1 Aug 2015

మెడ గూర్చి కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు

మహిళల్లో ఎక్కువగా కనిపించే ఆరోగ్య సమస్యల్లో మెడనొప్పి కూడా ఒకటి. నిరంతరం చేసే పనులు,
కొన్ని సంప్రదాయ పద్ధతులు ఇందుకు ఎక్కువగా కారణం అవ్ఞతున్నాయి. అవేంటో తెలుసుకోండి...

 తలవంచుకు కూర్చోవడం, నడవడం, పెద్దమనిషి తరహా అను కుంటారు కొందరు. అణకువగా ఉన్నట్లు భావిస్తారు. నిరంతరం ఇదే ప్రక్రియ కొన సాగిస్తే మెడలోని వెన్నుపూసలు, వెన్నుపాము, నరాలపై ఒత్తిడి ఎక్కువ అవ్ఞతుంది. అందువల్ల అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. తల భారాన్ని మోసేది మన మెడ. అంతేకాక మన శరీరంలోని రెండు ముఖ్యభాగాలైన మొండెం, తలను కలుపుతోంది. మెదడు ఇంకా ఇతర అవయవాల మధ్య సమాచార మార్పిడి చేసే నరాలు మెడ ద్వారా వెళతాయి. అందువల్ల మెడ కూడా శరీరంలోని ఒక ముఖ్యభాగమే. సాధా రణంగా మెడ పరిశుభ్రత, ఆరోగ్యం గురించి అంతగా పట్టించుకోరు. తల బరువ్ఞను మోసే మెడను శుభ్రంగా ఉంచుకోవాలి. మరీ కష్టపెట్ట కూడదు. అప్పుడు మెడ ఆరోగ్యంగా ఉంటుంది. ముఖసౌందర్యం కోసం వాడే క్రీముల్ని మెడకు కూడా పట్టిస్తే, మెడమీది చర్మం కాంతులీనుతూ ఉంటుంది. అంతేకాక మెడమీద చర్మం కోసం సన్‌స్క్రీన్‌ లోషన్లు వాడటం కూడా మంచిదే.్


మెడ గూర్చి కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు
కింద కూర్చున్నా, నడుస్తున్నా లేక ఏ స్థితిలో ఉన్నా మెడను నిటారుగా ఉంచాలి.
టివి, సినిమా చూసేటప్పుడు ముందుకు వంగవద్దు.

కొందరికి విపరీతమైన మెడనొప్పి ఉంటుంది. అది భుజంలోకి, చేతులలోకి కూడా వ్యాపిస్తుంది. దీనినే సర్వికల్‌ స్పాండిలైటిస్‌ అంటారు. ఫిజియోథెరపీ, కాలర్లను ఉపయోగించడంతో పాటు పూర్తి బెడ్‌రెస్ట్‌ కూడా ఈ నొప్పి తగ్గడానికి అవసరం. అంతేకానీ, ఇరుకు మంత్రం, బెణుకు మంత్రం మెడవిరిపించు కోవడం వంటి వాటివల్ల నొప్పి పెరిగి, పరిస్థితి మరింత అధ్వాన్నంగా తయారవ్ఞతుంది.
చింతాకుల ముద్ద మెడచుట్టూ నాలుగు నుండి ఐదురోజులు పట్టిస్తూ ఉంటే మెడనొప్పి తగ్గే అవకాశం ఉంది. ఇది చిట్కా మాత్రమే. కొన్నిసార్లు మెడ దగ్గర చాలా ఎక్కువగా ఉండే లింఫ్‌గ్లాండ్స్‌ వాస్తే కూడా మెడనొప్పి వస్తుంది. మెడనరాలపై ఒత్తిడి ఎక్కువైనప్పుడు నొప్పి చేతులు, భుజాలలోకి వ్యాపించడం జివ్ఞ్వమని లాగడం ఉంటుంది. ఛాతీలో ముందు వెనుకలకు కూడా వ్యాపించ వచ్చు.

కంటిదోషాల వల్ల కూడా మెడనొప్పి వచ్చే అవకాశం ఉంది. కంటికి తగిన వైద్యం చేయిస్తే మెడనొప్పి కూడా తగ్గిపోతుంది. ఎండ, వేడి, చలి వీటికి మెడ ఎక్స్‌పోజ్‌ చేయకూడదు. అలాచేస్తే మెడ కమిలి పోతుంది. నల్లబడుతుంది. మరీ ఎక్కువ ఆభర ణాలతో మెడను ఇబ్బంది పెడితే చర్మం ఒరుసుకు పోతుంది. బిరుసుగా అవుతుంది . ఇంట్లో ఉన్నప్పుడు సింపుల్‌గా ఉండే నగలు ధరించడం మంచిది. ముఖంతో పాటు మెడను కూడా సబ్బుతో శుభ్రపరుస్తుండాలి.

గిల్ట్‌ నగలు ధరించినప్పుడు ఆయా నగల తయా రీలో ఉపయోగించిన మెటల్స్‌ పడక కొందరికి ఎలర్జీ వస్తుంది. మెడనల్లగా మారడానికి స్త్రీలలో ఉత్పత్తి అయ్యే ఈస్ట్రోజన్‌ హార్మోన్‌ కూడా కొంత వరకు కారణం.
మెడకు కూడా వ్యాయామం అవ సరం. అన్ని వైపులకు మెడను తిప్పాలి. అందువల్ల మెడకు సరిగా రక్తప్రసరణ జరుగుతుంది. అంతేగాక మెడ కొవ్ఞ్వ కరిగి చర్మం పలచబడుతుంది. నాజూకుగా ఉంటుంది. ఎక్కువ బరువ్ఞలు మోయడం, ఎక్కువసేపు వాహనాలు నడపడం, నిలబడడం మానాలి.
నిద్రపోయే సమయంలో చాలామంది తలగడపై తల మాత్రమే ఉంచుతారు. తలతో పాటు మెడ కూడా ఉంచాలి. నరాల మీద ఒత్తిడి తగ్గుతుంది. యోగా చేసేవారు కూర్మాసనం వేస్తే మెడలోని అనవసరపు కొవ్ఞ్వ తగ్గి మెడ సన్నబడుతుంది.                 కూర్మాసనం

No comments:

Post a Comment