20 Jul 2015

ఘంటానాదం ఎప్పుడు చేయాలి...ఎప్పుడు చేయకూడదు ?


సాధారణంగా పూజ ప్రారంభంలో ఈ క్రింది మంత్రం చెబుతూ ఘంటానాదం చేస్తాము.

శ్లో!! ఆగమార్థంతు దేవానాం గమనార్థంతు రాక్షసాం !
......కుర్యాత్ ఘంటారావం తత్ర దేవతాహ్వాన లాంచనం !!


అంటే, ఘంటానాదం వలన దేవతలకు స్వాగతం తెలుపుతూ రాక్షసులకు గమనం చెప్పడం.
అనగా మనం దేవతా మందిరం లోకి ప్రవేశించగానే, పై మంత్రం చెబ్తూ ఘంటానాదం చేయాలి.
ఇంకా....దేవతలకి అభిషేకం చేసే సమయంలో, యజ్ఞోపవీతం వేసే సమయంలో, ధూపం వేసే సమయంలో, హారతి నీరాజనం ఇచ్చే సమయంలో ఘంటానాదం చేయాలి !

కొంత మంది ' నైవేద్యం ' పెట్టె సమయంలో కూడా ఘంటానాదం చేస్తూ ఉంటారు. ఇది చాలా తప్పు. ఎందుకంటే..
..
శ్లో!! ఘంటానాదం తధా వాద్యం నృత్యం గీతం తధైవచ !
.....నైవేద్య కాలే యః కుర్యాత్ రౌరవాద్ నరకం వ్రజేత్ !!


పై శ్లోకం ఆధారంగా నైవేద్య సమయంలో ఘంటానాదం, వాద్యము,నృత్యం చేయడము,పాట పాడటము ఇలాంటివి నైవేద్య సమయంలో కనుక చేస్తే ' రౌరవాది నరకం ' ప్రాప్తిస్తుంది.
కనుక నైవేద్యం సమయంలో ఘంటానాదం చేయరాదు.

( శ్రీ వైష్ణవ ఆగమ పద్ధతిలో వారు తప్పక ఘంటానాదం చేస్తారు పై వివరణ వారికి ఎంత మాత్రం సంబంధం లేదు. ఇందులో వాదనలకు తావులేదని మనవి )
Brahmasri Chaganti Koteswara Rao Garu

No comments:

Post a Comment