17 Jul 2015

అరటి ఆకు లో భోజనము వలన ఉపయోగాలు

అరటి మోదుగ ఆకులలో భోజనం చేయడం వల్ల ప్లేగుల్లోని క్రిములు నాశనమవుతాయని ఆయుర్వేదం కూడా చెపుతోంది. అలాగే అరటి చెట్టు నుంచి వచ్చే అరటి పండు కూడా ఆరోగ్యానికి మేలు చేస్తుంది.

అరటి పండులోని పొటాషియం శరీర కండరాలను కూడా ఆరోగ్యంగా ఉంచుతుంది. జీర్ణ సంబంధ సమస్యలను కూడా అరటిపండు మంచి ఔషధంలా పనిచేస్తుంది. జబ్బుపడినవాళ్లు దీనిని తీసుకుంటే త్వరగా కోలుకుంటారు. అరటిపండు అల్సర్లను నివారించడంలో క్రియాశీలకంగా పనిచేస్తుంది.

మహావిష్ణు స్వరూపమైన మర్రిచెట్టు ఆకులలో అన్నం తింటే క్రిమిరోగ నివారిణిగా పనిచేస్తుంది. కంటికి సంబంధించిన దోషాలను తొలగిస్తుంది.

ఎవరైతే అరటాకులో భోజనం చేస్తారో వాళ్లు సంపూర్ణ ఆరోగ్యంతో ఉంటారని వైద్యులు చెబుతున్నారు. అరటి చెట్టు మనిషికి ఎంత ఉపయోగపడుతుందో అందరికీ తెలిసిందే. అరటి ఆకులు కూడా మంచి ఆరోగ్యాన్ని అందిస్తాయి . అదెలా అంటే…

అరటి ఆకులోని పాలిఫెనాల్‌ అనే యాంటిఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి కణాలను వైరస్‌ ల నుంచి కాపాడతాయి. అంతేకాదు అరటి ఆకులో భోజనం చేయడం వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయంటే…

 వేడి వేడి ఆహారపదార్థాలను అరటాకులో వడ్డించటం వల్ల న్యూట్రీషియన్లన్నీ కలిసిపోతాయి. • ఆకుల్లోని క్లోరోఫిల్ చర్మవ్యాధులను రాకుండా చూస్తుంది.

కిడ్నాలో రాళ్లు, కాలేయ సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం తక్కువ.

వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది.

 ఆహారాన్ని రుచికరంగా ఉండేలా చేస్తుంది.

 తిన్న ఆహారం చక్కగా జీర్ణమయ్యేలా చేస్తుంది.

 అరటాకులను జ్యూస్‌ గా చేసి తలకు పట్టిస్తే డాండ్రఫ్‌ తగ్గుతుంది. ఆ పేస్ట్‌ ని ఎండవల్లకమిలిని చర్మంపై రాస్తే నలుపు పోతుంది.

 అరటాకులను కాసేపు చల్లని నీటిలో ఉంచి ఆ నీటిని పురుగులు, తేనెతీగలు కుట్టిన చోట పోస్తే మంచిది. అలాగే చర్మ సంబంధిత ఎలర్జీ కూడా తగ్గిపోతుంది.

అరటి పండు జీర్ణశక్తిని పెంచటమే కాదు శృంగార శక్తిని పెంచుతుంది. ఇలా చెట్టులోని ప్రతీ భాగము ఆరోగ్యదాయనిగా పనిచేస్తుంది.
 http://www.expresstv.in/eating-food-on-banana-leaves-13846.aspx#sthash.NGkQjV1Z.dpuf

No comments:

Post a Comment