పసి పిల్లలకు (1-2 ఏళ్ళు) ఆహార జాగ్రత్తలు
ముద్దులోలికించే పసి పిల్లలంటే ఇష్టపడని వారుండరేమో,ఎన్ని
కష్టాలు అనుభవిస్తే మాతృత్వం లభిస్తుందో, అంతే ఆనందం ఆ చిట్టి పొట్టి
పిల్లలు అడుగులు వేస్తుంటే కలుగుతుంది,అయితే వారి పట్ల తల్లిదండ్రులు ఎంతో
జాగ్రత్త తీసుకోవాలి,తల్లినుంచి లబించే ఆహారం,సరిపోయినప్పటికీ,వాళ్ళ
ఎదుగుదలకు ఎన్నో రకములైన పోషక పదార్దాలు అవసరం.సమాన్యంగా పిల్లలు సంవత్సర
కాలంలో 3-5inch మాత్రమే పెరుగుతారు, అయితే వారివారి వయస్సు,చురుకుతనం,
బరువుని దృష్టిలో ఉంచుకుని రోజుకి 1,000-1,400 క్యాలరీలు ఉండే ఆహారం
ఇవ్వాలి.అదేవిధంగా క్రమం తప్పకుండా, డాక్టర్ ని సంప్రదిస్తే మీ పిల్లల
ఆరోగ్యం గురించి ఆలోచించనవసరం లేదు.
తప్పటడుగులు వేసే మీ చిన్నారులకు ఆహార నియమాలు ఇవే:
ఎక్కువ ప్రయోజనాలను చేకూర్చే ఆహారం:
మీ పిల్లలు తినేటప్పుడూ ఎక్కువగా అల్లరి చేస్తూ, ఒక్కొక్కటే
తింటూన్నారా,అయితే ఆ ఒక్క వాటిలోనే అన్ని రకముల పోషక పదార్దాలు ఉండేలా
చూసుకోవాలి,కొంచెం కొంచెం పెడుతూ తినిపిస్తూ ఉండాలి, అంతే కాకుండా వెన్న,
బన్ను,వేరుసనగ వెన్న, ఇలా తినిపిస్తూ ఉంటే మంచిది.
మీ బుజ్జి పాపకి లేదా బాబుకి “డ్రింక్స్” తయారుచేయండి:
అందమైన మీ చిన్నారులకి ద్రవం రూపంలోనే ఎక్కువ పొషకాలు
పట్టించండి, అయితే ఎక్కడ “జ్యూస్” లను కాకుండా పాలు, నీరు, కొంచెం పండ్ల
రసము కలిపిన నీరు కలిపి పట్టిస్తే ఎంతో మంచిది .
చిరు తిండి:
ఎప్పుడూ అల్లరి చేస్తూ ఆడుతూ మనల్ని నవ్వించే మన పసిపిల్లలు
ఆడీ ఆడీ, అలసిపోతారు, అందుకే కొంచెం సమయం తరువాత కొద్ది కొద్దిగా చిరుతిండి
తినిపిస్తే ఎంతో మంచిది, చిరుతిండి అనగానే మనం తినేవి కాకుండా, పొషక
పదార్దాలతో కూడినవి,”యాపిల్ సాస్, వెన్న,కేక్,క్యారెట్”ఇలా.
తిండిలోని మార్పులో:
ఆ చిన్నవయస్సులో, ఏమి తెలియని పసిపిల్లలకు రోజు ఒకే రకమైన
ఆహారం పెట్టడం మంచిది కాదు, బోర్ కొట్టి తినడం మానేస్తారు, మనమైనా అంతేకదా,
రోజూ ఒకే రకమైన కూర తింటే మనకైనా బోర్ కొడుతుంది.
అందుకే రోజుకోరకంగా రంగు, రుచి,వాసన, మరియూ పొషక
పదార్దాలు,మారుస్తూ, పెట్టడం మంచిది,మరియూ మీ పిల్లలకు అరటి పండు, యాపిల్
ని ముక్కలుగా చేసి తినిపించడం, లేదా వాటిలో పెరుగు కలిపి పట్టించడం మంచిది.
అధికంగా తినిపించే కన్నా పౌష్టికమైన ఆహారం కొంచెమైనా చాలు:
ఒకవేళ మీ పిల్లలు ఎక్కూవగా తినకపోయినా, తినిపించేది తక్కువైన
పౌష్టికమైన ఆహారం ఇవ్వడం ఎంతో అవసరం.అంటే ఎక్కువగా తినిపించనవసరం లేదు,
కొద్దిగా అయినా బలాన్ని చేకూర్చే ఆహారం పెట్టడం మంచిది.
వాళ్ళు తినడం లేదు అని ఎక్కువగా అలోచించి కంగారు పడనవసరం
లేదు, మీరు చెయ్యవలసిందల్లా, వాళ్ళు తినే కొంచెం ఆహారంలో అయినా పొషక
పదార్దాలు నిండుగా ఉండేలా చుసుకుంటే సరిపోతుంది,
ప్రోటీన్లు, కాల్షియం, మినరల్స్, Vitamin C,పండ్లు, తృణధాన్యాలు, కొవ్వులు, సమృద్ధిగా ఉండే ఆహారాలు మీ పిల్లలకు ఇవ్వండి.
పైనవన్ని పాటించి మీ చిట్టి పొట్టి పిల్లలకు సరైన ఆరోగ్యంతో
పాటు,వయస్సుతో సరిసమానమైన ఎదుగుదల కావాలంటే వారిని ఆటలు ఎక్కువగా ఆడించండి.
http://telugutips.in/best-food-feeding-tips-to-1-2-years-kids-childrens-in-telugu/
No comments:
Post a Comment