- వెంట్రుకల ఆరోగ్యంగా ఉండటానికి తాజా పండ్లు & కూరగాయలను తినండి.
- జుట్టును శుభ్రపరిచుటకు గోరు వెచ్చని నీటిని ఉపయోగించండి.
- జుట్టుకు రసాయనికాలతో తయారు చేసిన క్రీమ్'లను వాడకండి.
- జుట్టు ఆరోగ్యానికి ఇంట్లో ఉండే ఔషదాలు శక్తివంతంగా పని చేస్తాయి.
- నూతన కాలంలో కాలుష్యం, మారుతున్న వాతావరణం, జన్యు సంక్రమణ, వివిధ రకాల కారణాల వలన జుట్టు రాలటం సాధారణం అని చెప్పవచ్చు. కానీ కొన్ని చిట్కాలను అనుసరించటం వలన జుట్టు రాలటాన్ని తగ్గించవచ్చు. వాటి గురించి ఇక్కడ తెలుపబడింది.
ఆరోగ్యకరమైన జీవన శైలిని అనుసరించండి
కావున, మీ జుట్టు ఆరోగ్యంగా ఉండటానికి కావాల్సిన అన్ని రకాల నియమాలను అనుసరించండి. తాజా పండ్లు మరియు కూరగాయాలను (జుట్టు పెరుగుదలకు అవసరమయ్యే విటమిన్ 'B', కాల్షియం, జింక్) తినండి. ఎల్లపుడు ప్రోటీన్ ఎక్కువగా ఉన్న ఆహారాలను (వెంట్రుకలు ప్రోటీన్ నిర్మితం) మరియు అధిక మొత్తంలో నీటిని తాగండి.
వెంట్రుకల గురించి తగిన జాగ్రత్తలు తీసుకోండి
సాధారణంగా కాలుష్య వాతావరణంలో తిరగటం వలన జుట్టుపై దుమ్ము, ధూళి చేరి, జుట్టు వివిధ రకాల ఇన్ఫెక్షన్'లకు గురవుతుంది అవునా! ఫలితంగా జుట్టు రాలిపోతుంది కావున ఎప్పటికపుడు మీ జుట్టును శుభ్రంగా ఉంచుకోండి. అంతేకాకుండా, జుట్టు కడగటానికి గోరు వెచ్చని నీటిని మాత్రమె వాడండి, వెంట్రుకలకు వాడే షాంపూ, నాణ్యమైనదిగా ఉండేలా చూసుకోండి. షాంపూతో కడిగే సమయంలో, వెంట్రుకల మొదల్లపై మరియు ఫాలికిల్'లపై మీ దృష్టిని కేంద్రీకరించండి. అదేవిధంగా, కండిషనర్ లేదా జుట్టు సంబంధిత లోషన్'లను వాడే సమయంలో జుట్టు కొనలపై దృష్టి సారించండి.
అంతేకాకుండా, ఎప్పటికపుడు సమయానికి అనుగుణంగా, మీ జుట్టు కోనలను కత్తిరించండి. ఫలితంగా, అవి ఆరోగ్యంగా ఉండటమే కాకుండా, పెరుగుదలలో కూడా మెరుగుపడుతుంది.
జుట్టుకు హాని కలిగించే వాటికి దూరంగా ఉండండి
జుట్టు స్టయిల్'గా కనపడేలా చేయటానికి వాడే వివిధ రకాల పరికరాలు, జుట్టును లాగి ఉంచుటకు ఉపయోగించే బాండ్ వంటివి (బాండ్స్, పోనిటైల్) వాడటం వలన వెంట్రుకల మోదళ్ళపై ఒత్తిడి కలిగి, ఫాలికిల్'లి పాడయ్యే అవకాశం ఉంది. ఫలితంగా జుట్టులో పెరుగదల లోపాలు లేదా రాలిపోవటం జరుగుతుంది.
రసాయనిక ఉత్పత్తుల (హెర్బల్ ఉత్పత్తులు అయినను) వాడకం వలన వాటి ఆరోగ్యం పాడయ్యే అవకాశం ఉంది. వీటిలో రసాయనికాలతో కూడిన స్ట్రెయిట్నర్స్, హాట్-ఆయిల్ ట్రీట్మెంట్, హాట్ ఐరోనింగ్ వంటి వాటికి సాధ్యమైనంత వరకు దూరంగా ఉండండి.
డ్రయర్'లను వాడే సమయంలో తగిన జాగ్రత్తలను తీసుకోండి. అనగా అధిక వేడి మరియు స్పీడ్'లతో ఉన్న డ్రయర్'ను వాడటం వలన జుట్టు ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉంది అందువలన జుట్టు తడిని పోగొట్టటానికి వేరే పద్దతులను అనుసరించండి లేదా డ్రయర్ యొక్క వేడి మరియు వేగాన్ని తగ్గించి జుట్టు యొక్క తడిదానాన్ని పోగొట్టండి. వెంట్రుకలపై ఒత్తిడితో దువ్వటం వలన జుట్టు ప్రమాదానికి గురయ్యి, తెగిపోయే అవకాశం ఉంది. కావున ఎక్కువ ఖాళీలు ఉన్న దువ్వెనతో, నెమ్మదిగా దువ్వండి.
ఆరోగ్యకరమైన జుట్టు కోసం ఇంట్లో చికిత్స
జుట్టు ఆరోగ్యంగా ఉండటానికి ఇక్కడ కొన్ని రకాల సూచనలను తెలిపాము, భారతదేశంలోని స్త్రీలు చాలా కాలం నుండి ఈ రకమైన సూచనలను పాటిస్తున్నారు.
మీ జుట్టు ఆరోగ్యంగా ఉండటానికి హెన్న పేస్ట్, పెరుగు, నానబెట్టిన మెంతులను, మందార పువ్వులను లేదా గుడ్డు వంటి ఇంట్లో సాధారణంగా లభించే ఔషదాలలో ఏదోక ఔషదాన్ని ఎంచుకొని షాంపూ వాడటానికి ముందుగా వాడండి. వీటిని క్రమంగా వాడటం వలన మీ జుట్టు బలంగా మరియు చూడటానికి అందంగా కనపడుతుంది. కానీ, హెన్న అనేది నల్ల రంగులో వెంట్రుకలను కలిగి ఉన్న వారికి మాత్రమే సరిపోతుంది కారణం- హెన్నా జుట్టును ఎరుపు రంగులోకి మారుస్తుంది.
జుట్టును వారానికి ఒకసారైన టీ పొడితో చేసిన డికాషన్ లేదా స్నానం చేసే నీటిలో కొద్దిపాటి నిమ్మరసంను కలపండి. దీని వలన చుండ్రు తగ్గుతుంది.
కొబ్బరి నూనె లేదా బాదం నూనెలతో రోజు మసాజ్ చేయండి. రాత్రి పడుకునే సమయంలో కొబ్బరి నూనెతో మదాజ్ చేయటం వలన, వెంట్రుకల మొదల్లలో కదలికలు జరిగి, కేశాలు ఆరోగ్యకరంగా ఉంటాయి.
Image Courtesy : Getty Images
http://telugu.onlymyhealth.com/hairfall-prevention-tips-in-telugu-1414557539
Pages
Total Pageviews
13 Jul 2015
జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు
Labels:
Health,
Tips &Trics
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment