మలబద్దకము- నిర్వచనం : సాదారణ రీతి లో కాకుండా ... మలము గట్టిగా , కష్టము గా మలద్వారము గుండా అవడానికి మలబద్దకం అంటాము .
- సాదారణము గా ప్రతి వ్యక్తికి విరోచనము అవ్వాలి. రోజుకి ౩ సార్లు నండి ౩ రోజులకు ఓకసారి అవడం వైద్య పరిభాషలో నార్మల్ గా పరిగనిస్తారు. రోజుకి ౩ సార్లు కంటే ఏక్కువ అయితే విరోచనాలు గాను, ౩ రోజులు దాటి విరోచనము అవకపోతే మలబద్దకము గాను అంటాము.
- పేద్ద పేగులో నీరు ఏక్కువగా absorb అవడం వలన మలము గట్టిపడి విరోచనము అవడం కస్టమగును. నోప్పి కూడా ఉండును వోక్కోక్కసారి రక్తము కూడా పడును. కడుపు ఉబ్బరము, గాలితో కూడిన కడుపు బరువు , జీర్ణశక్తి తగ్గి ,, ఆకలి మందగించును , మనసు చిరాకుగా ఉండి ... ఏ పని మీదా ఆశక్తి ఉండదు. ఏక్కువ కాలము ఉన్న మలబద్దకము పైల్స (మూలశంకకు)కి దారితీయును.
- ఆహారములో మార్పులు -పీచు పదార్ధం తక్కువగా ఉండడం ,
- ఎండా లేదా వేడి వాతావరణం లో గడపడం ,,
- అదే పనిగా కూర్చోవడం ,
- ఎక్కువసేపు పడుకోవడం ,
- శరీరానికి తగిన వ్యాయామము లేకపోవడం .
- అలవాటుగా వచ్చే విరోచనము ప్రైవసీ లేక ఆపుకోవడం వల్ల ,
కొన్ని రకాలైన మందులు .. మలబద్ధకాన్ని కలిగిస్తాయి . ఉదా:
- కొడిన్ కలిగిన దగ్గు మందులు ,
- నొప్పిని తగ్గించే కొన్ని మందులు ,
- హై బి.పి.ని తగ్గించే బీటా బ్లాకర్స్ ,
- ఆస్టియోపోరోసిస్ ని తగ్గించే కాల్సియం మాత్రలు,
- ఆందోళన ను తగ్గంచేందుకు వాడే ట్రన్క్విలిజర్స్ ,
- కడుపులో మంటను తగ్గించే 'యాంటాసిడ్స్ ;
- కడుపులో అల్సర్లు తగ్గించే మందులు (యాంటి కొలినేర్జిక్స్)
- పక్షవాతము ,
- నరాలబలహీనత ,
- వెన్ను పుసకు దెబ్బలు వల్ల కలిగే కండరాల నీరసం ,
- హైపో తిరాయిడ్ వ్యాధి ,
- బుద్ది మాన్దవ్యం వల్ల వచ్చే మెదడు వ్యాధులు ,
- 1.సహజమైన (Idiopathic) , : దీని లో కారణం కనబడదు ... కాని మలబద్దకం తో బాదపడుతుంటారు .
- 2.క్రియాత్మకమైన (Functional),: ఆహారపు అలవాట్లు , వాతావరణ పరిస్తితులు వలన వచ్చేది .
- నోటిపూత , వికారము , వాంతులు తరచుగా కలుగుతాయి ,
- కడుపులో గాలిచేరి పొట్ట ఉబ్బి 'గాస్ ట్రబుల్' కి దారితీస్తుంది .
- గాస్ పైకి తన్ని గుండె నొప్పి , కడుపు నొప్పి రావచ్చును .,
- గుదము(మలద్వారం) దగ్గర పగులు(AnalFissure), ఆర్శమోలలు(Piles) ఏర్పడతాయి ,
- గుండెలో మంట త్రేనుపులు , అసిదిటి వంటివి వస్తాయి ,
- నిద్ర పట్టకపోవడం ,
- చర్మము సహజ కాంతిని కోల్పోతుంది ,
- అనాస , మామిడి, సీతాఫలాలు తింటే విరేచనం సాఫీగా అవుతుంది ,
- మారేడు కాయ పండిన తరువాత గుజ్జు తింటే మంచి విరోచానకారిగా పనిచేస్తుంది ,
- కరక్కాయ ,ఉసిరికాయ తానికాయ కలిపిన "తిఫాల"చరణం మంచి మలబద్దకనివారని ,
- అరటి పండు తొక్క ను రోజు తింటే మలబద్దకం తగ్గుతుంది ,
- ఒక స్పాన్ కరివేప పొడితో తేనే కలిపి తీసుకున్న మలబద్దకం నివారించవచ్చును ,
- ఒక చెంచా ఆముదం వేడిచేసి రాత్రి పూట తీసుకుంటే ఎలాంటి మలబద్దకమైనా పోతుంది ,
- రాత్రి పడుకునే ముందు , తెల్లవారు లేవగానే రాగి చెంబులో నిల్వుంచిన నీరు త్రాగితే మంచి ఫలితం ఉంటుంది .
ప్రధమ చికిత్స-
- పైన పేర్కొన్న కారణాలు వలనేమో చూడాలి ,
- ఎక్కువ గా నీరు త్రాగాలి
- పీచు పదార్దము ఉన్న ఆహారము తీసుకోవాలి
- Dulcolax మాత్రలు ఓకటి లేదా రెండు ప్రతిరోజు రాత్రి తీసుకోవాలి.
- ఆలస్యం చేయకుండా మంచి డాక్టర్ ని సంప్రదిచాలి ,
* అప్పుడప్పుడు అల్లం వేసి కాచిన టీ తాగండి. ఇది పేగుల కదలికలను నియంత్రించేందుకు తోడ్పడుతుంది.
* జామపండ్లను విత్తనాలతో పాటు తింటే వాటిల్లోని పీచు మలబద్ధకాన్ని తొలగించేందుకు దోహదం చేస్తుంది.
* పేగులను ప్రేరేపించటానికి ఆపిల్స్ సాయం చేస్తాయి. అయితే వీటిని చెక్కు తీయకుండా తినాలని మరవరాదు.
* రోజుకి కనీసం ఒకసారైనా క్యారెట్ రసం తాగితే మేలు.
* రాత్రిపూట 5-6 ద్రాక్షపండ్లను నీటిలో నానేయాలి. పొద్దున్నే వాటిని తినేసి ఆ నీరు తాగితే ఉపశమనం కలగొచ్చు.
* పీచుతో కూడిన బ్రెడ్, ధాన్యాలు తినటం మంచిది.
* క్యాల్షియం దండిగా ఉండే పెరుగు పెద్దపేగు ఆరోగ్యానికీ మంచిదే. ఇది మలబద్ధకం నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
* రోజూ కనీసం 8-10 గ్లాసుల నీరు తాగండి. ఇది పేగుల కదలికలను మెరుగు పరుస్తుంది.
* క్యాబేజీ, బొప్పాయి, చిలగడదుంప, కొబ్బరి కూడా పేగుల కదలికలు సాఫీగా ఉండేలా చూస్తాయి.
* పెద్దపేగు ఆరోగ్యానికి బత్తాయిపండ్లు తోడ్పడతాయి. రోజుకి ఒక గ్లాసు బత్తాయి రసం తీసుకుంటే పేగులు శుభ్రంగా ఉండేందుకు సాయం చేస్తుంది.
* బియ్యం బదులు గోధుమలు వాడటమూ ఉపయోగకరమే.
* మలబద్ధకాన్ని తొలగించటంలో పచ్చి పాలకూర రసం ఎంతగానో దోహదం చేస్తుంది.
* అన్నింటికన్నా ముఖ్యంగా సమతులాహారం తీసుకోవటం అవసరం. ఇందులో శుద్ధిచేయని తృణధాన్యాలు, ఆకుకూరలు, కూరగాయలు, మొలకెత్తిన గింజలు, తేనె, పండ్లు, ఎండుఫలాలతో పాటు వెన్న, నెయ్యి వంటి పాల పదార్థాలు ఉండేలా చూసుకోవాలి.
పండ్లతో 'బద్ధకం' హుష్
పండ్లు, కూరగాయలు తినేలా ప్రోత్సహిస్తే బడికి వెళ్లే పిల్లల్లో మల బద్ధకం సమస్యను దూరం చేయొచ్చని మీకు తెలుసా? పండ్లు అంతగా తినటం ఇష్టం లేని పిల్లల్లో ఆహార అలవాట్లు, మానసిక అంశాల మూలంగా వచ్చే మల బద్ధకం 13 రెట్లు ఎక్కువగా ఉంటోందని తాజా అధ్యయనంలో వెల్లడైంది. నిజానికి 1-7 తరగతులు చదివే ఎంతోమంది పిల్లలు మలబద్ధకంతో బాధపడుతుంటారు. దీనివల్ల ఒత్తిడి, దుస్తుల్లో మూత్ర విసర్జన, బడిలో ఇబ్బందులు, ఆత్మ విశ్వాసం కోల్పోవటం, ఇతరులతో అంతగా కలవలేకపోవటం వంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఈ మల బద్ధకానికి దోహదం చేస్తున్న వాటిని తెలుసుకోవటానికి సింగపూర్‌లో ఒక అధ్యయనం చేశారు. హాంగ్‌కాంగ్‌లోని ఒక బడికి చెందిన 8-10 ఏళ్ల పిల్లల ఆహార, మల మూత్ర విసర్జన అలవాట్లను పరిశీలించారు. వీరిలో 7 శాతం మంది పిల్లలు మలబద్ధకంతో బాధపడుతున్నట్టు గుర్తించారు. ఇందుకు ఆహార అలవాట్లు గణనీయంగా దోహదం చేస్తున్నట్టు కనుగొన్నారు. పండ్లు, కూరగాయలు తక్కువగా తినేవారు చాలామంది మలబద్ధకంతో బాధపడుతున్నట్టు తేలింది. రోజుకి కేవలం 200-400 మి.లీ. ద్రవాలు తీసుకుంటున్న పిల్లల్లోనూ ఈ సమస్య 8 రెట్లు ఎక్కువగా ఉంటోందనీ బయటపడింది. అందుకే దీనిపై పిల్లలకు అవగాహన కలిగించేలా పాఠశాలలు చర్యలు తీసుకోవాలని పరిశోధకులు సూచిస్తున్నారు. తగినంత ద్రవాహారం, పండ్లు, కూరగాయలు పిల్లలకు ఇచ్చేలా తల్లిదండ్రులకూ తెలియజేయాలనీ వివరించారు.
- Water therapy for constipation :
dr.seshagirirao .com
No comments:
Post a Comment