2 Jul 2015

ఆకు కూరల పులుసు

అన్ని రకాల ఆకు కూరలు కలిపి చేసుకునే ఆకుకూరల పులుసు



ఆకుకూరలు  
పాలకూర - 1 కట్ట 
మెంతి కూర - 1 కట్ట 
  తోట కూర - 1 కట్ట 
గోంగూర - 1 కట్ట 

తాలింపు ( పోపు ) కోసం కావలసినవి
నూనె - 2 టేబుల్ స్పూన్లు 
వెల్లుల్లి రెబ్బలు -6 
ఎండుమిర్చి - 2
కారం -  1 టేబుల్ స్పూన్  
ఉల్లిపాయ ( మీడియం సైజు )
పసుపు - 1 టీ  స్పూన్ 
మరియు తాలింపు గింజలు 
ఉప్పు - రుచికి సరిపడా  
 
ఆకు కూరలన్నీ విడి విడిగా కడిగి,సన్నగా తరిగి పెట్టాలి. 

కుక్కర్ లో  1 కప్పు నీళ్ళు పోసి , తరిగిపెట్టిన ఆకుకూరలు , పసుపు,కారం ,ఉల్లిపాయ ముక్కలు , 2 వెల్లుల్లి రెబ్బలు  కుక్కర్ లో  వేసి ,(ఉప్పు వెయ కూడదు ) మూత  పెట్టి, 3 విజిల్స్ వచ్చేదాకా ఉడికించాలి . 
 
ఉడికిన ఆకుకూరల్ని తగినంత ఉప్పు వేసి మెత్తగా మెదపాలి . తరువాతబాండీలో నూనె వేసి కాగాక  తాలింపు వేసి, వేగగానే సన్నగా తరిగిన ఉల్లిపాయముక్కలు,  వెల్లుల్లి రెబ్బలు,ఎండుమిర్చి ముక్కలు,కరివేపాకు,కొంచెం కొత్తిమీర  వేసి వేయిస్తూ తాలింపు తయారు చేయాలి .ఈ తాలింపుని మెత్తగా మెదిపి  ఆకుకూరల పులుసులో వేసి,   బాగా కలిపి, కొంచెం కొత్తిమీర చల్లాలి . మూతపెట్టి 5 నిమిషాలు అలాగే ఉంచితే తాలింపులో ఆకుకూరల పులుసు బాగా మగ్గుతుంది . 


 



 

No comments:

Post a Comment