1. మీకు ఇట్టే అలుపురావడంతో పాటు పాలిపోయినట్లు, తెల్లగా వుంటారా? ఆయాసంగా అనిపిస్తుంటుందా? అప్పుడప్పుడు తల తిరిగినట్లు కూడా అనిపిస్తుందా?
రక్తహీనత (ఎనీమియా)
2. జలుబు, ప్లూ జ్వరాల్లాంటి వాటితో బాధపడుతున్నారా?
ఇన్ఫెక్షన్లు
3. ఎప్పుడు విషాదంగా, టెన్షన్ గా అనిపిస్తుంటుందా? అందరూ కలిసి మిమ్మల్ని 'మోసం' చేశారని అనిపిస్తుంటుందా?
క్రుంగుబాటు (డిప్రెషన్)
4. ఒకవేళ మీరు స్త్రీలైతే - గర్భం ధరించారా? లేదా, బహిష్టు ఆగిపోవాల్సిన వయసుకు చేరుకున్నారా?
హార్మోన్ల తేడాలు
5. ఎప్పుడూ అసహనంగా, విసుగ్గా, చిరాగ్గా వుంటుందా?
నిస్త్రాణం
6. మీకు చలిగా అనిపిస్తుంటుందా? జుట్టు పలుచబడిపోతోందా?
పొడిగా కూడా తయారవుతుందా? బరువు పెరుగుతున్నారా?
థైరాయిడ్ గ్రంథి చురుకుదనం తగ్గటం (హైపోథైరాయిడిజం)
7. సమతులాహారం తీసుకోవడం లేదా?
పౌష్టికాహార లోపం (మాల్ న్యూట్రిషన్)
8. ఏవైనా అల్లోపతి మందులు వాడుతున్నారా?
మందుల దుష్పలితం
9. మీ బరువులో మార్పు వచ్చిందా?
అంతః స్రావీగ్రంథుల సమస్యలు (హార్మోనల్ డిజార్డర్స్)
10. ఆపరేషన్ చేయించుకున్నారా?
శస్త్ర చికిత్సా నంతర సమస్యలు
"నాకే మాత్రంశక్తి ఉండటం లేదు. చేయాల్సిన పని ఎంతో వుంది. అయినా చేయాలని
పించడం లేదు" ఇదీ నేటి కాలంలో డాక్టర్లు పేషెంట్ల నుంచి ఎక్కువగా ఎదుర్కొనే
ఫిర్యాదు.
చాలా
సందర్భాల్లో, అలసిపోవడానికి ప్రధాన కారణాలు పని ఒత్తిడి ఎక్కువవ్వడం గాని,
నిద్ర చాలకపోవడంగాని అయ్యుంటుంది. మరికొంతమందిలో టెన్షన్లూ, ఆత్మన్యూనతా
భావాల వంటివి కూడా అలసటను కలుగజేస్తాయి. క్లాసు రూములో గాని, ఆఫీసులో గాని
గడపడం పరమ దుర్భరంగా అనిపించి ఇహ అక్కడ ఒక్క నిమిషం కూడా ఉండలేమనుకున్న
తర్వాత అదే రోజు సినిమా హాల్లోగాని, క్లబ్బులోగాని గంటల తరబడి కులాసాగా
గడిపే వారిని చూస్తూనే ఉంటాం. ఈ రకమైన సమస్యకు పరిష్కారం ఒక్కటే - జీవన
విధానాన్ని మార్చుకోవడం.
అలసటను
'ఎప్పుడూ వినే పాతపాట'లాగా కొట్టి పారేయకూడదు. దీని వెనుక చిన్నచిన్న
కారణాలనుంచి ప్రమాదకరమైన కారణాల వరకూ ఏవైనా ఉండొచ్చు. మీకు అలసటగా, నీరసంగా
అనిపిస్తుంటే దాని వెనుక గల కారణాలను తరచి చూసుకుని ఒక నిర్ణయానికి రావడం
మంచిది.
1. రక్తహీనత (ఎనీమియా)
రక్తాల్పత ఉన్నప్పుడు ఇట్టే అలసిపోతుంటారు. చర్మంపాలిపోయినట్లు తెల్లగా
ఉండటం, ఆయాసం, తల తిరగటం అనే లక్షణాలతో పాటు అలసట కూడా వుంటే, అది
రక్తాల్పతకు గుర్తు. రక్తంలో హిమోగ్లోబిన్ తగ్గటమే దీనికి కారణం. అంటే,
హిమోగ్లోబిన్ తగ్గటం వల్ల శరీరంలోని కణజాలాలకు ప్రాణవాయువు కనాకష్టంగా
అందుతుందన్నమాట. ఈ ఆక్సిజన్ లోపం వల్ల శరీర ధర్మాలకు అవసరమైన శక్తిలో కూడా
తరుగు ఏర్పడుతుంది. ఈ తరుగును కప్పిపుచ్చడానికి గుండె, ఊపిరితిత్తులు మరింత
శ్రమపడి, ఉన్న రక్తాన్నే ఎక్కువ సార్లు సరఫరా చేయాల్సి ఉంటుంది. ఈ
ప్రయత్నంలో గుండె వేగం పెరిగి దగడా అనిపిస్తుంది. గుండె పనితీరు వేగవంతమవడం
వల్ల – హెచ్చు ఆక్సిజన్ కోసం - శ్వాస వేగం కూడా పెరుగుతుంది.
రక్తాల్పత ఉన్నప్పుడు రక్తాన్ని వృద్ధిచేసే చికిత్సలు చేయవలసి వుంటుంది. శోభన చికిత్సగా విరేచన కర్మను చేయాలి.
గృహచికిత్సలు: 1. కరక్కాయ లేదా శొంఠి చూర్ణాన్ని అరచెంచాడు మోతాదుగా బెల్లంతో కలిపి రెండు పూటలా తీసుకోవాలి.
2. చెరకు రసాన్ని గ్లాసు మోతాదుగా రోజు 3 పూటలా తీసుకోవాలి.
3.
త్రిఫలాలు, తిప్పతీగ, అడ్డసరం, కటుక రోహిణి, నేలవేము, వేపపట్ట వీటిని
అన్నింటినీ తెచ్చి భాగాలు కలిపి కషాయం తయారుచేసికొని రోజుకి రెండుసార్లు
తాగాలి.
ఔషధాలు: మండూర భస్మం, పునర్నవాది మండూరం, ధాత్రీలోహం, లోహాసవం, కుమార్యాసవం.
2. ఇన్ఫెక్షన్లు: ఇన్ఫెక్షన్లు
వున్నప్పుడు, అది వైరస్ వల్లనైతే, పూర్తి విశ్రాంతితోపాటు వైరస్
వ్యతిరేకమైన గుణాలు కలిగిన తులసి, పసుపు, వేప, నేల ఉసిరిక మొదలైన ఓషధులు
కలిసిన మందుల్ని వాడాల్సి వుంటుంది. మిగతా ఇన్ఫెక్షన్లకు కారణాన్ని
అనుసరించి చికిత్స తీసుకోవాలి.
3. క్రుంగుబాటు (డిప్రెషన్)
డిప్రెషన్ లో సాధారణంగా కనిపించే లక్షణం అలసట. దీంతోపాటు ఆకలి లేకపోవడం,
నిద్రపట్టకపోవడం, మనసుకు నిలకడ లేకపోవడం, తలనొప్పి ఇలాంటి వన్నీ వుండొచ్చు.
జీవితమంటే విరక్తి చిన్నవిషయానికే ఏడవానిపించడం, అర్థం లేని ఆందోళనలు
ఇత్యాదివి కూడా వుండొచ్చు. ఈ మానసిక లక్షణాలతో పాటు కొంతమందిలో శారీరక
లక్షణాలు కూడా కనిపిస్తాయి. ఉదాహరణకు, కండరాల నొప్పులు, అజీర్తి, గ్యాస్
తయారవ్వడం, ఛాతిలో మంట, కడుపులో నొప్పి మదలైనవి. ఒక పరిశీలన ప్రకారం,
జనాభాలో 15 శాతం మంది జీవితంలో ఏదో ఒక సందర్భంలో డిప్రెషన్ తో బాధపడతారని
తేలింది, డిప్రెషన్ ను ఆయుర్వేదంలో చిత్తావసాదం అంటారు. డిప్రెషన్ లో
వున్నప్పుడు ధైర్యం చెప్పటం అన్నిటికన్నా ముఖ్యం. దీన్నే ఆయుర్వేద
శాస్త్రంలో 'అశ్వాసనం' అంటారు. దీనితోపాటు వ్యక్తిత్వ విశ్లేషణ, సత్వావజయ
చికిత్సలు (ధ్యానం, జపం మొదలైనవి) అవసరమవుతాయి. డిప్రెషన్ లో వాజీకరణ
ఔషధాలు బాగా పనిచేస్తాయి. కనీసం వారానికి రెండు సార్లు శృంగారంలో
పాల్గొనేవారిని డిప్రెషన్ బాధించదు.
గృహచికిత్సలు: 1. క్రమం తప్పకుండ వ్యాయామం చేయాలి.
2. ధ్యానం (మెడిటేషన్) డిప్రెషన్ లో మంచి ఫలితాన్ని ఇస్తుంది.
3. దూలగొండి చూర్ణాన్ని చెంచాడు మోతాదుగా రోజుకి మూడుసార్లు పాలతో కలిపి తీసుకోవాలి.
4. వస కొమ్ముల చూర్ణాన్ని పావు చెంచాడు మోతాదుగా తేనెతో కలిపి తీసుకోవాలి.
ఔషధాలు: మానస మిత్రవటకం, అశ్వగంధాది లేహ్యం, క్రౌంచపాకం, బ్రాహ్మీవటి, సర్ప గంధఘనవటి, ఉన్మాద గజకేసరి రసం.
4. హార్మోన్ల తేడాలు:
హార్మోనుల హెచ్చుతగ్గులు అలసటను కలుగచేస్తాయనడంలో సందేహం లేదు. గర్భం
ధరించిన రోజుల్లో అలసటగా వుంటుందని అందరికీ తెలుసు. దీనికి కారణం. ఈ
సమయంలో బరువు పెరగడం, రక్తాల్పత, నడుం నొప్పి, నిద్రపట్టకపోవడం మొదలైంవి
మాత్రమే కాకుండా హార్మోనుల హెచ్చుతగ్గులు కూడా సంభవించడమే. అలాగే,
బహిష్టులు ఆగిపోయే సమయంలో స్త్రీ శరీరంలోని అండాశయం ఈస్ట్రోజెన్ ని
ఉత్పత్తి చేయలేకపోవడం వల్ల కూడా అలసటగా అనిపిస్తుంది. అంతేకాకుండ,
బహిష్టుకు ముందుకూడా, ప్రతి నెలా చాలామంది స్త్రీలు అలసటగా కనిపిస్తారు.
దీనికి కారణం కూడా హార్మోన్ల హెచ్చు తగ్గులే.
సూచనలు:
హార్మోన్ల సమతుల్యం దెబ్బతిన్నప్పుడు ఆహారంలో మార్పులు చేర్పులు
చేసుకోవాలి. అవసరమైతే, వైద్యసలహా మేరకు, ఫైటో ఈస్ట్రోజన్స్ కలిగిన – అశోక,
సోయ తదితర మూలికలతో తయారైన – ఆయుర్వేద ఔషధాలను వాడాలి.
ఔషధాలు: అశోకారిష్టంమ్ అశోక ఘృతం, అశోకాదివటి, కళ్యాణఘృతం, క్షీరబలాతైలం (101 అవర్తాలు), సుకుమార ఘృతం, సుకుమార రసాయనం, శతావరి లేహ్యం.
సాధారణంగా,
ప్రతికూల పరిస్థితుల్ని తట్టుకోవడానికి గాను మన శరీరంలో ఎడ్రినలిన్ లు
గాని, ఇంకా తదితరాలైన రసాయన పదార్థాలు గాని విడుదలవుతుంటాయి. అయితే ఇదంతా
ఒక పరిధికి లోబడే ఉంటుంది. ఆ పరిధి తర్వాత శరీరం ఈ పదార్ధాలకు స్పందించడం
మానేస్తుంది. అలాంటప్పుడు అలసట మనిషిని అవహించేస్తుంది.
సూచనలు: జీవితం
డల్ గా అనిపిస్తూ తద్వారా అలసటగా అనిపిస్తుంటే, విశ్రాంతిగా, రిలాక్స్ డ్
గా వుండటానికి ప్రయత్నించండి. జీవన విధానంలో చిన్నపాటి మార్పుల ద్వారా ఈ
విషయంలో అద్భుతమైన ఫలితాలను సాధించవచ్చు.
6. థైరాయిడ్ గ్రంథి చురుకుదనం తగ్గటం (హైపోథైరాయిడిజం)
చల్లగా వుండటం, జుట్టు ఊడిపోవడం, వెంట్రుకలు బిరుసెక్కడం, బరువు పెరగటం
అనే లక్షణాలతో పాటు అలసట కూడా వున్నట్లయితే మీ థైరాయిడ్ గ్రంథి మందకొడిగా
తయారైందని అర్థం చేసుకోవాలి. ఇది 'థైరాయిడ్ హార్మోన్' ని తయారుచేస్తుందన్న
సంగతి తెలిసిందే. ఇది సమస్థితిలో వుంటే శరీరపు క్రియా నియంత్రణ సక్రమంగా
జరుగుతుంది. ఒకవేళ థైరాక్సిన్ ఎక్కువైత శరీరపు పనితీరు అంతా ఎక్కువవుతుంది.
తగ్గితే, శరీఎర క్రియాధర్మాలు కూడా తగ్గుతాయి. ఉదాహరణకి, థైరాయిడ్ గ్రంథి
మందకొడిగా వున్నప్పుడు నాడివేగం తగ్గుతుంది. శ్వాస నెమ్మదిగా తీసుకుంటారు.
ఆలోచనలు, వ్యక్తీకరణలు కూడా నెమ్మదిస్తాయి, మలబద్దకం వుంటుంది. జుట్టు
పలుచబడిపోతుంది. చల్లటి వాతావరణాన్ని భరించలేరు. ఎప్పుడూ అలసటగా అనిపిస్తూ
వుంటుంది. ఈ స్థితిని 'అపతర్పణ ఔషధాల'తో చికిత్సించాల్సి ఉంటుంది. అపతర్పణం
అంటే శరీరాన్ని తేలికగా, చురుగ్గా చేయడం. ఈ వ్యాధి ఉన్నవారు సల్ఫాడ్రగ్స్,
యాంటీహిస్టమిన్స్ వాడటం మంచిదికాదు.
గృహచికిత్సలు: 1. ఐయోడిన్ అధికంగా వుండే ఆహార పదార్ధాలను (సముద్రపు చేపలు, ఉల్లిపాయలు, బంగాళాదుంపలు, పిల్లిపీచర గడ్డలు) ఎక్కువగా తీసుకోవాలి.
2.
థైరాయిడ్ గ్రంథి చురుకుదనాన్ని తగ్గించేలా చేసే ఆహార పదార్థాలను (క్యాబేజీ,
మెంతికూర, క్యాలీఫ్లవర్, మొక్కజొన్నలు, చిలకడదుంపలు, తోటకూర) తీసుకోకూడదు.
3.
విటమిన్ బి. కాంప్లెక్స్ కలిగిన ఆహారాలు (తృణ ధాన్యాలు, గింజలు) విటమిన్ - ఏ
కలిగిన ఆహారాలు (ముదురు ఆకుపచ్చని రంగులో ఉండే ఆకులు, పసుపు పచ్చ రంగులో
ఉండే పండ్లు) ఎక్కువగా తీసుకోవాలి.
ఔషధాలు:
చతుర్ముఖ రసం, క్రమవృద్ధి లక్ష్మీ విలాస రసం, మకరధ్వజ సింధూరం, పూర్ణ
చంద్రోదయం, పంచబాణ రసం, స్వర్ణక్రవ్యాది రసం, వసంతకుసుమాకర రసం, ఆరోగ్య
వర్ధీని వటి, చంద్రప్రభావటి, గోక్షురాది గుగ్గులు ఘృతం, త్రయోదశాంగ
గుగ్గులు, యోగరాజ గుగ్గులు, భృంగరాజసవం, ధాత్రీలోహం, కుమార్యాసవం,
కాంతవల్లభ రసం, లోహాసవం, లోహరసాయనం, లోకనాధ రసం, నవాయాస చూర్ణం, ప్రాణదా
గుటిక, రజతలోహం రసాయనం. స్వర్ణమాక్షీక భస్మం, స్వర్ణ కాంత వల్లభ రసం,
సప్తాఘృత లోహం.
7. పౌష్టికాహార లోహం (మాల్ న్యూట్రిషన్) సరైన
ఆహారం లభిస్తేనే శరీరం సక్రమంగా పనిచేస్తుంది. ఆహారంలో పిండిపదార్థాలు,
మాంసకృత్తులు, కొవ్వు, లవణాలు, ఖనిజాలు, విటమిన్లు - అన్నీ వుండేలా
చూసుకోవాలి. ఎప్పుడూ ఒకేరుచి కలిగిన పదార్థాలను తీసుకోకూడదు. అన్ని రుచులను
కలిపి తీసుకోవాలి.
8. మందుల దుష్పలితం
కొన్ని రకాల మందులకు అలసటను కలిగించే గుణం వుంటుంది. ముఖ్యంగా డిప్రెషన్
ని తగ్గించడానికి వాడే కొన్ని మందులకు ఈ లక్షణం వుంటుంది. లాగే మత్తును
కలిగించే మందులను కూడా. మందుల వల్ల అలసటగా వుంటుందనుకుంటే మీ డాక్టరుతో ఆ
విషయం చర్చించండి.
9. అంతః స్రావీగ్రంథుల సమస్యలు (హర్మోనల్ డిజార్డర్స్) మనం
శరీరంలో వివిధ శారీరక క్రియలు వివిధ రకాలైన గ్రంథుల ద్వారా
నిర్వర్తింపబడతాయన్న సంగతి తెలిసిందే, మెదడు మూల ప్రదేశంలో పిట్యుటరీ
గ్రంథి వుంటుంది. శరీరంలోని గ్రంథుల్ని నియంత్రించే రింగ్ మాస్టర్ ఇదే. ఇది
ఎడ్రినల్ గ్రంథుల్ని శాసిస్తుంది. ఈ ఎడ్రినల్ గ్రంథులు తిరిగి
జననేంద్రియాల పనితీరును నియంత్రిస్తాయి. ప్యాంక్రియాస్ లాంటి మరికొన్ని
గ్రంథులు స్వంతంత్రంగా కూడా పనిచేస్తాయి. వీటిల్లో ఏది గురైనా శరీరపు
బరువులో మార్పు వస్తుంది. అలసటగా అనిపిస్తుంది. ఉదాహరణకి, ఎడ్రినల్ గ్రంథి
మందకొడిగా తయారైందనుకుందాం. అప్పుడు స్టీరాయిడ్ల ఉత్పత్తి తగ్గిపోతుంది.
దీంతో నీరసం ఆవహిస్తుంది. అలాగే, మధుమేహంలో కూడా పాంక్రియాస్ గ్రంథి
ఇన్సులిన్ని ఉత్పత్తి చేయకపోవడం వల్ల నీరసం వస్తుంది. ఔషధాలు: అపామార్గ
క్షారం, కాంచనార గుగ్గులు, గండమాల కందనరసం.
10. శస్త్రచికిత్సానంతర సమస్యలు:
ఆపరేషన్ చేయించుకున్నతర్వాత చాలామందికి నీరసంగా ఉంటుంది. అలసిపోయినట్లు
కనిపిస్తారు. దీనికి కారణాలు అనేకం. ఉదాహరణకు శస్త్రచికిత్స అంటే
భయంకావచ్చు. ఎనస్థీషియా మందులు, యాంటీ బయాటిక్స్ వీటి దుష్పలితాలు కావచ్చు,
లేదా శాస్త్రచికిస్తా సమయంలో కొద్దో గొప్పో రక్తం కోల్పోవడం అనేది కారణం
కావచ్చు, శస్త్రచికిత్స అనంతరం ఆరోగ్యస్థితిని పొందడానికి కనీసం నెల రోజులు
పడుతుంది. దీనిని వైద్య శాస్త్రపరిభాషలో కన్వాలిసెన్స్ అంటారు. ఈ
కాలవ్యవధిలో ఆయుర్వేద మందులు వాడితే త్వరగా కోలుకుంటారు.
ఔషధాలు: కామదుఘారసం (మోతీయుక్తం), లోకనాథరసం, లోహసవం, పంచాసవం.
http://www.teluguone.com/health/doctorprofile/tvaragaalasipovatam-533.html
No comments:
Post a Comment