Showing posts with label News. Show all posts
Showing posts with label News. Show all posts

19 Jul 2015

పుష్కర కాలంలో శ్రాద్ధకర్మలు ఎందుకు చేస్తారు? ఏవేవి దానం చేయాలి

Image result for శ్రాద్ధకర్మలు
పుష్కర కాలంలో శ్రాద్ధ కర్మలు చేయడం ద్వారా పితృదేవతలను సంతృప్తిపరిచినట్లు అవుతుందని, తద్వారా పాపాలు తొలగిపోయి.. వంశాభివృద్ధి చేకూరినట్లవుతుందని పండితులు అంటున్నారు. సాధారణంగా పుష్కర కాలానికి మరో విశిష్టత ఏమిటంటే.. పితరుల సంస్మరణార్థం చేసే శ్రాద్ధ కర్మలు. పుష్కర సమయాల్లో దేవతలు, రుషులు వారితో పాటు పితరులు కూడా వస్తారని శాస్త్రాలు చెప్తున్నాయి. 
 
పుష్కరాల్లో పెట్టే శ్రాద్ధం పితరులకు తిండి పెడుతుందా? అని అందరూ అనుకోవచ్చు. కానీ మన కంటికి కనిపించని కొన్ని పదార్థ గ్రాహకాలైన అణువులు పుష్కరాల్లోని మంత్రంతో కూడుకొని పెట్టే శ్రాద్ధ ద్రవంలోని ఆహార రసాన్ని మన పితరులకు అందిస్తుందంటారు. ఈ కర్మలను పరిపూర్ణ విశ్వాసం చేస్తే సత్ఫలితాలను పొందవచ్చునని ఆగమ శాస్త్ర నిపుణులు అంటున్నారు. 
 
శ్రాద్ధ కర్మలు ఎవరెవరికి ఇవ్వొచ్చంటే...?
పితృ, మాతృ వర్గాలకీ, మాతామహి మాతామహ వర్గాలకీ, అన్నదమ్ములతు, పినతండ్రి, పెదతండ్రులకు, అక్కచెల్లెళ్లకూ, బావమరుదులకు, బావగార్లకు, మామగారికి, అత్తగారికి, గురువులకు, శిష్యులకు, పినతల్లి, పెదతల్లులకు, మేనత్తలకు, వారి సంతానానికి, తన సంతానికి, అల్లుళ్లకూ కోడళ్లకూ ఇలా తనకు సంబంధించిన వారికందరికీ శ్రాద్ధకర్మ, పిండ ప్రదానం, తర్పణం వదలటం వంటి కార్యక్రమాలను జరపడం పుష్కర సమయంలో అనాదిగా వస్తున్న ఆచారం. 
 
పిండ ప్రదానంతో పాటు వస్త్రదానం, గోదానం, నువ్వుల దానం ఇవ్వొచ్చు. ఔషధదానం వల్ల ఆరోగ్యం, గోదానం వల్ల కైలాస ప్రాప్తి, నువ్వుల దానం వల్ల దుఃఖాలు తొలగిపోవడం, నేతిని దానం చేయడం వల్ల ఆయుర్దాయం, భూదానం వల్ల అధికారం, బంగారం, వెండి దానాల ద్వారా ఇహపర సౌఖ్యాలు పుణ్యలోక ప్రాప్తి చేకూరుతాయి. ఇవి ఇవ్వలేనివారు తమ శక్తికి తగిన ధనాన్ని దానం చేయవచ్చునని పండితులు అంటున్నారు. 
 
http://telugu.webdunia.com/article/religion-articles/significance-of-pushkaralu-115071300076_1.html

14 Jul 2015

గర్భిణీ స్త్రీలకు సలహాలు

గర్భం అనేది సృష్టి రహస్యం. 


ఇది మహిళలకు దేవుడిచ్చిన ఓ అపురూపమైన కానుక. కొన్ని సూచనలు పాటిస్తే ప్రసవం సులభతరమౌతుంది . గర్భం ధరించిన స్త్రీలు నిత్యం సంతోషంగా ఉండాలి. దీంతో పుట్టబోయే శిశువు కూడా అలాగే ఉంటుంది. ఆరోగ్యమైన శిశువు కొరకు పౌష్ఠిక ఆహారం: పాలు, పండ్లు, ఆకు కూరలు ,పప్పు, మాంసము ,చేపలు తీసుకోవాలి .

గర్భధారణకు మొట్టమొదటి సంకేతం సరయిన సమయంలో రావలసిన ఋతుస్రావం కాకపోవడం. కొందరిలో కడుపులో వికారం, వాంతులు వంటివి అనిపించవచ్చును. దీనిని తేదీ(నెల) తప్పడం అంటారు. క్రితం ఋతుచక్రం రోజుకు ఒక వారం కలుపుకుంటే ఇంచుమించుగా గర్భధారణ సమయం లెక్కించవచ్చును. ఈ తేదీల ఆధారంగానే వైద్య నిపుణులు అంచనా వేసి ఎప్పుడు పురుడు పోసుకునేదీ లెక్కకడతారు. దీనిని నేగలీ సూత్రం (Naegele's rule) అంటారు.EDD = LMP +9 months ,7 days.

గర్భ నిర్ధారణ పరీక్షలు ఎక్కువగా జరాయువు(placenta) నుండి తయారయ్యే హార్మోన్లు ఆధారంగా పనిచేస్తాయి. వీటిని రక్తంలో గాని, మూత్రంలో గాని కొద్ది రోజులలోనే గుర్తించవచ్చును. గర్భాశయంలో స్థాపించబడిన తరువాత, జరాయువు చే స్రవించబడిన కోరియానిక్ గొనడోట్రోఫిన్ స్త్రీ అండాశయంలొని కార్పస్ లుటియమ్ నుండి ప్రొజెస్టిరోన్ స్రావాన్ని ప్రేరేపిస్తాయి. దీని మూలంగా ఎండోమెట్రియమ్ మెత్తగా వాచి, రక్తనాళాలు వృద్ధిచెందుతాయి. దీని మూలంగా పిండాభివృద్ధికి కావలసిన ఆహార పదార్షాలు సరఫరా చెందుతాయి.

ప్రారంభ దశలో స్కానింగ్ పరీక్ష గర్భధారణ మరియు పిండం యొక్క వయస్సును కూడా తెలియజేస్తుంది. దీని ద్వారా పురుడు జరిగే సమయం కూడా నేగలీ సూత్రం కన్నా సరిగ్గా అంచనా వేయవచ్చును. శాస్త్రబద్ధంగా పురుడు ప్రారంభమైన సమయం ఋతుచక్రం యొక్క తేదీల ప్రకారం 3.6 శాతం కేసులలో మాత్రమే జరుగుతుంది. అయితే స్కానింగ్ ద్వారా అంచనా కూడా 4.3 శాతంలో మాత్రమే సరైనదిగా తెలిసినది.

స్త్రీ, పురుష ప్రాకృతిక సంభోగంలో, పురుషుని వీర్యకణాలు స్త్రీ అండాన్ని ఫలదీకరించిన తరువాత ఏర్పడిన పిండం స్త్రీ గర్భాశయంలో పెరగడం ప్రారంభిస్తాయి. దీనిని గర్భం (Pregnancy) అంటారు. గర్భం ధరించిన స్త్రీని గర్భవతి అంటారు. కొంతమందిలో ఒకటి కన్నా ఎక్కువ పిండాలు తయారౌతాయి. ఫలదీకరణం తరువాత తయారైన పిండం పెరుగుతూ ఉండే కాలాన్ని గర్భావధి కాలం అంటారు. దీని తరువాత శిశువు జన్మింస్తుంది. దీనిని పురుడు అంటారు. క్షీరదాలన్నింటిలో క్షుణ్ణంగా పరిశోధన మానవులలో జరిగింది. ఈ వైద్య శాస్త్రాన్ని ఆబ్స్టెట్రిక్స్ (Obstetrics) అంటారు. గర్భావధి కాలం తరువాత శిశువు జననం సాధారణంగా 38 - 40 వారాలు అనంతరం జరుగుతుంది. అనగా గర్భం ఇంచుమించు తొమ్మిది నెలలు సాగుతుంది.(9 lunar month * 30 days = 270 days).

ఫలదీకరణం తరువాత ప్రారంభ దశను 'పిండం'(Embryo) అంటారు. 'శిశువు'(Foetus) అని ఇంచుమించు రెండు నెలలు లేదా 8 వారాల తర్వాత నుండి పురిటి సమయం వరకు పిలుస్తారు. చాలా దేశాల్లో మానవుల గర్భావథి కాలాన్ని మూడు ట్రైమిస్టర్(3*3 months) కాలాలుగా విభజిస్తారు. మొదటి ట్రైమిస్టర్ కాలంలో గర్భస్రావం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. రెండవ ట్రైమిస్టర్ కాలంలో శిశువు పెరుగుదలను సులభంగా గుర్తించవచ్చును. మూడవ ట్రైమిస్టర్ కాలంలో శిశువు గర్భాశయం బయట స్వతంత్రంగా బ్రతకగలిగే స్థాయికి పెరుగుతుంది.

తీసుకోవలసిన జాగ్రత్తలు :

  • ఆరోగ్యమైన శిశువు కొరకు అన్ని కలిసిన పౌస్టికాహారము అనగా ఎక్కువపాలు , పండ్లు , ఆకుకూరలు , పప్పు , మాంసము , చేపలు వగైరా తీసుకోవాలి .
  • మొదటి ఆరునెలలు .... నెలకొకసారి , ఏడు -ఎనిమిది నెలల్లో నెలకు రెండు సార్లు , తొమ్మిదోనెలలో వారానికొకసారి వైద్యపరీక్షలు అవసరము .
  • సొంతముగా మందులు వాడడము , ఎక్షురేలు తీయించుకోవడము చేయకండి.
  • ఎత్తుమడమల చెప్పులు వాడకంది ,
  • గర్భం ధరించిన స్త్రీలు నిత్యం సంతోషంగా ఉండాలి. దీంతో పుట్టబోయే శిశువు కూడా అలాగే ఉంటుంది.
  • మొదటి మూడునెలలు , చివరి నెలలో దూరప్రయాణాలు , కారు స్కూటరు నడపడము , చేయరాదు .
  • రాత్రులు 8-10 గంటలు , పగలు 1 గంట నిద్ర లేదా విశ్రాంతి తీసుకోవాలి . నిద్రపోవునపుడు ఒక ప్రక్కకు (వీలైతే ఎడమ వైపు ) తిరిగి పడుకోవాలి .
  • స్త్రీలు గర్భము దాల్చిన మూడు మాసముల తరువాత, ప్రసవించిన మూడు మాసముల వరకు యోగ విద్య నభ్యసించ రాదు. ఉదయము నడక మాత్రము చేయవలయును.
  • ధనుర్వాతం బారినుండి రక్షణకోసము టెటనస్ టాక్షాయిడ్ ఇంజక్షన్‌ లు తీసుకోవాలి .
  • రక్తస్రావము , ఉమ్మనీరు పోవడము , శిశువు కదలిక తగ్గినట్లు అనిపించినప్పుడు , కడుపు నొప్పి వచ్చినా డాక్టర్ని సంప్రదించాలి .
 గర్భవతులకు - పోషకాహారం-- గర్భస్త సమయంలో ఆహారంలో తీసుకోవలసిన జాగ్రత్తలు -

భారతదేశంలో, ముఖ్యంగా దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న జనాభాలో స్త్ర్రీ గర్భవతిగా లేని సమయంలోను, గర్భవతిగా ఉన్న సమయంలోను, ఓకే విధమైన ఆహారం తీసుకుంటున్నట్లు లెక్కల్లో తేలింది. బిడ్డకు, తల్లికి ఇద్దరికీ సరిపడా లేక ఎక్కువ ఆహారం తీసుకోవలసిన - అవసరం చాలా ఉంది.

నష్టాలు -
  • 1. గర్భవతి తీసుకోవలసిన దానికంటే తక్కువ ఆహారం తీసుకోవటంవలన, తక్కువ బరువుతో శిశువు జన్మించడం - ఇది - తల్లీ/బిడ్డల మరణాలకు దారితీయటం ఎక్కువగా కనిపిస్తుంది.
  • 2. శిశువు బరువు వృధ్ది చెందడంలోను, తల్లికికూడా కొవ్వు శరీరంలో పెరిగేటందుకు అదనపు ఆహారం చాలా దోహద పడుతుంది.
  • 3. పాలిచ్చే తల్లులు (బాలింతలు) సంపూర్ణ ఆహారం తీసుకుంటే, శిశువుకు కావలసినంతగా పాలు వచ్చే అవకాశం ఉంటుంది.

గర్భవతికి కావలసిన ఆహారం -
  • గర్భవతి తీసుకొనే ఆహారం పుట్టబోయే బిడ్డ బరువు పై ప్రభావం చూపుతుంది.
  • గర్బవతికి 300 cal (కాలరీల శక్తి ఎక్కువగా/అదనంగా 15గ్రా మాంసకృత్తులు/10గ్రా కొవ్వుపదార్దాలు అయిదు/ఆరు నెలల గర్భధారణ నుండి తిసుకోవలసిన అవసరం చాలా ఉంటుంది.
  • గర్భవతులు , బాలింతులు తీసుకొనే ఆహారంలో, అధనపు కాల్షియం ఉండాలి. శిశువు ఎముకలు దంతాలు రూపు దిద్దుకోవటానికి, రొమ్ము పాలు పెరగటానికి ఇది చాలా అ వసరం.
  • గర్భ స్ధ దశలో ఇనుము లోపంతో వచ్చే రక్తహీనత, కాన్పుసమయంలో తల్లి మరణానికి దారి తీస్తుంది. శిశువు తక్కువ బరువు తో పుడతారు కనుక, ఇనుము ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవలసి ఉంటుంది.
గర్భవతులు ఆహారం విషయంలో పాటించవలసినవి -
1. గర్భవతులు, బాలింతలు, అదనపు ఆహారం తప్పకుండా తీసుకోవాలి.
2. రోజుకు మూడు కన్నా ఎక్కువ పూటలు భోజనం చేస్తే మరీ మంచిది. .
3. ముడిధాన్యాలు, మొలకెత్తినధాన్యాలు,పులిసిన ఆహారం(పెరుగు ) అదనంగా తీసుకొవాలి.
4. పాలు/మాంసము/కోడిగుడ్లు తీసుకోవాలి.
5. ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు ఎక్కువగా తినాలి .
6. మందులు వైద్యుని సలహా ప్రకారమే తీసుకోవాలి.
7. ఐరన్, ఫోలిక్ / కాల్షీయంను (ఎక్కువ 14-16 వారాల గర్బం నుంచి ప్రారంభించాలి, తల్లి పాలు ఇచ్చేంతవరకు పోడిగించాలి.
8. గర్భవతి, రోజూవారీ చేసుకొనే పనులలో నడక ఉండాలి, కాని ఎక్కువ బరువుపనులు చెయ్యరాదు, అదీ నెలలునిండిన సమయంలో ప్రత్యేకంగా.
9. పోగాకు లేదా మద్యపానం అనగా (సారా, విస్కీ) లాంటివి సేవించరాదు.
10. టీ, కాఫీ తాగడంవలన, శరీరానికి కావలసినంత ఐరన్ అందదు, అందువలన భోజనం తరువాత, టీ / కాఫీ తీసుకొనరాదు.
11.అనవసరమైన భయం ప్రసవ సమయాన్ని కష్టతరము చేస్తుంది,గర్భము , ప్రసవము సృష్టిలో సర్వసాధారణ విషయాలని గుర్తుంచుకోండి.
12. భార్యా భర్తలు నిత్యమూ సంభోగము చేయవచ్చును . అతిగా సంభోగము చేయరాదు . 8-9 వ నెలలో పొట్టపైన ఒత్తిడి పడకుండా రతిలో పాల్గొనాలి .
13. గర్భము దరించిన నుండి , బిడ్డకు పాలు ఇవ్వడం ఆపేంత వరకూ రక్తదానం చేయరాదు .
గర్భము ధరించిన స్త్రీ ఏవిధముగా ఉండాలి?
  • గర్భము ధరించిన స్త్రీ ముఖ్యముగా ఎల్లవేలలూ ప్రసంతముగా వుండాలి.
  • ప్రతిపనిలోను నీజాయితిగా వుండాలి.
  • అనునిత్యము దేవనామస్మరణ చేయవలెను.
  • దర్మప్రవుత్తి కల్గివుండాలి.
  • సత్యమునే పలకవలెను.
  • మీకుటుంబమందు ఆప్యాయత అనురాగము కలిగి వుండాలి .
  • నీతి కధలను చదువుతు వుండాలి.
  • గర్భం ధరించిన స్త్రీలు నిత్యం సంతోషంగా ఉండాలి. దీంతో పుట్టబోయే శిశువు కూడా అలాగే ఉంటుంది.
గర్భిణులు నిద్రలో కొన్ని సమస్యలు-జాగ్రత్తలు :
గర్భిణులు కంటినిండా నిద్రపోవటం ఎంతో అవసరం. అయితే గర్భం ధరించినపుడు శరీరంలో జరిగే మార్పులు నిద్రలో కొన్ని సమస్యలు సృష్టిస్తుంటాయి. కొన్ని జాగ్రత్తలు పాటిస్తే రాత్రిపూట హాయిగా నిద్రపోవటానికి వీలుంటుందని నిపుణులు సూచిస్తున్నారు.
  • * గర్భిణులు మూడోనెల నుంచి ఎడమ వైపు తిరిగి పడుకోవాలి. ఎక్కువసేపు వెల్లకిలా పడుకోకుండా చూసుకోవాలి.
  • * పగలు సాధ్యమైనంత ఎక్కువగా ద్రవాలు తీసుకోవాలి. అయితే రాత్రిపూట వాటిని పరిమితం చేయాలి-లేకపోతే ఎక్కువసార్లు మూత్రవిసర్జన నిద్రలేమికి దారితీయును. .
  • * కారం తక్కువగా ఉండే పదార్థాలు తినాలి. ఛాతీలో మంట పుట్టించే మసాలా ఆహారాన్ని మానెయ్యటమే మంచిది--చాతిలోమంట నిద్రరానివ్వదు ..
  • * పడుకునేటప్పుడు గర్భిణుల కోసం ప్రత్యేకంగా తయారుచేసిన దిండ్లు వాడుకోవాలి. అవి అందుబాటులో లేకపోతే మరో దిండును మోకాళ్ల మధ్య పెట్టుకొని పడుకోవచ్చు.
  • * పగటిపూట వీలు చేసుకొని కాసేపు కునుకు తీయాలి. నిద్ర బాగా పట్టేందుకు మనసును ప్రశాంతంగా ఉంచే పద్ధతులు పాటించాలి.
  • * నిద్రలేమితో బాధపడుతుంటే తప్పకుండా డాక్టరుకు చూపించుకోవటం మరవరాదు.

గర్భిణి లలో మధ్యపానము , Alcohol in pregnency .


ఇంటిలో గర్భిణీ స్త్రీలు ఉన్నప్పుడు మానసికం గా తీసుకోవలసిన జాగ్రత్తలు :

ఇంట్లో గర్భిణీ స్త్రీలు ఉన్నప్పుడు, ఆ గృహస్తులు కొత్త ఇల్లు లేదా ఫ్లాట్స్ వంటి వాటివి కొనుగోలు చేయడం, కట్టడం వంటివి కూడదని వాస్తు నిపుణులు అంటున్నారు. గృహ నిర్మాణ పనులు చేపట్టినప్పుడు అక్కడ వాతావరణము దుమ్ము, ధూళి వంటి వాటివలన కాలుష్యమౌతుంది కనుక కచ్చితముగా గర్భిణీ స్త్రీలను, పుట్టబోయే పిల్లల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుందని వాస్తు శాస్త్రం చెబుతోంది. శిశువు పుట్టిన తర్వాతే కట్టడాల నిర్మాణాలు, ఫ్లాట్స్ కొనడం వంటివి చేయాలని వాస్తునిపుణులు సలహా ఇస్తున్నారు.

అలాగే నిద్రలేచిన వెంటనే గర్భిణీ స్త్రీలు పచ్చటి ప్రకృతి, జలపాతాలు వంటి దృశ్య పటాలను ప్రొద్దునే నిద్రలేస్తూనే చూడటం మంచిది. నిద్రలేచిన వెంటనే దేవుడు పటాల్ని చూడటం ద్వారా రోజంతా శుభదాయకంగా ఉంటుంది.

గర్భిణీ స్త్రీలు ఉండే ఇళ్లలో గృహస్థలం యొక్క దక్షిణము వైపున ఖాళీస్థలాన్ని వదిలిపెట్టి ఉత్తరము వైపున ఇల్లు ఉండకుండా చూడాలి. ఇటువంటి స్థలం గర్భిణీ స్త్రీలనే మాత్రమే గాకుండా స్త్రీలకు బాధలను కలిగిస్తాయని వాస్తు నిపుణులు హెచ్చరిస్తున్నారు. వాస్తు ప్రకారము దక్షిణము న విశాలప్రదేశమున్నట్లైతె రాత్రులు యమకింకరులు తిరుగుతారని నమ్మకము .

మరోవైపు గర్భవతికి ఆరు మాసములు నిండిన తర్వాత గృహారంభం, గృహప్రవేశం చేయకూడదని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. క్రొత్త వతావరణము కడుపులో బిడ్డ మానసిక స్థితి పై ప్రభావము ఉంటుంది . దీంతో పాటు సముద్ర ప్రయాణము, భర్త దూరముగా వలస వెళ్ళుట , గర్భవతి శ్రాద్ధాన్న భోజనం చేయుట వంటివి కూడదు అని అంటారు .

ఇంకా గర్భిణీ స్త్రీ భర్త పుణ్యతీర్థములు సేవించుట, శవమును మోయుట, శవము వెంట నడుచుట వంటివి చేయకూడదు. గర్భిణీ స్త్రీలైతే.. నదీ స్నానము, శవం వద్ద దీపమెలిగించడం, రక్తాన్ని చూడటం, శ్మశాన దర్శనం చేయడం శిశువుకు మంచిది కాదు. అంటువ్యాధు వచ్చే ప్రమాదము మరియు బిడ్డ మానసిక పెరుగుదల పై ప్రభావము చూపుతాయి .

అలాగే గర్భిణీ స్త్రీలుండే ఇంటి నిర్మాణంలో మార్పులు, చేర్పులు చేయడం శ్రేయస్కరం కాదని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. ఆ సమయము లో గర్భిణీ లకు ప్రశాంతత కరువవుతుందనే వాదన ఉంది .


గర్భిణి స్త్రీలలో మానసిక ఒత్తిడి ప్రభావము, Mental stress effects on Pregnancy

గర్భిణి తీవ్ర మానసిక ఒత్తిడి అనుభవిస్తే ఆ ప్రభావం కడుపులోని బిడ్డ పైనా పడుతుందా? దీనిపై వైద్యరంగం ఎప్పటి నుంచో రకరకాల అధ్యయనాలు చేస్తోంది. తాజాగా వెల్లడైన అంశమేమంటే- గర్భం దాల్చిన తర్వాత తొలి మూడు మాసాల్లో తల్లి తీవ్రమైన మానసిక ఒత్తిడికి లోనైతే ఆమెకు పుట్టే బిడ్డకు రక్తహీనత, ముఖ్యంగా ఇనుము లోపం బారినపడే అవకాశాలు ఎక్కువ. దీనివల్ల బిడ్డ మానసిక, శారీరక ఎదుగుదల ప్రభావితమవుతుందని ఇజ్రాయెల్‌ పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. ఇనుము బిడ్డ శారీరక అవయవాల ఎదుగుదలకు, ముఖ్యంగా మెదడు వికాసానికి చాలా కీలకం. తల్లుల్లో ఇనుము లోపం, మధుమేహం, గర్భం దాల్చిన తర్వాత పొగ తాగటం వంటివి పిల్లల్లో ఇనుము లోపాన్ని పెంచుతాయి. అలాగే నెలలు నిండక ముందే పుట్టిన బిడ్డల్లో కూడా ఇనుము లోపించే అవకాశాలు ఎక్కువ. వీటన్నింటికి తోడు- గర్భిణి తీవ్ర మానసిక ఒత్తిడికి గురైనా కూడా పిల్లల్లో ఇనుము లోపం తలెత్తవచ్చని తాజా అధ్యయనంలో వెల్లడవటం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అంశం. ఈ నేపథ్యంలో గర్భిణులంతా 'చక్కటి పోషకాహారం, మానసిక ప్రశాంతత'.. ఈ రెండు అంశాల మీదా ప్రత్యేక శ్రద్ధ పెట్టటం చాలా అవసరమని పరిశోధకులు సూచిస్తున్నారు.

=============================================
మూలాలు
* From my knowledge & experience.
1. ↑ Embryo Definition. MedicineNet.com. MedicineNet, Inc. .
2. ↑ Fetus Definition. MedicineNet.com. MedicineNet, Inc. .
3. ↑ Trimester Definition. MedicineNet.com. MedicineNet, Inc. .
4. ↑ Nguyen, T.H.; et al. (1999). "Evaluation of ultrasound-estimated date of delivery -Ultrasound in Obstetrics and Gynecology 14 (1): 23-28.
5.* Harrison's Text book of Medicine.
6. * Obstetrics for Under graduates" by Dr.R K Raju.MD (prof.& Head of Dept. of OBS & Gynaec._AMC visakhapatnam)

11 Jul 2015

Insurance coverage 30 lacks for gas cylinder blost


సబ్జా గింజల లాభాలు


గోమతిచక్రాలు పూజా విధానం


https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEgJlj5MTZiH7DDVWTZdAzngxSwAjufdsy0K22pXV3mfAYvjbf3d85MLlHyAHhDLQwDHRiev3Vf9EYjTasG1d_aXcA75p0R-PDT7A4VUpsjgj1N0jIjbE4ZGu08J1BF_k1xgK2IcTvszuq4H/s1600/gomati+1.jpeg  గోమతిచక్రాలు అరుదైన సహజసిధ్ధంగా లభించే సముద్రపు ఉత్పత్తి. గోమతిచక్రాలు గుజరాత్ రాష్ట్రం నందు ద్వారకలోని గోమతి నది నందు లభిస్తాయి.చంద్రుడు వృషభ రాశిలోని రోహిణి లేదా తులా రాశిలోని స్వాతి నక్షత్రంలో సంచరించే సమయంలో సోడియం లేదా కాల్షియం లేదా కర్బనపు అణువుల సహాయంతోఇవి రూపు దిద్దుకుంటాయి..ఈరెండు రాశులు శుక్రగ్రహానికి చెందినవి కావటం.ఈశుక్రుడు భార్గవునికి జన్మించిన లక్ష్మీ దేవికి సోదరుడు కావటం వలన ఈ చక్రాల ఉపయోగం అనేకం అనంతం అని చెప్పవచ్చును. జ్యోతిష్యశాస్త్ర రీత్యా శుక్రుడు లైంగిక సామర్ధ్యానికి,ప్రేమ,దాంపత్య సౌఖ్యం,సౌభాగ్యాలకు కారకత్వం వహిస్తుండటం వలన గోమతి చక్రాన్ని ధరించిన వారికి పైవన్నీ పుష్కలంగా లభిస్తాయి.

                                గోమతిచక్రం శ్రీకృష్ణుని  చేతిలోని సుదర్శన చక్రాన్ని పోలి ఉంటుంది.దీనినే "నాగ చక్రం" అని "విష్ణు చక్రం" అని కూడ అంటారు. ఇది నత్త గుళ్ళ ని పోలి ఉంటుంది.అందువల్ల దీనిని "నత్త గుళ్ళ "స్టోన్ అని కూడ అంటారు.గోమతిచక్రాలు వెనుక భాగం ఉబ్బెత్తుగాను ముందు భాగం ప్లాట్ గాను ఉంటుంది.గోమతిచక్రం ముందుభాగం తెల్ల గాను,కొన్ని ఎర్ర గాను ఉంటాయి.తెల్ల గా ఉన్న గోమతిచక్రాలు అన్ని రకాల పూజా కార్యక్రమాలకి,సకల కార్యసిధ్ధికి,ఆరోగ్య సమస్యలకి,ధరించటానికి ఉపయోగపడతాయి.ఎర్రగా ఉన్న గోమతిచక్రాలు వశీకరణానికి,శత్రునాశనానికి,క్షుద్రప్రయోగాలకి,తాంత్రిక ప్రయోగాలకి మాత్రమే ఉపయోగించాలి.గోమతిచక్రాలలో ఆరు,తొమ్మిది సంఖ్యలు అంతర్లీనంగా దాగి ఉన్నాయి . సంఖ్యాశాస్త్రంలో ఆరు శుక్ర గ్రహానికి,తొమ్మిది కుజ గ్రహానికి చెందుతాయి.జాతకంలో కుజ శుక్రులు బలహీనంగా ఉన్నప్పుడు ప్రేమలో విఫలం  కావటం ,వివాహాం అయిన తరువాత రతికి ఆసక్తిని కనబర్చకపోవటం వంటి దోషాలు సైతం గోమతిచక్ర ధారణవల్ల నివారించబడతాయి.  https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEjkkWPGzO0sbt9tBFR6uc4j-iKzqzgmFvWpvcgRyKapn-V9Xs2eHPCezVVAtzXrN1JHMet51e3Ej36vQGywSuCoosN3eYD9k-7DLuWPJwx-9_zxYHBRodyeM6-IqcdNdZ924-RuZL75D0T7/s1600/gomati2.jpeg

పూజా విధానం:-
       గోమతి చక్రాలను సిధ్ధం చేసుకున్న తరువాత వాటిని ముందుగా గంగాజలం నీళ్ళతో గాని పసుపు నీళ్ళతో గాని కడిగి పరిశుబ్రమైన బట్టతో తుడవాలి.గోమతిచక్రాలను శ్రీయంత్రం లేదా  అష్ట లక్ష్మీ యంత్రం గాని పీటం మీద గాని ఉంచాలి.గోమతిచక్రాలను లలితా సహస్త్ర నామం జపిస్తూ కుంకుంతో గాని హానుమాన్ సింధూరంతో గాని అర్చన చేయాలి.గోమతిచక్రాల పూజ శుక్రవారం రోజు గాని దీపావళి రోజు గాని వరలక్ష్మి వ్రతం రోజు గాని చేసుకొని మనకు కావలసిన సమయాలలో వీటిని ఉపయోగించుకోవచ్చు.పూజ చేసిన గోమతిచక్రాలను పూజామందిరంలో గాని బీరువాలో గాని ఉంచి మనకు అవసరమైనప్పుడు వాటిని తీసి ఉపయోగించుకోవచ్చు. గోమతిచక్రాలను ఎప్పుడు ఎర్రని బట్టలో గాని,హనుమాన్ సింధూరంలో గాని ఉంచాలి.గోమతిచక్రాలను పిరమిడ్ లో గాని వెండి బాక్స్ లో గాని ఉంచి కొద్దిగా హనుమాన్ సింధూరం లేదా కుంకుమతో పాటు ఉంచాలి.గోమతిచక్రాలు శుక్ర గ్రహానికి ప్రతీక.
ఉపయోగాలు:-
1)ఒక్క గోమతిచక్రాన్ని త్రాగే నీళ్ళలో ఉంచి ఆ నీటిని త్రాగటం వలన మనిషిలో రోగ నిరోదక శక్తి పెరిగి అనారోగ్య సమస్యలనుండి విముక్తి కలుగుతుంది.గోమతిచక్రాన్ని లాకెట్ లాగ ధరిస్తే నరదృష్టి భాదల నుండి విముక్తి కలుగుతుంది.బాలారిష్ట దోషాలు కూడ పోతాయి .
2)రెండు గోమతిచక్రాలను బీరువాలో గాని పర్సు లో గాని ఉంచితే దనాభివృధ్ధి ఉండి ఎప్పుడు ధనానికి లోటు ఉండదు.రెండు గోమతిచక్రాలను భార్యా భర్తలు నిద్రంచే పరుపు కింద గాని దిండు కింద గాని ఉంచినట్టయితే వారిద్దరి మధ్య ఎటువంటి గొడవలు లేకుండా అన్యోన్యంగా ఉంటారు.
3)మూడు గోమతిచక్రాలను బ్రాస్ లెట్ లాగా చేసుకొని చేతికి ధరిస్తే జనాకర్షణ,కమ్యూనికేషన్,సహాకారం లభిస్తుంది.మన దగ్గర అప్పుగా తీసుకున్న డబ్బులను తిరిగి ఇవ్వని వారి పేరు గోమతిచక్రాల మీద అతని పేరు వ్రాసి నీటిలో వేయటం గాని వాటిని వెంట పెట్టుకొని డబ్బులు ఇవ్వవలసిన వ్యక్తి దగ్గరకు వెళితే అతను తీసుకున్న డబ్బులను త్వరగా ఇవ్వటానికి అవకాశం ఉంటుంది.ఈ ప్రయోగాన్ని మంగళవారం రోజు చేస్తే ప్రయోజనం కలుగుతుంది.
4)నాలుగు గోమతిచక్రాలు పంట భూమిలో పొడిచేసి గాని మాములుగా గాని చల్లటం వలన పంట బాగా పండుతుంది.గృహా నిర్మాణ సమయంలో గర్భ స్ధానం లో నాలుగు గోమతిచక్రాలు భూమిలో స్ధాపించటం వలన ఆ ఇళ్ళు త్వరితగతిన పూర్తి చేసుకొని అందులో నివసించే వారికి సకల ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలిగి ఉందురు.నాలుగు గోమతిచక్రాలను వాహానానికి కట్టటం వలన వాహాన నియంత్రణ కలిగి వాహాన ప్రమాదాలనుండి నివారించబడతారు.
5)ఐదు గోమతిచక్రాలు తరుచు గర్భస్రావం జరుగుతున్న మహిళ నడుముకు కట్టటం వలన గర్భం నిలుస్తుంది.ఐదు గోమతిచక్రాలు పిల్లలు చదుకొనే బుక్స్ దగ్గర ఉంచటం వలన చదువులో ఏకాగ్రత కలుగుతుంది.తరుచు ఆలోచనా విధానంలో మార్పులు ఉంటాయి.పుత్రప్రాప్తి కోసం 5 గోమతిచక్రాలను నది లోగాని జలాశయంలో గాని విసర్జితం చేయాలి.  
6)ఆరు గోమతిచక్రాలు అనారోగ్యం కలిగిన రోగి మంచానికి కట్టటం వలన తొందరగా ఆరోగ్యం కుదుటపడుతుంది.శత్రువులపై విజయం సాదించవచ్చును.కోర్టు గొడవలు ఉండవు.విజయం సాదించవచ్చును.
7)ఏడు గోమతిచక్రాలు ఇంటిలో ఉండటం వలన వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది.ఇతరులతో సామాజిక సంబందాలు బాగుంటాయి.7 గోమతిచక్రాలను నదిలో విసర్జితంచేసిన దంపతుల మధ్య అభిప్రాయబేదాలు మటుమాయం అవుతాయి.
8)ఎనిమిది గోమతిచక్రాలు అష్టలక్ష్మి స్వరూపంగా పూజిస్తారు.
9)తొమ్మిది గోమతిచక్రాలు ఇంటిలో ఉండటం వలన మన ఆలోచనలని ఆచరణలో పెట్టవచ్చు.ఆద్యాత్మిక చింతన కలుగుతాయి.ఆ ఇంటిలోని వ్యక్తులు గౌరవించబడతారు.
10)పది గోమతిచక్రాలు ఆఫీసులో ఉండటం వలన ఆ సంస్ధకి అమితమైన గుర్తింపు లభిస్తుంది.ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ లభిస్తాయి.మరియు వారు సమాజంలో గొప్ప పేరు ప్రఖ్యాతలతో గుర్తించబడతారు.
11)పదకొండు గోమతిచక్రాలు లాభ లక్ష్మి స్వరూపంగా పూజిస్తారు.భవన నిర్మాణసమయంలో పునాదిలో పదకొండు గోమతిచక్రాలను ఉంచటం వలన ఎటువంటి వాస్తుదోషాలు ,శల్యదోషాలు ఉండవు.
12)13 గోమతిచక్రాలను శివాలయంలో దానం చేసిన ఉద్యోగంలో ప్రమోషన్ వస్తుంది.
13)27 గోమతిచక్రాలని వ్యాపార సముదాయములలో ద్వార బందానికి కట్టి రాకపోకలు ఆద్వారం గుండా చేస్తే వ్యాపారం దినదినాభివృద్ధి అవుతుంది. 
14) జాతకచక్రంలో నాగదోషం,కాలసర్పదోషం ఉన్నవారు పంచమస్ధానంలో ఉన్న రాహువుకి పాగ్రహాల దృష్టి గాని,సాంగత్యం గాని ఉన్న సంతాన దోషం ఉంటుంది.దీనినే నాగదోషం అంటారు.జాతకచక్రంలో రాహు కేతువుల మద్య అన్నీ గ్రహాలు ఉన్నప్పుడు దానిని కాలసర్పదోషం అంటారు. ఈ రెండు దోషాలు ఉన్నవారు గోమతి చక్రాలను పూజచేయటం గాని,దానం చేయటం గాని, గోమతిచక్రాన్ని మెడలో లాకెట్ లాగా ధరించటం గాని చేయాలి.
http://astroexperts.blogspot.in/

19 Jun 2015

ఆరోగ్య భీమా ,కానుక గా ఇవ్వచ్చు

ఆరోగ్య భీమా కావలసిన వారు , నన్ను సంప్రదించ వచ్చు
 ,Vishwakarma Sitaram : 9849181081

14 Jun 2015

Infertility in middle Age- సంతాన లేమి

 ప్రస్తుత కాలంలో సంతాన లేమి అన్నది ఒక సమస్య గా మారుతోంది. గత కాలంతో పోలిస్తే ఇప్పటితరంలో ఇది ఎక్కువగా కనిపిస్తోంది. వైద్య శాస్త్రం చాలా ప్రగతి సాధించినప్పటికీ అనేక మంది దంపతులు అవగాహన లేమితో సమస్యతో బాధపడుతున్నారు. సరైన సమయంలో సరైన వైద్య సహాయం తీసుకొంటే సమస్య నుంచి బయట పడేందుకు అవకాశం ఉంటుంది..

వివాహం అనేది ఒక ధర్మ ప్రక్రియగా భారతీయులు భావిస్తారు. యుక్త వయస్సు వచ్చిన తర్వాత పెళ్లి చేసుకోవటం, సంతానాన్ని కనటం విద్యుక్త ధర్మములుగా చెబుతారు. ఇందులో మొదటిది మన చేతిలో ఉన్నప్పటికీ, రెండోది మాత్రం ఒక్కోసారి మనుషుల పరిధిలో ఉండకుండా పోతుంది. పైగా సంతానం లేకపోతే వంశం నిలిచిపోతుందన్న మాట కూడా వినిపిస్తూ ఉంటుంది. అందుచేత భారతీయ సమాజంలో సంతానాన్ని కనటం, పిల్లల్ని వ్రద్ది లోకి తీసుకొని రావటాన్ని తప్పనిసరి ప్రక్రియగా భావిస్తారు.
ఆధునిక కాలంలో రక రకాల కారణాలతో సంతాన లేమి అన్నది సమస్యగా మారింది. పెళ్లి అయ్యాక రెండు ఏళ్ల పాటు కలిసి కట్టుగా కాపురం చేసినా గర్భం దాల్చక పోవటాన్ని సంతాన లేమిగా ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదికలు చెబుతున్నాయి. యుక్త వయస్సులో ఉన్న దంపతుల్లో మూడు, నాలుగు సంవత్సరాల పాటు వేచి ఉండే ధోరణిని కూడా మనం గమనిస్తాం. అయినప్పటికీ కూడా గర్భం దాల్చకపోతే మాత్రం సంతానలేమి అన్న అనుమానం కలగక మానదు. అందుచేత సమస్యలకు దారితీస్తున్న పరిస్థితుల గురించి సమాజంలో అవగాహన అవసరం.

సంతానం కలగక పోవటానికి సాధారణంగా దంపతుల్లో ఎవరో ఒకరిలో ఇబ్బంది ఉండటాన్ని కారణంగా చెబుతారు. సాధారణంగా మూడో వంతు దంపతుల్లో మహిళల్లో లోపం ఉంటే, మరో మూడో వంతు జంటల్లో పురుషుల్లో సమస్య ఉంటుంది. మరో మూడో వంతు మందిలో మాత్రం ఇద్దరిలో సమస్య ఉండటం కానీ, ఊహించని పరిణామం చోటు చేసుకోవటం కానీ సమస్యకు దారితీస్తుంది. అటువంటప్పుడు సమస్య ఎవరిలో ఉందో ముందుగా గుర్తించాలి. తర్వాత ఆయా వ్యక్తుల్లో సమస్యను సరిదిద్దుకొని సంతానాన్ని పొందేందుకు అవకాశం ఏర్పడుతుంది.నిర్దిష్టంగా ఒక కారణంతో సంతాన లేమి ఏర్పడుతుందని చెప్పటం కష్టం. కొన్ని అంశాలు సమస్యకు దారి తీసే అవకాశం ఉంది. అంత మాత్రాన అంశాల కారణంగా పిల్లలు పుట్టరని తెగేసి చెప్పటం కూడా సరి కాదు. వివాహం అయిన తర్వాత క్రమం తప్పకుండా కాపురం చేసే జంటల్లో తొందరలోనే గర్భం దాల్చే అవకాశం ఉంటుంది. చాలా మందిలో ఒక నెల నుంచి ఆరు నెలల కాలంలో ఫలితం వస్తుంటుంది. మరి కొందరిలో ఇందుకు సంవత్సరం నుంచి రెండేళ్ల కాలం పట్టవచ్చు. రెండు సంవత్సరాలు దాటినప్పటికీ గర్భం దాల్చకపోతే మాత్రం ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది.

సాధారణంగా గర్భం దాల్చటానికి వయస్సు అనే దాన్ని ముందుగా గుర్తుచుకోవాలి. ముఖ్యంగా భారత్వంటి ఉష్ణ మండల దేశాల్లో 15,16 సంవత్సరాలకే యుక్త వయస్సు మొదలై పోతుంది. అంటే అప్పటి నుంచే సంతాన ఉత్పత్తికి తగినట్లుగా శరీరం లో సన్నాహాలు జరిగిపోతాయి. అప్పటి నుంచి 20 సంవత్సరాల నాటికి అన్ని అవయవాలు పూర్తిగా విస్తరించు కోవటం జరుగుతుంది. అప్పటి నుంచి 30 ఏళ్ల వయస్సు వరకు సమ్రద్దిగా ఉండే వయస్సు అనుకోవచ్చు. అంటే పదేళ్ల కాలం వివాహానికి, సంతానాన్ని దాల్చేందుకు చక్కటి సమయం అనుకోవచ్చు. మహిళల్లో 32-35 సంవత్సరాలు దాటిన నాటి నుంచి ఫెర్టిలిటీ రేటు తగ్గుతూ వస్తుంది. పురుషుల్లో మాత్రం ఇందుకు తగిన వయస్సు 40 ఏళ్ల దాకా చెబుతారు. 40 దాటాక సామర్థ్యం తగ్గుతూ వస్తుంది. ఆలస్యంగా వివాహం చేసుకొనే వారిలో సమస్య ఏర్పడటానికి ఇదే కారణంగా చెప్పుకోవచ్చు.పొగతాగటం, మద్యం తాగటం వంటి దురలవాట్లు కూడా దీన్ని ప్రభావితం చేస్తాయని గుర్తుంచుకోవాలి. అలవాట్లు సాధారణంగా భారత్వంటి సాంప్రదాయిక దేశాల్లో పురుషుల్లో ఎక్కువగా చూస్తు ఉంటాం. అందుచేత పురుషుల్లో సంతాన ఉత్పత్తి సామర్థ్యం తగ్గిపోవటంలో అంశాల్ని గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఎక్కువ బరువు ఉండటం లేదా స్థూలకాయం ఉండటాన్ని కూడా గమనించాల్సి ఉంటుంది. ఆధునిక కాలంలో సీటుకు అతుక్కొని పనిచేయాల్సిన ఉద్యోగాలు ఎక్కువ గా ఉంటున్నాయి.

దీంతో శారీరక వ్యాయామం బాగా తగ్గిపోతోంది. శరీర భాగాలకు మాత్రం అలసట లేని పరిస్థితి కనిపిస్తోంది. దీంతో శరీరంలో కొవ్వులు పేరుకొని పోయి అధిక బరువుకి లేదా స్థూలకాయానికి దారితీస్తోంది. ఏమాత్రం వ్యాయామం లేని జీవితం గడపటం ఎంతటి సమస్యో, విపరీతంగా వ్యాయామం చేసే వారిలో లేదా విపరీతంగా కాయకష్టం చేసే వారిలో కూడా సమస్యలు ఉంటాయని గుర్తుంచుకోవాలి.
శారీరక అంశాలు ఎంత ముఖ్యమో, మానసిక పరిస్థితి కూడా ముఖ్యమని గుర్తుంచుకోవాలి. ఎక్కువ ఆందోళన చెందేవారు, టెన్షన్తో కూడిన పనులు చేసే వారు, అధికంగా ఒత్తిడిని
ఎదుర్కొనే వారిలో సమస్యను గుర్తించవచ్చు. దీంతో పాటు పిల్లలు పుట్టకపోతే దిగులు ను చాలా మంది మనసులో పెట్టేసుకొంటారు. దీంతో సమస్య మరింత ఎక్కువ అవుతుంది. ఆందోళనతో కాపురం చేసే వారిలో సరైన కలయిక సాధ్యం కాదు. దీంతో సంతాన లేమి అనేది మరింత పెద్ద సమస్యగా దాపురిస్తుంది. సంతాన లేమి అనేది ప్రధాన మైన సమస్య అనటంలో సందేహం లేదు. అంతమాత్రాన జీవితం నిస్సారం అయిపోయిందని మాత్రం భావించకూడదు. ఆధునిక కాలంలో సంతాన లేమికి అనేక రకాల చికిత్సలు అందుబాటులోకి వచ్చాయి. వీటిని ఉపయోగించుకొని సంతానాన్ని పొందేందుకు అవకాశం ఉంది. అంతేకానీ, అదే పనిగా ఆందోళనను మనస్సులో పెట్టుకొని చికిత్సకు హాజరైనప్పటికీ ఏమాత్రం ప్రయోజనం ఉండదని గుర్తించు కోవాలి. ముఖ్యంగా భార్యా భర్తలు ఇద్దరు ప్రశాంతంగా వైద్యుల్ని సంప్రదించి తగిన చికిత్స తీసుకోవటం ముఖ్యం. లోపం ఎవరిలో ఉన్నా, ఇద్దరు పరస్పర సహకారంతో మెలిగినప్పుడు మంచి ఫలితాలు వస్తాయి.


- డాక్టర్వందన హెగ్డే, M.S.(OBG)F.R.M.,(infertility)-స్పెషలిస్టు ఇన్రిప్రొడక్టివ్మెడిసిన్‌, అబ్స్ట్రెట్రిషియన్‌ - గైనకాలజిస్టు, క్లినికల్డైరక్టర్‌, హెగ్డే హాస్పిటల్సు-విఠల్రావు నగర్‌, మాధాపూర్‌-హైదరాబాద్‌ - 81.--May 4, 2015@sury newspaper.

కల్తీలు జాగ్రత్తలు