31 Jul 2015

తామర గురించి భయము వద్దు


జేనిటక్ గురించి ........


వేరికోసిల్ వుంటే పిల్లలు పుట్టరా ?


పగటి నిద్ర ఎప్పుడూ మేలే


హెర్నియా అంటే ఏమిటి?



  • హెర్నియా అంటే ఏమిటి? : 
  •  మనశరీరములో వివిధ భాగాలు నిర్ధిష్ట స్థానాలలో స్థిరముగా ఉండేలా చూసేవి కండరాలు . గజ్జల్లో కాని, ఉదరంలో కాని కండరాలు బలహీనపడినప్పుడు, కడుపు లోని కొవ్వు, ప్రేగులు వాటిగుండా బయటికి రావడానికి ప్రయత్నిస్తాయి. అప్పుడు బయటికి కనబడే "ఉబ్బు"ను గిలక లేదా హెర్నియా (Hernia) అంటాము. కారు లేదా బైక్‌ టైర్‌ పంచర్‌ అయినప్పుడు లేదా దెబ్బ తిన్నప్పుడు ట్యూబ్‌ ఆ ప్రాంతంలో ఉబికి వచ్చినట్లుగా ఉంటుం ది. హెర్నియాలో ఇలాగే జరుగుతుంది. ఏ వయస్సు వారికై నా వచ్చే అవకాశం ఉంది. ఈ వ్యాధి ఉన్న వారికి ఆ ప్రాంతంలోని అవయవం లేదా కణజాలం ఉబ్బినట్టు కనిపిస్తుంది. అలాంటపుడు వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి. మొదట్లో నొప్పి ఉన్నట్లు అనిపించక పోయినా ఆ తర్వాత సమస్య మరింత జటిలమవుతుంది. ఈ విషయాన్ని గుర్తించి వెంటనే చికిత్స ప్రారంభించాలి.

హెర్నియా పలు రకాలు

* 1. గజ్జల్లో వచ్చే హెర్నియా (Inguinal Hernia)
* 2. తొడ లోపలి భాగంలో వచ్చే హెర్నియా (Femoral Hernia)
* 3. ఉదర పైభాగంలో వచ్చే హెర్నియా (Epigastric Hernia, Umbilical Hernia, Para-Umbilical Hernia)
* 4. శస్త్రచికిత్స ఐన తరువాత, కొంత కాలానికి, శస్త్రచికిత్సజరిగిన చోట ఏర్పడే హెర్నియా (Postoperative Incisional Hernia)

వ్యాధి లక్షణాలు

1. దగ్గినప్పుడు, బరువులను ఎత్తినప్పుడు "ఉబ్బు" కనబడుతుంది. చేతితో ఒత్తితే "ఉబ్బు"తిరిగి లోపలికి వెళ్ళిపోవచ్చు. 2. ఒక్కోసారి కడుపులోని ప్రేగులు అక్కడే చిక్కుకొని, తిరిగి కడుపు లోనికి వెళ్ళకపోవచ్చు. అప్పుడు రోగికి తీవ్రమైన కడుపునొప్పి, వాంతులు మొదలవవచ్చు. దీనిని Strangulated Hernia అంటారు. ఇది ఎమర్జెన్సీ. త్వరగా ఆపరేషన్ చేయకపోతే రోగికి ప్రాణాపాయం కలగవచ్చు.

ఎవరికి వస్తుంది ఈ వ్యాధి ?

1. ఎక్కువగా బరువులు ఎత్తేవారిలో-వృత్తి రీత్యా , కూలీలు, హమాలీలు, రైతులు వగైరా. 2. మద్యపానం చేసేవారిలో, కొందరికి కండరాలు పలచబడుతాయి. 3. వృద్ధుల్లో. 4. ఊబకాయం గలవారికి. 5. పుట్టుకతోనే కొందరికి కండరాలు బలహీనంగా ఉండొచ్చు. వారిలో. 6. ఆపరేషన్ చేయించుకొన్న వారిలో, ముఖ్యంగా Cessarian, Tubectomy, Appendicectomy మొదలైనవి.(అంటే ప్రతి ఒక్కరికీ రావాలని ఏమీలేదు.)


వ్యాధి నిర్ధారణ పరీక్షలు
ఏమీ లేవు. వైద్యుడు కళ్ళతో చూసి, చేతితో పరీక్షించి, రోగ నిర్ధారణ చేస్తాడు.

సాధారణంగా ఇది బొడ్డు దగ్గర లేదా పొత్తికడుపు దిగువన మర్మావయాల ప్రాం తంలో వస్తుంది. ఆపరేషన్‌ జరిగిన ప్రాంతంలో కూడా రావచ్చు. చర్మం కింద వా పులా కన్పిస్తుంది. దగ్గినప్పుడు, బరువులు ఎత్తినప్పుడు, మలమూత్ర విసర్జన సమయాల్లో ఆ వాపు మరింత స్పష్టంగా తెలుస్తుంది. మొదట్లో ఎ లాంటి బాధ లేకున్నా, నొప్పి కొద్దిగానే ఉన్నప్పటికీ రానురానూ సమస్య తీవ్రమౌ తుంది.

హెర్నియా ఎందువల్ల వస్తుంది?
పొత్తికడుపు సహజంగానే కొన్ని బలహీన ప్రాంతాలను కలిగిఉంటుంది. ఆ పొరలు బలహీనంగా ఉన్న చోట హెర్నియా వస్తుం 0ది. బరువులు ఎత్తినప్పుడు నిరంతరాయంగా నొప్పి రావడం, దగ్గు, మలమూత్ర విసర్జనల సమస్యల్లాంటివి ఈ బలహీన ప్రాంతాలను మరింత బలహీనం చేస్తాయి. ఫలితంగా హెర్నియా ఏర్పడుతుంది. పిల్లల్లో కానవచ్చే హెర్నియాల్లో అధిక శాతం పుట్టుకతో వచ్చేవే.

హెర్నియా ఏర్పడిన తరువాత ఏం జరుగుతుంది?
హెర్నియా ఏర్పడితే దాన్ని తొలగించేందుకు ఆపరేషన్‌ మినహా మరో మార్గం లేదు. హెర్నియా ఏదీ దానంతదే తగ్గదు. కాలం గడుస్తున్న కొద్దీ మానిపోదు. ఏ రకం హెర్నియా అయినా తీవ్రమైన నొప్పిని కలిగిస్తుంది. ఇతరత్రా తీవ్ర సమస్యలూ తలెత్తవచ్చు.

హెర్నియాతో ఎలాంటి సమస్యలు రావచ్చు?
నిరంతరాయంగా తీవ్రమైన నొప్పి, వాపు, తీపు ఉండవచ్చు. ఇవన్నీ ఆందోళన కలిగించే అంశాలే. సర్జరీ ద్వారా హెర్నియాను తొలగించుకోవచ్చు.

హెర్నియాను నయం చేయడమెలా?
లోకల్‌ అనస్తేషియా ఇచ్చి మూడు, నాలుగు అంగుళాల గాటు చేయడం ద్వారా సర్జరీ చేస్తారు. పేషెంట్‌ 5 రోజుల్లోఇంటికి వెళ్ళవచ్చు. లాప్రోస్కోప్‌ ద్వారా కూడా ఇది చేయవచ్చు. దీనికి జనరల్‌ అనస్త్తీషియా ఇవ్వాల్సి ఉంటుంది. పేషెంట్‌ మరుసటి రోజు ఇంటికి వెళ్ళవచ్చు.

హెర్నియా సర్జరీతో ఇతర దుష్ఫలితాలు (సైడ్‌ ఎఫెక్ట్స్‌) ఏవైనా ఉంటాయా?
ఏ ఆపరేషన్‌కైనా ఇతర దుష్ఫలితాలు ఉండే అవకాశం ఉంది. హెర్నియా కూడా ఇతర సాధారణ ఆపరేషన్‌ లాంటిదే. దీనిలో వాటిల్లే సమస్య లు మాత్రం చాలా తక్కువ, మరీ ముఖ్యంగా లోకల్‌ అనస్తీషియా ఇచ్చి చేసినప్పుడు.


Visit website - > Dr.Seshagirirao.com/

పిల్లల తో కలసి మెలిసి మీరు కుడా ఉంటే ఆ ఆనందం ...


వుద్యోగం మారేటప్పుడు జాగ్రత్త


పసివాళ్ళ కోసము ....


భార్య భర్తలు మధ్య ...........



Top 10 Useful Gadgets That Will Change Your Life

Cool Future Gadgets - Top New Technology - Best High-tech Inventions 2015

Mercedes F 015 Self Driving Car Amazing First Commercial CES Mercedes S ...

30 Jul 2015

10 Brain Damaging Habits That You Must Know

 
   1. No Breakfast
People who do not take breakfast are going to have a lower blood sugar level.
This leads to an insufficient supply of nutrients to the brain causing brain degeneration.

2. Overeating
It causes hardening of the brain arteries, leading to a decrease in mental power.

3. Smoking
It causes multiple brain shrinkage and may lead to Alzheimer disease.


4. High Sugar consumption
Too much sugar will interrupt the absorption of proteins and nutrients causing malnutrition and may interfere with brain development.

5. Air Pollution
The brain is the largest oxygen consumer in our body. Inhaling polluted air decreases the supply of oxygen to the brain, bringing about a decrease in brain efficiency.

6. Sleep Deprivation
Sleep allows our brain to rest. Long term deprivation from sleep will accelerate the death of brain cells.

7. Head covered while sleeping
Sleeping with the head covered increases the concentration of carbon dioxide and decrease concentration of oxygen that may lead to brain damaging effects.

8. Working your brain during illness
Working hard or studying with sickness may lead to a decrease in effectiveness of the brain as well as damage the brain.

9. Lacking in stimulating thoughts
Thinking is the best way to train our brain, lacking in brain stimulation thoughts may cause brain shrinkage.

10. Talking Rarely
Intellectual conversations will promote the efficiency of the brain.

Visit : http://www.healthdigezt.com/10-brain-damaging-habits-that-you-must-know/

కీళ్ళ నొప్పులకు, ఆయుర్వేద పరిష్కారాలు


Foods to Avoid While Trying to Conceive

Are you trying to conceive? Do you eat healthy?

 

Conception is a commitment for which you need to prepare both
mentally and physically. You have to be in a good shape with a
sound mind. The foods that you eat during those days have a great
impact on your body that is preparing for motherhood. Yes, I mean
it. There are foods you should avoid during your TTC days.
 
1. Stop taking too many sweets. Trans fats and sugars are not good
at any time. These have no nutrition but fats. You don't want to
end up with gestational diabetes for sure!
 
2. Soya in excess can harm the guy! Though soya cannot cause
inertility to a healthy male it is wise to limit soya products if
he has a slight problem in the area.
 
3. Eating raw eggs or fish (Japanese dishes like Sushi) could
expose you to bacteria and infections. So do not take raw animal
foods and unpasteurised cheese. Cook them well!
 
4. Avoid high mercury content in your diet. King mackerel and
certain types of fish are harmful for a developing fetus' nevous
system. If you are a fish lover, your better choices are trout,
salmon or shrimp.
 
5. Avoid alcoholic beverages. These drinks harm you even before you
know that you are pregnant. Alcohol may even interfere  with a
woman's ability to get pregnant.
 
6. Caffeine is yet another factor you should not ignore. There are
studies that say that caffeine is linked to risk of miscarriage and
infertility in women. So go easy on caffeinated drinks if you are
trying to get pregnant. Other than tea and coffee, soda, drinks,
chocolate, and coffee ice cream can also contain caffeine. Remember
that some allergy medications and the like also contain caffeine.
 
7. Staying away from cigarette smoke is also a healthy thing to do.
 
8. Excess of Vitamins A, C, or D should be avoided in your diet.
 
While Vitamin E, C, Folic Acid and Zinc are key nutrients for a
healthy sperm a woman need folic acid everyday to keep birth
defects at bay!
 
I would be happy to answer any other queries you might have
. Check us out at www.nirogam.com
Follow us on Facebook at : http://www.facebook.com/nirogam
 
Wishing you good health,
 
Regards,
Puneet Aggarwal
puneet@puneetaggarwal.com

సమస్యలని పిల్లల కు ఏ విధముగా తెలపాలి


ఆడ పిల్లలూ , జాగ్రత్త సుమా


స్మార్ట్ ఫోన్ వుంటే అందు బాటు లో అందరు వైద్యులు


మొబైల్ ఫోన్ కు రక్షణ



27 Jul 2015

త్వరగా అలసిపోవటం


1. మీకు ఇట్టే అలుపురావడంతో పాటు పాలిపోయినట్లు, తెల్లగా వుంటారా? ఆయాసంగా అనిపిస్తుంటుందా? అప్పుడప్పుడు తల తిరిగినట్లు కూడా అనిపిస్తుందా?
రక్తహీనత (ఎనీమియా)
2. జలుబు, ప్లూ జ్వరాల్లాంటి వాటితో బాధపడుతున్నారా?
ఇన్ఫెక్షన్లు
3. ఎప్పుడు విషాదంగా, టెన్షన్ గా అనిపిస్తుంటుందా? అందరూ కలిసి మిమ్మల్ని 'మోసం' చేశారని అనిపిస్తుంటుందా?
క్రుంగుబాటు (డిప్రెషన్)
4. ఒకవేళ మీరు స్త్రీలైతే - గర్భం ధరించారా? లేదా, బహిష్టు ఆగిపోవాల్సిన వయసుకు చేరుకున్నారా?
హార్మోన్ల తేడాలు
5. ఎప్పుడూ అసహనంగా, విసుగ్గా, చిరాగ్గా వుంటుందా?
నిస్త్రాణం
6. మీకు చలిగా అనిపిస్తుంటుందా? జుట్టు పలుచబడిపోతోందా?
పొడిగా కూడా తయారవుతుందా? బరువు పెరుగుతున్నారా?
థైరాయిడ్ గ్రంథి చురుకుదనం తగ్గటం (హైపోథైరాయిడిజం)
7. సమతులాహారం తీసుకోవడం లేదా?
పౌష్టికాహార లోపం (మాల్ న్యూట్రిషన్)
8. ఏవైనా అల్లోపతి మందులు వాడుతున్నారా?
మందుల దుష్పలితం
9. మీ బరువులో మార్పు వచ్చిందా?
అంతః స్రావీగ్రంథుల సమస్యలు (హార్మోనల్ డిజార్డర్స్)
10. ఆపరేషన్ చేయించుకున్నారా?
శస్త్ర చికిత్సా నంతర సమస్యలు

"నాకే మాత్రంశక్తి ఉండటం లేదు. చేయాల్సిన పని ఎంతో వుంది. అయినా చేయాలని పించడం లేదు" ఇదీ నేటి కాలంలో డాక్టర్లు పేషెంట్ల నుంచి ఎక్కువగా ఎదుర్కొనే ఫిర్యాదు.

చాలా సందర్భాల్లో, అలసిపోవడానికి ప్రధాన కారణాలు పని ఒత్తిడి ఎక్కువవ్వడం గాని, నిద్ర చాలకపోవడంగాని అయ్యుంటుంది. మరికొంతమందిలో టెన్షన్లూ, ఆత్మన్యూనతా భావాల వంటివి కూడా అలసటను కలుగజేస్తాయి. క్లాసు రూములో గాని, ఆఫీసులో గాని గడపడం పరమ దుర్భరంగా అనిపించి ఇహ అక్కడ ఒక్క నిమిషం కూడా ఉండలేమనుకున్న తర్వాత అదే రోజు సినిమా హాల్లోగాని, క్లబ్బులోగాని గంటల తరబడి కులాసాగా గడిపే వారిని చూస్తూనే ఉంటాం. ఈ రకమైన సమస్యకు పరిష్కారం ఒక్కటే - జీవన విధానాన్ని మార్చుకోవడం.

అలసటను 'ఎప్పుడూ వినే పాతపాట'లాగా కొట్టి పారేయకూడదు. దీని వెనుక చిన్నచిన్న కారణాలనుంచి ప్రమాదకరమైన కారణాల వరకూ ఏవైనా ఉండొచ్చు. మీకు అలసటగా, నీరసంగా అనిపిస్తుంటే దాని వెనుక గల కారణాలను తరచి చూసుకుని ఒక నిర్ణయానికి రావడం మంచిది.

1. రక్తహీనత (ఎనీమియా) రక్తాల్పత ఉన్నప్పుడు ఇట్టే అలసిపోతుంటారు. చర్మంపాలిపోయినట్లు తెల్లగా ఉండటం, ఆయాసం, తల తిరగటం అనే లక్షణాలతో పాటు అలసట కూడా వుంటే, అది రక్తాల్పతకు గుర్తు. రక్తంలో హిమోగ్లోబిన్ తగ్గటమే దీనికి కారణం. అంటే, హిమోగ్లోబిన్ తగ్గటం వల్ల శరీరంలోని కణజాలాలకు ప్రాణవాయువు కనాకష్టంగా అందుతుందన్నమాట. ఈ ఆక్సిజన్ లోపం వల్ల శరీర ధర్మాలకు అవసరమైన శక్తిలో కూడా తరుగు ఏర్పడుతుంది. ఈ తరుగును కప్పిపుచ్చడానికి గుండె, ఊపిరితిత్తులు మరింత శ్రమపడి, ఉన్న రక్తాన్నే ఎక్కువ సార్లు సరఫరా చేయాల్సి ఉంటుంది. ఈ ప్రయత్నంలో గుండె వేగం పెరిగి దగడా అనిపిస్తుంది. గుండె పనితీరు వేగవంతమవడం వల్ల – హెచ్చు ఆక్సిజన్ కోసం - శ్వాస వేగం కూడా పెరుగుతుంది.

రక్తాల్పత ఉన్నప్పుడు రక్తాన్ని వృద్ధిచేసే చికిత్సలు చేయవలసి వుంటుంది. శోభన చికిత్సగా విరేచన కర్మను చేయాలి. 

గృహచికిత్సలు: 1. కరక్కాయ లేదా శొంఠి చూర్ణాన్ని అరచెంచాడు మోతాదుగా బెల్లంతో కలిపి రెండు పూటలా తీసుకోవాలి.
2. చెరకు రసాన్ని గ్లాసు మోతాదుగా రోజు 3 పూటలా తీసుకోవాలి.
3. త్రిఫలాలు, తిప్పతీగ, అడ్డసరం, కటుక రోహిణి, నేలవేము, వేపపట్ట వీటిని అన్నింటినీ తెచ్చి భాగాలు కలిపి కషాయం తయారుచేసికొని రోజుకి రెండుసార్లు తాగాలి.

ఔషధాలు: మండూర భస్మం, పునర్నవాది మండూరం, ధాత్రీలోహం, లోహాసవం, కుమార్యాసవం.

2. ఇన్ఫెక్షన్లు: ఇన్ఫెక్షన్లు వున్నప్పుడు, అది వైరస్ వల్లనైతే, పూర్తి విశ్రాంతితోపాటు వైరస్ వ్యతిరేకమైన గుణాలు కలిగిన తులసి, పసుపు, వేప, నేల ఉసిరిక మొదలైన ఓషధులు కలిసిన మందుల్ని వాడాల్సి వుంటుంది. మిగతా ఇన్ఫెక్షన్లకు కారణాన్ని అనుసరించి చికిత్స తీసుకోవాలి.

3. క్రుంగుబాటు (డిప్రెషన్) డిప్రెషన్ లో సాధారణంగా కనిపించే లక్షణం అలసట. దీంతోపాటు ఆకలి లేకపోవడం, నిద్రపట్టకపోవడం, మనసుకు నిలకడ లేకపోవడం, తలనొప్పి ఇలాంటి వన్నీ వుండొచ్చు. జీవితమంటే విరక్తి చిన్నవిషయానికే ఏడవానిపించడం, అర్థం లేని ఆందోళనలు ఇత్యాదివి కూడా వుండొచ్చు. ఈ మానసిక లక్షణాలతో పాటు కొంతమందిలో శారీరక లక్షణాలు కూడా కనిపిస్తాయి. ఉదాహరణకు, కండరాల నొప్పులు, అజీర్తి, గ్యాస్ తయారవ్వడం, ఛాతిలో మంట, కడుపులో నొప్పి మదలైనవి. ఒక పరిశీలన ప్రకారం, జనాభాలో 15 శాతం మంది జీవితంలో ఏదో ఒక సందర్భంలో డిప్రెషన్ తో బాధపడతారని తేలింది, డిప్రెషన్ ను ఆయుర్వేదంలో చిత్తావసాదం అంటారు. డిప్రెషన్ లో వున్నప్పుడు ధైర్యం చెప్పటం అన్నిటికన్నా ముఖ్యం. దీన్నే ఆయుర్వేద శాస్త్రంలో 'అశ్వాసనం' అంటారు. దీనితోపాటు వ్యక్తిత్వ విశ్లేషణ, సత్వావజయ చికిత్సలు (ధ్యానం, జపం మొదలైనవి) అవసరమవుతాయి. డిప్రెషన్ లో వాజీకరణ ఔషధాలు బాగా పనిచేస్తాయి. కనీసం వారానికి రెండు సార్లు శృంగారంలో పాల్గొనేవారిని డిప్రెషన్ బాధించదు.

గృహచికిత్సలు: 1. క్రమం తప్పకుండ వ్యాయామం చేయాలి.
2. ధ్యానం (మెడిటేషన్) డిప్రెషన్ లో మంచి ఫలితాన్ని ఇస్తుంది.
3. దూలగొండి చూర్ణాన్ని చెంచాడు మోతాదుగా రోజుకి మూడుసార్లు పాలతో కలిపి తీసుకోవాలి.
4. వస కొమ్ముల చూర్ణాన్ని పావు చెంచాడు మోతాదుగా తేనెతో కలిపి తీసుకోవాలి.
ఔషధాలు: మానస మిత్రవటకం, అశ్వగంధాది లేహ్యం, క్రౌంచపాకం, బ్రాహ్మీవటి, సర్ప గంధఘనవటి, ఉన్మాద గజకేసరి రసం.

4. హార్మోన్ల తేడాలు: హార్మోనుల హెచ్చుతగ్గులు అలసటను కలుగచేస్తాయనడంలో సందేహం లేదు. గర్భం ధరించిన రోజుల్లో అలసటగా వుంటుందని అందరికీ తెలుసు. దీనికి కారణం. ఈ సమయంలో బరువు పెరగడం, రక్తాల్పత, నడుం నొప్పి, నిద్రపట్టకపోవడం మొదలైంవి మాత్రమే కాకుండా హార్మోనుల హెచ్చుతగ్గులు కూడా సంభవించడమే. అలాగే, బహిష్టులు ఆగిపోయే సమయంలో స్త్రీ శరీరంలోని అండాశయం ఈస్ట్రోజెన్ ని ఉత్పత్తి చేయలేకపోవడం వల్ల కూడా అలసటగా అనిపిస్తుంది. అంతేకాకుండ, బహిష్టుకు ముందుకూడా, ప్రతి నెలా చాలామంది స్త్రీలు అలసటగా కనిపిస్తారు. దీనికి కారణం కూడా హార్మోన్ల హెచ్చు తగ్గులే.

సూచనలు: హార్మోన్ల సమతుల్యం దెబ్బతిన్నప్పుడు ఆహారంలో మార్పులు చేర్పులు చేసుకోవాలి. అవసరమైతే, వైద్యసలహా మేరకు, ఫైటో ఈస్ట్రోజన్స్ కలిగిన – అశోక, సోయ తదితర మూలికలతో తయారైన – ఆయుర్వేద ఔషధాలను వాడాలి.
ఔషధాలు: అశోకారిష్టంమ్ అశోక ఘృతం, అశోకాదివటి, కళ్యాణఘృతం, క్షీరబలాతైలం (101 అవర్తాలు), సుకుమార ఘృతం, సుకుమార రసాయనం, శతావరి లేహ్యం.

5. నిస్త్రాణం  బోర్' గా వున్నప్పుడు మనిషిని నీరసం ఒక్కసారిగా చుట్టుముడుతుంది. ఇటువంటప్పుడు నాడీ వ్యవస్థ మొద్దుబారిపోతుంది.
సాధారణంగా, ప్రతికూల పరిస్థితుల్ని తట్టుకోవడానికి గాను మన శరీరంలో ఎడ్రినలిన్ లు గాని, ఇంకా తదితరాలైన రసాయన పదార్థాలు గాని విడుదలవుతుంటాయి. అయితే ఇదంతా ఒక పరిధికి లోబడే ఉంటుంది. ఆ పరిధి తర్వాత శరీరం ఈ పదార్ధాలకు స్పందించడం మానేస్తుంది. అలాంటప్పుడు అలసట మనిషిని అవహించేస్తుంది.
సూచనలు: జీవితం డల్ గా అనిపిస్తూ తద్వారా అలసటగా అనిపిస్తుంటే, విశ్రాంతిగా, రిలాక్స్ డ్ గా వుండటానికి ప్రయత్నించండి. జీవన విధానంలో చిన్నపాటి మార్పుల ద్వారా ఈ విషయంలో అద్భుతమైన ఫలితాలను సాధించవచ్చు.

6. థైరాయిడ్ గ్రంథి చురుకుదనం తగ్గటం (హైపోథైరాయిడిజం) చల్లగా వుండటం, జుట్టు ఊడిపోవడం, వెంట్రుకలు బిరుసెక్కడం, బరువు పెరగటం అనే లక్షణాలతో పాటు అలసట కూడా వున్నట్లయితే మీ థైరాయిడ్ గ్రంథి మందకొడిగా తయారైందని అర్థం చేసుకోవాలి. ఇది 'థైరాయిడ్ హార్మోన్' ని తయారుచేస్తుందన్న సంగతి తెలిసిందే. ఇది సమస్థితిలో వుంటే శరీరపు క్రియా నియంత్రణ సక్రమంగా జరుగుతుంది. ఒకవేళ థైరాక్సిన్ ఎక్కువైత శరీరపు పనితీరు అంతా ఎక్కువవుతుంది. తగ్గితే, శరీఎర క్రియాధర్మాలు కూడా తగ్గుతాయి. ఉదాహరణకి, థైరాయిడ్ గ్రంథి మందకొడిగా వున్నప్పుడు నాడివేగం తగ్గుతుంది. శ్వాస నెమ్మదిగా తీసుకుంటారు. ఆలోచనలు, వ్యక్తీకరణలు కూడా నెమ్మదిస్తాయి, మలబద్దకం వుంటుంది. జుట్టు పలుచబడిపోతుంది. చల్లటి వాతావరణాన్ని భరించలేరు. ఎప్పుడూ అలసటగా అనిపిస్తూ వుంటుంది. ఈ స్థితిని 'అపతర్పణ ఔషధాల'తో చికిత్సించాల్సి ఉంటుంది. అపతర్పణం అంటే శరీరాన్ని తేలికగా, చురుగ్గా చేయడం. ఈ వ్యాధి ఉన్నవారు సల్ఫాడ్రగ్స్, యాంటీహిస్టమిన్స్ వాడటం మంచిదికాదు.

గృహచికిత్సలు: 1. ఐయోడిన్ అధికంగా వుండే ఆహార పదార్ధాలను (సముద్రపు చేపలు, ఉల్లిపాయలు, బంగాళాదుంపలు, పిల్లిపీచర గడ్డలు) ఎక్కువగా తీసుకోవాలి.
2. థైరాయిడ్ గ్రంథి చురుకుదనాన్ని తగ్గించేలా చేసే ఆహార పదార్థాలను (క్యాబేజీ, మెంతికూర, క్యాలీఫ్లవర్, మొక్కజొన్నలు, చిలకడదుంపలు, తోటకూర) తీసుకోకూడదు.
3. విటమిన్ బి. కాంప్లెక్స్ కలిగిన ఆహారాలు (తృణ ధాన్యాలు, గింజలు) విటమిన్ - ఏ కలిగిన ఆహారాలు (ముదురు ఆకుపచ్చని రంగులో ఉండే ఆకులు, పసుపు పచ్చ రంగులో ఉండే పండ్లు) ఎక్కువగా తీసుకోవాలి.
ఔషధాలు: చతుర్ముఖ రసం, క్రమవృద్ధి లక్ష్మీ విలాస రసం, మకరధ్వజ సింధూరం, పూర్ణ చంద్రోదయం, పంచబాణ రసం, స్వర్ణక్రవ్యాది రసం, వసంతకుసుమాకర రసం, ఆరోగ్య వర్ధీని వటి, చంద్రప్రభావటి, గోక్షురాది గుగ్గులు ఘృతం, త్రయోదశాంగ గుగ్గులు, యోగరాజ గుగ్గులు, భృంగరాజసవం, ధాత్రీలోహం, కుమార్యాసవం, కాంతవల్లభ రసం, లోహాసవం, లోహరసాయనం, లోకనాధ రసం, నవాయాస చూర్ణం, ప్రాణదా గుటిక, రజతలోహం రసాయనం. స్వర్ణమాక్షీక భస్మం, స్వర్ణ కాంత వల్లభ రసం, సప్తాఘృత లోహం.

7. పౌష్టికాహార లోహం (మాల్ న్యూట్రిషన్) సరైన ఆహారం లభిస్తేనే శరీరం సక్రమంగా పనిచేస్తుంది. ఆహారంలో పిండిపదార్థాలు, మాంసకృత్తులు, కొవ్వు, లవణాలు, ఖనిజాలు, విటమిన్లు - అన్నీ వుండేలా చూసుకోవాలి. ఎప్పుడూ ఒకేరుచి కలిగిన పదార్థాలను తీసుకోకూడదు. అన్ని రుచులను కలిపి తీసుకోవాలి.

8. మందుల దుష్పలితం కొన్ని రకాల మందులకు అలసటను కలిగించే గుణం వుంటుంది. ముఖ్యంగా డిప్రెషన్ ని తగ్గించడానికి వాడే కొన్ని మందులకు ఈ లక్షణం వుంటుంది. లాగే మత్తును కలిగించే మందులను కూడా. మందుల వల్ల అలసటగా వుంటుందనుకుంటే మీ డాక్టరుతో ఆ విషయం చర్చించండి.

9. అంతః స్రావీగ్రంథుల సమస్యలు (హర్మోనల్ డిజార్డర్స్) మనం శరీరంలో వివిధ శారీరక క్రియలు వివిధ రకాలైన గ్రంథుల ద్వారా నిర్వర్తింపబడతాయన్న సంగతి తెలిసిందే, మెదడు మూల ప్రదేశంలో పిట్యుటరీ గ్రంథి వుంటుంది. శరీరంలోని గ్రంథుల్ని నియంత్రించే రింగ్ మాస్టర్ ఇదే. ఇది ఎడ్రినల్ గ్రంథుల్ని శాసిస్తుంది. ఈ ఎడ్రినల్ గ్రంథులు తిరిగి జననేంద్రియాల పనితీరును నియంత్రిస్తాయి. ప్యాంక్రియాస్ లాంటి మరికొన్ని గ్రంథులు స్వంతంత్రంగా కూడా పనిచేస్తాయి. వీటిల్లో ఏది గురైనా శరీరపు బరువులో మార్పు వస్తుంది. అలసటగా అనిపిస్తుంది. ఉదాహరణకి, ఎడ్రినల్ గ్రంథి మందకొడిగా తయారైందనుకుందాం. అప్పుడు స్టీరాయిడ్ల ఉత్పత్తి తగ్గిపోతుంది. దీంతో నీరసం ఆవహిస్తుంది. అలాగే, మధుమేహంలో కూడా పాంక్రియాస్ గ్రంథి ఇన్సులిన్ని ఉత్పత్తి చేయకపోవడం వల్ల నీరసం వస్తుంది. ఔషధాలు: అపామార్గ క్షారం, కాంచనార గుగ్గులు, గండమాల కందనరసం.

10. శస్త్రచికిత్సానంతర సమస్యలు: ఆపరేషన్ చేయించుకున్నతర్వాత చాలామందికి నీరసంగా ఉంటుంది. అలసిపోయినట్లు కనిపిస్తారు. దీనికి కారణాలు అనేకం. ఉదాహరణకు శస్త్రచికిత్స అంటే భయంకావచ్చు. ఎనస్థీషియా మందులు, యాంటీ బయాటిక్స్ వీటి దుష్పలితాలు కావచ్చు, లేదా శాస్త్రచికిస్తా సమయంలో కొద్దో గొప్పో రక్తం కోల్పోవడం అనేది కారణం కావచ్చు, శస్త్రచికిత్స అనంతరం ఆరోగ్యస్థితిని పొందడానికి కనీసం నెల రోజులు పడుతుంది. దీనిని వైద్య శాస్త్రపరిభాషలో కన్వాలిసెన్స్ అంటారు. ఈ కాలవ్యవధిలో ఆయుర్వేద మందులు వాడితే త్వరగా కోలుకుంటారు.
ఔషధాలు: కామదుఘారసం (మోతీయుక్తం), లోకనాథరసం, లోహసవం, పంచాసవం.

http://www.teluguone.com/health/doctorprofile/tvaragaalasipovatam-533.html

Govt, Approved Layouts at Vijayawada

ABOUT GOVERNMENT  APPROVED LAYOUTS AT  

VIJAYAWADA,  Andhra Pradesh,   INDIA 

 


Soon the details will be published in this Blog :

For NRI's and Local people, Its good time to invest on land's now .

Government  Layouts C.R.D.A ( Capital Region Development Authority) which are at
Gannavaram, Telaprolu, Ungutur mandal (already Approved).

Contact :

Sitaram Vishwakarma 

email : msrvishwakarma@yahoo.com

mobile : +91 - 7382175757

స్త్రీలలో మధుమేహం ( Diabetes in women )

 మహిళలు మధుమేహం
మధుమేహుల్లో పైకి ఎలాంటి బాధలూ లేకుండానే మూత్రనాళ ఇన్ఫెక్షన్లు ఉండే అవకాశం చాలా ఎక్కువ. సాధారణ స్త్రీలలో ఈ ఇన్ఫెక్షన్లు 10% ఉంటే.. మధుమేహుల్లో 30% వరకూ కనబడతాయి. దీన్నే 'ఎసింప్టమాటిక్‌ బ్యాక్ట్రీయూరియా/పయూరియా' అంటారు. సాధారణంగా స్త్రీలలో మూత్రంలో చీముకణాలు 10 వరకూ ఉన్నా అది సహజమేనన్నట్లు వదిలేస్తారు. అలాగే స్త్రీల బ్యాక్టీరియా ఎక్కువగా కనిపించినా వైద్యులు కొంత వరకూ ఫర్వాలేదు, సహజమేనని వదిలేస్తారు. ఎటువంటి లక్షణాలూ లేవు కాబట్టి దీన్ని వదిలెయ్యటం ఒక అలవాటుగా వస్తోంది. అయితే దీన్ని ఏమాత్రం నిర్లక్ష్యం చెయ్యటానికి లేదని, దీనికి కచ్చితంగా చికిత్స చెయ్యటం అవసరమని అధ్యయనాలన్నీ చెబుతున్నాయి. సాధారణంగా మూత్రనాళ ఇన్ఫెక్షన్లు ఉంటే- చలితో కూడిన జ్వరం, మూత్రంలో మంట, తరచుగా వెళ్లాల్సి రావటం, పొత్తికడుపు వెనక భాగంలో నొప్పి వంటి లక్షణాలుంటాయి. కానీ మధుమేహ స్త్రీలలో ఇవేవీ ఉండకపోవచ్చు. మధుమేహుల్లో నాడీమండల సమస్యల వల్ల (అటనామిక్‌ న్యూరోపతి) ఇటువంటి రక్షణ స్పందనలు కరవు అవుతాయి. కాబట్టి మధుమేహులకు మూత్రపరీక్షలో చీముకణాలు ఏ మాత్రం ఉన్నా కూడా తప్పనిసరిగా చికిత్స చెయ్యాలి. ముఖ్యంగా- ఇవి కల్చర్‌ పరీక్షల్లో బయటపడకపోవచ్చు. కాబట్టి ఎటువంటి అనుమానం వచ్చినా సాధారణ మూత్రపరీక్షే కీలకం.

* మధుమేహం అదుపులో పెట్టుకోవటంతో పాటు సాధారణ అవసరాల కంటే ఒకటిరెండు లీటర్ల నీరు ఎక్కువగా తాగాలి. కొందరికి సోడాసిట్రా/సిట్రాల్కా వంటి టానిక్కుల ద్వారా మూత్రంలో క్షార స్వభావం పెంచేందుకు ప్రయత్నిస్తారు. దీనివల్ల మూత్రంలో ఆమ్లతత్వం తగ్గి.. బ్యాక్టీరియా పెరుగుదల నిరోధమవుతుంది. మధుమేహులు వైద్యుల సలహా మేరకు దీన్ని వాడుకోవాలి. మూత్రాశయం గోడల్లో ఉండిపోయే ఇన్ఫెక్షన్లు కొద్దిరోజుల్లో పోయేవి కావు. అందుకోసం ఈ జాగ్రత్తలన్నీ దీర్ఘకాలం వాడుకోవాల్సిన అవసరం ఉంటుంది.

* ఎటువంటి లక్షణాలూ లేకుండా కేవలం మూత్రంలో చీముకణాల వంటివే కనబడుతుంటే దీర్ఘకాలం మధుమేహాన్ని నియంత్రించుకోవటం ద్వారా తగ్గించుకోవచ్చు. కానీ ఒకసారి లక్షణాలు కనబడితే మాత్రం.. అంటే చలితో జ్వరం, పొత్తికడుపులో నొప్పుల వంటి సమస్యలు తలెత్తుతుంటే- కచ్చితంగా శక్తిమంతమైన యాంటీబయాటిక్స్‌, అవసరమైతే ఇంజక్షన్ల రూపంలో కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ముఖ్యమైన విషయం ఏమంటే- ఈ ఇన్ఫెక్షన్‌ వల్ల రక్తంలో గ్లూకోజు పెరుగుతుంటుంది, మరోవైపు గ్లూకోజు పెరిగిన కొద్దీ ఇన్ఫెక్షన్లూ పెరుగుతుంటాయి. కాబట్టి.. ఈ రెంటికీ ఏకకాలంలో కచ్చితమైన చికిత్స ఇవ్వటం అవసరం. ఇలా కచ్చితమైన చికిత్స తీసుకోకపోతే ఇన్ఫెక్షన్లు రక్తంలోకి చేరిపోయి తలెత్తే తీవ్రమైన 'సెప్టిసీమియా' సమస్య స్త్రీలలో ఎక్కువగా కనబడుతోంది. ఇది చాలా ప్రమాదకరమైన సమస్య. కాబట్టి మూత్రంలో ఇన్ఫెక్షన్లను.. లక్షణాలు ఉన్నా, లేకున్నా కూడా కచ్చితంగా చికిత్స తీసుకోవటం అవసరమని అంతా గుర్తించాలి. పైగా మూత్ర వ్యవస్థలో కింది నుంచి ఇన్ఫెక్షన్లు క్రమేపీ పైకి పాకి.. (రెట్రోగ్రేడ్‌ ఇన్ఫెక్షన్‌) కారణంగా కిడ్నీలు దెబ్బతినిపోయే అవకాశాలు చాలా ఎక్కువ. కాబట్టి ఏమాత్రం నిర్లక్ష్యం చెయ్యటానికి లేదు.

* మధుమేహ స్త్రీలలో మూత్రం ఆపుకోలేని సమస్య రెండున్నర రెట్లు ఎక్కువ. మధుమేహం కారణంగా సంభవించే కండర క్షీణత, వాటి పనితీరు మందగించటం దీనికి కారణం కావచ్చని భావిస్తున్నారు.

ఒకప్పుడు ప్రపంచవ్యాప్తంగా అన్ని సమాజాల్లో, అన్ని జాతుల్లోనూ కూడా స్త్రీలో మధుమేహం తక్కువనే గట్టి నమ్మకం ఉండేది. మన దేశంలో కూడా మధుమేహ బాధితులపై జరిగిన చాలా సర్వేల్లో ప్రతి ముగ్గురు పురుషులకు ఒక స్త్రీ (3:1) ఉంటున్నట్టు గుర్తించేవారు. కానీ గత 20, 30 ఏళ్లలో ఈ నమ్మకాలు పూర్తిగా పటాపంచలు అయిపోయాయి. మొట్టమొదటగా సూరినామ్‌, గయానా వంటి దక్షిణ అమెరికా దేశాల్లో భారతీయ సంతతికి చెందిన స్త్రీలలో మధుమేహం ఎక్కువగా ఉంటోందని గుర్తించారు.

అయితే దీన్ని మన దేశంలోని స్త్రీలకు ఎంత వరకూ అన్వయించవచ్చన్న సందేహాలు ఉండేవి. కానీ క్రమేపీ మలేషియా, ఫిజీ వంటి దేశాల్లో జరిగిన అధ్యయనాల్లో కూడా భారత సంతతి స్త్రీలలోనే ఎక్కువగా కనబడుతోందని గుర్తించారు. ఎందుకిలా అన్నదానిపై చాలా చర్చలు జరిగాయి. భారతీయ సంతతి స్త్రీలు బరువు ఎక్కువగా, లావుగా ఉండటం ఒక కారణమన్న వాదన ఉంది. ముఖ్యంగా ఎత్తుకు తగ్గ బరువు కంటే ఎక్కువ ఉండటం, అలాగే తుంటి-నడుము నిష్పత్తి కూడా వీరిలో ఎక్కువగా ఉండటం ఒక సమస్య. పురుషుల కంటే స్త్రీలు లావు, బరువు పెరగటానికి కారణమేమిటో కచ్చితంగా చెప్పలేంగానీ హార్మోన్ల పాత్ర, ఆహారంలో కొవ్వుల పాత్ర కీలకమని భావించాల్సి ఉంటుంది.

కారణమేదైనా మన దేశంలో కూడా ఈ మధ్య కాలంలో జరుగుతున్న సర్వేల్లో- పురుషుల్లో మధుమేహం ఏ స్థాయిలో ఉంటోందో స్త్రీలలోనూ అంతే ఉంటోందని స్పష్టంగా వెల్లడవుతోంది. కొన్నిప్రాంతాల్లో అయితే స్త్రీలలో కొంత శాతం ఎక్కువగా ఉంటోందని కూడా గుర్తిస్తున్నారు. వైద్యం విషయంలో స్త్రీలు తోసేసుకు తిరుగుతుండటం, కొంత తాత్సారం చెయ్యటం, ఆరోగ్య స్పృహ, శ్రద్ధ కొరవడటం తదితర కారణాల వల్ల మధుమేహం కారణంగా స్త్రీలలో దుష్ప్రభావాలు కూడా ఎక్కువగానే కనబడుతున్నాయి. అందుకే ప్రపంచ ఆరోగ్య సంస్థ, అంతర్జాతీయ మధుమేహ ఫెడరేషన్‌ వంటి అంతర్జాతీయ సంస్థలన్నీ కూడా ఇప్పుడు స్త్రీలలో వచ్చే మధుమేహాన్ని ప్రత్యేకంగా గుర్తిస్తున్నాయి. లక్షణాలు, చికిత్సల విషయంలో వీరికంటూ ప్రత్యేకంగా చూడాల్సిన అవసరం ఉందని స్పష్టంగా పేర్కొంటున్నాయి.

చిన్నవయసులోనే మధుమేహం బారినపడే ఆడపిల్లలకు సహజంగానే యుక్తవయసులో, గర్భధారణ సమయంలో చాలా ప్రత్యేక జాగ్రత్తలు అవసరం. వీరిలో తలెత్తే అవకాశం ఉన్న సమస్యలు కూడా ప్రత్యేకంగానే ఉంటాయి. గర్భనిరోధక పద్ధతుల విషయంలో కూడా వీరిని కొంత ప్రత్యేకంగా గుర్తించక తప్పదు. ఇవి కాకుండా మధ్యవయసులో కూడా మధుమేహం కారణంగా స్త్రీలలో కొన్ని రకాల సమస్యలు ప్రత్యేకంగా కనబడుతుంటాయి. వీటిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సినవి రుతుక్రమం అస్తవ్యస్తం కావటం, తరచూ తెల్లబట్ట, ఎటువంటి లక్షణాలూ లేకుండానే ప్రమాదాలు తెచ్చిపెట్టే మూత్రనాళ ఇన్ఫెక్షన్లు.. ఇవన్నీ కీలకమైనవే. అరుదుగా కొన్ని రకాల క్యాన్సర్లు కూడా వీరిలో ఎక్కువ. అందుకే వీటి గురించి స్త్రీలంతా అవగాహన పెంచుకోవటం చాలా అవసరం.
పురుషుల కంటే స్త్రీలలో ఐదేళ్ల ముందే మధుమేహం వస్తున్నట్టు గుర్తించారు. జీవితంలో త్వరగా మధుమేహం బారినపడటం, ఎక్కువగా దుష్ప్రభావాలకు గురవుతుండటం, వాటిలో కూడా మెదడు సంబంధ సమస్యలు ఎక్కువగా కనబడుతుండటం.. స్త్రీల విషయంలో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అంశాలు.

తెల్లబట్ట
మధుమేహ స్త్రీలలో చాలా తరచుగా, ఎక్కువగా కనబడే సమస్య.. జననాంగ ఫంగల్‌ ఇన్ఫెక్షన్లు. వీరిని క్యాండిడియాసిస్‌ అనే సమస్య ఎక్కువగా వేధిస్తుంటుంది. దీని ప్రధాన లక్షణాలు- దురద, తెల్లమైల. తెలుపు పెరుగులా, తరకలు తరకలుగా కనబడుతుంది. దుర్వాసన. పొత్తికడుపులో నొప్పి, నడుంనొప్పి కూడా ఉంటాయి. వైద్యులు స్పెక్యులమ్‌తో పరీక్షించి 'క్యాండిడియాసిస్‌'ను తేలికగానే గుర్తుపడతారు. అవసరమైతే ఇతరత్రా పరీక్షలు చేయిస్తారు. నిజానికి చాలామందిలో క్యాండిడియా ఇన్‌ఫెక్షన్‌తోనే మధుమేహం బయటపడుతుండటం గమనార్హం. దీనికి యాంటీఫంగల్‌ మాత్రలు, అవసరమైతే జననాంగంలో అమర్చే మాత్రలు ఇస్తారు. కొన్నిసార్లు ఇది మందులకు లొంగదు. ఇది మధుమేహుల్లో మరీ ఎక్కువ. వీరికి మరింత సమర్థవంతమైన మందులు ఇవ్వాల్సి ఉంటుంది. ఇతరత్రా సమస్యలకు యాంటీబయోటిక్స్‌ వాడుతున్న వారిలో క్యాండిడియాసిస్‌ వచ్చే అవకాశం ఎక్కువ. కొందరికి క్యాండిడియాసిస్‌ తరచుగా వస్తుంటుంది. వీరికి కల్చర్‌ పరీక్ష చేసి.. ఫంగస్‌ ఎక్కడెక్కడ పెరుగుతోంది? ఏ మందుకు లొంగుతుంది? వంటివి తెలుసుకుని, దాన్నిబట్టి మందులను ఇస్తారు.

క్యాన్సర్‌ కార్పస్‌ సిండ్రోమ్‌
30-60 ఏళ్ల వారిలో.. వూబకాయం - మధుమేహం - అధికరక్తపోటు - జన్యుపరమైన అంశాలు - రక్తసంబంధీకుల్లో క్యాన్సర్లు - ఈస్ట్రోజెన్‌ హార్మోన్‌ స్థాయులు ఎక్కువగా ఉండటం.. ఇవన్నీ క్రమంగా పెరుగుతుంటాయి. వీటిని నిర్లక్ష్యం చేస్తే చివరికి గర్భాశయ క్యాన్సర్‌, అండాశయ క్యాన్సర్‌, రొమ్ము క్యాన్సర్‌, కాలేయ క్యాన్సర్‌ వంటి వాటికి దారితీయొచ్చు. ఈ నాలుగు క్యాన్సర్లు ఈస్ట్రోజెన్‌తో సంబంధం ఉన్నవేనని గుర్తించటం అవసరం. యుక్తవయసులో అండాశయాల్లో నీటితిత్తులు ఎక్కువగా ఉండే పీసీవోడీ.. మధ్యవయసులో నెలమధ్యలో ఎరుపు కనబడుతుండే డీయూబీ.. 40ల్లో గర్భాశయంలో ఫైబ్రాయిడ్‌ కణితులు, ఎండోమెట్రియాసిస్‌.. 60ల్లో ఎండోమెట్రియోసిస్‌ క్యాన్సర్‌.. ఇవన్నీ ఒక చట్రంలా వస్తుండే సమస్యలు. వీటన్నింటినీ వేరుగా చూడలేం. కాబట్టి 30-60 ఏళ్ల మధుమేహ స్త్రీలు మధుమేహ పరీక్షలతో పాటు ఏటా పాప్‌స్మియర్‌, అల్ట్రాసౌండ్‌ స్కాన్‌, మామోగ్రఫీ కూడా తప్పనిసరిగా చేయాల్సి ఉంటుంది. బరువును నియంత్రించుకోగలిగితే తీవ్ర సమస్యల బారిన పడకుండా కాపాడుకోవచ్చు.

ఒంటి మీద ఫంగస్‌ ఇన్ఫెక్షన్లు
ఒంట్లో తేమ ఎక్కువగా ఉన్న వారికి ఫంగల్‌ ఇన్ఫెక్షన్ల సమస్య చాలా ఎక్కువ. గ్లూకోజు ఎక్కువగా ఉండటం వల్ల రోగనిరోధక శక్తి తగ్గిపోతుంది. ఇంకా ఇతరత్రా సమస్యలు కూడా చాలా ఉంటాయి. దీనివల్ల వీరిలో అన్ని రకాల ఫంగల్‌ ఇన్ఫెక్షన్లూ ఎక్కువ. మ్యుకర్‌మైకోసిస్‌ వంటి ఇన్ఫెక్షన్త్లెతే కేవలం మధుమేహుల్లోనే కనబడతాయి. కాబట్టి ఒంటి మీద తేమ ఎక్కువగా లేకుండా కాలి వేళ్ల మధ్యలో, చంకల్లో, గజ్జల్లో ఎక్కడైనా, చీర ముడతల్లో గానీ తేమ లేకుండా చూసే డస్టింగ్‌ పౌడర్‌ వేసుకోవటం అవసరం. క్లోట్రైమజోల్‌, నిస్టాటిన్‌, కీటొకొనజోల్‌, ఫ్లూకొనజోల్‌ వంటి యాంటీఫంగల్‌ మందులు వాడాల్సిన అవసరం ఉంటుంది. ఇవన్నీ ఏదో ఒకటి రెండు రోజుల చికిత్సలతో తగ్గేవి కావు. దీర్ఘకాలిక చికిత్స తీసుకోవటం తప్పనిసరి.

మధుమేహం తెచ్చిపెట్టే నానా దుష్ప్రభావాలూ దరి జేరకూడదనుకుంటే.. వాటి బెడద మనకు వద్దనుకుంటే.. మనం చెయ్యగలిగింది ఒక్కటే! దాన్ని కచ్చితంగా అదుపులో ఉంచుకోవటం! జీవితం అదుపు తప్పకుండా.. అటూఇటూ బెసిగిపోకుండా.. ఎన్నడూ నిర్లక్ష్యం వహించకుండా.. ఎక్కడా తేలికగా తీసుకోకుండా.. మధుమేహాన్ని కచ్చితంగా, ఇంకా చెప్పాలంటే కఠినంగా నియంత్రణలో ఉంచుకోవటం ఒక్కటే సరైన మార్గం.

పక్షవాతాలెక్కువ!
మన దేశంలో నిర్వహించిన సర్వేల్లో మధుమేహ పురుషుల్లో కంటే మధుమేహ స్త్రీలలో పక్షవాతం సమస్యలు అధికమని వెల్లడైంది. కారణాలేమిటో కచ్చితంగా చెప్పలేకపోయినా- మధుమేహ పురుషుల్లో గుండె జబ్బులు ఎక్కువగానూ, స్త్రీలలో మెదడుకు సంబంధించిన పక్షవాతం తరహా సమస్యలు ఎక్కువగానూ కనబడుతున్నాయి.
ఏ బాధలూ లేని మూత్ర ఇన్‌ఫెక్షన్లు



పొత్తికడుపులో నొప్పి
మలమధుమేహ స్త్రీలలో కనిపించే మరో ముఖ్యమైన సమస్య 'పెల్విక్‌ ఇన్‌ఫ్లమేటరీ డిసీజ్‌'. ఇందులో పొత్తికడుపులో ఎక్కడైనా ఇన్‌ఫెక్షన్‌ ఉండొచ్చు. ఇది గర్భసంచీ నుంచి, అండాశయాల నుంచి లోపలికి ఎక్కడికైనా వ్యాపించొచ్చు. సాధారణంగా కాన్పులు, సిజేరియన్లు, ట్యూబెక్టమీ, తరచుగా అబార్షన్ల వంటి చరిత్ర ఉన్నవారిలో ఆయా సమయాల్లో బ్యాక్టీరియా లోపలికి వెళ్లిపోయి లోపల నిద్రాణంగా ఉండిపోవచ్చు. రోగనిరోధక శక్తి బలంగా ఉన్నంత వరకూ ఇవేమీ ఇబ్బంది పెట్టకపోవచ్చు. కానీ ఏదైనా కారణాన రోగనిరోధకశక్తి బలహీనపడితే ఇక తరచుగా ఇన్‌ఫెక్షన్ల దాడి ఆరంభమవుతుంది. ఇలాంటి ఇన్‌ఫెక్షన్లు ఉన్న వారు ముందు తెలుపు అవుతుందని, పొత్తికడుపులో నొప్పి అనీ వైద్యులను సంప్రదిస్తుంటారు. ఇది చూడటానికి చిన్న సమస్యే కావొచ్చు గానీ కొన్నిసార్లు తీవ్ర సమస్యగానూ మారొచ్చు. ఎందుకంటే ఫలోపియన్‌ ట్యూబు, అండాశయం కలిసేచోట ఇన్‌ఫెక్షన్‌ ఏర్పడితే చీముగడ్డలా ఏర్పడే అవకాశం ఉంటుంది. దాన్ని తొలగించకపోతే హఠాత్తుగా పగిలి తీవ్ర ప్రమాదం ముంచుకురావొచ్చు. కొందరిలో ఇన్ఫెక్షన్‌ రక్తంలో చేరిపోయి 'సెప్టిసీమియా'కూ దారితీయొచ్చు. కొందరికి కేవలం గర్భసంచీలోనే పొరల్లో స్వల్పంగా ఇన్‌ఫెక్షన్‌ ఉంటే నెలసరి అస్తవ్యస్తం అవుతుంది. దీంతో అక్కడ స్రావాలు చేరిపోయి ఫలోపియన్‌ ట్యూబ్‌ మూసుకుపోవచ్చు. దీన్ని హైడ్రోసాల్సింగ్స్‌ అంటారు. దీంతో తర్వాతి సంతానం కలగటంలో ఇబ్బందులు తలెత్తొచ్చు. తెలుపు కావటం, నడుం నొప్పి, పొత్తి కడుపు నొప్పి, సంభోగంలో నొప్పి, నెలసరి అస్తవ్యస్తం కావటం, రుతుస్రావం ఎక్కువగా అయిపోతుండటం వంటి లక్షణాలు కనబడతాయి. వీరిలో ఇన్‌ఫెక్షన్‌ ఎక్కడుందో గుర్తించి- ఒక కోర్సు యాంటీబయోటిక్‌ మందులు ఇస్తే చాలావరకూ తగ్గుతుంది. ముఖ్యంగా మెట్రోనిడజోల్‌, ట్రినిడజోల్‌ వంటివి తప్పకుండా ఇవ్వాల్సి ఉంటుంది. అవసరమైతే యాంటీబయోటిక్‌ ఇంజెక్షన్లూ ఇస్తారు. ఒకవేళ తగ్గకపోతే మరోసారి యాంటీబయోటిక్‌ మందులు ఇస్తారు. ఏడాదికో, రెండేళ్లకో మళ్లీ ఇన్‌ఫెక్షన్లు వస్తుంటే మందులు వాడాల్సి ఉంటుంది. ఇలా తరచుగా ఇన్‌ఫెక్షన్లు రావటం వల్ల కాన్సర్ల ముప్పూ పెరుగుతుంది. కాబట్టి ఏటా పాప్‌స్మియర్‌ వంటి పరీక్షలు చేయించుకుంటూ తగు జాగ్రత్తలు తీసుకోవటం అవసరం.

మొత్తానికి మధుమేహుల్లో ఈ పొత్తికడుపులో ఇన్ఫెక్షన్లు, పెల్విక్‌ ఇన్‌ఫ్లమేటరీ డిసీజ్‌ పూర్తిగా నయం కావటం కష్టం. చాలాకాలం లోపలే ఉండిపోయి, మళ్లీ మళ్లీ వస్తుండొచ్చు. కాబట్టి వీటన్నింటికీ పూర్తి విరుగుడు ఏమంటే- రక్తంలో గ్లూకోజును కచ్చితంగా నియంత్రణలో ఉంచుకోవటం! దాంతో ఇన్‌ఫెక్షన్లు తగ్గుతాయి. ఇతరత్రా సమస్యలూ దరిజేరవు.

గర్భధారణ సమయంలో...
మధుమేహం ఉన్న గర్భిణులు అసలు గర్భధారణ ప్రయత్నాలకు ముందే కచ్చితంగా వైద్యులను సంప్రదించి, రక్తంలో చక్కెర మోతాదులను కచ్చితంగా నియంత్రణలో ఉంచుకోవటంతో పాటు జాగ్రత్తలన్నీ తీసుకుని అప్పుడు గర్భధారణకు ప్రయత్నించటం అవసరం. ఇక మధుమేహ స్త్రీలు గర్భం ధరించినపుడు తొలి మూడు నెలల్లో మూత్రనాళ ఇన్ఫెక్షన్లు తరచుగా వస్తుంటాయి. వీరిలో ఫంగల్‌ ఇన్‌ఫెక్షన్లు కూడా ఎక్కువే. ముఖ్యంగా క్యాండిడియాసిస్‌ అధికం. చాలామంది తెలుపు అవుతోందని వైద్యులను సంప్రదిస్తుంటారు. వైద్యులు పరీక్షిస్తే యోని మార్గంలో పెరుగు తరకల మాదిరిగా తెలుపు కనబడుతుంది. అలాగే మధుమేహ గర్భిణుల్లో బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్లూ తరచుగా వస్తుంటాయి. ముఖ్యంగా వీరిలో మూత్రంలో మంట వంటి లక్షణాలేవీ లేకుండా కూడా ఇన్ఫెక్షన్లు ఉండొచ్చు. ఇన్ఫెక్షన్లు ఉన్నవారిలో అబార్షన్లు, నెలలు నిండక ముందే కాన్పుల వంటి ముప్పులూ ఎక్కువే. కాబట్టి మధుమేహ గర్భిణులు మరింత జాగ్రత్తగా ఉండాలి.

గర్భనిరోధకాల్లో తేడా
అందరిలా మధుమేహ స్త్రీలకు అన్ని రకాల గర్భనిరోధక సాధనాలూ పనికిరాకపోవచ్చు. నిజానికి బిడ్డకూ, బిడ్డకూ మధ్య గర్భనిరోధకంగా లూప్‌/కాపర్‌ టీ మంచి సాధనం. కానీ మధుమేహ స్త్రీలకు వీటిని అమర్చటం కుదరదు. వీటిని అమర్చినప్పుడు వీరిలో క్రమంగా ఇన్ఫెక్షన్లు మొదలయ్యే అవకాశం ఉంటుంది. ఇన్‌ఫెక్షన్ల మూలంగా వీరిలో అబార్షన్ల ముప్పూ ఎక్కువే. కాబట్టి వీరికి మాత్రలు శ్రేయస్కరం. అయితే సాధారణ గర్భనిరోధ మాత్రలు వాడుతున్నప్పుడు పాలు తగ్గిపోతాయి. కాబట్టి వీరికి పాలు తగ్గకుండా, గర్భనిరోధానికి పనికి వచ్చేలా- ఒకే హార్మోను ఉండే మాత్రలు ఇస్తారు. వీటిని మర్చిపోకుండా క్రమం తప్పకుండా వేసుకోవాల్సిందే. ఈ మాత్రలతో కొందరిలో నెల మధ్యలో రక్తస్రావం (డీయూబీ- డిస్‌ఫంక్షన్‌ యూటరీన్‌ బ్లీడింగ్‌) కావచ్చు. దీన్ని తప్పనిసరిగా వైద్యుల దృష్టికి తీసుకువెళ్లాలి.

సిజేరియన్లూ ఎక్కువే!
మధుమేహ గర్భిణులకు సిజేరియన్‌ చెయ్యాల్సి వచ్చే అవకాశమూ ఎక్కువే. మామూలు స్త్రీలలో సిజేరియన్‌ అవసరం 30% మందికి ఉంటే.. వీరిలో 60% వరకూ ఉంటుంది. పైగా వీరికి ఇన్‌ఫెక్షన్‌ ముప్పు ఎక్కువ కావటం వల్ల కోత త్వరగా మానదు. లోపల అక్కడక్కడ చీము గూడు కట్టుకొని జ్వరం వంటి సమస్యలు తలెత్తుతుంటాయి. కొన్నిసార్లు వీరిలో మాయ కూడా పూర్తిగా బయటకు రాదు. కాబట్టి కాన్పు అయ్యాక మూడు నెలల తర్వాత తప్పకుండా స్కానింగ్‌ చేసి పరీక్షించాల్సి ఉంటుంది.

నెలసరి అస్తవ్యస్తం
పిల్లలు పుట్టిన తర్వాత నెలసరి సరిగా రావటం లేదని చాలామంది డాక్టర్లను సంప్రదిస్తుంటారు. దీనికి ప్రధాన కారణం పొట్ట దగ్గర కొవ్వు పేరుకోవటం. ఈ కొవ్వు నుంచి విడుదలయ్యే ఈస్ట్రియల్‌ (ఈ3) అనే ఈస్ట్రోజెన్‌ హార్మోన్‌ నెలసరిని అస్తవ్యస్తం చేస్తుంది. ఇది మధుమేహుల్లో ఎక్కువ. రుతుస్రావం ఎక్కువ అవుతుండటం, గడ్డలు గడ్డలుగా పడుతుండటం వంటివి కనబడతాయి. దీంతో రక్తహీనత వస్తుంది. చాలామంది దీన్ని పట్టించుకోరు. సమయానికి చికిత్స తీసుకుంటే సమస్య ముదరకుండా చూసుకోవచ్చని గుర్తించాలి.


  • Dr.P.V .rao prof.HOD -diabetology NIMS hyd, & Dr.v.janaki prof.Gyaenecology ,Nilofer hos.Hyd, @eenadu sukhibhava.27-05-2014

Mushroom Masala Gravy


Mushroom Masala


  Button Mushroom is one of my favorite mushrooms and I prepare a variety of dishes with it. Mushrooms contain 80-90 percent of water and are very low in calories. They are good source of minerals and are high in anti-oxidants. Research studies show that consuming white button mushrooms can reduce the risk of developing breast cancer. It also helps to boost our immune system. As mushrooms are loaded with essential nutrients, we include them on a regular basis. Today we will learn how to make restaurant style Mushroom masala curry (South Indian style, vegetarian recipe) following this easy recipe
 Prep Time : 10 mins
 Cook Time : 30 mins 
 Serves: 2-3
 Recipe CategorySide Dish
 Recipe CuisineSouth Indian
 Author:

   Ingredients needed

   Button mushrooms - 200 grams
   Onion - 1 cup
   Tomato - 3/4 cup
   Ginger garlic paste - 1 tsp

   Spice Powder

   Turmeric Powder - a pinch
   Chilli Powder -1 tbsp (mine is not hot)
   Coriander powder - 2 tbsp
   Garam masala powder - 1/2 tsp

   Coconut paste - 3 tbsp

   For the seasoning

   Oil - 4 tbsp
   Cloves -2
   Cinnamon -1 inch
   Marathi Moggu -1
   Curry leaves - few

   For Garnishing

   Coriander leaves finely chopped -2 tbsp
Preparation


Wash and clean the mushrooms well and chop it into big pieces. Check out my Mushroom Pulao recipe to know how to clean mushrooms.

Finely chop onions and tomatoes.

Note - If you want the mushroom masala very spicy, you can dry roast the spices (2 cloves, 1 inch cinnamon, 1 marathi moggu) powder it and add after heating the oil. In that case, skip the garam masala. I did not powder it but used the whole spices for seasoning.

Method

Heat oil in a pan, add cloves, cinnamon, marathi moggu, when it splutters, add finely chopped onions and curry leaves.

Saute onions till it becomes brown.This step is important. Do not add tomatoes without browning the onions.

Then add ginger-garlic paste and saute for a few more minutes. Add tomatoes, chilli powder, coriander powder, turmeric powder, garam masala, salt needed and cook till tomatoes become mushy. If it becomes too dry, you can add 1 or 2 tbsp of water.

mushroom-1

Add the chopped mushrooms and cook for a few minutes.

Then add a cup of water and cook till the mushrooms are soft.

mushroom -2

Finally add coconut paste, simmer and cook for another 6-7 minutes.Garnish with coriander leaves.

mushroom-3

Note-The consistency of the gravy can be adjusted according to individual preferences.This is a fantastic side dish for flavored rice, pulao, chapati, poori and naan.
http://www.padhuskitchen.com/2012/07/mushroom-masala-mushroom-gravy-mushroom.html 

24 Jul 2015

భగవాన్ శ్రీకృష్ణుడి కుటుంబము

శ్రీకృష్ణుడికి భార్యలందరితోనూ ఒక్కొక్కరి వల్ల పదేసి మంది పిల్లలు పుట్టారు.
రుక్మిణి వల్ల కృష్ణుడికి ప్రద్యుమ్నుడు, చారుదేష్ణుడు, సుదేష్ణుడు, చారుదేహుడు, సుబారుడు, చారుగుప్తుడు, భద్రచారుడు, చారుచంద్రుడు, విచారుడు, చారుడు అనే బిడ్డలు కలిగారు.

సత్యభామ వల్ల కృష్ణునికి భానుడు, సుభానుడు, స్వర్భానుడు, ప్రభానుడు, భానుమంతుడు, చంద్రభానుడు, బృహద్భానుడు, అతిభానుడు, శ్రీభానుడు, ప్రతిభానుడు అనే బిడ్డలు కలిగారు.

జాంబవతీ శ్రీకృష్ణులకు సాంబుడు, సుమిత్రుడు, పురజిత్తు, శతజిత్తు, సహస్రజిత్తు, విజయుడు, చిత్రకేతుడు, వసుమంతుడు, ద్రవిడుడు, క్రతువు అనే సంతానం కలిగింది. జాంబవతికి కలిగిన ఈ బిడ్డలంటే కృష్ణుడికి ప్రత్యేకమైన ప్రేమ ఉండేది.

నాగ్నజితి, కృష్ణులకు వీరుడు, చంద్రుడు, అశ్వసేనుడు, చిత్రగుడు, వేగవంతుడు, వృషుడు, లముడు, శంకుడు, వసుడు, కుంతి అనే పిల్లలు కలిగారు.
కృష్ణుడికి కాళింది వల్ల శ్రుతుడు, కవి, వృషుడు, వీరుడు, సుబాహుడు, భద్రుడు, శాంతి, దర్శుడు, పూర్ణమానుడు, శోమకుడు అనే కుమారులు జన్మించారు.

లక్షణకు, శ్రీకృష్ణుడికి ప్రఘోషుడు, గాత్రవంతుడు, సింహుడు, బలుడు, ప్రబలుడు, ఊర్ధ్వగుడు, మహాశక్తి, సహుడు, ఓజుడు, అపరాజితుడు అనే సంతానం కలిగింది.
మిత్రవింద, కృష్ణులకు వృకుడు, హర్షుడు, అనిలుడు, గృద్ధుడు, వర్ధనుడు, అన్నాదుడు, మహాశుడు, పావనుడు, వహ్ని, క్షుధి అనే పుత్రులు పుట్టారు.

కృష్ణుడికి భద్ర అనే భార్య వల్ల సంగ్రామజిత్తు, బృహత్సేనుడు, శూరుడు, ప్రహరణుడు, అరిజిత్తు, జయుడు, సుభద్రుడు, వాముడు, ఆయువు, సత్యకుడు అనే పిల్లలు పుట్టారు.
ఈ అష్ట మహిషులే కాక మిగిలిన పదహారు వేల వంద మంది కృష్ణుడి భార్యల ద్వారా కూడా ఒక్కొక్కరికి పది మంది సంతతి కలిగింది.

కృష్ణుడికి పదహారు వేల మంది గోపికలు. అన్ని వేల మంది తో కేవలం సరససల్లాపాలు మాత్రమె చేసాడు.
అల్లరి చేసాడు, అల్లరి పెట్టాడు.
అంతవరకే కానీ ఏ నాడు ఆయన అతిక్రమించలేదు.
గోపికలు కృష్ణుల మద్య ఉన్నది ఒక పవిత్రమైన చెలిమి మాత్రమే.
కృష్ణుడు భోగి గా కనిపించే యోగి.

ఇక నెమలి విషయానికి వస్తే ప్రపంచంలో సంభోగం చెయ్యని జీవి ఇది.
అత్యంత పవిత్రమైన జీవి కనుకే మన దేశానికి జాతీయ పక్షిగా ప్రకటించబడుతుంది.
పదహారు వేల మంది గోపికలు ఉన్నా కూడా శ్రీ కృష్ణుడు అత్యంత పవిత్రుడు.
అందుకే నెమలి పించం తలపై ఉండి శ్రీ కృష్ణ భగవానుడి పవిత్రతను తెలియజేస్తుంది.
 
http://meekosamblog.blogspot.in/2015/07/blog-post_1.html#.VbJb9qOCam4

సంధ్యావందనము


మార్జనము

శ్లో || అపవిత్రః పవిత్రోవా సర్వావ స్దాంగా తో పివా
యస్స్మరేత్సుండరీకాక్షం సబాహ్యా భన్తర శ్శుచిహ్
పుండరీకాక్ష ! పుండరీకాక్ష ! పుండరీకాక్ష !

టీ అపవిత్రః = స్నానము మొదలైనవి ఆచరింపక శుద్దముగా నున్నవాడైననూ, ఎట్టి దురాచారములు, దుర్గుణములు కలవాడైననూ,
పవిత్రః వా = స్నానము మొదలైనవి ఆచరించి శుచిగా నున్నవాడైననూ,సదాచారములు గలవాడైననూ,
సర్వావ స్దాంగా తో పివా = ఎట్టి అవస్ధలో నున్నవాడైననూ, పుండరీకాక్ష = సర్వ వ్యాపకుండైన ఆ పరమాత్మను, యః = ఎవడు,
స్మరేత్ = స్మరించునో ,
సః = అట్టి పురుషుడు,
సభాహ్యాభ్యన్తరః = వెలుపలలో పలకూడ ,
శుచిహ్ = మహా పవిత్రుడు,
భవతి = అగును.

ఆచమనము

1 . కుడి చేతి నాల్గు వ్రేళ్ళనూ దగ్గరగా బెట్టి ,
ఓం కేశవాయస్వాహా,
ఓం నారాయణాయస్వాహా,
ఓం మాధవయస్వాహా అని నోటితో ఉచ్చరించుచు,

బొటన వ్రేలు మధ్య వ్రేలు మొదటి నుండి , గోకర్ణముగా హస్తమును పెట్టి అర చేతి గుంటలో నురుగుగాని, బుగ్గలు గాని లేకుండ మినపగింజమునుగునంత నీరు ఉంచుకొని, చిటికెన వ్రేలు, దానిప్రక్క వ్రేలును వదులుగ వదిలిపెట్టి ముడుసారులు లోపలకు త్రాగవలెను. బ్రాహ్మణులు అయినవారు మొదట త్రాగిన నీరు బొడ్డు దగ్గరకు పోయిన తరువాత గాని రెండవ సారి త్రాగరాదు. క్షత్రియులు మొదటిసారి త్రాగిన నీరు కంటము దిగిన తరువాత త్రాగవలయును. వైశ్యులు కంటముదాక బోయిన తరువాత త్రాగవచ్చును.

2 . ఓం గోవిందాయనమః,
ఓం విష్ణవేనమః అని చెప్పుచు అర చేతులను రెండింటిని కడుగుకొనవలయును.

3 . ఓం మధుసూదనాయనమః,
ఓం త్రివిక్రమాయనమః అని చెప్పుచు పెదవులు తుడుచుకోవలయును.

4 . ఓం వామనాయనమః ఓం శ్రీధరాయనమః అని చెప్పుచు శిరస్సుపై ఉదకము చల్లుకోవలెను.

5 . శ్రీ హృషీకేశాయనమః అని అనుచు వామహస్తమున నీళ్ళు చల్లవలెను.

6 . ఓం పద్మనాభాయనమః అని చెప్పుచు పాదములచై నీళ్ళు చల్లుకొ వలయును.

7 . ఓం దామోదరాయనమః అని చెప్పుచు శిరస్సుపై ఉదకమును చల్లుకొనవలయును.

8 . ఓం సంకర్షణాయనమః అని చెప్పుచు చేతి వ్రేళ్ళను గిన్నె వలె ఉంచి గడ్డమును తుడుచుకోవలయును.

9 . వాసుదే వాయనమః,
ఓం ప్రద్యుమ్నాయనమః అనుచు వ్రేళ్ళతో ముక్కును వదులుగ పట్టుకోవలయును.

10 . ఓం అనిరుద్దాయనమః,
ఓం పురుషోత్తమాయనమః,
ఓం అదోక్షజాయనమః,
నార సింహాయ నమః అని చెప్పుచు నె త్రములను, చెవులను తాకవలెను.

11 . ఓం అచ్యుతాయనమః అని చెప్పుచు బొడ్డు సృశింపవలెను.

12 . ఓం జనార్ధనాయనమః అని అనుచు చేతివ్రేల్లతో వక్ష స్ధలమును, హృదయమును తాకవలె.
13 . ఓం ఉపెంద్రాయనమః ఓం కృష్ణాయనమః అని అనుచు చేతితో కుడి మూపురమును, ఎడమ మూపురమును తాకవలయును. అనంతరము భూతోచ్చాటన చేయవలెను.

భూతోచ్చావ

శ్లో || ఉత్తిష్ఠన్తు భూత పిశాచాః ఏతే భూమిభారకాః,

ఏతే షా మవిరోదేన బ్రహ్మకర్మ సమారభే .

టీ . ఉత్తిష్ఠ న్త్సు నాయందుండు చెడుగుణములు నశించుగాక ,
భూత పిశాచాః కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యములను చెడుగుణములు,
భూమిభారకాః ఈ జీవితమునకు అపకీర్తి కలుగజేయుచున్నటువంటి ,
ఏతే షాం: ఈ చెడుగుణములు,
ఏతే: ఇవి,
అవిరోధేన: చెడు గుణములు నశించునట్లు,
బ్రహ్మకర్మ: ఈ సంధ్యావందనమును, అహం నేను
సమారభే: ఆచరిచుచున్నాను.

ప్రాణాయామము

తన హృదయములో పరమాత్మ ధ్యానమే తప్ప యితర ఆలోచనలు కలుగ కుండునట్లు చేయుటయే ప్రాణాయామ మనబడును. అట్టి ప్రాణాయామము, వూరకము, కుంభకము, రేచకము అని మూడు విధములు, సప్తవ్యా హృతులలో తోడను శిరస్సు తోడను కూడిన పూర్తి గాయత్రిని జపము చేయుచు, కుడి ముక్కున వాయువును పూరించుట వూరకమనబడును. మూడు సారులు గాయత్రిని జపము చేయుచు వాయువును బంధించి పరమాత్మను ధ్యానము చేయుట కుంభకము. మరల గాయత్రి మంత్రమును ఒకసారి జపము చేసి ఎడమ ముక్కు ద్వారా గాలిని విడుచుట రేచకమనబడును. ఈ మూడును కలసి ఒక ప్రాణాయామమగును. ఈ ప్రాణాయామమును ఉదరము సాయంత్రము మూడు సారులు చేయవలయును. అర్ఘ్యమూ ఇచ్చునప్పుడు కూడ ప్రాణాయామము చేయవలయును. గాయత్రి జపము చేయుటకు ముందు ఒక సారి చేయవలయును.

ఓం భూహ్-ఓం భువః - ఓగ్ o సువః ఓం మహః- ఓం జనః-
ఓం తపః- ఓగ్ ౦ సత్యమ్- ఓం తత్ సవితుర్వరేణ్యంభర్గో దేవస్య
ధీ మహి, ధీ యోయోనః- ప్రచోదయాత్ , ఓమాసోజ్యోతి
రసోమృతం బ్రహ్మ భూర్భువస్సువరోమ్

టీ . ఓం - ఓంకార శబ్దము పరమాత్మ స్వరూపము,
భుహ్ - సకల సంపదలతో కూడిన వాడు,
భువః - పూజ్యుడును,
సువః - సకల ప్రపంచకమునకు ఆధార భూతుడును,
మహః - విశేష ప్రభావము గలవాడును,
జనః - సకలలో కములను సృష్టించినవాడను,
తప - జ్ఞాన స్వరూపుడను,
సత్యం ఓం - జ్ఞానానంద స్వరూపుడును,
దేవస్య - దివ్యమైన జ్యోతి రూపమయిన టువంటియు, 
సవితుహ్ - సృష్టి స్దితిలయములకు కారణమైనట్టిదియు, 
వరేణ్యం - పవి త్ర మైనటువంటిదియు, 
భార్గః - అజ్ఞానమును పారద్రోలునదియు, 
యః - ఏ తేజస్సు , 
సః - మా యొక్క, 
దీయః - జ్ఞానమును, 
ప్రచోదయాత్ - కలిగించుచున్నదో, 
తత్ - ఆ తేజస్సు, 
ధీ మహి - ఆ తేజోరూపుడైన పరమాత్మను ధ్యానము చేయుదును, 
ఆపః - సకలమును కాపాడుచుందునడియు, 
జ్యోతి - స్వయంప్రకాశమైనటువంటియు, 
రసః - సుఖమయి కలుగ జేయునదియు, 
అమృతం - ముక్తిని కలుగాజేయునదియు, 
బ్రహ్మ - పరిపూర్ణ మైనదియు, 
భూహ్ - సకల ప్రపంచమునకు ఆధారమైనదియు, 
భువః -సకల సృష్టికి ఆధారమైనటువంటియు, 
సువః - జీవన్మక్తి ని పొందుటకు కారణముగానున్నది. 

శ్రీ గోవింద ! గోవింద ! గోవింద ! శ్రీ మహావిష్ణోరాజ్ఞయా ప్రవర్త మానస్య అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్దె శ్వేత వరాహకల్సే వైవ సవత మన్వంతరే కలియుగే ప్రదం పాదే , జంబూద్వీపే, భరతవర్షే భారత ఖండే మేరోహ్ దక్షిణదిగ్భాగే శ్రీ శైలస్య ఈశాన్య ప్రదేశీ మధ్య దేశే సమస్త దేమో బ్రాహ్మణా హరి హరి సన్నిధౌ అస్మిన్వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన .........సంవత్సరే ..........ఆయనే ........ఋతౌ........మాసే ..........పక్షే .........తిధౌ , వాసరే శుభ యోగే శుభ కరణ ఏవంగుణ విశేషణ విశిష్టాయాం శుభా తిధౌ , శ్రీమాన్ .....గేత్రః శర్మా శ్రీమతః ....గోత్రస్య శరణస్య ధర్మపత్ని సమెత స్య మమోపాత్త ది రి ట క్ష యద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్ధం ........సంధ్యాముపాసిశ్యే , అని సంకల్పము చెప్పవలయును.

మార్జనము

ఓమ్ ఆపోహిష్టామయోభువః తానుర్జే ద ధాతన
మహేరణాయ చక్షసే, యోవశ్శివ త మోర సః, తస్య యస్యక్ష యాయజిస్వధ ఆసో జన యాధాచనః.
టీ అప - పరమాత్మా, హి - ఎందుచేత , మయోభువః - జ్ఞాన కారణములు, స్ధ - నిలయమై ఉన్నావో, తాః - అట్టి నీవు, నః - మాకు, ఊర్జే - ఆహారమును, ద ధాతన - ప్రసాదింపుము, మహె - పూజింపదగినట్టి, రణాయ - నిలయమై, వెక్షసే - దర్శనము చేయుట, ద ధాతన - ప్రసాదింపుము, భో ఆపః - ఓ పరమాత్మ స్వరూపుడా ! నః - నీ యొక్క,యః - ఏది , ర సః - దయా స్వరూపము, శివ తమః - మిగుల శుభకరమైనదో, తస్య - అట్టి వానికి , ఉశతీ - ప్రేమతోనుండు, మాతరః - తల్లులవలె , ఇహ - ఈ జన్మయందు, నః - మాకు, భాజయత - కలుగజేయుము,యస్యక్ష మాయ - నీ దయా స్వరూపమును చూచుటకు, జిన్వధ -కోరుచున్నారో, తంర సం - ఆదయాస్వరూపమును, అర - ఆలస్యముచేట్టి శ్రమపెట్టక, గమామ - కలుగజేయుము, ఆపః - ఓ దయా స్వరూపుడా !సః - నన్ను , జనయధ - నీ దివ్య స్వరూపమును పొందునట్లు అనుగ్రహింపుము.
ప్రాతర్మన్త్రాచమన (జలపాన) మునకు చెప్పవలసిన మంత్రము

సూర్యశ్చ మామన్యుశ్చ మన్యుపతిశ్చ మాన్యుకృతేభ్యః,పాపేభ్యో రక్షన్తాం, యద్రాత్యా త్సా పమకార్షం, మనసా వాచాహస్తాభ్యాం, పద్భ్యా ముద రేణ శిశ్ఘ్చా, రాత్రి స్తదవలుమ్బతుసూర్యే జ్యోతిష జుహొ మి స్వాహా

టీ సూర్యః - సూర్య మండంమును అంతర్యామియైయుండు పరమాత్మయు, మన్యుశ్చ - జ్ఞాన స్వరూపుడును, మన్యుపతయ - సుగ్ననమును కలుగజేయు యత్కంచ దుంతే మయి, ఇద మహం మామమృత యోనౌ వాడును, మాం - నన్ను, మన్యు కృతేభ్య - పాపాత్ముడ నైన నన్ను, పాపేభ్యః - సకల పాపములనుండి , రక్షాన్తాన్ - రక్షించుగాక , రాత్ర్యా - గతించిన రాత్రియందు, మనసా - మనస్సు చేతను, ఉదరేణ - భోజనము చేయునప్పుడు ఉదరముచేతను, శిశ్గ్చా - అన్య స్త్రీ సంపర్కములును, యత్ - ఏ పాపములను,ఆకార్షమ్ - ఆచరింతునో, తత్ - ఆ పాపములనన్నిటిని రత్రిహ్ - రాత్రియందు చేటిన ఆ పాపములను పరమాత్మ, అవలుమ్సతు - నశింపజేయునుగాక, యత్కించ - యింకను, మయి - నాయందు,యత్ దురితమ్ - నేను తెలియక చేటిన పాపములన్నిటినీ, ఇదమ్ -వాటిని, మాంచ -నాది అను అహంభావమును, అహం - నే న నెది అహంకారమును, సూర్యే - మోక్ష మిచునట్టి నీ యందు, అమృత యోనౌ - దయాస్వరూపుడవైన నీ యొక్క, జ్యోతిషి - తేజస్సు నందు, జుహొమి - భస్మముచేయుచున్నాను, స్వాహా - ఆ పాపములన్నియు పూర్తిగాభస్మము అగునుగాక - అని మంత్రించి ఆజలమును త్రాగవలయును.

మధ్యాహ్నము చెప్పవలసిన మంత్రము

ఆపః పునస్తు పృదీవీం పృదీవీం పూతా పునాతుమాం,
పునస్తు బ్రాహ్మణ స్సతిర్బహ్మా పూతా పునాతుమాం,
జ్ఞాన స్వరూపు యదుచ్చిష్ట మభోజ్యం యద్వా దుశ్చరి తంమమ,
పునస్తు మామాపోసతాంచ ప్రతిగ్ర హగ్గ్ ౦స్వాహా.
టీ ఆపః - ఆ పరమాత్మ, పృధీవీమ్ - నా శరీరమును, పునస్తు - పవిత్రము చేయుగాక, పృధీవీమ్ - నా దేహము, పూతా - మంచి కర్మలు చేయుగార, మామ్ - నన్ను, పునాతు - పవిత్రము చేయుగాక, ఉచ్చిష్టమ్ - ఇతరుల ఎంగిలి తినిన పాపమును, అభోజ్యమ్ - తినగూడని పదార్దములు తినుట వలన కలిగిన పాపమును, యద్వాదుశ్చరితమ్ మయ - ఇట్టి పాపములు, అపవిత్రమైన పనులు చేసినందు వలన కలిగిన నా పాపములను, అవతాం - తిలదానము మొదలగు పట్ట కూడని నిదానములు నేను పట్టినందున కలిగిన పాపములను, ప్రతిగ్రహంచ - చెడ్డ దానములు పట్టుటి లన కలిగిన పాపములను, మామ్ - నన్ను, అప - దయామయుడైన ఆ పరమాత్మ, సర్వమ్ - నేను చేసిన సకల పాపములను నశింపజేసి, పునస్తు - మరల పవిత్రునిగను, పుణ్యాత్మునిగను చేయుగాక.


సాయంకాలమున మంత్రాచ మనమునకు చెప్పవలసిన మంత్రము
అగ్నిశ్చ మామన్యుశ్చ మన్యుపత యశ్చ మాన్యుకృతేభ్యః
పాపేభ్యో, రక్షిన్తా, యదహ్నాత్సాపమకార్షం మనసావాతాహస్తాబ్యాం పద్భ్యా ముద రేణ శిశ్గ్చా అహస్త ద వలుమ్పతుసత్యే జ్యోతిషి జుహొ మి స్వాహా.
టీ అగ్నిశ్చ = అగ్నిసాక్షియైన పరమాత్మయు, మన్యుశ్చ = జ్ఞాన స్వరూపుడును, మన్యుపతయశ్చః = గురువును, మన్యుకృతేభ్యః = అజ్ఞానముతో నున్న, పాపేభ్య = సమస్త పాపములనుండి, రక్షన్తాం = రక్షించునుగాక, ఆహ్నా = ప్రతి దినమును, మనసా = మనసు చేత, వాచా = మాటల చేత, హస్తాభ్యామ్ = చేతులతో, పద్భ్యామ్ = పాదములచే, ఉద రేణ = భోజనాదులచే, శిశ్గ్చా = వ్యభిచారము మొదలగు పాపకార్యములవలనను, యత్ = ఆ పాపములన్నింటినీ, అహః = దయస్వరూపుడైన ఆ పరమాత్మ, అవలుమ్పతు = నశింపజేయుకు ప్రార్ధించు చున్నాను, కించ = మరియును, మయి = నాది యను మమకారమును అహం = నన్ను అను అహంకారమును, సత్యే = కాలత్ర యమందుండు, అమృత యోనౌ = ఈ జగత్తునకు కారణభూతుడైన, జ్యోతిషి = స్వయం ప్రకాశ మానమున, జుహొమి = నశింపజేయుచున్నాను, స్వాహా = నా పాపములన్నియు నీ జ్యోతియందు పూర్తిగా భస్మమగుగాక. ద ధీ క్రావ్ ణ్నోఅకారిషం, జిష్ణో రశ్వస్యవాజినః, సురభినో ముఖా కరతృణ ఆయూగ్ ౦ షి తారి షత్ ఆపోహిష్టా మయోభువః తాన ఊర్జే ద ధాతన, మహేరణాయ చక్ష సేయోవ శ్శివ త మోర నః, తస్య భాజయతే హనః ఉశ తీ రి వ మాతరః, తస్మా అరంగ మామవో, 
యస్యక్ష మాయ జిన్వధ అపోజన యధాచనః
టీ ద ధీ క్రావ్ ణ్నో = మహా ప్రభావము గలవాడైన ఆ పరమాత్మను, జిష్ణో = జయప్రదుడును, అశ్వస్య = సర్వాంత ర్యావి
యు, వాజినః = భక్తులను సదా కాపాడుచుండు వాడును అయిన ఆ పరమాత్మను, అకారిషమ్ = నేను ఎల్లప్పుడు
ధ్యానము చేయుదును, నః = నా యొక్క, ముఖా = మనస్సును, సురభి = పవిత్రమైనది గా కరత్ = చేయుగాక,
ఆయూగ్ ౦ షి = నేను ఆచరించు పనులన్నియు ఈశ్వర ప్రీతి అగునట్లు, తారిషత్ = అనుగ్రహించునుగాక.


మరలమార్జనము


హిరణ్యవర్ణాశ్శుచ  యః పావకాః యా సుజాతః క శ్యపోయా
స్వి న్ద్రః అగ్నిం యాగర్భంద ధీ రే విరూ పాస్తాన ఆపశ్శాగ్ ౦
స్యోనాభనస్తు యాసాగ్ ౦ రాజా వరుణో యాతి మధ్యే
సత్యానృతే ఆవ సశ్యంజనానాం మధుశ్చ్యుత శ్శుచ యోయాః
పావకాస్తాన అపశ్శగ్ o స్యోనాభవస్తు, యాసాం దేవాః
ది వికృణ్వన్తి భక్షం యాఆన్త రీ రి క్షే బహు భాభ వన్తియాః పృధీవీం
వయ సోస్ధన్తి శుక్రాస్తా నా పశ్శగ్ సోన్యా భవస్తు శివే న మాచ
క్షుషా వ శ్యతాపశ్శివ యా త్వక్ వో పృశత త్వంచమే.
సర్వాగ్ ౦ అగ్నీగ్ oర ప్సుత షదో హువేలో మయివర్చోబలమోజో నిర త.


టీ హిరణ్యవర్ణా = బంగార పురంగు గలిగినటువంటియు, శుచయః = పవిత్రమైనటువంటియు, పావకాః = పవిత్రముచెయునట్టియు, యాసు = వేటియందు, కశ్యప = సర్వసాక్షి యైన సూర్యుడు, జాతః = ఉద్భవించెనో, యాః = ఏపరమాత్మ, అగ్నిమ్ = అగ్నిని, గర్భం = గర్భమున , దధీరెహ్ = ధరించెనో,  విరూపాః = విశ్వరూపుడైన, తాన్ ఆపః =పరమాత్మ , నః = నా యొక్క , శమ్ = కష్టములను తొలగించునదియు, స్యోనాః = శుభమును కలుగజేయునదియు,భవస్తు = అగుగాక, యాసాగ్ o రాజావరుణో యాతిమధ్యే = ఏ బుద్ది యందు, రాజా = ప్రకాశించునట్టి , వరుణః = చైతన్యము, జనానామ్ = ప్రకాశింపజేయుచున్నదో, యాః = ఏది, మధుశ్చ్యత = అమృతము కలుగచేయుచున్నదో, శుచయ = శుచియైనదో , పావకా = అన్నిటినీ పవిత్రము చేయునదిగయున్నదో, తాన్ ఆపః = ఆ పరమాత్మ, సః = నా యొక్క, శమ్ = దుఖములను పోగొట్టి, స్యోనాః = సుఖమును కలుగ జేయుననియు, భవస్తు = ఆగుగాక, దేవాః = ఇంద్రియములు, ది వి = వినోదముగా, యాసామ్ దేవాః ది వికృణ్వన్తిభక్షం = వేనిని ఆహారముగా చేయుచున్నవో, యాః =ఏవి, అన్తరక్షే =  హృదయమను ఆకాశమందు, బహొధా = అనేక మార్గాములుగ, భవన్తి = అగుచున్నవో, యాః = ఏవి, పృధివీమ్ = శరీరమును, వయసా = అమృత గుణముచే, ఉన్దన్తి = తృప్తి పొందుచున్నవో, శుక్రాః = పవిత్రమైన, 
తాఃఆపః = ఆ పరమాత్మ, సః = నా యొక్క, శమ్ =సమస్త దుఖములను పోగొట్టి, స్యోనాః = సుఖమును కలుగజే
యునది, భవస్తు = అగుగాక, భో ఆపః = ఓ పరమాత్మా, శివేన = శుభకరములైన, చక్షుసా = దయతో, మామ్ =
నన్ను, పశ్యత = అనుగ్రహించి చూడుము, శివయా = ఆనందమైన, అనువా = రూపముతో, మే = నా యొక్క, త్వక్ = దేహమును, ఉపసృశిత = వ్యాపించుటచే పవిత్రము చేయుము, హేఆపః = ఓ దైవమా, వః = నీ యొక్క, అప్సుషద =అన్నిటినిపాలించు రూపమునందున్న, సర్వా = సమస్త, అగ్నీన్ = తేజస్సులను, వర్చః = బ్రహ్మవర్చస్సులను, బలమ్ =శక్తికి, ఓజహ = సంతోషమును, మయి = నా యందు, నిధత్త = స్ధిరముగ నుండునట్లు అనుగ్రహించుమని, హువే = వెడుచున్నాను.


పాపవిమోచన మంత్రము


ద్రుపదాది న ముఘ్చతు, ద్రుపదాది వేన్ముచానః, స్విన్నస్స్నాత్వీమలా మలాది ప, పూతం పవిత్రేణే వాజ్యం,
అపశ్శువస్తు మైస్ధనః టీ ద్రుపదాత్ ఇవ = బండ కొయ్యనుండి విడి పించినట్లుగ, ముంచుతు =నన్ను విదిపించుము, ద్రుపదాత్ = బండ కొయ్యనుండి, ముచానః ఇవ = విడువబడిన వాని వలె, స్విన్నః = చెమటపట్టిన వాడు, స్నాత్వా = స్నాన మాచరించి, విమలాత్ ఇవ = మురికిని పోగొట్టుకొనినట్లు, పవిత్రేణ = జ్ఞానముచే, ఆజ్యమ్ = మూలప్రకృతి, పూతం ఇవ = తొలగునట్లు, ఆపః = ఆపరమాత్మ, మాం = నన్ను, శునస్తు = సకల పాపములనుండి విముక్తి గలుగునట్లు జేయుగాక. తరువాత మరల ప్రాణాయామము చేయవలయును.

అర్ఘ్య ప్రదానము

పూర్వోక్టై వంగుణ..... తిధౌ ముఖ్య కాలాతిక్రమణ దోష పరిహారార్ధం ప్రాయశ్చిత్తార్ఘ్య ప్రదాన పూర్వక సాయమర్ఘ్య

ప్రదానం కరిష్యే.
ప్రాతః కాల మంత్రము

ఉద్యన్త మస్తం యన్త మాది తం మభిధ్యాయన్ కుర్వన్బ్రా

హ్మణో విద్వాన్ స్సక లంభ ద్రమశ్నుతే సావాది త్యో
బ్రహ్మేతి బ్రహ్మేవ సన్ బ్రహ్మాస్మేతియ
ఏవం వేద అసావా


టీ ఉద్యస్తమ్ = ఉదయించుచున్న, అస్తంయన్తమ్ = అస్తమించుచున్నట్టి, ఆదిత్యమ్ = స్వయంప్రకాశమానుడైన
సూర్యుని, అభిధ్యాయన్ = ప్రకాశమే, బ్రహ్మేతి = భగవంతునిగా, విద్వాన్ = తెలుసుకొనునట్టి, బ్రాహ్మణః = జ్ఞాని,
సకలమ్ = సమస్త విధములైన, భద్రమ్ = శుభములను, అశ్నుతే = పొందుచున్నాడు, యః = ఎవరు, ఎవమ్ = ఏ విధముగా, వేద = జ్ఞానమును పొందుచున్నాడో, బ్రహ్మేవ సన్ = పరబ్రహ్మరూపుడైన, బ్రహ్మ = భగవంతుని, ఏతి =పొందుచున్నాడు, అసౌ = ఈ, ఆదిత్య = స్వయం ప్రకాశ మానుడైన సూర్యుడే, బ్రహ్మ = బ్రహ్మము.
ప్రాతః కాలమున యీ మంత్రమే పటించ వలయును.


మధ్యాహ్న కాల అర్ఘ్యమంత్రము


హమ్ ౦ సశ్శుచి షద్వ సుర న్త రిక్ష సద్దోతా వేది షద
తిధిర్డురోణసత్ నృషద్వర ససదృత సద్బ్యోమ పనబ్జాగో జా ఋత జా
ఋత జా ఆద్రి జా బూతం బృహత్టీ . శుచిషత్ = పవిత్రమైన మనస్సునందుడువాడును, వసుహ్ = భూమండలమును తన ఉదరమున గలవాడును, అన్తరిక్ష సత్ = సూర్యచంద్ర నక్షత్రములలో అంత ర్యామియై వ్యాపించి యున్నవాడును, హొతా = అగ్నియందుగల తేజో రూపుడును, వేది షత్ = వ్యాపించియున్నవాడును, అతిధిహ్ దురోణసత్ = ధర్మ స్వరూపుడై బ్రహ్మాండ మంతయు వ్యాపిన్చియుండువాడును, నృషత్ = వైశ్వానర రూపుడై మనుష్యులయందుండువాడును, రససత్ = జ్ఞాన రూపుడై బ్రహ్మజ్ఞానము కలవారియందుండువాడును, రుతవత్తు = నిష్పాదకుడై యుండువాడును, వ్యోమసత్తు = సకలాంత ర్యామియై హృదయాకాశమున సంచరించువాడును, ఆజ్ఞాః = నీటియందు మొసళ్ళు మొదలగు రూపములతో నుండువాడును, గో జాః = పశువులు, పక్షులు మొదలగు సర్వ ప్రానులయండును అంత ర్యామియై యుండువాడును రుత జాః = వేదములచే కొనియాడు బడుచుండువాడును, ఆద్రీ జాః = ప్రపంచ మంతటను వ్యాపించియుండువాడును, బృహత్ = శ్రేష్టుడును, రుతమ్ = స్వరూపుడును.

సాయంకాల మంత్రము

ఓం భూర్భువస్సువః, త త్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య
ధీ మహిధి యోయోనర్గో ప్రచోదయాత్తు.ప్రాయశ్చిత్తార్ఘ్యమునకు : ఓం భుహ్ ఓం భువః ఓగ్ ౦ సువః ఓం మహః ఓం జన హః ఓం తపః ఓగ్ ౦ సత్యం ఓం త త్స వితుక్వరేణ్యం భర్గో దేవస్యధీ వహిధి యోయోనః ప్రచోదయాత్తు ఓమాపోజ్యో తిర సోమృతం బ్రహ్మ భూర్భువస్సువరోమ్ అని మంత్రము చెప్పవలయును. దోసిలిలో నీరు పోసుకొని యీ మంత్రముతో అభి మంత్రించి అంగుష్టము తర్జుని వ్రేళ్ళు కలియకుండ మూడు పర్యాయములు గో శృంగాకార ముగ ఎత్తి అర్ఘ్యము యీయవలయును. దీనికి ముందు వ్యాహృతులు శిరస్సు వీ నితో పూర్తిగా గాయత్రి మంత్రమును చెప్పి ప్రాయశ్చిత్తార్ఘ్యము వి డువ వలయును, తరువాత ప్రాయశ్చిత్తార్ఘ్యముతో గూడ ఉదయము సాంత్రము నాలుగు అగుచున్నవి. మధ్యాహ్నము ప్రాయశ్చిత్తార్ఘ్యము ప్రధానా(హంసా)ర్ఘ్యము పిదప మరల ఉదయము వలె ఒక అర్ఘ్యము కలసి మూడు అగుచున్నవి. ఉదయము, మధ్యాహ్నము, ప్రాజ్ఞ్మాఖముగ నిలువబడి అర్ఘ్యము యీయవలయును. సాయంకాలము పశ్చిమ ముఖముగా కూర్చుండి యీయవలయును. సాయంకాలము జలములో విడువరాదు. తరువాత ఆచమనముచేసి సంధ్యాంగ తర్పణము చేయవలెను.
 http://telugubhaktiblog.blogspot.in