Pages
Total Pageviews
Showing posts with label Bhakti. Show all posts
Showing posts with label Bhakti. Show all posts
20 Aug 2015
19 Aug 2015
పరమ శివుడు ఎప్పుడు ఏ స్తితి లో ఉన్నదీ తెలుసుకొని అభిషేకము చేస్తే వచ్చే ఫలితాలు
ఏ రోజు శివాభిషేకము చేయుదురో , ఆరోజు తిధిని 2 చేత హేచ్చించ్చగా, వచ్చిన మొత్తమును, మరల 5 చేత హేచ్చిన్చ్చ వలెను. ఈ విధము గా హేన్చ్చిన్చ్చిన మొత్తమును , 7 తో భాఘించగా,
1 శేషము వచ్చినచో, శివుడు కైలసామందున్నట్లు గాను,
2 శేషము వచ్చినచో,పార్వతీదేవి వద్ద వున్నట్లు గాను,
3 శేషము వచ్చినచో,వృషభ వాహనుడ్డై వున్నట్లు గాను,
4 శేషము వచ్చినచో, సభా మధ్యమున వున్నట్లు గాను,
5 శేషము వచ్చినచో, భోజనాలయమున వున్నట్లు గాను,
6 శేషము వచ్చినచో, క్రీడాభావనమందు వున్నట్లు గాను,
0 శేషము వచ్చినచో, స్మసానమందు వున్నట్లు గాను, తెలుసు కోవలెను.
1. కైలాసము నందు శివుడున్నప్పుడు చేసిన శివపూజ, శివాభిషేకము వలన, సర్వ సౌఖ్యములు కలుగును
2. పార్వతి దేవి వద్ద శివుడున్నప్పుడు చేసిన శివపూజ, శివాభిషేకము వలన, సమస్త సుఖములు కలుగును
3. వృషభ (నంది) వాహనుడై శివుడున్నప్పుడు చేసిన శివపూజ, శివాభిషేకము వలన, ఐశ్వర్య వృద్ధి కలుగును
4. సభా మద్యములో శివుడున్నప్పుడు చేసిన శివపూజ, శివాభిషేకము వలన, పుత్ర పౌత్రాభి వృద్ధి, కీర్తి కలుగును
5. భోజనాలయము న శివుడున్నప్పుడు చేసిన శివపూజ, శివాభిషేకము వలన, జీవితాంతము తిండికి బట్టకి లోటుండదు
6. క్రీడా భవనమునందు (పార్వతి దేవి తో) శివుడున్నప్పుడు చేసిన శివపూజ, శివాభిషేకము వలన,అసౌఖ్యము భార్య పుత్ర వియోగము, పరనిందలు పడుట, వృత్తి యందు నష్టము కలుగును.
0. స్మశానము నందు శివుడున్నప్పుడు చేసిన శివపూజ, శివాభిషేకము వలన, మృత్యువు సంభవించును.
గాన శివ పూజ శివాభిషేకము చేయు వారు, ఈ వివరములను గమనించి, 6, 0, శేషములలో చేయకుండా శుభ స్తానములైన 1,2,3,4,5 ,స్తానములలో శివుడున్నప్పుడు శివపూజ, శివాభిషేకము చేసుకోవలెను
తెలుగు తిధులు
క్రమ సంఖ్య
1. పాడ్యమి
2. విదియ
3. తదియ
4. చవితి
5. పంచమి
6. షష్టి
7. సప్తమి
8. అష్టమి
9. నవమి
10. దశమి
11. ఏకాదశి
12. ద్వాదశి
13. త్రయోదశి
14. చతుర్ధశి
15. పౌర్ణమి
16. అమావాస్య
Labels:
Bhakti
పరమ శివునికి వేటితో అభిషేకము చేస్తే ఏమి ఫలితము కలుగుతుందో తెలుసుకుందాము
1. .గరిక నీటితో శివాభిషేకము చేసిన నష్టమైన ద్రవ్యము తిరిగి లభించును.2 .నువ్వుల నూనెతో అభిషేకించిన అపమృత్యువు నశించ గలదు.
3 .ఆవు పాల అభిషేకం సర్వ సౌఖ్యములను ప్రసాదించును
4 .పెరుగుతో అభిషేకించిన బలము, ఆరోగ్యము, యశస్సు లభించును.
5 .ఆవు నేయితో అభిషేకించిన ఐశ్వర్య ప్రాప్తి కలుగును
6. చెరకు రసముతో అభిషేకించిన ధన వృద్ది కలుగును.
7 .మెత్తని చేక్కరతో అభిషేకించిన దుఃఖ నాశనము కలుగును
8 .మారేడు బిల్వదళ జలము చేత అభిషేకము చేసిన భోగభాగ్యములు లభించును.
9 .తేనెతో అభిషేకించిన తేజోవృద్ది కలుగును.
10. పుష్పోదకము చేత అభిషేకించిన భూలాభము కలుగును.
11. కొబ్బరి నీటితో అభిషేకము సకల సంపదలను కలిగించును.
12 .రుద్రాక్ష జలాభిషేకము సకల ఐశ్వర్యములనిచ్చును.
13 .భస్మాభిషేకంచే మహా పాపాలు నశించును.
14 .గందోదకము చేత అభిషేకించిన సత్పుత్ర ప్రాప్తి కలుగును.
15 .బంగారపు నీటితో అభిషేకము వలన ఘోర దారిద్రము
16 .నీటితో అభిషేకించిన నష్టమైనవి తిరిగి లభించును.
17 .అన్నముతో అభిషేకించిన అధికార ప్రాప్తి, మోక్షము మరియు దీర్ఘాయువు లభించును. శివపూజలో అన్న లింగార్చనకు ప్రత్యేక ప్రాధాన్యత కలదు పెరుగు కలిపిన అన్నముతో శివ లింగానికి మొత్తంగా అద్ది (మెత్తుట) పూజ చేయుదురు ఆ అద్దిన అన్నాన్ని అర్చనానంతరము ప్రసాదముగా పంచి పెట్టెదరు, చూడటానికి ఎంతో చాలా బాగుంటుంది అన్న లింగార్చన).
18.ద్రాక్షా రసముచే అభిషేక మొనర్చిన ప్రతి దానిలో విజయము లభించగలదు.
19 .ఖర్జూర రసముచే అభిషేకము శత్రుహానిని హరింప జేస్తుంది.
20 .నేరేడు పండ్ల రసముచే అభిషేకించిన వైరాగ్య సిద్ది లభించును.
21.కస్తూరి కలిపిన నీటిచే అభిషేకించిన చక్రవర్తివ్తము లభించును.
22 .నవరత్నోదకము చే అభిషేకము ధాన్యము, గృహ, గోవృద్దిని కలిగించును.
23 .మామిడి పండ్ల రసము చేత అభిషేకము చేసిన దీర్ఘ వ్యాధులు నశించును.
24 .పసుపు నీటితో అభిషేకించిన మంగళ ప్రదము అగును శుభ కార్యములు జరుగ గలవు.
Thanks to http://www.teluguone.com/
Labels:
Bhakti
17 Aug 2015
వేదాలు – ఉపయోగాలు
ఈ లోకంలో ప్రతి ప్రాణి, ప్రతి జీవి యొక్క యదార్థ స్వరూపం పరమాత్మయే. అయితే తను పరమాత్మా స్వరూపాన్ని మరచి జీవుడుగా వ్యవహరిస్తున్నాడు మానవుడు. అది ఎలాగు అంటే తను తన స్వస్వరుపాన్ని మరచి అజ్ఞానంతో మరియు అవిద్యతో ఏర్పరచుకున్న కర్మలతో తనకు తాను వచ్చిన దారిని మరచి బద్దుడవుతున్నాడు. (దీనిని ఏసుక్రీస్తు "మీరు అంత దారి తప్పిన గొర్రెపిల్లలు" అని తన వాక్యాలలో చెప్పాడు ) అంటే మనం మన ఇంటిని మరచిపోయం . అందువలన ఇప్పుడు తెలుసుకొని మన ఇంటికి మనం అందరం చేరుకుందాం.
అలా దారితప్పిన మనం ఇప్పుడు తిరిగి మాధవుడుగా (మానవుడే మాధవుడు), నరుడు నారాయనుడుగా, జీవుడు దేవుడుగా తన స్వస్తితిలో నిలిచి పోవాలంటే అందుకు మార్గం చుపేవే వేదాలు.
వేద అంటే తెలుసుకొనుట అని అర్థం . ఏమి తెలుసుకోవాలి? దేనిని తెలుసుకున్న తరువాత ఇక తెలిసికోవాల్సింది ఏమి ఉండదో, దేనిని తెలుసుకుంటే సర్వము తెలిసినట్లో అట్టి జ్ఞానాన్ని ఆత్మ జ్ఞానాన్ని తెలుసుకోవాలి.
కనుక మానవుడు తరించాలంటే, తన జన్మను సార్ధకం చేసుకోవాలంటే, జీవిత పరమార్ధమైన మోక్షాన్ని పొందాలంటే తప్పక తెలిసికోవలసింది వేదవిజ్ఞాన్నే.
ఈ వేదవిజ్ఞానాన్ని మొదట బ్రహ్మ దేవుడు దివ్యవాణిగా విన్నాడు. అందుకే దీనిని శృతి అన్నారు. శృతి అంటే విన్నది అని అర్థం. బ్రహ్మదేవుడు మొదటగా విని ఇతరులకు బోదించటం వలన దీనిని "బ్రహ్మవిద్య" అన్నారు.
మొదట వేదం అంతా ఒకటిగానే వుండేది. కానీ కలియుగంలో మనుషులు అల్పాయుష్కులు మరియు అల్పజ్ఞానులు అని గ్రహించి ఈ వేదమంత్రాలను కలియుగానికి ముందే ద్వాపరయుగంలో జన్మించిన వ్యాసమహర్షి ఒకటిగా ఉన్న ఈ వేదమంత్రాలను నాలుగుగా విభజించి వేదవ్యాసుడయ్యాడు. అవే ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం మరియు అధర్వణవేదం.
ఇలా విభజించబడిన ప్రతివేదం తిరిగి ఒక్కొక్కటి నాలుగు భాగాలుగా విభజించబడినవి. అవే
1. సంహిత (మంత్రం భాగము)
2. బ్రాహ్మణులూ (పూజలు. యజ్ఞయాగాదులు మో||న కర్మకాండ),
౩.ఆరణ్యకాలు (ఉపాసనలు)
4.ఉపనిషత్తులు (పరమాత్మా తత్త్వం).
మానవులకు మోక్ష మార్గాన్ని చుపేవే ఉపనిషత్తులు . ఇవి వేదాలకు అంతంలో వుండడం వలన వేదాంతం అంటారు. మన మానవ జీవితాన్ని తరింప జేసుకోనుటకు, మోక్షాన్ని అందుకొనుటకు కావలసిన అద్భుత జ్ఞానాన్ని ప్రసదించేవే ఉపనిషత్తులు. ఇవి నాలుగు వేదాలలోను మొత్తం 1180 వున్నవి. అయితే 108 ఉపనిషత్తులు మాత్రమే మంత్రాలతో సహా ఇప్పుడు మనకు లభిస్తున్నాయి. ఇందులో కూడా 10 ఉపనిషత్తులు అత్యంత ముక్యమైనవని మహాత్ములందరూ అంగీకరిస్తున్నారు. అవే ఈసా, కేన, కఠో, ప్రశ్న, ముండక, మాండుక్య, తైత్తిరీయ, ఐతరేయ, ఛాందోగ్య, బృహదారణ్యక అనే దశోపనిషత్తులు.
ఉపనిషత్తులు అంటే ఆత్మవిద్య అదే బ్రహ్మవిద్య . ఈ విద్య మానవునిలోని అజ్ఞాన్ని పోగొట్టి, సమస్త దుఃఖాలను నివృత్తి చేసి, పరబ్రహ్మాన్ని ఎరుకపరిచి, ముక్తిని ప్రసాదిస్తుంది.
Thank you to http://vedasastram.blogspot.in
Labels:
Bhakti
శంకు స్థాపన కొన్ని విషయాలు
మనందరం ఇళ్ళు, సరస్సులు, గుడులు , మొ. వాని నిర్మాణంలో " శంకు స్థాపన " అన్న మాట వింటు ఉంటాం. కాని ఆ ముహుర్తములో అక్కడ కొన్ని రాళ్లో ఇటుకలో పెట్టి పూజచేసి వాటిని పాతి పెట్టడం మాత్రమె చేస్తాం. దీనిని శంకు స్థాపన అని మాత్రం వ్యవహరిస్తాము. ఈ శంకువు గురించి నియమాలు మొదలగునవి శాస్త్రమున చాలాచేప్పబడినవి. వివిధ ఋషులు, పండితులు పలు అభిప్రాయాలు వేలిబుచ్చిరి. కొన్ని మాత్రం చెబుతాను.
బహుకాలము జీర్ణము కాక ఉండు, ముదురుదైన, వంకలు, కణుపులు లేని కొయ్యను (దానినే దారువు అని అంటారు ) తిసుకునుని 12 అంగుళములు పొడవు 4 అంగుళము వెడల్పు నాలుగు ప్రక్కల ఉండునటుల చేక్కుకోవాలి.అన్ని జాతి కర్రలలో " చండ్రకర్ర " ప్రశస్తమని చెప్పిరి.. ఈ కర్ర నీటిలోను, భూమిలోనూ ఎంతకాలమున్నా మురిసి పోదు. పూర్వము చెరువులకు తూములు పెట్టుటకు దీనినే వాడెడి వారు. మామిడి, వేప వంటివి వాడ రాదు. ఈ దారువును మూడు సమభాగములు గా చెయ్యాలి. మొదటి భాగము 4 పలకలగాను, రెండవ భాగము ఎనిమిది పలకల గాను మూడవ భాగము గుండ్రము గాను చేసుకోవాలి. దీనిలోనికి వాస్తు పురుషుని ఆవాహన చేసి పుష్పము అక్షతలతొ పూజలు యథావిధిగా చేసి తరువాత ముహూర్త కాలమున నిర్ణిత స్థలములు స్థాపిన చెయ్యాలి.
కాళిదాసు మాత్రము శంఖు నిర్మాణంలో మొదటి భాగమును ఎనిమిది పలకల గాను రెండవ భాగమును 4 పలకలగాను చేసుకో వాలని "కాలామృత గ్రంధమున " చెప్పియున్నారు ఈ నాలుగు , ఎనిమిది ఏమి ? నాలుగు దిశలు ఎనిమిది దిక్కులకు సంకేతం గుండ్రనిది భూమికి సంకేతం.
ఈ శంకువు , గృహములు, చెరువులు, ఆలయములు, అన్నిటా నిర్మాణ సమయమున స్థాపించాలి. అందులోను కొన్ని తేడాలు కలవు. గృహములలో గోడలకు లోపల భాగమున అనగా ఇంటిలోనూ, దేవాలయ నిర్మాణమున గోడలకు వెలుపల, చెరువులకు కట్టల క్రింద స్థాపించాలి. పూజా విధానమన్నిట యధావిధిగా జరిపించాలి. ఈ దారువు (శంకువు ) భుమిలోనున్నంతకాలము ఆ యజమానులు సుఖముగా ఆయురారోగ్య ఐశ్వర్య సంతాము కలిగి ఉందురని నమ్మకము. ఇది శాస్త్రమున చెప్పబడినది.
thanks to గుమ్మా రామలింగ స్వామి గారు
Labels:
Bhakti,
Technology
మన హిందూ సాంప్రదాయం ప్రకారం శుభ- అశుభ శకునాలు
మనం నడిచే దారిలో స్త్రీ నెత్తిన మంచి నీళ్ళా బిందే కానీ కుండతో కానీ మనలల్ని దాటుకుని వెళ్ళిన అధి శుభ సూచకం
మనం నడిచే దారిలో వితంతువు ( ఒక వేళా గుండు చేయిoచు కొన్న) మనలల్ని దాటుకుని వెళ్ళిన అధి అశుభం.
మనం నడిచే దారిలో మంగళివాడు తన సామగ్రితో మనకు ఎదురు పడినా అధి శుభ సూచకం
ఎవరైనా మన దారిలో ఒక మైనా పక్షుల జంటను చూసినా అధి శుభ సూచకం
మన ప్రవేశ ద్వారం(ఇంటి గడప ) మీద నిలబడి తుమ్మిన అధి అశుభం.దీన్ని నివారించాలంటే అదే గడప మీద నిలబడి నెత్తిన పసుపు నీటిని చల్లు కోవాలి
మన ఇంటిలోకి ప్రవేశించుచున్న ఆవు శుభ సూచకంగా మన పెద్దలు చెప్పుతారు
మన దేవాలయంలో దేవుడికి వేసిన పూలు,దేవుడి కి కుడి ప్రక్కన క్రింద పడినచో అది శుభ సూచకం
మనం నడిచే దారిలో ఆవును,ఆవుతో పాటు దూడను ఒకే సారి చూచిన ఎడల అది శుభ సూచకం
మన రహదారిలో ముంగిస కనపడిన ఎడల అది శుభ సూచకం
మన ఇంటిలో కానీ ,కార్యాలయాల్లో కానీ బల్లి అరిచిన అది అశుభం.
మన ఇంటి ఆరు బయట కాకి ,అదే పనిగా అరుస్తుంటే మన ఇంటికి ఎవరో బంధువులు వస్తున్నారు అని సంకేతంగా చెప్పుకోస్తారు మన పెద్దలు
మన ఇంటిలో పెంచుకొనే పెంపుడు కుక్క మనం బయటకు వెళ్ళేతప్పుడు తుమ్మిన అది మనకు శుభ సూచకం
Labels:
Bhakti
అంతర్వేది ఆలయ స్థలపురాణం
పూర్వం ఒకానొక సమయంలో హిరణ్యాక్షుని కుమారుడైన రక్తవలోచనుడు అనే రాక్షసుడు
గోదావరి నదిఒడ్డున కొన్ని వేలాది సంవత్సరాలు శివునికి ఘోర తపస్సు చేస్తాడు.
శివుని ఇతని తపస్సును మెచ్చుకుని ప్రత్యక్షమై వరాన్ని కోరుకొమ్మని
ఆదేశిస్తాడు. అప్పుడు రక్తవలోచనుడు దొరికిన అవకాశాన్ని అదునుగా తీసుకుని.. ప్రత్యేకంగా తన వరాన్ని కోరుకుంటాడు. ఆ వరం ప్రకారం.. రక్తవలోచనుడి శరీరం నుంచి నేల (ఇసుక రేణువులు)పై పడిన రక్తం.. తిరిగి తనంత పరాక్రమవంతులైన రక్తవలోచనులుగా పుట్టాలని కోరుకంటాడు. ఆ గర్వంతో అతను యజ్ఞాలు చేసుకునే ప్రతి బ్రాహ్మణులను, గోవులను తీవ్రంగా హింసించేవాడు.
ఇదిలావుండగా... విశ్వామిత్రునికి, వశిష్టుడికి మధ్య సమరం జరుగుతుంది. ఆ సమయంలో విశ్వామిత్రుడు.. వశిష్టుని సంహరించాల్సిందిగా రక్తవలోచనుడిని ఆజ్ఞాపిస్తాడు. దాంతో రాక్షసుడైన రక్తవలోచనుడు భీభత్సం సృష్టించి, వశిష్టుడి నూరుగురు కుమారులను సంహరించుకుంటూ పోతాడు.
అప్పుడు వశిష్ట మహర్షి తనకు అండగా నిలవవలసిందిగా.. శ్రీ మహావిష్ణువును ప్రార్థించుకుంటాడు. అప్పుడు విష్ణువు లక్ష్మీ సమేతుడై గరుడవాహనంపై చేరుకుంటాడు. విష్ణువు నరసింహుని అవతారం ఎత్తి రక్తవలోచనుడిని సంహరించడానికి వస్తాడు.
దీంతో నరసింహుడు, రక్తవిలోచనుడి మధ్య యుద్ధం సాగుతుండగా.. రక్తవిలోచనుడి శరీరం నుండి భూమిపై పడే రక్తపుచుక్క నుంచి ఒక్కొక్క రాక్షసుడిగా మారి వస్తుంటారు. ఆ సమయంలో నరసింహుడు అశ్వరూఢాంబికా అనే మాయాశక్తిని అక్కడికి రప్పించి... రక్తవిలోచనుడి రక్తం భూమి (నేల)పై పడకుండా నాలుకను చాచాలని సూచిస్తాడు.
స్వామి ఆదేశంప్రకారం ఆమె తన నాలుకను చాచి.. రక్తపు చుక్కలను నేలపై పడకుండా చూసుకుంటుంది. నరసింహుడు తన శక్తులతో ఆ రాక్షసుడిని ఓడించి, సంహరిస్తాడు.
అప్పుడు రక్తవలోచనుడి శరీరం నుంచి పారే రక్తం నేలపై పడకుండా రక్తకుల్య అనే నదిలోకి ప్రవహించేటట్లు చేస్తాడు. ఆ తరువాత వశిష్టుడి కోరిక మేరకు నరసింహస్వామి అంతర్వేది ప్రదేశంలో లక్ష్మీనరసింహస్వామిగా వెలిశాడు.
ఆలయ విశేషాలు :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని, తూర్పు గోదావరి జిల్లాలో సఖినేటి మండలానికి చెందినదే ఈ అంతర్వేది గ్రామం. పశ్చిమ గోదావరి జిల్లాలోని నరసాపురం సమీపంలో లక్ష్మీనరసింహ స్వామివారి పురాతన ఆలయన త్రికోణాకారపు దీవిపై ప్రసిద్ధి చెందింది.
ఒకప్పుడు బ్రహ్మ.. శివునిపట్ల చేసిన అపచారాలకు ప్రాయశ్చితం చేసుకోవాలని భావించి, రుద్రయాగం చేయాలని భావిస్తాడు. ఆ యాగం చేయడానికి ఒక వేదికగా ఈ ప్రదేశాన్ని ఎన్నుకున్నాడు. దాంతో ఈ ప్రాంతానికి అంతర్వేది (అంతర్ + వేదిక) అనే పేరు వచ్చిందని చెబుతారు.
మొదట ఈ ఆలయం శిథిలావస్థిలో వున్నప్పుడు శ్రీ కోపనాతి కృష్ణమ్మ అనే ఒక జమీందారు తిరిగి పునర్మిర్మాణం చేపట్టారు. ఆలయ ముఖద్వారంలో ఈయన శిలాగ్రహం కూడా వుంది. ఆయనిచ్చిన విరాళాలతోనే ఈ ఆలయం నిర్మాణం జరిగింది.
విష్ణువు ఆలయానికి పక్కనే ఆమె చెల్లలుగా భావించే అశ్వరూఢాంబిక ఆలయం కూడా వుంది. ఈమెకూడా రక్తవలోచనుడిని చంపడంలో ప్రముఖపాత్రను వహించింది.
Thanks to http://telugubhaktiblog.blogspot.in/
Labels:
Bhakti
ధ్వజస్థంభం గురించి కొంత
ఈ ధ్వజస్థంభం ఏర్పడటానికి ఓ కధ ఉంది.భారత యుద్ధానంతరం పాండవులలో జ్యేష్టుడైన ధర్మరాజు సింహాసనాన్ని అధిష్టిస్తాడు. ధర్మబధ్ధంగా రాజ్య పాలన చేస్తుంటాడు. ధర్మమూర్తిగా, గొప్పదాతగాపేరు పొందాలనే కోరికతో విరివిగా దానధర్మాలు చేయడం మొదలు పెడ్తాడు. ఇదంతా చూస్తున్న శ్రీకృష్ణుడు అతనికి తగినరీతిగా గుణపాఠం చెప్పాలనుకుంటాడు. ధర్మరాజుకి అశ్వమేధయాగం చేసి, శత్రురాజులను జయించి, దేవతలనూ బ్రాహ్మణులను సంతుష్టి పరచి, రాజ్యాన్ని సుస్థిరం, సుభిక్షం చేయమనీ చెప్తాడు. ధర్మరాజు శ్రీకృష్ణుని మాట శిరసా వహించి అశ్వమేధానికి సన్నాహాలు చేయించి, యాగాశ్వానికి రక్షకులుగా నకుల సహదేవులను సైన్యంతో పంపుతాడు.ఆ యాగాశ్వం అన్నిరాజ్యాలూ తిరిగి చివరికి మణిపుర రాజ్యం చేరుతుంది. ఆ రాజ్యానికి రాజు మయూర ధ్వజుడు. ఆయన మహా పరాక్రమ వంతుడు, గొప్ప దాతగా పేరుగాంచినవాడు. మయూరధ్వజుని కుమారుడు తామ్ర ధ్వజుడు, పాండవుల యాగాశ్వాన్నిబంధిస్తాడు.
తామ్రధ్వజునితో యుద్ధం చేసిన నకులసహదేవులు, భీమార్జునులు ఓడిపోతారు. తమ్ములందరూ ఓడిపోయిన విషయం తెల్సుకున్న ధర్మరాజు స్వయంగా యుధ్ధానికై బయలుదేరగా శ్రీకృష్ణుడు అతన్ని వారించి మయూరధ్వజుడ్ని యుధ్ధంలో జయించడం సాధ్యంకాదనీ, మహాబలపరాక్రమవంతులైన భీమార్జునులే ఓడిపోయారనీ,అతడ్నికపటోపాయాంతో మాత్రమే జయించాలనీ చెప్తాడు. శ్రీకృష్ణుడు, ధర్మరాజుతోకలసి వృద్ధ బ్రాహ్మణుల రూపంలో మణిపురం చేర్తాడు. ఆ బ్రాహ్మణులను చూసిన మయూరధ్వజుడు వారికి దానం ఇవ్వదలచి ఏమి కావాలో కోరుకొమ్మని అడుగుతాడు. దానికి శ్రీకృష్ణుడు,"రాజా! మీ దర్శనార్ధమై మేమువస్తున్న దారిలో ఒక సింహం అడ్డు వచ్చి ఇతని కుమారుడ్ని పట్టుకుంది. బాలుని విడిచి పెట్టవలసినదిగా మేముప్రార్థించగా, సింహం మానవ భాషలో " మీ కుమారుడు మీకు కావాలంటే మణిపుర రాజైనా మయూరధ్వజుని '' శరీరంలోని సగభాగం నాకు ఆహారంగా అతడి భార్యాపుత్రులే స్వయంగా కోసి ఇవ్వగా తెచ్చి ఇస్తే, ఇతడ్ని వదిలేస్తాననీ చెప్పిందనీ, కనుక ప్రభువులు మా యందు దయదలచి తమ శరీరంలోని సగభాగాన్ని దానమిచ్చి ఇతడి కుమారుని కాపాడమని కోరుతారు. వారి కోరిక విన్న మయూరధ్వజుడు అంగీకరించి దానికి తగిన ఏర్పాట్లు చేయించి భార్యాసుతులు అతని శరీరాన్నిమధ్యకు కోసి వారికి ఇవ్వమని చెప్తాడు. వారు ఆయన శరీరాన్ని సగంగా కోయటం చూచిన ధర్మరాజు అతని దాన గుణానికి నివ్వెరపోయాడు. ఇంతలో మయూరధ్వజుని ఎడమకన్ను నుంచి నీరు కారటం చూసిన ధర్మరాజు "తమరు కన్నీరు కారుస్తూ ఇచ్చిన దానం మాకు వద్దు గాక వద్దు అంటాడు". అందుకు మయూరధ్వజుడు, "మహాత్మా తమరు పొరపడుతున్నారు. బాధపడి నా శరీరాన్ని మీకివ్వటం లేదు. నా కుడి భాగం పరోపకారానికి ఉపయోగపడింది, కానీ ఆ భాగ్యం తనకు కలగటంలేదు కదా అని ఎడమ కన్ను చాలా బాధపడుతూ కన్నీరు కారుస్తున్నది." అని వివరిస్తాడు. మయూరధ్వజుని దానశీలతకు మెచ్చిన శ్రీకృష్ణుడు తన నిజరూపాన్ని చూపి "మయూరధ్వజా! నీ దానగుణం అమోఘం ! ఏదైనావరం కోరుకో! అనుగ్రహిస్తాను" అంటాడు. "పరమాత్మా! నా శరీరం నశించినా నా ఆత్మ పరోపకారార్థం ఉపయోగపడేలా నిత్యం మీ ముందు ఉండేలాగానుగ్రహించండి" అని కోరుతాడు మయూరధ్వజుడు. అందుకు శ్రీకృష్ణుడు "తథాస్తు" అని పలికి, "మయూరధ్వజా! నేటి నుంచీ ప్రతి దేవాలయం ముందు నీ గుర్తుగా నీ పేరున ధ్వజస్తంభాలు వెలుస్తాయి. వాటిని ఆశ్రయించిన నీ ఆత్మ, నిత్యం దైవ సాన్నిధ్యంలో ఉంటుంది. ముందు నిన్ను దర్శించి ప్రదక్షిణ నమస్కారాలు ఆచరించిన మీదటనే ప్రజలు తమ ఇష్టదైవాలను దర్శించుకుంటారు. ప్రతినిత్యం నీ శరీరమున దీపం ఎవరుంచుతారో వారి జన్మ సఫలం అవుతుంది. నీ నెత్తిన ఉంచిన దీపం రాత్రులందు బాటసారులకు దారి చూపే దీపం అవుతుంది" అంటూ అనుగ్రహించాడు. ఆనాటి నుంచీ ఆలయాల ముందు ధ్వజస్తంభాలు తప్పనిసరిగా ప్రతిష్టించడం ఆచారమయింది. భక్తులు ముందుగా ధ్వజస్థంభానికి మొక్కి ఆ తర్వాతే ములవిరాట్టు దర్శనం చేసుకోడం సాంప్రదాయంగా మారింది...
Thanks to http://telugubhaktiblog.blogspot.in/
Labels:
Bhakti
16 Aug 2015
శత్రు బాధలను అధిగమించేందుకు శ్లోకం
చాలామంది శత్రు భయంతో వణికిపోతుంటారు. ఎప్పుడేం జరుగుతుందోనని
బిక్కుబిక్కుమంటుంటారు. అటువంటివారు ఈ క్రింది శ్లోకాన్ని పఠిస్తే శత్రు
భయం వదిలిపోతుందంటున్నారు పండితులు.
మనోజవంమారుత తుల్యవేగం
జితేంద్రియం బుద్ధిమతాం వరిష్ఠం
వాతాత్మజం వానరయూధ ముఖ్యం
శ్రీరామదూతం శిరసానమామి
జయత్యతిబలో రామోలక్ష్మణశ్చ మహాబలః
రాజాజయతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః
అర్థఇత్వా పురీంలంకా మభివాద్యజ మైథిలీం
సముర్థార్థో గమష్యామి మిషతాం సర్వరక్షసాం
6 Aug 2015
దేవాలయములోని ధ్వజస్థంభం గురించి
ధ్వజస్థభం ఆలయ నిర్మాణాన్ని పిడుగుపాటు నుండీ రక్షిస్తుంది.అది ఆలయంకంటే ఎత్తులో ఉండడం వలన అది విద్యుత్ శక్తిని గ్రహించి,భూమిలోకి పంపించివేసి,ఆలయాన్ని కాపాడుతుంది.
ధ్వజస్థభం ప్రతిష్ట ముందు దానిక్రింద పంచలోహాలు(బంగారం,వెండి,ఇత్తడి,రాగి,కంచు)ను వేస్తారు.అవి భూమిలోపల ఉన్న విద్యుత్ అయస్కాంత శక్తి(electro-magnetic energy)ని గ్రహిస్తాయి.అందుకే ధ్వజస్థభం వద్ద విద్యుత్ అయస్కాంత్ క్షేత్రం(electro-magnetic energy) ఏర్పడుతుంది.అంతేకాదు ద్వజస్థభానికి వేసే పంచలోహ్ల తొడుగు కూడా విద్యుత్ అయస్కాంత్ శక్తిని గ్రహించి ఈ క్రింద ఏర్పడిన విద్యుత్ ఆయస్కాంత్ క్షేత్రానికి మరింత శక్తిని చేకూరుస్తుంది.దాని దగ్గరకు వెళ్ళి నమస్కరించడం వలన మన శరీరానికి కావలసిన శక్తి అందుతుంది.ధ్వజస్థంభం వద్ద ఉండే బలిపీఠం ఈ విద్యుత్ అయస్కాంత శక్తిని అత్యధికంగా నిలువ ఉంచుకునే ప్రదేశం.
ధ్వజం అంటే జెండా.బ్రహ్మోత్సావాల సమయంలో ధ్వజారోహణం పేరున ధ్వజస్థంబానికి జెండాను ఎగిరేస్తారు.దీనికి ఎగురేసిన జెండా దేవలోకంలో ఉన్న సమస్త దేవతలను ఉత్సవాలకు ఆహ్వానిస్తుంది.
ధ్వజస్తంభం అడుగుభాగంలో శివుడు,మధ్యభాగంలో బ్రహ్మ,పై భాగంలో శ్రీ మహావిష్ణువు కోలువై ఉంటారు.విశ్వాసం శ్వాస కంటే గొప్పది.వేదం పరమాత్ముడి శ్వాస.నాలుగు వేదాలకు ప్రతీక ఆ నిలువెత్తు ద్వజస్థంభం.
ధ్వజము అంటే మరొక అర్ధం పతాకం అని.మనిషికి ఆత్మజ్ఞానం కలిగినప్పుడు,అతనికి అత్యున్నతమైన ఆలోచనలు కలుగుతాయి.అవి అతనిని పతాక స్థాయికి తీసుకువెళతాయని,అతను జీవితంలో అత్యున్నతస్థాయిలో నిలబడతాడని గుర్తుచేస్తుంది ధ్వజస్థంభం.
ఇంత ప్రాముఖ్యం ఉన్న ద్వజస్థంభానికి ఏదో ఒక చెట్టు మాను తీసువచ్చి పెట్టరు.ఆగమశాస్త్రం ప్రకారం ధ్వజస్థంభానికి వాడే మానుకు కొన్ని లక్షణాలు కలిగి ఉండాలి.ఆ మానుకు ఎలాంటి తొర్రలు ఉండకూడదు.కొమ్మలు ఉండకూడదు.ఎలాంటి పగుళ్ళుఉండకూడదు.ఏ మాత్రం వంకరగా ఉండకూడదు.సుమారు 50 అడుగులకంటే ఎత్తు ఉండాలి.ఇలాంటి మానునే ధ్వజస్థంభానికి ఉపయోగించాలి అని ఆగమశాస్త్రం చెబుతోంది.
ఏ దేవాలయానికి వెళ్ళినా ముందుగా ధ్వజస్థంభానికి మొక్కి, ప్రదక్షిణచేసి ఆతర్వాతే లోపలికి వెళతాం.
ఈ ధ్వజస్థంభం ఏర్పడటానికి ఓ కధ ఉంది.భారత యుద్ధానంతరం పాండవులలో జ్యేష్టుడైన ధర్మరాజు సింహాసనాన్ని అధిష్టిస్తాడు. ధర్మబధ్ధంగా రాజ్య పాలన చేస్తుంటాడు. ధర్మమూర్తిగా, గొప్పదాతగాపేరు పొందాలనే కోరికతో విరివిగా దానధర్మాలు చేయడం మొదలు పెడ్తాడు. ఇదంతా చూస్తున్న శ్రీకృష్ణుడు అతనికి తగినరీతిగా గుణపాఠం చెప్పాలనుకుంటాడు. ధర్మరాజుకి అశ్వమేధయాగం చేసి, శత్రురాజులను జయించి, దేవతలనూ బ్రాహ్మణులను సంతుష్టి పరచి, రాజ్యాన్ని సుస్థిరం, సుభిక్షం చేయమనీ చెప్తాడు. ధర్మరాజు శ్రీకృష్ణుని మాట శిరసా వహించి అశ్వమేధానికి సన్నాహాలు చేయించి, యాగాశ్వానికి రక్షకులుగా నకుల సహదేవులను సైన్యంతో పంపుతాడు.ఆ యాగాశ్వం అన్నిరాజ్యాలూ తిరిగి చివరికి మణిపుర రాజ్యం చేరుతుంది. ఆ రాజ్యానికి రాజు మయూర ధ్వజుడు. ఆయన మహా పరాక్రమ వంతుడు, గొప్ప దాతగా పేరుగాంచినవాడు. మయూరధ్వజుని కుమారుడు తామ్ర ధ్వజుడు, పాండవుల యాగాశ్వాన్నిబంధిస్తాడు.
తామ్రధ్వజునితో యుద్ధం చేసిన నకులసహదేవులు, భీమార్జునులు ఓడిపోతారు. తమ్ములందరూ ఓడిపోయిన విషయం తెల్సుకున్న ధర్మరాజు స్వయంగా యుధ్ధానికై బయలుదేరగా శ్రీకృష్ణుడు అతన్ని వారించి మయూరధ్వజుడ్ని యుధ్ధంలో జయించడం సాధ్యంకాదనీ, మహాబలపరాక్రమవంతులైన భీమార్జునులే ఓడిపోయారనీ,అతడ్నికపటోపాయాంతో మాత్రమే జయించాలనీ చెప్తాడు. శ్రీకృష్ణుడు, ధర్మరాజుతోకలసి వృద్ధ బ్రాహ్మణుల రూపంలో మణిపురం చేర్తాడు. ఆ బ్రాహ్మణులను చూసిన మయూరధ్వజుడు వారికి దానం ఇవ్వదలచి ఏమి కావాలో కోరుకొమ్మని అడుగుతాడు. దానికి శ్రీకృష్ణుడు,"రాజా! మీ దర్శనార్ధమై మేమువస్తున్న దారిలో ఒక సింహం అడ్డు వచ్చి ఇతని కుమారుడ్ని పట్టుకుంది. బాలుని విడిచి పెట్టవలసినదిగా మేముప్రార్థించగా, సింహం మానవ భాషలో " మీ కుమారుడు మీకు కావాలంటే మణిపుర రాజైనా మయూరధ్వజుని '' శరీరంలోని సగభాగం నాకు ఆహారంగా అతడి భార్యాపుత్రులే స్వయంగా కోసి ఇవ్వగా తెచ్చి ఇస్తే, ఇతడ్ని వదిలేస్తాననీ చెప్పిందనీ, కనుక ప్రభువులు మా యందు దయదలచి తమ శరీరంలోని సగభాగాన్ని దానమిచ్చి ఇతడి కుమారుని కాపాడమని కోరుతారు. వారి కోరిక విన్న మయూరధ్వజుడు అంగీకరించి దానికి తగిన ఏర్పాట్లు చేయించి భార్యాసుతులు అతని శరీరాన్నిమధ్యకు కోసి వారికి ఇవ్వమని చెప్తాడు.
వారు ఆయన శరీరాన్ని సగంగా కోయటం చూచిన ధర్మరాజు అతని దాన గుణానికి నివ్వెరపోయాడు. ఇంతలో మయూరధ్వజుని ఎడమకన్ను నుంచి నీరు కారటం చూసిన ధర్మరాజు "తమరు కన్నీరు కారుస్తూ ఇచ్చిన దానం మాకు వద్దు గాక వద్దు అంటాడు". అందుకు మయూరధ్వజుడు, "మహాత్మా తమరు పొరపడుతున్నారు. బాధపడి నా శరీరాన్ని మీకివ్వటం లేదు. నా కుడి భాగం పరోపకారానికి ఉపయోగపడింది, కానీ ఆ భాగ్యం తనకు కలగటంలేదు కదా అని ఎడమ కన్ను చాలా బాధపడుతూ కన్నీరు కారుస్తున్నది." అని వివరిస్తాడు.
మయూరధ్వజుని దానశీలతకు మెచ్చిన శ్రీకృష్ణుడు తన నిజరూపాన్ని చూపి "మయూరధ్వజా! నీ దానగుణం అమోఘం ! ఏదైనావరం కోరుకో! అనుగ్రహిస్తాను" అంటాడు. "పరమాత్మా! నా శరీరం నశించినా నా ఆత్మ పరోపకారార్థం ఉపయోగపడేలా నిత్యం మీ ముందు ఉండేలాగానుగ్రహించండి" అని కోరుతాడు మయూరధ్వజుడు. అందుకు శ్రీకృష్ణుడు "తథాస్తు" అని పలికి, "మయూరధ్వజా! నేటి నుంచీ ప్రతి దేవాలయం ముందు నీ గుర్తుగా నీ పేరున ధ్వజస్తంభాలు వెలుస్తాయి. వాటిని ఆశ్రయించిన నీ ఆత్మ, నిత్యం దైవ సాన్నిధ్యంలో ఉంటుంది. ముందు నిన్ను దర్శించి ప్రదక్షిణ నమస్కారాలు ఆచరించిన మీదటనే ప్రజలు తమ ఇష్టదైవాలను దర్శించుకుంటారు. ప్రతినిత్యం నీ శరీరమున దీపం ఎవరుంచుతారో వారి జన్మ సఫలం అవుతుంది. నీ నెత్తిన ఉంచిన దీపం రాత్రులందు బాటసారులకు దారి చూపే దీపం అవుతుంది" అంటూ అనుగ్రహించాడు. ఆనాటి నుంచీ ఆలయాల ముందు ధ్వజస్తంభాలు తప్పనిసరిగా ప్రతిష్టించడం ఆచారమయింది. భక్తులు ముందుగా ధ్వజస్థంభానికి మొక్కి ఆ తర్వాతే ములవిరాట్టు దర్శనం చేసుకోడం సాంప్రదాయంగా మారింది..
దేవాలయో రక్షతి రక్షితః
(దేవాలయాల రక్షణే మన రక్షణ)
Labels:
Bhakti
5 Aug 2015
ఏయే మాసాల్లో శుభకార్యాలు చేయకూడదు..
జ్యేష్ఠమాసం :
హిందూ సంస్కృతీ - సంప్రదాయం ప్రకారం... జ్యేష్ఠమాసంలో జ్యేష్ఠ సంతానం వివాహం చేయకూడదని పూర్వకాలం నుంచి మన ఆచారులు చెబుతున్నారు. అయితే మొదట ఇక్కడ జ్యేష్ఠ సంతానం గురించి తెలుసుకోవాల్సి వుంది. జ్యేష్ఠ సంతానం అంటే.. దంపతులకు మొదటిసారిగా పుట్టిన పుత్రుడుకానీ, పుత్రికకానీ జ్యేష్ఠ సంతానాలు పరిగణించబడతారు. ఇందులో జ్యేష్ఠం అనే పదం గర్భానికి సంబంధించింది. ఒకవేళ గర్భస్రావమయి కూడా ప్రథమ సంతానం జీవించి వుండకపోతే.. ఆ తరువాత జన్మించే సంతానం జ్యేష్ఠ సంతానం కిందకే వస్తారు.
ఇక వివాహ విషయానికి వస్తే... మన పురాణగ్రంథాల ప్రకారం... జ్యేష్ఠమాసంలో ఎటువంటి పరిస్థితులోనైనా జ్యేష్ఠ సంతానానికి వివాహ కార్యక్రమాలను నిర్వహించకూడదు. కేవలం వివాహ కార్యక్రమాలనే కాదు.. ఏ శుభకార్యాలలోనూ కూడా వాళ్లను ఆహ్వానించడకూడదు. అలాగే మార్గశిర మాసం కూడా జ్యేష్ఠ సంతానికి అంత శ్రేయస్కరం కాదు. యజ్ఞోపవీతం, వివాహం, కేశఖండన వంటి శుభకార్యాలు జ్యేష్ఠ సంతానానికి చెందిన వ్యక్తులు.... వారు జన్మించిన మాసంలో అస్సలు జరపకూడదు. అలా కాని ఎడలా వారికి అరిష్టాలే ఎదురవుతాయి.
భరద్వాజ మహర్షి సూచనల ప్రకారం... జ్యేష్ఠ మాసంలో కృతికా నక్షత్రంలో సూర్యుడు వుండే పదిరోజులు మినహాయించి... మిగతారోజుల్లో శుభకార్యాలు చేసుకోవచ్చు. వరుడు, వధువు ఇద్దరూ జ్యేష్ఠ సంతానమే అయితే వారికి జ్యేష్ఠ మాసంలో వివాహం ఎన్నటికీ చేయకూడదు. ఒకవేళ వధూవరులలో ఒకరే జ్యేష్ఠులు అయితే.. అటువంటివారు వివాహం చేసుకోవచ్చు.
ఆషాడమాసం :
హిందువుల సంస్కృతి సంప్రదాయాలు ప్రకారం... ఆషాఢమాసంలో వివాహాలుగానీ, ఇతర శుభకార్యాలుగానీ నిర్వహించుకోకూడదు. ఎందుకంటే.. ఈ ఆషాఢమాసాన్ని శూన్యమాసం అని మన పూర్వీకులు పేర్కొన్నారు. ఈ మాసంలో వచ్చే ముఖ్యమైన తిథి ఆషాఢ శుద్ధ ఏకాదశి. దీనినే తొలిఏకాదశి అని అంటారు. ముఖ్యంగా ఇది విష్ణువు ఆరాధులకు ఎంతో ప్రముఖమైన రోజు. ఈ తొలిఏకాదశి నుంచే చాతుర్మాస్యవ్రతం ప్రారంభం అవుతుంది. అలాగే పండుగలు కూడా మొదలవుతాయి.
తెలంగాణాలో బోనాల పండుగ, పూరిజగన్నాథుడి రథయాత్రం వంటి పండగలు ఈ మాసంలోనే జరుగుతాయి. అలాగే సకల జీవులకు ఆహారం అందించే ‘‘ఆదిశక్తి’’ని శాకంబరీదేవిగా కొలుస్తారు. ఈ మాసంలో కొత్తగా పెళ్లయిన అమ్మాయిలను తమ పుట్టింటికి తీసుకునివెళ్తారు. అంటే ఈ మాసం మొత్తం భార్యాభర్తలు దూరంగా వుండాల్సిందే! పురాతనకాలం నుంచి ఈ మాసంలో ఆడవాళ్లు తమ చేతులకు గోరింటాకు వేసుకోవడం ఒక ఆచారంగా వస్తోంది.
http://telugubhaktiblog.blogspot.in
http://telugubhaktiblog.blogspot.in/2015/04/blog-post_56.html#.VcL_7qOCam4
Labels:
Bhakti
Subscribe to:
Posts (Atom)







