మెటబాలిజమ్
అంటే మన శరీరంలో జరిగే రసాయనిక ప్రక్రియ. దీన్ని స్థూలంగా చెప్పుకోవాలంటే రోజుకి కేలరీలు ఖర్చయ్యే వేగం అనుకోవచ్చు. అయితే ఇది అందరికీ ఒకేలా ఉండదు. కొందరు ఎక్కువగా తిన్నప్పటికీ సన్నగా ఉండటానికీ.. మరికొందరు ఏ కొంచెం తిన్నా బరువు పెరగటానికీ ఈ తేడానే కారణం. అందుకే మెటబాలిజమ్‌పై అవగాహన కలిగి ఉండటం చాలా అవసరం.జీవక్రియల (మెటబాలిజమ్) జరిగే మార్పుల మూలముగా మధుమేహం, అధిక రక్తపోటు, స్థూలకాయం, క్యాన్సర్ వంటి వాటిని మనం ఎదుర్కొనవలసి వస్తుందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.
బరువుపై ప్రభావం
* జీవక్రియల వేగం తక్కువగా ఉండే వారిలో కేలరీలు ఖర్చు కావటమూ నెమ్మదిగా జరుగుతుంది. దీంతో కేలరీలు పోగుపడి, బరువు పెరుగుతుంటారు. అదే జీవక్రియలు వేగంగా జరిగేవారిలో కేలరీలు ఖర్చూ అధికమే. కాబట్టి బరువు పెరిగే అవకాశం తక్కువ.
చల్లటి నీరు తాగండి
* రోజుకి 6-8 గ్లాసుల నీరు తాగటం మంచిది. ఇది జీవక్రియల వేగాన్ని పెంచి శరీరం నుంచి విష పదార్థాలు, అధిక కొవ్వును తొలగించటానికి తోడ్పడుతుంది. భోజనానికి ముందు చల్లటి నీరు తాగితే జీర్ణాశయం కుంచించుకుపోయి కొంచెం తినగానే కడుపు నిండిన భావన కలుగుతుంది.
మూడు గంటలకోసారి
* ఒకేసారి ఎక్కువగా తినటం కన్నా కొంచెం కొంచెంగా రోజుకి 4-6 సార్లు ఆహారం తీసుకోవటం మంచిది. భోజనాన్ని మానేయటం అసలు చేయరాదు. క్రమం తప్పకుండా ఆహారం తీసుకోకపోతే జీవక్రియలు మందగించి, కొవ్వు పేరుకుపోవటానికి దారి తీస్తుంది.
అల్పాహారమూ తప్పనిసరి
* ఉదయం పూట టిఫిన్ చేయటం తప్పనిసరి. తొలిసారి తీసుకునే ఈ అల్పాహారం రోజంతా జరిగే జీవక్రియల పద్ధతిని గాడిలో పెడుతుంది. ఒకవేళ పెందరాలే లేచి, ఆలస్యంగా టిఫిన్ చేస్తే.. కేలరీలు ఖర్చు విషయంలో చాలా సమయాన్ని వృథా చేసుకున్నట్టే.
ట్రాన్స్‌ఫ్యాట్ వద్దు
* బిస్కట్లు, బ్రెడ్, చాక్లెట్లు, ఫాస్ట్‌ఫుడ్, వేపుళ్లు, కేకుల వంటి వాటిల్లో ట్రాన్స్‌ఫ్యాట్స్ ఉంటాయి. ఇవి రక్తంలో కొలెస్ట్రాల్‌ను పెంచి హాని చేస్తాయి. మంచి కొలెస్ట్రాల్ మోతాదునూ తగ్గిస్తాయి. కాబట్టి వీటి జోలికి వెళ్లకపోవటమే మంచిది.
వ్యాయామం చేయాలి
* క్రమం తప్పకుండా వ్యాయామం చేయటం ఎంతో అవసరం. రోజుకి కనీసం 2-3 కి.మీ. నడవాలి. శారీరకశ్రమ మూలంగా గుండె, వూపిరితిత్తులు పూర్తి సామర్థ్యంతో పనిచేస్తాయి. వ్యాయామం ఎప్పుడు చేసినా మంచిదే గానీ.. సాయంత్రం పూట శారీరకశ్రమ మెటబాలిజమ్‌కు ఎంతగానో తోడ్పడుతుంది. ఎందుకంటే రాత్రయ్యే కొద్దీ చాలామందిలో జీవక్రియల వేగం మందగిస్తుంటుంది. రాత్రి భోజనానికి ముందు అరగంట సేపు కదలికలు వేగంగా ఉండే వ్యాయామం చేస్తే జీవక్రియల వేగమూ పెరుగుతుంది.
కొవ్వుని కరిగించే పీచు
* పీచు పదార్థాలు ఎక్కువగా తినేవారిలో అధిక బరువు సమస్య తక్కువగా ఉంటున్నట్టు వివిధ అధ్యయనాల్లో తేలింది. కొవ్వును కరిగించే వేగాన్ని ఇది 30 శాతం వరకు పెంచుతుంది కూడా. కాబట్టి రోజుకి సుమారు 25 గ్రాముల చొప్పున మూడుసార్లు పండ్లు, కూరగాయలు తినటం మరవరాదు. అలాగే రోజుకి 70 గ్రాములకు తక్కువ కాకుండా ప్రోటీన్లనూ తీసుకోవాలి. ఇవి రక్తంలోకి ఇన్స్‌లిన్ స్రావాన్ని నియంత్రించి, జీవక్రియలకు ఉత్తేజాన్నిస్తాయి.
నిద్రతో ఎంతో మేలు
* రాత్రిపూట రోజుకి 6-7 గంటలు నిద్రపోవటం ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఆలస్యంగా పడుకొని, తగినంత నిద్రపోనివారిలో ఒత్తిడి పెరగటమే కాదు, శరీరంలో అవయవాల చుట్టూ కొవ్వు కూడా పేరుకుంటున్నట్టు పరిశోధనల్లో బయటపడింది.
ఉపవాసం వద్దే వద్దు
* చాలామంది బరువు తగ్గించుకోవటానికి ఉపవాసాలు చేస్తుంటారు. దీంతో మేలు కన్నా కీడే ఎక్కువ. పూర్తిగా ఆహారం తీసుకోకుండా ఉంటే జీవక్రియల వేగం మందగించి, శరీరంలో కొవ్వు పేరుకుపోవటానికి దోహదం చేస్తుంది.

No comments:
Post a Comment