17 Aug 2015

శంకు స్థాపన కొన్ని విషయాలు



మనందరం ఇళ్ళు, సరస్సులు, గుడులు , మొ. వాని నిర్మాణంలో " శంకు స్థాపన " అన్న మాట వింటు ఉంటాం. కాని ఆ ముహుర్తములో అక్కడ కొన్ని రాళ్లో ఇటుకలో పెట్టి పూజచేసి వాటిని పాతి పెట్టడం మాత్రమె చేస్తాం. దీనిని శంకు స్థాపన అని మాత్రం వ్యవహరిస్తాము. ఈ శంకువు గురించి నియమాలు మొదలగునవి శాస్త్రమున చాలాచేప్పబడినవి. వివిధ ఋషులు, పండితులు పలు అభిప్రాయాలు వేలిబుచ్చిరి. కొన్ని మాత్రం చెబుతాను.

బహుకాలము జీర్ణము కాక ఉండు, ముదురుదైన, వంకలు, కణుపులు లేని కొయ్యను (దానినే దారువు అని అంటారు ) తిసుకునుని 12 అంగుళములు పొడవు 4 అంగుళము వెడల్పు నాలుగు ప్రక్కల ఉండునటుల చేక్కుకోవాలి.అన్ని జాతి కర్రలలో " చండ్రకర్ర " ప్రశస్తమని చెప్పిరి.. ఈ కర్ర నీటిలోను, భూమిలోనూ ఎంతకాలమున్నా మురిసి పోదు. పూర్వము చెరువులకు తూములు పెట్టుటకు దీనినే వాడెడి వారు. మామిడి, వేప వంటివి వాడ రాదు. ఈ దారువును మూడు సమభాగములు గా చెయ్యాలి. మొదటి భాగము 4 పలకలగాను, రెండవ భాగము ఎనిమిది పలకల గాను మూడవ భాగము గుండ్రము గాను చేసుకోవాలి. దీనిలోనికి వాస్తు పురుషుని ఆవాహన చేసి పుష్పము అక్షతలతొ పూజలు యథావిధిగా చేసి తరువాత ముహూర్త కాలమున నిర్ణిత స్థలములు స్థాపిన చెయ్యాలి.

కాళిదాసు మాత్రము శంఖు నిర్మాణంలో మొదటి భాగమును ఎనిమిది పలకల గాను రెండవ భాగమును 4 పలకలగాను చేసుకో వాలని "కాలామృత గ్రంధమున " చెప్పియున్నారు ఈ నాలుగు , ఎనిమిది ఏమి ? నాలుగు దిశలు ఎనిమిది దిక్కులకు సంకేతం గుండ్రనిది భూమికి సంకేతం.

ఈ శంకువు , గృహములు, చెరువులు, ఆలయములు, అన్నిటా నిర్మాణ సమయమున స్థాపించాలి. అందులోను కొన్ని తేడాలు కలవు. గృహములలో గోడలకు లోపల భాగమున అనగా ఇంటిలోనూ, దేవాలయ నిర్మాణమున గోడలకు వెలుపల, చెరువులకు కట్టల క్రింద స్థాపించాలి. పూజా విధానమన్నిట యధావిధిగా జరిపించాలి. ఈ దారువు (శంకువు ) భుమిలోనున్నంతకాలము ఆ యజమానులు సుఖముగా ఆయురారోగ్య ఐశ్వర్య సంతాము కలిగి ఉందురని నమ్మకము. ఇది శాస్త్రమున చెప్పబడినది.

thanks to గుమ్మా రామలింగ స్వామి గారు

No comments:

Post a Comment