- జుట్టు నుండి ఎక్కువగా రంగుని తొలగించే పెద్ద కారకం H2O.
- రంగు వేయటానికి ఒకటి లేదా రెండు రోజుల ముందు జుట్టుకి షాంపూ వాడండి.
- రంగు వేయటానికి వారం రోజుల ముందుగా మీ జుట్టుకి కండిషనర్'ని వాడండి.
- సూర్యుడి కిరణాలకు మరియు క్లోరిన్'లకు మీ జుట్టుని దూరంగా ఉంచండి.
- అందం కోసం మరియు వ్యక్తిగత సంరక్షణ కోసం ఖర్చు చేసే ప్రతి రూపాయి మనము లెక్క కడతాము. జుట్టుకి వేసుకునే రంగు చాలా కటినమైన మిశ్రమము. ముఖ్యంగా జుట్టుకి వేసిన రంగు తొందరగా పోవటమే కాకుండా ఎక్కువ కాలం ఉండదు, జుట్టుకి వేసిన రంగు ఎక్కువ కాలం ఉండటం ఎలా?
జుట్టుకి రంగు వేసిన తరువాత, కేశాలలోని రేణువులు వేసిన రంగుకి బానిసలుగా మారిపోతాయి. కానీ నిజానికి, రంగుని తొలగించే పదార్థాలతో కడగటం వల్ల హెయిర్ షాఫ్ట్ క్యుటికిల్స్ నుండి వేసిన రంగు రేణువులు త్రోలగిపోతాయి. H2O (నీరు) అనేది కేశాల నుండి రంగును తొలగించే పెద్ద కారకము, అలా అని జుట్టుని నీటితో కడగకుండా ఉండలేము. కొన్ని పద్దతులు అనుసరించటం వల్ల జుట్టు నుండి రంగుకి సంబంధించిన రేణువులు దూరం అయిపోవటాన్ని తగ్గించవచ్చు. వీటిని అనుసరించటం వల్ల ఏ సమస్య లేకుండా కేశాలను ఇష్టం ఉన్న రంగుతో ప్రకాశింపచేసుకోవచ్చు.
షాంపూ ట్రిక్
సూచించిన చిట్కాలను అనుసరించటం వల్ల, అవలక్షణమైన జుట్టు రంగు వేసుకోటానికి అనుగుణంగా మారుతుంది. దీని వల్ల మీ జుట్టుకు వేసిన రంగు ఎక్కువ కాలం నిలిచి ఉంటుంది మరియు రంగు వేసుకోటానికి ఒక రోజు లేదా రెండు రోజుల ముందు మాత్రమే షాంపూ వాడాలి. ఆ తరువాత షాంపూని వాడకుండా మీ జుట్టుకి రంగు వేయండి. ఇలా చేయటం వల్ల మీ జుట్టు నుండి రంగు త్వరగా తొలగిపోవటాన్ని అధిగమిస్తారు, మరియు వీటి తరువాత జుట్టికి సహజ సిద్ధమైన నూనెలను వాడటం వల్ల వెంట్రుకలకు మంచిది. ఇలా చేయటం వల్ల మీ జుట్టుకి రంగు అతుక్కొనే ఉంటుంది.
కండిషనింగ్ ట్రిక్
కేశాలకి వేసిన రంగు ఎక్కువ కాలం ఉండాలి అనుకుంటే, రంగు వేసుకోటానికి ఒక వారం ముందుగా కండిషనర్'ని తప్పకుండా వాడండి. ముఖ్యంగా మూడు రోజుల ముందు కండిషనర్'ని వాడటం వల్ల, వెంట్రుకలకు ఎక్కువ తేమని సమకూరుతుంది. మీరు నిజంగా రంగు వేయటానికి ముందు ఇలా చేయటం వల్ల తరువాత కండిషనర్'ని వాడాల్సిన అవసరం లేదు.
అతిశయమైన మార్పులు (Extreme changes)
చాలా మంది కేశాలు నలుపు నుండి తెలుపు, ఎరుపు, పర్పల్, రంగులోకి మార్చటానికి ఇష్టపడుతూ ఉంటారు. ఇది చాలా తప్పు మరియు ఇలా చేయటం వల్ల కేశాలకు వేసిన రంగు చాలా కాలం ఉండలేదు. మీరు ఎపుడైతే అతిశయమైన మార్పులు చేస్తారో, అపుడు వేసే రంగు యొక్క పనిని గమనించండి, రంగు వేసేటపుడు వెంట్రుకల మూలాలకు రంగును అద్ధటానికి ఎక్కువ సమయం మరియు ఎక్కువ సార్లు వెంట్రుకల మొదల్లలో రంగును పూయాలి. జుట్టుకి సహజ సిద్దమైన రంగులను వాడటం మంచిది.
సూర్యరశ్మికి దూరంగా ఉండటం
తొందరగా జుట్టు రంగు పోవటానికి సూర్యరశ్మి కూడా ఒక కారణం. సూర్యరశ్మి వల్ల చర్మమే కాకుండా, జుట్టు కూడా పాడవుతుంది. మీరు ఎక్కువ సమయం ఎండలో గడపడము వల్ల మీ వెంట్రుకలు పొడి బారటమే కాకుండా, మీ కేశాల యొక్క రంగుని కూడా త్రోలగిస్తుంది. సూర్యరశ్మి నుండి మీ చర్మాన్ని సురక్షితంగా ఉంచుకోటానికి ఏ విధంగా అయితే లోషన్స్'ని వాడతారో, టోపీ, హ్యాట్ వంటి వాటిని ధరించి మీ కేశాలను సూర్యరశ్మి నుండి కాపాడుకోండి.
క్లోరిన్ స్కేర్ [Chlorine scare]
తప్పకుండా దీని నుండి జాగ్రత్తగా ఉండాలి. క్లోరిన్ జుట్టుని పాడుచేస్తుంది ఇది జుట్టుకి వేసే రంగు కాదు. ప్రతిసారి స్విమ్మింగ్ పూల్'లో దుకేపుడు స్విమ్మింగ్ క్యాప్'లను ధరించటం వల్ల క్లోరిన్ స్త్రిప్స్ నుండి తప్పించుకోవచ్చు, కేప్ ధరించక పోవటం వల్ల క్లోరిన్ స్ట్రిప్ జుట్టు రంగుని త్వరగా తొలగించేస్తుంది.
ఇలాంటి సూచనలను పాటించటం వల్ల మీరు ఎక్కువ కాలం మీ జుట్టు రంగుని ఉంచుకోగలుగుతారు. శ్రేష్ఠమైన జుట్టుకి హాని కలిగించని రంగులను ఎంపికచేసుకోండి.
Image Courtesy:Getty Imageshttp://telugu.onlymyhealth.com/how-to-hair-colour-longer-in-telugu-1394179241
Pages
Total Pageviews
13 Jul 2015
జుట్టుకు వేసిన రంగు ఎక్కువ రోజులు ఉంచుకోవటం ఎలా?
Labels:
Health,
Tips &Trics
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment