కావలసిన పదార్థాలు :
బీట్‌రూట్... పావు కేజీ
చింతపండు గుజ్జు... 2 T Spoons
ఉప్పు... తగినంత
పసుపు... చిటికెడు
నూనె... 3 T Spoons
వెల్లుల్లి... 8
పచ్చిమిర్చి... 4
ఎండుమిర్చి... 3
పోపుకోసం మినప్పప్పు...1 T Spoons
ఆవాలు... 1 T Spoons
కరివేపాకు... 2 రెమ్మలు
తయారీ విధానం :
బీట్‌రూట్ చెక్కు తీసి శుభ్రంగా కడిగి చిన్న ముక్కలుగా కోయాలి. బాణలిలో కొద్దిగా నూనె వేసి ఎండుమిర్చి, పచ్చిమిర్చి వేయించి తీయాలి. తరువాత అందులోనే మరికాస్త నూనె వేసి బీట్‌రూట్ ముక్కలు, ఉప్పు వేసి మూతపెట్టి తక్కువ మంటమీద ఉడికించాలి. మధ్యలో కలుపుతూ ఉండాలి.
ముక్కలు మెత్తగా ఉడికిన తరువాత దించాలి. వీటికి పసుపు, వెల్లుల్లి రేకలు, చింతపండు గుజ్జు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి చేర్చి మిక్సీలో వేసి మెత్తగా రుబ్బి తాలింపు పెట్టాలి. నీళ్లు కలపకుండా వుంటే పచ్చడి చాలా రుచిగా ఉంటుంది.
No comments:
Post a Comment