబెట్టినవి కూరలు పెట్టడం మంచిది. సోడా, ఫ్రూట్ జ్యూసెస్‌లతో పాటు ఎక్కువగా పాలు, నీళ్లు ఇవ్వడానికి ప్రాధాన్యత ఇవ్వండి.
అన్నిసార్లు మరీ కఠినంగా ఉండకుండా ఎప్పుడో ఓసారి జంక్ ఫుడ్స్ కూడా ఇవ్వండి.
కలర్‌ఫుల్ ఫుడ్
ఎప్పుడూ పెట్టిన టిఫిన్స్, అన్నం, కూరలు పెట్టడం వల్ల పిల్లలకు విసుగొస్తుంది. సో కొత్త కొత్త వెరైటీస్ తినిపించండి. అవి ఎలా తయారు చేయాలో చూద్దాం...
పిల్లలు ఎక్కువగా కలర్ ఫుల్ ఫుడ్ ఇష్టపడతారు. సో వాళ్లను ఫుడ్ వైపు ఎట్రాక్ట్ చేయాలంటే ముందుగా కలర్‌ఫుల్‌గా ఉండే డిషెస్ ప్రిపేర్ చేయాలి.
ఫ్రూటీ విప్
కావాల్సినవి :
స్ట్రాబెర్రీ4,
ప్రూన్స్ (అల్‌బూకర్)
2, బనానా 1,
పాలు- సగం కప్పు,
చక్కెర తగినంత
విధానం :
స్ట్రాబెర్రీ, ప్రూన్స్, బనానాను ఒక బౌల్‌లోకి తీసుకుని మెత్తగా చేసుకోవాలి. దీనికి పాలు కలపాలి. చక్కర తగినంత కలిపి సెర్వ్ చేయాలి. బనానా, ప్రూన్స్ జీర్ణ వ్యవస్థను వృద్ధి చేస్తాయి. పిల్ల లో మలబద్దకం రాకుండా చేస్తాయి. ఇక స్ట్రాబెర్రీ రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ప్రూన్స్ దొరకకపోతే కిస్‌మిస్ కూడా ఉపయోగించవచ్చు.
మస్కీ యాపిల్
కావాల్సినవి :
యాపిల్ (తొక్క తీసిన యాపిల్) సగం, ఖర్బూజ (తొక్కతీసినది) సగం, పాలు సగం కప్, చక్కెర తగినంత
విధానం :
యాపిల్, కర్భూజలను పూర్తిగా గ్రైండ్ చేయాలి. దానికి పాలు, చక్కెర తగినంత యాడ్ చేయాలి. దీనివల్ల పిల్లలకు కావాల్సిన :రన్, ఫైబర్, ప్రోటీన్స్ అందుతాయి.
రాగి జావ
( ఇంట్లో తయారు చేసుకోవచ్చు. బయట షాప్స్‌లో కూడా దొరుకుతాయి),
సగం కప్పు రాగుల పొడిసగం కప్పు పాలు, రెండు కప్పుల నీళ్లు, చిటికెడు యాలకుల పొడి, చక్కెర తగినంత
విధానం :
సన్నమంటమీద రాగుల పొడిని వేయించాలి. మరో గిన్నెలో పాలు తీసుకుని గోరు వెచ్చగా చేయాలలి. నీళ్లలో రాగి పొడిని బుడగలు లేకుండా బాగా కలిపి ఉడికించాలి. దీనికి యాలకుల పొడిని వేయాలి. కొద్దిసేపటి తరువాత పాలు, చక్కెర కలుపుకోవాలి. 2 నిమిషాలు ఉడికించి దించుకోవాలి. బ్రేక్‌ఫాస్ట్‌గా రాగి జావ ఇవ్వడం ఆరోగ్యదాయకం. రాగులలో ఐరన్, మినరల్స్, ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి.
Mee
M.S.R
Health Advisor
No comments:
Post a Comment