- గర్భం ధరించిన వారిలో హార్మోన్'ల ప్రభావం వలన చాలా మార్పులు జరుగుతాయి.
- గర్భసమయంలో మానసిక స్థితిలలో మార్పులు చాలా సాధారణం.
- లైంగిక పరంగా నిలకడ లేని మనస్తత్వము ఈ దశలో చాలా సాధారణం.
- గర్భనిర్దారణ జరిగిన కొంత మంది దంపతులు దూరంగా ఉండటానికి ఇష్టపడుతుంటారు.
- చాలా మంది ఆడవారిలో మొదటి త్రైమాసిక గర్బస్థ దశలో చాలా మార్పులను వారి శరీరంలో గమనిస్తారు. దీని వలన మీ కడుపులో మరొక ప్రాణి లేదా మీ శిశువు పెరుగుతుంది అని చాలా ఆశ్చర్యానికి గురవుతారు. లేదా తరువాత 9 నెలలో వచ్చే సమస్యలు మరియు వాటి కోసం తీసుకోవలసిన జాగ్రత్తల గురించి విచారణకు గురవుతుంటారు.
మొదటి కొన్ని నెలలు
మొదటి సారి గర్భం ధరించిన వారికి మొదటి త్రైమాసిక దశ చాలా కష్టతరంగా అనిపిస్తుంది. ఏ సమయంలో మీ శరీరంలో చాలా రకాల మార్పులకు మరియు మీ శరీర భాగాల పని తీరును గమనిస్తుంటారు. అజీర్ణము, మలబద్దకము, తలనొప్పి మరియు ఇతర కారకాల వలన ఇబ్బందులకు గురవుతుంటారు. కానీ మీరు తెలుసుకోవాల్సింది ఏమిటంటే, మీ శరీరంలో జరిగే మార్పులకు అనుగుణంగా మీరు మారుతున్నారు అని అర్థం చేసుకోవాలి. ఎక్కువ సమయం విశ్రాంతి తీసుకోవాలి. ఆరోగ్యకరమైన ఆహరం మరియు ఎక్కువ సమయం విశ్రాంతి తీసుకోవటం మర్చిపోకండి.
మానసిక కల్లోలాలు
గర్భసమయంలో మీరు తెలుసుకోవలసిన ముఖ్య విషయం మానసిక కల్లోలం గురించి. మీ శరీరంలో విడిదల అయ్యే హార్మోన్'ల వలన మీ మాసిక స్థితి స్థిరంగా ఉండదు. కొన్ని సార్లు ఆనందంగా ఉంటారు ఆ మరుసటి నిమిషం చాలా వేదనకు గురి అవుతుంటారు. ఏది ఏమైనను, మీరు మీ కోపాన్ని నియంత్రణలో ఉంచుకుంటూ మరియు ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించండి. మీ శరీరంలో హార్మోన్'లకు అనుగుణంగా త్వరగా మీ శరీరంలో పెద్ద మార్పులు సంభవిస్తుంటాయి, ఆ మార్పులకి అనుగుణంగా వాటిని భరిస్తూ కోపంను భయటపడనివ్వకండి.
లైంగిక ఆలోచనలు
మీరు గర్భాన్ని ధరించిన తరువాత సాధారణంగా లైంగిక కార్యకలపాల పైన ఆసక్తిని కోల్పోతారు. స్త్రీలు వారి శరీరంలో జరిగే మార్పుల వలన వీటి పైన ఆసక్తిని కలిగి ఉండరు. కానీ కొంత మందిలో గర్భం ధరించిన తరువాత కుడా లైంగిక చర్యల పైన ఆసక్తిని చూపిస్తుంటారు కానీ కొంత మందిలో వాటి పైన పూర్తి ఆసక్తి కోల్పోతారు, ఇందులో విచారించటానికి ఏమి లేదు కొంత సమయం లేదా ప్రసవం అయిన తరువాత కొంత సమయం తరువాత తిరిగి వారి ఆలోచనలు మామూలు స్థితికి వస్తాయి.
గర్భ సమయంలో శిశువు కోసం ప్రణాళిక
మీ శిశువు కోసం ముందుగానే జాగ్రత్తలు తీసుకొని ప్రణాలికలు రూపొందించటం చాలా మంచిది. రోజు కొన్ని గంటల పాటూ పుట్టబోయే మీ పాపాయి కోసం ఆలోచించటం వలన, గర్భ సమయంలో కలిగే ఇబ్బందులను కొద్దిగా అయిన మర్చిపోయే అవకాశం ఉంది. ఇలాంటి విషయాలు అన్ని మీ భాగాస్వామితో కూడా చర్చించటం వలన మీరు ఉపశమనాన్ని పొందే అవకాశం ఉంటుంది.
ప్రసవం
చివరి త్రైమాసిక దశ తరువాత చివరగా ఉండేది ప్రసవం. ప్రసవం నొప్పి మరియు భయంతో కూడినది మాత్రమే కాదు, మీ ఆరోగ్యము మరియు మీ శిశువు క్షేమంతో కూడా ముడిపడి ఉంది. అంతేకాకుండా ప్రసవం తరువాత మీ పాపాయిని చూడటానికి ఉత్సాహంగా ఉంటారు.
గర్భం అనేది ఒక అందమైన మరియు ప్రతి స్త్రీ పొందవలసిన దశ. ఒక సారి గర్భాన్ని ధరించిన తరువాత, రెండవ సారి వచ్చే సమస్యల పట్ల పూర్తి అవగాహన కలిగి ఉంటారు. రెండవ సారి వచ్చే సమస్యలకు పరిష్కారాలు కుడా మీరే అవగాహన కలిగి ఉంటారు.
Image Courtesy:Getty Images
http://telugu.onlymyhealth.com/things-know-about-pregnancy-in-telugu-1402057407
Pages
Total Pageviews
13 Jul 2015
గర్భం గురించి తెలుసుకోవలసిన ముఖ్య విషయాలు
Labels:
Health,
Tips &Trics
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment