ధనవంతులు మాత్రమే ఉపయోగించుకునే ఏసీ (ఎయిర్ కండిషన్) ఇప్పుడు
మధ్యతరగతి వారికీ అందుబాటులోకి వచ్చేసింది. కొందరు ఆఫీసుల్లోనే కాక
ఇళ్లలోనూ ఏసీలోనే ఎక్కువ సమయం గడిపేందుకు ఇష్టపడుతున్నారు. ఏసీలో ఉండడం వలన
చల్లగా హాయిగా ఉన్నప్పటికీ ఆరోగ్య సమస్యలు మాత్రం పొంచి ఉన్నాయనే
విషయాన్ని మరచిపోతున్నారు. ఏసీలో ఉండడం వలన ప్రయోజనాల కంటే కూడా
నష్టాలే ఎక్కువని వైద్యులు సూచిస్తున్నారు. ఏసీలో ఉండడం వలన బయట వాతావరణంలో
చోటుచేసుకునే మార్పులేవీ మనపై దుష్ర్పభావం చూపవు. అత్యాధునికంగా వచ్చిన
ఏసీలలో ఉండే ఫిల్టర్లు సూక్ష్మస్థాయిలో ఉండే కాలుష్యం నుంచి మనల్ని
రక్షిస్తాయి. ఏసీ గదిలో చల్లదనం బయటికి వెళ్లకుండా ఉండేందుకు తలుపులు
వేసేస్తారు.
దీంతో ఆ గదిలో మనం వదిలే కార్బన్ డై ఆక్సైడ్ వాయువు పెరిగి,
ఆక్సిజన్ తక్కువై తలనొప్పు సమస్య ఏర్పడుతుంది. అదేవిధంగా ఆక్సిజన్ సరఫరా
లేనందువల్ల రక్తంలోని ఎర్ర రక్త కణాలలో ఆక్సిజన్‌ను తీసుకెళ్లే సామర్థ్యం
ఒకింత తగ్గుతుంది. దీంతో ఏసీలో చాలా సేపు ఉన్నవారికి బాగా అలసిపోయినట్లుగా
అనిపిస్తుంది. ఎసీలో ఎక్కువ సమయం ఉండేవారికి దాహం అనిపించదు. దీంతో రోజుకి
తాగాల్సిన నీళ్ల కంటే తక్కువ మోతాదులో తాగడం వలన కిడ్నీలో రాళ్ల సమస్య
ఏర్పడుతుంది. ముఖ్యంగా ఏసీ ఉన్న వారికి శ్వాసకోస సంబంధిత సమస్యలు అధికంగా
వస్తాయి. ఇదేవిధంగా ఆస్తమా, లోబీపీ, చర్మం పొడిబారిపోవడం వంటి పలు విధాలైన
ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి. ఏసీలో ఎక్కువ సమయంలో ఉండేవారు ఖచ్చితంగా
జాగ్రత్తలు తీసుకోవాలి.
అప్పుడప్పుడూ చల్లగాలి తగిలే విధంగా బయటకు వస్తూ
ఉండాలి. మధ్యాహ్నం పూట బాగా వేడిగా ఉన్న సమయంలో ఏసీ గదిలో నుంచి
అకస్మాత్తుగా ఎండలోకి రాకూడదు. కాస్త చల్లబడిన తర్వాత సాయంత్రం మాత్రమే
బయటకు రావాలి. తప్పనిసరిగా ఏసీలోనే ఉండాల్సి వచ్చినప్పుడు శరీరానికి
మాయిశ్చరైజింగ్ క్రీములు ఉపయోగించాలి. లేదంటే చర్మం పొడిబారిపోతుంది. మరీ
చలి అనిపిస్తే ఉన్ని దుస్తులు ధరించాలి. దాహం అనిపించకపోయినా అప్పుడప్పుడు
నీళ్లు తాగుతూ ఉండాలి. అన్నిటికంటే ముఖ్యంగా ఏసీని అప్పుడప్పుడు శుభ్రం
చేసుకుంటూ ఉండాలి. ఇలా చేయడం వలన ఏసీ వలన ఎదురయ్యే సమస్యలు కొంతైనా
తగ్గుతాయి
Thanks to http://unewslive.tv/index.php
No comments:
Post a Comment