- ఆరోగ్యమే మహాభాగ్యం - ఆరోగ్యంగా ఉండడానికి సంపూర్ణాహారం తినాలి.
- కలుషిత ఆహారం తినరాదు.
- అన్నం, పప్పు, ఆకుకూరలు, కాయగూరలు, పాలు, పండ్లు బలమైన ఆహార పదార్థాలు.
- బియ్యం, రాగులు, సజ్జలు, జొన్నలు, గోధుమ లాంటి ధాన్యాలు, తోటకూర, గోంగూర, చుక్కకూర, అవిశ, మునగ, చేమ, బచ్చలి, మెంతిలాంటి ఆకుకూరలు, బెండ, కాకర, దోస, టమేటా, పొట్ల మునగలాంటి కాయగూరలు పనికిరావని అనరాదు. ఇవన్నీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.
- మాంసం, చేపల్లోనే మాంసకృత్తులు ఉన్నాయని అనుకోరాదు. పప్పులు, కోడిగ్రుడ్లలో కూడా మానవ శరీరానికి కావలసిన మాంసకృత్తులు ఉన్నాయి. ఇవి మన ఆరోగ్యానికి ఎంతో మంచిది.
- ఆరోగ్యం, వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రతపై ఆధారపడి ఉంటుంది.
- వ్యాధులకు కారణాలు అనేకం, చాలా వరకు వ్యాధులు సూక్ష్మజీవుల ద్వారా వ్యాపిస్తాయి.
- నీటి ద్వారా కొన్నిరకాల వ్యాధులు వ్యాపిస్తాయి.
- మంచినీటి బావుల్లో, బ్లీచింగ్ పౌడరు కలపాలి. వానాకాలంలోను, కలరా, టైఫాయిడ్ లాంటి వ్యాధులు ఎక్కువగా ఉన్న రోజుల్లో నీటిని కాచి వడగట్టి చల్లార్చి తాగాలి.
- ఒకరి నుంచి ఇంకొకరికి సంక్రమించే వ్యాధుల్ని అంటు వ్యాధులు అంటారు.
- వ్యక్తిగత పారిశుద్ధ్య కార్యక్రమాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.
- పోషకాహార లోపాల వల్ల కొన్ని వ్యాధులు వస్తాయి. ఉదాహరణకు మాంసకృత్తులు లోపిస్తే వాపునంజు, శక్తిజనకాలు లోపిస్తే కట్టెనంజు వ్యాధులు వస్తాయి.
- విటమినులు లోపిస్తే వ్యాధులు వస్తాయి. ఉదాహరణకు ఏ విటమిన్ లోపిస్తే రేచీకటి, బి విటమిన్ లోపిస్తే నంజువ్యాధి, నోటిపుండ్లు వస్తాయి.
- ఖనిజ లవణాలు లోపిస్తే వ్యాధులు వస్తాయి. ఉదాహరణకు అయొడిన్ లోపిస్తే గాయిటర్, ఐరన్ లోపిస్తే రక్తహీనత వస్తాయి.
- కొన్ని వ్యాధులు అతి ప్రమాదకరమైనవి. వీటి నివారణకు టీకాలు తీసుకోవాలి.
- గర్భిణీ స్త్రీలు, పిల్లలు టీకాలు సరైన సమయంలో విధిగా క్రమం తప్పకుండా మోతాదు తీసుకోవాలి.
- డాక్టర్ సలహా లేకుండా అంగట్లో మందులు కొని వేసుకోరాదు. ఎక్స్ స్పయిరి తేది (వాడేందుకు చివరి తేదీ) తర్వాత ఏ మందును వాడరాదు.
- రోగనిరోధక శక్తి పెంపొందాలంటే క్రమబద్ధంగా వ్యాయామం చేయాలి. సంపూర్ణాహారం తినాలి.
- నిద్ర అలసిన శరీరానికి విశ్రాంతి ఇస్తుంది. విశ్రాంతి శరీరానికి అవసరం.
Pages
Total Pageviews
10 Jul 2015
శిశు సంరక్షణ - ఆరోగ్యం అన్న విషయంలో అందరూ గుర్తుంచుకోవాల్సిన విషయాలు
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment