22 Aug 2015

షుగర్ వ్యాధితో బాధపడుతున్నవారికి శుభవార్త.


షుగర్ వ్యాధిని తగ్గించుకునే సరికొత్త మార్గం మీ ముందుకు వచ్చింది. దీని కోసం డాక్టర్ల దగ్గరకు పరుగులు తీయక్కర్లేదు.. వేలాది రూపాయలు ఖర్చు పెట్టి మందులు వాడాల్సిన పని అంతకన్నా లేదు.. జస్ట్. . వారానికి నాలుగు గుడ్లు తింటే చాలు.. మధుమేహం .. మన మాట వింటుందంటున్నారు పరిశోధకులు.
6 కోట్ల 50 లక్షలు.. ఇది ఓ రాష్ట్రం జనాభా కాదు.. దేశంలో డయాబెటిస్ రోగుల సంఖ్య. మధుమేహం… ఒకప్పుడు పెద్దల్లోనే ఎక్కువగా కనిపించే ఈ సమస్య.. ఇప్పుడు పిల్లల్నీ పట్టి పీడిస్తోంది. డయాబెటిస్ బారిన పడుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. మారుతున్న ఆహారపు అలవాట్లు.. జనాన్ని డయాబెటిస్ బారిన పడేలా చేస్తున్నాయి. డయాబెటిస్ చికిత్స తీసుకోవడంతో పాటు.. ఆహారపు అలవాట్లను మార్చుకోవడం, కొన్ని రకాల యోగాసనాలు వేయడం వల్లా మధుమేహ నియంత్రణ సాధ్యమవుతుందంటున్నారు డాక్టర్లు.

డయాబెటిస్ రెండు రకాలు.. టైప్ వన్.. టైప్ టు.. ప్రపంచంలో 95 శాతం మంది టైప్ టు డయాబెటిస్ తోనే బాధపడుతున్నారు. వీరి శరీరానికి సరిపడినంత ఇన్సులిన్ ఉత్పత్తి కాకపోవడం వల్లో.. లేదంటే అధికంగా ఉత్పత్తి కావడం వల్లో.. ఈ టైప్ టు డయాబెటిస్ సోకుతుంది. దీనివల్ల గ్లూకోజ్ రక్తం నుంచి శరీరంలోని కణాలకు అందదు. ఫలితంగా రక్తంలో గ్లూకోజ్ స్థాయి పెరిగిపోతుంది.

మధుమేహం నియంత్రణకు మహామంత్రం. వారానికి నాలుగు గుడ్లు తింటే చాలు అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రియన్ లో ప్రచురితమైన ఓ పరిశోధన… వారానికి నాలుగు గుడ్లు తింటే.. మధుమేహ నియంత్రణ సాధ్యమే అంటోంది. గుడ్లలో కొలస్ట్రాల్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి.. వారానికి నాలుగు కన్నా ఎక్కువ గుడ్లు తినకూడదన్న అభిప్రాయం గతంలో ఉండేది. కానీ, అందులో ఉన్న కొవ్వు మన శరీరానికి మంచిదేనంటున్నారు పరిశోధకులు. ముఖ్యంగా టైప్ టు మధుమేహంతో బాధపడేవారు గుడ్డును తినడం వల్ల రక్తంలో గ్లూకోజ్ సమతుల్యంగా ఉంటుందని గుర్తించారు. ఈస్ట్రన్ ఫిన్ లాండ్ యూనివర్సిటీలో 2332 మందిపై 19 ఏళ్లపాటు ఈ పరిశోధన సాగింది. వారానికి ఒక గుడ్డు తిన్న వారికంటే.. నాలుగు గుడ్లు తిన్నవారిలో… 37 శాతం మందికి డయాబెటిస్ వచ్చే అవకాశాలు తక్కువగా ఉన్నట్లు ఈ రీసెర్చ్ లో తేలింది.
ప్రతి ఒక్కరూ షేర్ చెయ్యండి.

అందులకు స్మార్ట్ ఫోన్ తో ఇలా సహాయం


windows 10 Tips



ప్రోస్టేట్ గ్రంధి వాపు - క్యాన్సర్‌ వస్తోందేమో గమనిస్తుండాలి మరియు జాగ్రత్తలు

ప్రోస్టేటు గ్రంథి.. మలి వయసు పురుష లోకంలో కలవరాన్ని పెంచుతోంది! వయసులో ఉన్నంత కాలం వీర్యం ఉత్పత్తిలో ముఖ్య పాత్ర పోషించే ఈ గ్రంథి.. మలివయసుకు దగ్గరవుతున్నకొద్దీ కొద్దికొద్దిగా ఉబ్బటం ఆరంభమవుతుంది. అది సహజం! దానివల్ల మూత్రం ఆపుకోలేక పోవటం, వెళ్లినా ఇంకా లోపలే ఉండిపోతుండటం వంటి సమస్యలు మొదలవ్వటమూ అంతే సహజం. దీన్నే 'బీపీహెచ్‌' అంటారు. ఈ బాధలు, ఇబ్బందులు తప్పించి ఇదేమంత ప్రమాదకరమైంది కాదు. కానీ... కొద్దిమందిలో మాత్రం దాదాపు ఇవే లక్షణాలతో.. పూర్తిగా ఇదే తీరులో.. ప్రోస్టేటు క్యాన్సర్‌ కూడా ఆరంభం కావచ్చు! దీన్ని ఏమాత్రం నిర్లక్ష్యం చెయ్యటానికి వీల్లేదు. కాబట్టి మలివయసులో మూత్ర సమస్యలు వేధిస్తున్నప్పుడు తక్షణం వైద్యులకు చూపించుకోవటం.. అది క్యాన్సర్‌ కాదని స్పష్టంగా నిర్ధారణ చేయించుకోవటంచాలా ముఖ్యం. ఒకవేళ క్యాన్సర్‌ అయితే ఎలా ఎదుర్కోవాలన్నదీ అంతే ముఖ్యం.

పౌరుష గ్రంథి.. అస్థీల గ్రంథి.. ప్రోస్టేటు గ్రంథి.. ఇలా పేరు ఏదైనా అది పురుషులకు అత్యంత కీలకమైన గ్రంథి! మూత్రాశయం కిందే... పెద్ద ఉసిరికాయ ఆకారంలో.. మూత్ర మార్గం చుట్టూ ఆవరించి ఉండే ఈ గ్రంథి.. వీర్యం ఉత్పత్తిలో కీలకమైన పాత్ర పోషిస్తుంటుంది.సంతానానికి బీజాంకురాలుగా వృషణాల్లో ఉత్పత్తి అయ్యే శుక్రకణాలు.. ఈ ప్రోస్టేటు గ్రంథిలో తయారయ్యే స్రావాలతో కలిసే 'వీర్యం' రూపంలో బయటకు వస్తుంటాయి. ఈ గ్రంథికి అంతటి ప్రాధాన్యం ఉంది.కానీ పురుషులకు వయసు పెరుగుతున్న కొద్దీ ఇది పెద్దదిగా ఉబ్బటం.. ఫలితంగా మూత్ర విసర్జనలో రకరకాల సమస్యలు తలెత్తటంచాలా సహజ పరిణామంగా మారింది. దీన్నే 'బినైన్‌ ప్రోస్టాటిక్‌ హైపర్‌ప్లేసియా(బీపీహెచ్‌)' అంటారు. ఇది ఇబ్బంది పెట్టేదేగానీ ప్రమాదం తెచ్చిపెట్టేది కాదు. కానీ సరిగ్గా ఇదే వయసులో... ఇదే లక్షణాలతో ప్రోస్టేటు గ్రంథిలో క్యాన్సర్‌ కూడా ఆరంభం కావచ్చు. ఈక్యాన్సర్‌ పాశ్చాత్య దేశీయులతో పోలిస్తే మన ఆసియా వాసుల్లో తక్కువేగానీ.. మన దగ్గర దీనిపై సరైన చైతన్యం, దీన్ని ముందుగా గర్తించే స్క్రీనింగ్‌ పరీక్షలపై అవగాహన లేకపోవటం మూలంగా చాలామంది దీన్ని బాగా ముదిరిపోయిన తర్వాతగానీ గుర్తించలేకపోతున్నారు.అప్పటికే క్యాన్సర్‌ ప్రోస్టేటు గ్రంథిని దాటిపోయి.. ఎముకలకు ఇతరత్రా అవయవాలకు పాకిపోతోంది. ముందుగా గుర్తిస్తే దీన్ని చాలా వరకూ నయం చేసే, సమర్థంగా నియంత్రించే చికిత్సలు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. అందుకే మలివయసులో మూత్ర విసర్జనలో బాధలు ఎదురవుతున్నప్పుడు తప్పకుండా అది క్యాన్సర్‌ కాదని నిర్ధారణ చేయించుకోవటం అవసరం.


ఎవరికి ఎక్కువ: ప్రోస్టేట్‌ క్యాన్సర్‌ వృద్ధుల్లో ఎక్కువ. 40 ఏళ్ల లోపు వారిలో అరుదు. బ్యాటరీ పరిశ్రమల్లో కాడ్మియం ప్రభావానికి లోనయ్యే వారిలోనూ ఎక్కువ. ఇది ఎందుకొస్తుందో స్పష్టమైన కారణమేదీ తెలియదు. కానీ తలసరి కొవ్వు వినియోగం ఎక్కువగా ఉన్న దేశాల్లో ఇదీ ఎక్కువ. మన దేశంలో మిగతా క్యాన్సర్లతో పోలిస్తే ఇది అరుదే అయినా సంపన్న, పట్టణ వర్గాల్లో, కొవ్వు ఎక్కువగా తినే వారిలో ఎక్కువగా కనబడుతోంది.

లక్షణాలేమిటి: ప్రోస్టేట్‌ క్యాన్సరుకంటూ ప్రత్యేకమైన లక్షణాలేమీ లేవు. వయసుతో వచ్చే 'బీపీహెచ్‌' సమస్యలో ఉన్నట్టే దీనిలోనూ- తరచూ మూత్రానికి వెళ్లాల్సి రావటం, మూత్ర విసర్జన కష్టంగా ఉండటం, బొట్లుబొట్లుగా వస్తుండటం, మూత్రాన్ని ఆపులేకపోవటం వంటి లక్షణాలే ఉంటాయి. కాబట్టి ఈ లక్షణాలను వయసుతో సహజంగా వచ్చే 'బీపీహెచ్‌'వే అని కొట్టిపారెయ్యకుండా క్యాన్సర్‌ కాదని నిర్ధారించుకోవటం అవసరం. తొలిదశలోనే ప్రోస్టేట్‌ క్యాన్సర్‌ సూచనలు మనకు 'పీఎస్‌ఏ' పరీక్షలో అందుతాయి. క్యాన్సర్‌లో మరింత ఎక్కువగా పెరుగుతుంది. సమస్య నిర్ధారణలో ఈ పరీక్ష అత్యంత కీలకమైనది.

గుర్తించేదెలా: 50 ఏళ్లు దాటిన తర్వాత ప్రతి పురుషుడూ ఏటా 'పీఎస్‌ఏ' పరీక్ష చేయించుకోవటం చాలా అవసరం. ఈ 'పీఎస్‌ఏ' పెరుగుదల ఎక్కువగా ఉంటే క్యాన్సరేమోనని అనుమానించటం శ్రేయస్కరం. దీనితో పాటు వైద్యులు మలద్వారం గుండా వేలు పెట్టి.. ప్రోస్టేటు గ్రంథిని నొక్కి చూస్తారు. దీన్నే 'డిజిటల్‌ రెక్టల్‌ ఎగ్జామినేషన్‌' అంటారు. ఇలా నొక్కినప్పుడు ఈ గ్రంథి పెద్దగా అవటమేకాదు, క్యాన్సర్‌ సోకితే అది చాలా గట్టిగా కూడా తగులుతుంది. దీంతో క్యాన్సర్‌ అనుమానం బలపడుతుంది. ప్రోస్టేటు క్యాన్సర్‌ను కచ్చితంగా నిర్ధారణ చేసుకునేందుకు ప్రోస్టేటు గ్రంథి నుంచి ముక్కతీసి పరీక్షించే 'బయాప్సీ' ఒక్కటే మార్గం. అయితే దీన్ని ఎవరికి, ఎప్పుడు బయాప్సీ చెయ్యాలన్న దానిపై స్పష్టమైన మార్గదర్శకాలున్నాయి.

'పీఎస్‌ఏ' కీలకం!
'పీఎస్‌ఏ' రక్తపరీక్ష ముఖ్యంగా ప్రోస్టేటు గ్రంథి స్వభావాన్ని చెప్పే పరీక్షేగానీ.. క్యాన్సర్‌కు ప్రత్యేకించింది కాదు. కాబట్టి ఇది మనం బలంగా అనుమానించేందుకు మాత్రమే ఉపయోగపడుతుంది. 'పీఎస్‌ఏ' మోతాదు పెరిగితే క్యాన్సర్‌గా అనుమానించాలి, నిర్ధారించుకునేందుకు ఇతర పరీక్షలు చెయ్యాలి. పీఎస్‌ఏ సాధారణంగా వయసును బట్టి 0-4 నానోగ్రామ్స్‌/ఎంఎల్‌ మధ్య ఉంటుంది. వయసును బట్టి ఇది ఆ లోపు ఉంటే ఫర్వాలేదు. ఏ వయసు వారికైనా 'పీఎస్‌ఏ' 10 నానోగ్రామ్స్‌/ఎంఎల్‌ కంటే ఎక్కువుంటే తక్షణం ప్రోస్టేట్‌ క్యాన్సర్‌ ఉందేమో తెలుసుకునేందుకు గ్రంథి నుంచి ముక్క తీసి (బయాప్సీ) పరీక్ష చేయాలి. ఒకవేళ పీఎస్‌ఏ 4-10 మధ్య ఉంటే అప్పుడు బయాప్సీ అవసరమా? కాదా? అన్నది నిర్ధారించటం కీలకం. అందుకు పీఎస్‌ఏ డెన్సిటీ, పీఎస్‌ఏ వెలాసిటీ, ఫ్రీ పీఎస్‌ఏ.. వంటి ఇతర పరీక్షలు మనకు కీలక సమాచారాన్నిఅందిస్తాయి. వాటన్నింటి ఆధారంగా బయాప్సీ అవసరమా? కాదా? అన్నది నిర్ధారించాల్సి ఉంటుంది. వాటి గురించి వివరంగా..

వయసు: పీఎస్‌ఏ స్థాయి ఎంత ఉండొచ్చన్న దానికి వయసు ప్రాతిపదిక. వయసు పెరుగుతున్న కొద్దీ ఇది కూడా పెరుగుతుంటుంది. ఉదాహరణకు 40-49 ఏళ్ల వారిలో 0-2.5 ఉంటే నార్మల్‌. అంటే 45 ఏళ్ల వ్యక్తికి పీఎస్‌ఏ 4 ఉంటే ప్రమాదం పొంచి ఉన్నట్టు అర్థం. అదే 75 ఏళ్ల వ్యక్తికి 6.5 ఉన్నా కూడా దాన్ని మరీ తీవ్రంగా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎవరికి బయాప్సీ అవసరమన్నది నిర్ధారించటంలో ఇది ఒక కీలకాంశం.

పీఎస్‌ఏ డెన్సిటీ: వయసుతో పాటే ప్రోస్టేట్‌ గ్రంథి సైజూ పెరుగుతుంది. కాబట్టి రక్తంలో పీఎస్‌ఏ స్థాయి కూడా పెరుగుతుంది. కాబట్టి రక్తంలో పీఎస్‌ఏ స్థాయి... ప్రోస్టేట్‌ గ్రంథి సైజుకు అనుగుణంగానే పెరిగిందా? ఇంకా ఎక్కువగా పెరిగిందా? అన్నది తెలుసుకోవటం దీని ఉద్దేశం.

పీఎస్‌ఏ వెలాసిటీ:
ఇది కొంత క్లిష్టమైన లెక్క. ఏడాదికి ఒకసారి పీఎస్‌ఏ చెయ్యాలి. కాలక్రమేణా అది ఏ రేటులో పెరుగుతోందన్నది లెక్కించాలి. ఇది కూడా ముఖ్యమే

ఫ్రీ పీఎస్‌ఏ: ప్రోస్టేట్‌ క్యాన్సర్‌ ఉంటే.. 'టోటల్‌ పీఎస్‌ఏ' ఎక్కువుంటుంది.. కానీ దానిలో 'ఫ్రీ పీఎస్‌ఏ' అన్నది తగ్గుతుంటుంది. దీన్ని బట్టి కూడా అనుమానించటం అవసరం. వీటన్నింటి ఆధారంగా బయాప్సీ అవసరమా? కాదా? అన్నది వైద్యులు నిర్ధారిస్తారు.
*
ప్రోస్టేట్‌ గ్రంథి వాపులో, సిస్టోస్కోపీ తర్వాత, ప్రోస్టేట్‌ గ్రంథి బయాప్సీ తర్వాత ఆరు వారాల వరకూ కూడా పీఎస్‌ఏ స్థాయి పెరిగే ఉంటుంది, ఆ విషయాన్ని మర్చిపోకూడదు. కాబట్టి పీఎస్‌ఏ పెరిగిందంటే ఇవన్నీ చూడటం అవసరం.
* అలాగే క్యాన్సర్‌ బాధితుల్లో ఓ 10% శాతం మందిలో పీఎస్‌ఏ మోతాదు పెరగకుండానూ ఉండొచ్చు. కానీ వీరిలో లక్షణాలుంటాయి. కాబట్టి లక్షణాలు బలంగా, తీవ్రంగా ఉన్నప్పుడు బయాప్సీకి వెళ్లటం ఉత్తమం.


ఇతర పరీక్షలు
బయాప్సీలో క్యాన్సర్‌ ఉందని నిర్ధారణ అయితే.. వెంటనే ఆ క్యాన్సర్‌ ఏ స్టేజ్‌లో ఉన్నదీ తెలుసుకునేందుకు సీటీ స్కాన్‌/ఎమ్మారై బాగా ఉపయోగపడతాయి. కణితి ఎక్కడుంది? అది గ్రంథిని దాటి బయటకు వెళ్లిందా? శుక్రాశయాలకు (సెమినల్‌ వెసికిల్స్‌) కూడా పాకిందా? వంటివన్నీ సీటీ స్కానింగులో తెలుస్తాయి.
* స్పష్టమైన కారణమేంటో తెలియదుగానీ ప్రోస్టేట్‌ క్యాన్సర్‌ ప్రధానంగా ఎముకలకు వ్యాపిస్తుంటుంది. కాబట్టి వీరికి 'బోన్‌ స్కాన్‌' కూడా అవసరం. బోన్‌ స్కాన్‌లో క్యాన్సర్‌ ఆనవాళ్లు కనబడుతున్నాయంటే వ్యాధి బాగా ముదిరిన దశకు వెళ్లిందనే అర్థం.


గ్లీసన్స్‌ స్కోర్‌
ప్రోస్టేట్‌ క్యాన్సర్‌ స్వభావం ఎలా ఉందన్నది తెలుసుకునేందుకు ఉపయోగపడేదే ఈ అంచనా స్కోరు. బయాప్సీ పరీక్షలో క్యాన్సర్‌ కణాల రూపురేఖలను బట్టి ఈ గ్లీసన్‌ స్కోరు నిర్ధారిస్తారు. దీన్ని 2-4, 5-6, 7-10గా విభజిస్తారు. ఈ స్కోరు 2-4 ఉంటే క్యాన్సర్‌ తీరు చాలా నిదానంగా ఉందని (లోగ్రేడ్‌) అర్థం. దీంతో మరణించే అవకాశం 10 శాతం కన్నా తక్కువ. ఇదేమంత త్వరగా ఇతర భాగాలు వ్యాపించదు. కాబట్టి చికిత్స తీసుకుంటే దీనితో పెద్ద ఇబ్బంది లేకుండా జీవితం గడిపెయ్యచ్చు. ఇక స్కోరు 5-6 ఉంటే ఇది మధ్యస్థ రకం. దీనితో ప్రాణాలకు ప్రమాదం ఉండొచ్చు. ఇక స్కోరు 7-10 ఉంటే అది ఉధ్ధృత రకం. ఇది ప్రాణాంతకమైంది. వేగంగా లింఫ్‌గ్రంథులకు, ఎముకలకు వ్యాపించే రకం ఇది.
హార్మోన్ల చికిత్స కీలకం!
మన శరీరంలో పురుష హార్మోన్లను వృషణాలు ఉత్పత్తి చేస్తాయి, మూత్రపిండాల మీద ఉండే ఎడ్రినల్‌ గ్రంథులూ ఉత్పత్తి చేస్తాయి. రెంటినీ అడ్డుకోవటం అవసరం. మనం వృషణాలను తీసివెయ్యటం లేదా 'ఎల్‌హెచ్‌ఆర్‌హెచ్‌ అనలాగ్స్‌' ఇంజక్షన్లు ఇవ్వటం ద్వారా వృషణాల నుంచి వచ్చే హార్మోన్లను అడ్డుకోవచ్చు. కానీ అడ్రినల్‌ గ్రంథుల నుంచి వచ్చే వాటిని మాత్రం వీటితో అడ్డుకోలేం. దానికోసం సిప్రోటిరాన్‌ ఎసిటేట్‌, లేదా ఫ్లూటమేట్‌ వంటి యాంటీ యాండ్రోజెన్‌ రకం మందులు (యాండ్రోబ్లాక్‌ మొ||) ఇవ్వాల్సి ఉంటుంది. ఈ రెంటినీ ఇవ్వటాన్నే 'టోటల్‌ యాండ్రోజెన్‌ బ్లాకేడ్‌' అంటారు. ఇది 1980ల నుంచీ బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. కాబట్టి కేవలం వృషణాలు తీసెయ్యటం లేదా ఎల్‌హెచ్‌ఆర్‌హెచ్‌ అనలాగ్‌ ఇంజెక్షన్లు చెయ్యటమే కాకుండా.. ఈ 'యాంటీ యాండ్రోజెన్‌' మందులూ ఇవ్వటం అవసరం. ముఖ్యంగా- ఎల్‌హెచ్‌ఆర్‌హెచ్‌ ఇంజక్షన్లు ఇచ్చిన తర్వాత తొలి రెండు వారాల్లో అవి టెస్టోస్టిరాన్‌ ఉత్పత్తిని ప్రేరేపిస్తాయి, ఆ తర్వాత అడ్డుకుంటాయి. ముందు 14 రోజుల పాటు 'యాంటీ యాండ్రోజెన్‌' బిళ్లలు ఇచ్చి.. ఆ తర్వాత ఎల్‌హెచ్‌ఆర్‌హెచ్‌ ఇంజక్షన్‌ ఇవ్వటం ఉత్తమం. ఒకవేళ ఇంజక్షన్లు కాకుండా వృషణాలు తీసివేసే ఆపరేషన్‌ చేయించుకోవాలనుకుంటే నేరుగా, ఎప్పుడైనా దానికి వెళ్లొచ్చు. ఇదీ ఇప్పుడు ప్రామాణిక చికిత్స.
నివారించుకోలేమా?
ప్రోస్టేటు క్యాన్సర్‌ను నివారించుకోవటానికి కచ్చితమైన మార్గమేం లేదు. చిన్నతనం నుంచీ కొవ్వు తక్కువ తినటం మంచి అలవాటు. శాకాహారం, కూరగాయలు, పండ్లు ఎక్కువగా తినటం ఉత్తమం. 50 ఏళ్ల నుంచీ ఏటా తప్పనిసరిగా 'పీఎస్‌ఏ' రక్త పరీక్ష చేయించుకుంటూ ఉండాలి.
చికిత్స ఏమిటి?
మొత్తానికి మూడు రకాలు: 1. తొలిదశ క్యాన్సర్‌. (ఎర్లీ) 2. గ్రంథిలోనే బాగా ముదిరిన రకం (లోకల్లీ అడ్వాన్స్‌డ్‌) గ్రంథి చుట్టూ, పక్కనే ఉండే శుక్రాశయాలకు పాకి ఉంటుంది. 3. గ్రంథి నుంచి బయటకు పాకి.. లింఫ్‌గ్రంథులు, ఎముకల వంటి ఇతరత్రా అవయవాలకు వ్యాపించిన రకం (మెటాస్టాటిక్‌)

1. తొలి దశ క్యాన్సర్‌
* క్యాన్సర్‌ ఇంకా గ్రంథిలోనే ఉంది కాబట్టి సర్జరీ చేసి గ్రంథి మొత్తాన్ని తొలగించటం (ర్యాడికల్‌ ప్రోస్టెటెక్టమీ) ఒక విధానం. లేదంటే రేడియేషన్‌ థెరపీ అయినా ఇవ్వచ్చు.

* గ్రంథిని, దానికి ఆనుకుని ఉన్న కణజాలాన్ని, లింఫ్‌గ్రంథులను పూర్తిగా తొలగించేందుకు కోతబెట్టి చేసే పద్ధతి లేదంటే కేవలం రంధ్రాలతోనే చేసే ల్యాప్రోస్కోపీ విధానాలను అనుసరించవచ్చు. కోతబెట్టి చేసే సర్జరీలతో కొన్ని దుష్ప్రభావాలు తలెత్తే అవకాశం ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఎక్కువగా ల్యాప్రోస్కోపిక్‌ విధానాన్నే అనుసరిస్తున్నారు. పీఎస్‌ఏ 10 కంటే తక్కువ, గ్లీసన్‌ స్కోరు 6 కంటే తక్కువ ఉన్న వారికి సర్జరీతో మంచి ప్రయోజనం ఉంటుందని గుర్తించారు.

* సర్జరీతో... మొత్తమ్మీద ర్యాడికల్‌ ప్రోస్టెటెక్టమీ సర్జరీ వల్ల వచ్చే దుష్ప్రభావాల్లో ప్రధానంగా చెప్పుకోవాల్సింది- 4% మందిలో మూత్రం ఆపుకోలేని సమస్య; 30% మందిలో దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు పొట్టలో ఒత్తిడి పెరిగినప్పుడు మూత్రం లీకవ్వటం, 4% మందిలో మూత్రమార్గం సన్నబడటం (స్ట్రిక్చర్స్‌), కొందరిలో అంగ స్తంభన సమస్యల వంటివి తలెత్తుతాయని గుర్తించారు. నాడులు ప్రభావితం కాకుండా చేసే సర్జరీ కూడా ఉంది. దానితో ఈ స్తంభన వంటి ఇబ్బందులేమీ లేకుండా చేసే వీలుంది. దీన్ని రోబో సహాయంతో చేసినప్పుడు దుష్ప్రభావాలు మరింత తక్కువగా ఉంటున్నాయి.


* రేడియేషన్‌తో.. ఇటీవలి కాలంలో ఇమేజ్‌ గైడెడ్‌ రేడియో థెరపీ(ఐజీఆర్‌టీ), ఇంటెన్సిటీ మాడ్యులేటెడ్‌ రేడియో థెరపీ(ఐఎంఆర్‌టీ) వంటి వాటితో అధిక డోసుల్లో రేడియేషన్‌ను ఇవ్వటం సాధ్యపడుతోంది కాబట్టి.. ఇప్పుడు రేడియేషన్‌ థెరపీతో కూడా సర్జరీతో సరిసమానమైన ఫలితాలే ఉంటున్నాయి. అయితే రేడియేషన్‌ వల్ల- తరచుగా మూత్రానికి వెళ్లాల్సి రావటం, విసర్జలో మంట, పొత్తికడుపులో వాపు, వృషణాల తిత్తి వాపు వంటివి 20% వరకూ ఉంటున్నాయి. స్తంభన 40% మందిలో ఉంటుంది. పెద్దపేగు ప్రోస్టేటు గ్రంథి వెనకే ఉంటుంది కాబట్టి 5% మందిలో మలాశయం, మూత్రాశయం కూడా రేడిషన్‌ ప్రభావానికి గురవుతుంటాయి. ఈ దుష్ప్రభావాలను దృష్టిలో ఉంచుకుని- ఇప్పుడు తొలిదశ క్యాన్సర్‌కు.. సర్జరీని తట్టుకునే ఆరోగ్యం, శక్తి ఉంటే ఏ వయసులోనైనా సర్జరీ చేయించుకోవచ్చు. లేదంటే రేడియేషన్‌ ఇవ్వచ్చు.

2. గ్రంథిలోనే ముదిరిన రకానికి..
* క్యాన్సర్‌ దశ, గ్లీసన్‌ స్కోరు, రోగి ఆరోగ్య స్థితిని బట్టి- వీరికి ముందుగా శరీరంలో హార్మోన్లను అడ్డుకునే చికిత్స చెయ్యటం, ఆ తర్వాత గ్రంథిని సమూలంగా తొలగించే ర్యాడికల్‌ సర్జరీ లేదా రేడియేషన్‌ అవసరమవుతుంది. తర్వాత కూడా పీఎస్‌ఏ తీరును గమనిస్తుండాలి.

* హార్మోన్ల చికిత్స: ప్రోస్టేటు క్యాన్సర్‌ కణాలకు శరీరంలో తయారయ్యే హార్మోన్లే ప్రేరకాల వంటివి. కాబట్టి హార్మోన్లను అడ్డుకోవటం ముఖ్యం. ఈ హార్మోన్లు వృషణాల్లో తయారవుతాయి. అలాగే మూత్రపిండాలపైన ఉండే అడ్రినల్‌ గ్రంథుల్లోనూ తయారవుతాయి. వీటిని అడ్డుకోవటం ద్వారా క్యాన్సర్‌ను నిలువరించవచ్చు. వీరికి వృషణాల నుంచి వచ్చే హార్మోన్లను నిరోధించే 'ఎల్‌హెచ్‌ఆర్‌హెచ్‌ అనలాగ్‌' ఇంజెక్షన్లు ఇవ్వచ్చు. లేదా సర్జరీ చేసి రెండు వృషణాలనూ తొలగించవచ్చు. ఈ రెంటిలో ఏదైనా ఒకటి చేస్తే చాలు. కాకపోతే ఆ ఇంజెక్షన్లు ఖరీదైనవి, వాటిని ప్రతి 3 నెలలకు ఒకసారి జీవితాంతం చేయించుకోవాల్సి ఉంటుంది కాబట్టి దీనికంటే ఒక్కసారే వృషణాలు తీసివేసే సర్జరీ తేలిక.


* హార్మోన్లను అడ్డుకునే చికిత్స చేసిన తర్వాత.. ప్రోస్టేటు గ్రంథిని తొలగించే సర్జరీ, దానికి వీల్లేకపోతే రేడియేషన్‌ ఇవ్వాల్సి ఉంటుంది. కొన్నిసార్లు క్యాన్సర్‌ మరికాస్త చుట్టుపక్కలకు కూడా పాకిందనిపిస్తే సర్జరీ తర్వాత రేడియేషన్‌ కూడా ఇస్తారు.

* హార్మోన్లను అడ్డుకునే చికిత్స చెయ్యగానే పీఎస్‌ఏ తగ్గిపోతుంది. కానీ తర్వాత కూడా ఆ పరీక్ష చేయించుకుంటూ ఉండాలి. పీఎస్‌ఏ పెరుగుతుంటే సమస్య ఊపిరితిత్తుల్లో, ఎముకల్లో మరెక్కడన్నా వస్తోందేమో చూసుకోవాలి.

3.ఇతర అవయవాలకూ పాకితే..
దురదృష్టవశాత్తూ మన దేశంలో 90% మంది ఈ దశలోనే గుర్తిస్తున్నారు. ఇది బాగా ముదిరిన దశ. కేవలం హార్మోన్లను నిరోధించే ఇంజెక్షన్లు లేదా వృషణాలను తీసివేసే సర్జరీ ఒక్కటే మార్గం. ఈ దశలో ఇరత్రా మార్గాలతో ప్రయోజనం ఉండదు. అయితే ఈ హార్మోన్ల ప్రభావం ఎవరికైనా 12-24 నెలల పాటు మాత్రమే పని చేస్తుంది. ఆ తర్వాత క్యాన్సర్‌ కణాలు ఈ హార్మోన్లకు నిరోధకత పెంచుకుంటాయి. ఆ దశలో రకరకాల కీమోథెరపీ మందులు ప్రయత్నించాల్సి ఉంటుంది.

* ప్రోస్టేటు క్యాన్సర్‌ ఎముకలకు వ్యాపించిన వారందరికీ కూడా 'బిస్ఫాస్ఫనేట్స్‌' రకం మందులు ఇవ్వాలి. దీనివల్ల ఎముకల నొప్పి తగ్గి అవి దృఢతరమవుతాయి. చాలామందికి నడుము కింది వెన్నుపూసలు, పొత్తికడుపు ఎముకలు ప్రభావితమవుతాయి. అవసరమైతే ఆ ప్రభావితమైన ఎముకలకు రేడియేషన్‌ కూడా ఇవ్వాల్సి ఉంటుంది.
చికిత్స తర్వాత..?
క్యాన్సర్‌ ఎంత ముదిరింది, ఏ స్టేజిలో ఉంది, గ్లీసన్‌ స్కోరు ఎంత ఉందన్న దాన్ని బట్టి ఫలితాలుంటాయి. పీఎస్‌ఏ రెట్టింపు కావటానికి ఎంతకాలం పడుతుందన్నది కీలకమైన అంశం. దీన్నే 'పీఎస్‌ఏ డబ్లింగ్‌ టైమ్‌' అంటారు. త్వరగా రెట్టింపు అయితే.. దానర్థం క్యాన్సర్‌ బాగా ఉగ్రంగా ఉందని.

డా|| మోహన వంశీ- చీఫ్‌ సర్జికల్‌ ఆంకాలజిస్ట్‌- ఒమేగా హాస్పిటల్స్‌- హైదరాబాద్‌( సుఖీభవ)

తేనే - దాల్చిన చెక్క వల్ల తగ్గు వ్యాధులు


జబ్బు తగ్గించే విధానం


1.కీళ్ళవాపు
రెండింతల గోరు వెచ్చని  నీటికి ఒక వంతు తేనెను కలిపి దానికి ఒక టేబుల్ స్పూన్ దాల్చిన చక్క చుర్నాన్ని కలిపి పేస్టు ల చేసుకొనవలెను. దినిని దురద ఉన్న చోట నెమ్మదిగా బాగా మర్దన చేస్తే 2 లేక 3 నిమిషాలలో ఫలితం చూడవచ్చు


లేక కీళ్ళవాపు ఉన్నవారు ప్రతిరోజు ఒక కప్ వేడి నీటి లో రెండు చంచాల తేనెను ఒక చెంచ దలచిన చక్క చుర్నాన్ని ఉదయం రాత్రి వేళలలో క్రమం తప్పకుండ తీసుకుంటే క్రోనిక్ కీళ్ళవాపు కూడా తగ్గించ వచ్చు


ఇటివల కాలంలో కోపెన్హగెన్ విశ్వ విద్యాలయం  లో 200 మంది కీళ్ళ  వాపుతో బాధ పడుతున్న వారికీ ప్రతి రోజు ఉదయం ఒక చంచ తేనె అర చంచ ధల్చినచాక్క పౌడర్ ని ఇచ్చి అధ్యయనం చేయగా అందులో ౭౩ మందికి ఒక నెలలో నే పూర్తిగా తగ్గిపోవటం విశేషం . మరికొంతమంది లేవలేని స్థితి నుండి నొప్పిలేకుండా నడిచే స్థితికి వచ్చారు. ఇది తేనె యొక్క విశిష్టత


2.జుట్టు ఉడటం :
ఎవరైతే వెంట్రుకలు ఉడిపోవడం బట్టతల వంటి వంటి వాటితో బాధ పడుతున్నారో వారు వేడి ఆలివ్ నునే ఒక చంచ తేనె ఒక చంచ దాల్చిన చక్క ని ముద్దగా  చేసుకొని స్నానానికి ముందు తలకు ౧౫ నిమిషాల వరకు పట్టిస్తే చక్కని ఫలితం కనిపిస్తుంది

3.మూత్రాశయ ఇన్ఫెక్షన్ :
రెండు చంచల దాల్చిన చక్క  చుర్నాన్ని ఒక చంచ తేనె ఒక గ్లాస్ గోరువేచని నీటితో కలిపి తాగితే మూత్రాశయం లోని క్రిములు చనిపోతాయి

4.పంటి పోటు:

ఒక చంచ దాల్చినచక్క 5 చంచల తేనెను ముధగా చేసి పెట్టుకొని రోజుకు మూడు సార్లు నొప్పి ఉన్న ప్రదేశం లో ఉంచితే పంటి నొప్పి తగ్గుతుంది

4.కొలెస్ట్రాల్
రెండు చంచల తేనె మూడు టేబుల్ స్పూన్స్ దాల్చిన చక్క చుర్నాన్ని 500 గ్రాముల తేనీటిని కలిపి కొలెస్ట్రాల్ ఉన్న వారికీ ఇచ్చిన 2 గంటలలో 10 % కొలెస్ట్రాల్ తగ్గుతుంది 
కీళ్ళ నొప్పులకి చెప్పిన విధంగా రోజుకు మూడు సార్లు తీసుకుంటే క్రోనిక్ కోలేస్త్రోల్ కూడా తగ్గుతుంది. ఒక పత్రికలో ఇచిన విధంగా రోజు స్వచ్చమైన తేనెను ఆహారంతో తీసుకుంటే కోలేస్త్రోల్ బాధితులు తగ్గుతారు 


5.జలుబు :

గోరు వెచ్చని   ఒక స్పూన్  తేనెను కలిపి దానికి పావు  స్పూన్ దాల్చిన చక్క చుర్నాన్ని కలిపి రోజుకు మూడు సార్లు తీసుకుంటే జలుబు, ముక్కుదిబ్బడ, దగ్గు నుండి ఉపశమనం పొంద వచ్చు 

6.వ్య్నధ్యత్వం (పిల్లలు పుట్టని ):
పురుషుని వీర్యం బలపడేందుకు ప్రతిరోజు రెండు స్పూన్ల తేనెను పడుకునే ముందు తిసుకోనవలెను. అలా చేసినచో ఫలితము కనిపించును
చైనా, జపాన్ తూర్పు దేశాల వారు ఎవరైతే గర్భం రాలేదో వారు దశాబ్దాల నుండి దాల్చిన చక్క పౌడర్ ని తీసుకుంటున్నారు.


7.కడుపు ఉబ్బరం
తేనెను దాల్చిన చెక్క పౌడర్ తో తీసుకుంటే కడుపునొప్పి, కడుపు  లో మంట బారి నుండి తప్పించుకోవాచు

8.గ్యాస్ (వాయువు)
ఇండియా, జపాన్ లలో జరిగిన అధ్యయనాల ఆధారంగా తేనెను దళ్చ్జిన చెక్కను కలిపి తీసుకుంటే గ్యాస్ నుండి విముక్తి పొందవచ్చు

9.గుండె సంబంధిత వ్యాధులు :

తేనెను దాల్చిన చక్కను  కలిపి ముద్దగా  చేసుకొని బ్రెడ్ మరియు చపాతీ ల లో జాం బదులుగా  పెట్ట్టుకొని ప్రతి రోజు ఉదయం తింటే అది కోలేస్త్రోల్ ని తగ్గించి గుండె పోటు బారి నుండి రక్షిస్తుంది ఒక వేల గుండె పోటు ఒక సరి వచ్చి ఉన్న వారికీ మరల రాకుండా ఉపయోగ పడుతుంది
అమెరికా మరియు కెనడా ల లో ఈ విధముగా చేసి సత్ఫలితాలను పొందారు దిని వలన శ్వాస గుండె చప్పుడు బలపడుతాయీ .
 మరియు నూతన ఉత్తేజం  వస్తుంది 


10.రోగనిరోధక వ్యవస్థ
ప్రతి రోజు తేనె ధల్చినచాక్క తీసుకొని రోగ నిరోధక శక్తిని పెంచుతుంది  మరియు బ్యాక్టీరియా నుండి కాపాడుతుంది
తేనేన్లో అనేకమైన విటమిన్స్ ఐరన్ కలిగి ఉన్నాయ్ అని శాస్త్రజ్ఞులు నిర్ధారించారు. తేనెను తరచుగా వాడడం వలన తెల్ల రక్త కణాలు వృద్ధి చెంది బ్యాక్టీరియా తో పోరాడుతాయీ  


11.అజీర్ణం
దాల్చిన చక్క పౌడర్ ని రెండు చంచల తేనెతో కలిపి తీసుకుంటే  అది అజీర్ణం కడుపులో మంట ని తగ్గిస్తుంది.


12.విష జ్వరం
స్పైన్ లోని ఒక శాస్త్రజ్ఞుడు తేనెలో ప్రకృతి సిద్ధమైన పోషకాలు ఉంటై అని అవి జ్వరం ని పుట్టించే బ్యాక్టీరియ ని నివారించి జ్వరం రాకుండా కాపాడుతుంది అని నిర్ధారించాడు

13.దీర్గాయువు
ప్రతి రోజు మనం చేసుకునే తేనీరు ని తేనె మరియు ధల్చినచాక్క చూర్ణం తో చేసుకుంటే యవ్వనం గ కనిపిస్తారు. అది ముసలితనాన్ని బంధిస్తుంది.
తాయారు చేయు విధానం
4 స్పూన్స్ తేనె ఒక స్పూన్ దాల్చిన చక్క చూర్ణం, మూడు కప్పుల నీరూ వీటిని కలిపి వేడి చేసి టీ లాగా చేసుకోవలెను
దినిని పావు కప్పు రోజుకి ౪ సార్లు తాగితే వృద్ధాప్యం త్వరగా రాకుండా కాపాడుకోవచ్చు. 100 సంవత్సరాల మనిషి కూడా చలాకి గా తిరుగుతాడు

14.మొటిమలు
మూడు స్పూన్ల తేనె ఒక స్పూన్ దాల్చిన చక్క పౌడర్ ముధగా చేసుకొని మొటిమల పై పాడుకొనే ముందు మర్దన చేసి మరుసటి రోజు వెచ్చని నీటితో కడగా వలెను ఇలా క్రమం తప్పకుండ రెండు వారలు చేస్తే మొటిమలు రాకుండా పోతాయి


15.చర్మ వ్యాధులు :
తేనెను దాల్చిన చక్క చుర్నాన్ని సమపాలల్లో కలిపి బాధ ఉన్న చోట   
మర్దన చేస్తే  దురద, తమర ఇతర చర్మ విధులు పోతాయి


16.బరువు తగ్గుట:
ప్రతిరోజు ప్రొద్దున ఉదయం తినడానికి ముందు మరియు పాడుకోడానికి ముందు కాళి కడుపుతో ఉండి. తేనె దాల్చిన చక్క చుర్నాన్ని ఒక కప్ వేడి నీటితో కలిపి ప్రతి రోజు తాగితే  బరువు ని తగించడమే కాకుండా. తిన్న పదార్ధాలను జీర్ణం చేస్తుంది

17.కాన్సెర్ :
ఇటివల జరిగిన జపాన్ మరియు ఆస్ట్రేలియా జరిపిన పరిశోధన లో ఉద్రిక్త సతి లో ఉన్నటువంటి పొట్ట కాన్సెర్ మరియు బొక్కల కాన్సెర్ ని విజయ వంతముగా నివారించారు . ఈ వ్యాధులతో బాదపడుతున్నవారు ఒక చెంచాడు తేనె ఒక చెంచాడు దాల్చినచెక్క పౌడర్ నెల రోజుల వరకు రోజుకు మూడు సార్లు సేవించ వలెను.
ఇలా చేసిన ఫలితం కనబడును 

18.అలసట
తేనేలోని షుగర్ వలన మనిషికి  నష్టం కలగకుండా చల్ ఉపయోగ పడుతుంది వృద్ధాప్యం లో ఉన్నవారు తేనెను దాల్చిన చక్కను సమ పాళ్ళలో తీసుకుంటే అలసట ఉండదు హుషారుగా ఉంటారు.
DR మిల్టన్ చేసిన పరిశోధన ఆధారంగా అర స్పూన్ తేనె ఒక గ్లాస్ లో తీసుకొని ఒక గ్లాస్ నీరూ పోసి దానిలో ధల్చినచాక్క వేసి తిప్పి ప్రతి రోజు మొహం కడుక్కోగానే మరియు సాయంకాలం మూడు గంటలకు తీసుకుంటే  అలసట తగ్గిపోతుంది ఉత్సాహం పెరుగుతుంది 


19.శ్వాస దుర్వాసన :
దక్షిణ అమెరిక ప్రాంత వాసులు ప్రొద్దునే తేనె దాల్చిన చక్క వేడినీటిలో వేసి పుక్కిలించటం వలన వారి శ్వాస దుర్వాసన రాకుండా ఉంటుంది

20.సరనులు & తలనొప్పి :
తేనె మరియు నిమ్మరసం కలిపి తాగితే తల నొప్పి మరియు సరసులు తగ్గుతాయి

స్కూల్ నించి వచ్చిన పిల్లలతో తల్లితండ్రులు ఎలవుండాలి


మూత్రపిండాలకు మేలు చేసే కాయగూరలు



పళ్ళ మొక్కలని ఇంటిలోనే పెంచుకోటము ఎలా


చిన్న పిల్లలకు పెట్టే ఆహరం , జాగ్రత్తలు


పిల్లలకు అన్నం తినిపించడమంటే...


పే...ద్ద పని. చందమామను చూపుతూ తినిపిస్తే వెంటనే తినేయడానికి ఇప్పటి పిల్లలు అమాయకులు కాదు. తినడం ఎలా ఎగ్గొట్టాలో వాళ్లకు బాగా తెలుసు. ఇంట్లో పనులన్నీ చేసుకోవడం ఓ ఎత్తై అల్లరి పిల్లలకు అన్నం తినిపించడం మరో ఎత్తు. ఏదో టైమ్‌కు తినిపించాలి కాబట్టి బలవంతంగా పిల్లల నోట్లో పెట్టేస్తుంటాం. కానీ ఎలాంటి ఆహారం పిల్లలు ఇష్టంగా తింటారు? పిల్లలు ఆరోగ్యంగా ఉండాలంటే ఏయే ఆహారం ఎంత మోతాదులో ఇవ్వాలి? నిపుణుల సూచనలు మీకోసం.

ఎదిగే పిల్లలకు సంపూర్ణ సమతుల ఆహారం తప్పనిసరి. అందుకే కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, కొవ్వు, విటమిన్స్, మినరల్స్, నీరు ఇలా అన్నీ తగిన మోతాదులో కలిపిన పౌష్టికాహారం ఇవ్వాలి.
రైస్, బ్రెడ్, చపాతీ, ఇడ్లీ లాంటివి తినిపించాలి. తప్పనిసరిగా పండ్లు, తాజా కూరగాయలు ఉండేలా చూసుకోవాలి. ఇక పప్పు ధాన్యాలు, మాంసం కూడా పెట్టాలి. పాలు, పాల ఉత్పత్తులు ఎక్కువగా ఇవ్వాలి. మినరల్స్‌తో కూడాని కొవ్వు పదార్థాలు, స్వీట్స్ తినిపించాలి. రోజుకు 6 నుంచి 8 గ్లాసుల నీళ్లను తప్పనిసరిగా తాగించాలి. ఇవన్నీ తగిన మోతాదుల్లో తీసుకోవడంవల్ల పిల్లలలో ఎదుగుదల బాగుంటుంది.

కార్బొహైడ్రేట్స్ :
పిల్లలకు ఇచ్చే ఆహారంలో కార్బొహైడ్రేట్స్‌ది ప్రధాన పాత్ర. అయితే ఆ కార్బొహైడ్రేట్స్ ఏ రూపంలో ఇస్తున్నామనేది ముఖ్యం. తీయని పండ్ల రసాలు, చాక్లెట్స్, బ్రేక్‌ఫాస్ట్‌లో ప్రాసెస్‌డ్ ఫుడ్స్, గోధుమలతో తయారు చేసిన బ్రెడ్, ఎక్కువగా పాలిష్ చేయని బియ్యంలాంటి వాటిలో కార్బొహైడ్రేట్స్ పుష్కలంగా లభిస్తాయి.

ప్రొటీన్స్ :
గుడ్లు, పాలు, వెన్న, చికెన్, చేపలు, మాంసం, పప్పు ధాన్యాలలో ప్రోటీన్స్ అధికంగా ఉంటాయి. పిల్లల ఆహారంలో ఇవి కచ్చితంగా ఉండేలా చూసుకోవాలి.

ఫ్యాట్
పిల్లలకు తప్పనిసరిగా ఇవ్వాల్సిన ఆహారంలో కొవ్వు కూడా ముఖ్యం. కొవ్వులో ఒమెగా-3, ఒమెగా-6 ప్రధానం. టునా, సాల్మన్ చేపలు, నువ్వులు, వేరుశనగ, కాజూ, బాదంలలో ఒమెగా -3 ఎక్కువగా దొరుకుతుంది. వెన్నపండు, పొద్దుతిరుగుడు గింజలు, మొక్కజొన్న, బాదంలో ఒమెగా -6 లభిస్తుంది.

కాల్షియం
తప్పనిసరిగా తీసుకోవాల్సిన మరో విటమిన్ కాల్షియం. ఇది ఎముకలు, దంతాలను ఆరోగ్యంగా ఉంచుతుంది. నరాల వ్యవస్థ సరిగా పనిచేయడానికి, కండరాల బలోపేతానికి తోడ్పడుతుంది. ప్రతీరోజూ పిల్లలకు కాల్షియం అవసరం ఉంటుంది. అందుకే ఎక్కువ కాల్షియం ఎక్కువగా ఇవ్వాలి. పాల ఉత్పత్తులు, నువ్వులు, రాగులలో కాల్షియం పుష్కలంగా ఉంటుంది.

ఐరన్
రోగనిరోధక శక్తి పెరగడానికి, పిల్లలలో ఎదుగుదలకు, పునరుత్పత్తి విధులకు ఐరన్ తప్పనిసరి. బాడీలో ఐరన్ తక్కువగా ఉంటే పిల్లలు ఎనీమియా బారిన పడే అవకాశం ఉంది. ఆకు కూరలు, ఎండిన పళ్లు, పుచ్చపండు, బియ్యం, మాంసం, లివర్‌లలో ఎక్కువగా దొరుకుతుంది.

ఆహార వేళలు
మీ పిల్లలకు ఉదయం బ్రేక్‌ఫాస్ట్ తప్పనిసరిగా పెట్టాలి. రాత్రి నుంచి ఏం తినకుండా ఉండటం వల్ల ఉదయం శక్తి తక్కువగా ఉంటుంది. అందుకే పిల్లలను ఖాళీ కడుపుతో స్కూల్‌కు పంపిం చకూడదు. ఆయిల్ ఫుడ్ కాకుండా సులభంగా జీర్ణమయే లైట్ ఫుడ్ బ్రేక్‌ఫాస్ట్‌గా పెట్టాలి.
మూడు పూటలా ఇచ్చే ఆహారంతోపాటు మరో రెండుసార్లు స్నాక్స్ తినిపించండి. స్నాక్స్ అనగానే అందరూ నూనెతోచేసే వంటకాల వైపు చూస్తారు. కానీ డ్రై ఫ్రూట్స్, పాప్‌కార్న్, బ్రెడ్ వంటివి తినిపించడం మంచిది.

పిల్లలకు ఫుడ్ టైమ్ పెట్టండి. దాని ప్రకారమే ఇవ్వండి.


అంతేకాదు మీరు ఫుడ్ తయారు చేసేటప్పుడు వారికీ చూపించండి. షాప్‌కు తీసుకెళ్లడం తెచ్చినవి స్టెప్ బై స్టెప్ ఎలా వండుతున్నారో చెప్పండి. దీనివల్ల పిల్లలు ఫుడ్ గురించి ఎక్కువగా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది.
రోజూ మీరే తినిపించడం కాకుండా వారికి తినడం తొందరగా నేర్పండి. వాళ్లు మొదట తినకపోయినా తరువాత తరువాత వాటిని అలవాటు చేసుకుంటారు. 


ఫ్రై కాకుండా ఉడకబెట్టినవి కూరలు పెట్టడం మంచిది. సోడా, ఫ్రూట్ జ్యూసెస్‌లతో పాటు ఎక్కువగా పాలు, నీళ్లు ఇవ్వడానికి ప్రాధాన్యత ఇవ్వండి.
అన్నిసార్లు మరీ కఠినంగా ఉండకుండా ఎప్పుడో ఓసారి జంక్ ఫుడ్స్ కూడా ఇవ్వండి.

కలర్‌ఫుల్ ఫుడ్
ఎప్పుడూ పెట్టిన టిఫిన్స్, అన్నం, కూరలు పెట్టడం వల్ల పిల్లలకు విసుగొస్తుంది. సో కొత్త కొత్త వెరైటీస్ తినిపించండి. అవి ఎలా తయారు చేయాలో చూద్దాం...
పిల్లలు ఎక్కువగా కలర్ ఫుల్ ఫుడ్ ఇష్టపడతారు. సో వాళ్లను ఫుడ్ వైపు ఎట్రాక్ట్ చేయాలంటే ముందుగా కలర్‌ఫుల్‌గా ఉండే డిషెస్ ప్రిపేర్ చేయాలి.

ఫ్రూటీ విప్
కావాల్సినవి :
స్ట్రాబెర్రీ4,
ప్రూన్స్ (అల్‌బూకర్)
2, బనానా 1,
పాలు- సగం కప్పు,
చక్కెర తగినంత

విధానం :
స్ట్రాబెర్రీ, ప్రూన్స్, బనానాను ఒక బౌల్‌లోకి తీసుకుని మెత్తగా చేసుకోవాలి. దీనికి పాలు కలపాలి. చక్కర తగినంత కలిపి సెర్వ్ చేయాలి. బనానా, ప్రూన్స్ జీర్ణ వ్యవస్థను వృద్ధి చేస్తాయి. పిల్ల లో మలబద్దకం రాకుండా చేస్తాయి. ఇక స్ట్రాబెర్రీ రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ప్రూన్స్ దొరకకపోతే కిస్‌మిస్ కూడా ఉపయోగించవచ్చు.

మస్కీ యాపిల్
కావాల్సినవి :
 యాపిల్ (తొక్క తీసిన యాపిల్) సగం, ఖర్బూజ (తొక్కతీసినది) సగం, పాలు సగం కప్, చక్కెర తగినంత

విధానం :
యాపిల్, కర్భూజలను పూర్తిగా గ్రైండ్ చేయాలి. దానికి పాలు, చక్కెర తగినంత యాడ్ చేయాలి. దీనివల్ల పిల్లలకు కావాల్సిన :రన్, ఫైబర్, ప్రోటీన్స్ అందుతాయి.

రాగి జావ
 ( ఇంట్లో తయారు చేసుకోవచ్చు. బయట షాప్స్‌లో కూడా దొరుకుతాయి),
సగం కప్పు రాగుల పొడిసగం కప్పు పాలు, రెండు కప్పుల నీళ్లు, చిటికెడు యాలకుల పొడి, చక్కెర తగినంత

విధానం :
సన్నమంటమీద రాగుల పొడిని వేయించాలి. మరో గిన్నెలో పాలు తీసుకుని గోరు వెచ్చగా చేయాలలి. నీళ్లలో రాగి పొడిని బుడగలు లేకుండా బాగా కలిపి ఉడికించాలి. దీనికి యాలకుల పొడిని వేయాలి. కొద్దిసేపటి తరువాత పాలు, చక్కెర కలుపుకోవాలి. 2 నిమిషాలు ఉడికించి దించుకోవాలి. బ్రేక్‌ఫాస్ట్‌గా రాగి జావ ఇవ్వడం ఆరోగ్యదాయకం. రాగులలో ఐరన్, మినరల్స్, ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి.
Mee
M.S.R
Health Advisor


21 Aug 2015

వంటింటి చిట్కాలు


పిల్లల తెల్ల వెంట్రుకలకు - బాలకేశామృతం


మూత్రపిండాలలో రాళ్లు ఆయుర్వేద వైద్యం


కంటి చూపు - కళ్ళ సమస్య



తెల్ల వెంట్రుకలకు ఆయుర్వేదం


Bright Colors - Rich Diet


ఆరోగ్యానికి రక్ష - నల్ల ద్రాక్ష


కళ్ళజోడు పెట్టుకుంటే ముక్కు పై మచ్చలా



Color Codes of Toothpastes


నువ్వుల నూనె తో ఉపయోగాలు


1. గుండె ఆరోగ్యానికి :  నువ్వుల నూనెలో కొన్ని ఎలిమెంట్స్ సీసమోలో అనే యాంటీఆక్సిడెంట్స్ మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి .. సీసమోలో గుండె సంబంధిత వ్యాధులకు చాలా మేలు చేస్తుంది.

2. ప్రోటీనులు అధికం: నూనెల్లో ప్రోటీనులు కలిగి ఉండటం చాలా అరుదు. కానీ, నువ్వుల నూనెలో ఒక ఔన్స్ లో 4.5 నుండి 5గ్రాముల ప్రోటీనులు ఉంటుంది. ఇది వెజిటేరియన్స్ మరో అదనపు ప్రయోజనం.


3. మధుమేహ నివారణకు:  011లో ప్రచురించబడిని ఓ అద్యయనం ప్రకారం టైప్ 2 మధుమేహ గ్రస్తులకు ఉపయోగపడుతుందని చెబుతున్నాయి. అధిక మూత్ర వ్యాధితో బాధపడేవారు నువ్వులు పొడిచేసి, గోరువెచ్చటి నీటిలో కలిపి సేవిస్తూ వుంటే మంచి ఉపశమనం పొందడమే కాకుండా ఎముకల వ్యాధులు, కీళ్ళనొప్పులు, చర్మ రోగాలు దూరమవుతాయి.

4. ఎముకల ఆరోగ్యానికి: ఎముకల బలహీనతతో బాధ పడే పెద్ద వారు, ఆస్టియోపొరాసిస్‌ వంటి చికాకులతో ఉన్నవారు కూడా చెంచాడు నువ్వుల్ని నానబెట్టి ఉదయాన్నే పాలలో కలిపి సేవిస్తే ఈ రుగ్మతల నుంచి బయట పడవచ్చు. పిల్లలకిగానీ, పెద్దవారికి గానీ, రక్త హీనత తగ్గి రక్తం బాగా వృద్ధిచెందాలంటే, టీస్పూన్‌ నువ్వులు నానబెట్టి నిత్యం మూడునెలలపాటు తీసుకుంటే రక్తం వృద్ధిచెందడమే కాకుండా ఉదర సంబంధవ్యాధుల్ని నిర్మూలిస్తుంది.నువ్వుల నూనె క్యాల్షియంను అధికంగా అంధించడం వల్ల కీళ్ళ ను కాపాడుతుంది.

5. జీర్ణ సంబంధిత సమస్యలు: 
కొబ్బరినూనె లేదా మస్టర్డ్ వంటి ఇతర నూనెలతో పోల్చినప్పుడ, నువ్వులు నూనె చాలా తేలికగా మరియు మరింత సులభంగా జీర్ణం అవుతుంది. ఈ నూనె మీ పెద్దప్రేగు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది.

6. ఆంటీ స్పాస్మోడిక్ ఆయిల్: నువ్వుల నూనె యాంటీస్పాస్మోడిక్ లక్షణాలున్నాయి. ఫలితంగా ఇది శ్వాసనాళ లో కండరాల నొప్పులు ఉపశమనాన్ని కలిగిస్తుంది. ముఖ్యంగా ఆస్తమాటిక్స్ కు నువ్వులు నూనె యొక్క లక్షణం ద్వారా ప్రయోజనం పొందుతున్నాయి.

7. బ్లడ్ ప్రెజర్ ను తగ్గిస్తుంది:  నువ్వుల నూనెలో ఉన్న మెగ్నీషియం ఆస్తమా, లోయర్ బ్లడ్ ప్లజర్, బ్లడ్ వెజల్స్ ను వంటి వాటిని తగ్గిస్తుంది. మెగ్నీషియం, బ్లడ్ ప్రెజర్ ను తగ్గించడంలో బాధ్యత వహిస్తుంది. ఒక వేళ మధుమేహగ్రస్తుల్లో హైబ్లడ్ ప్రెజర్ ఉన్నప్పుడు నువ్వుల నూనె చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.

8. ఓరల్ హెల్త్:  నువ్వులు దంత క్షయాన్ని పోగొడుతుంది. దంత సమస్యలు, చిగుళ్ళ సమస్యలను, చిగుళ్ళ నుండి రక్తం కారుట, థ్రోట్ ఇన్ఫెక్షణ్ తొలగించి, పళ్ళకు బలాన్ని చేకూర్చుతుంది . నువ్వుల నూనెతో ఆయిల్ పుల్లింగ్ కూడా చేయ్యొచ్చు.

9. క్యాన్సర్ నుండి రక్షణ కల్పిస్తుంది:  యాంటీయాక్సిడెంట్స్ లక్షణాలు కలిగి ఉండటమే కాకుండా, నువ్వుల నూనెలో ఫైటేట్ ఇవి క్యాన్సర్ సెల్స్ తో పోరాడే గుణాలను కలిగి ఉంటుంది.

10. చర్మ ఆరోగ్యానికి: నువ్వుల నూనెలో విటమిన్ మరియు విటమిన్ బి లు పుష్కలంగా ఉన్నందున, చర్మం పాడవకుండా కాపాడుతుంది. మరయు మీరు యవ్వనంగా కనబడేలా , చర్మంలో కొత్త మెరుపులను అంధిస్తుంది. చర్మాన్ని సంరక్షించడంలో నువ్వులనూనె ప్రాధాన్యత చాలానే ఉంది. నువ్వల నూనెలో ఉన్న ఇ మరియు బి విటమిన్ లు చర్మానికి సంబంధిచిన అన్నిరకాల సమస్యలను దూరం చూసే గుణం ఇందులో పుష్కలంగా ఉంది. నువ్వులన నూనెను చర్మ సంరక్షణలో ఉపయోగించడం ద్వారా ముఖంను ఫ్రెష్ గా, యవ్వనంగా మెరుస్తూ ఉండేట్లు చేస్తుంది.

11. జుట్టుకు: నువ్వులను నూనెను: జుట్టు సంరక్షించుకోవడానికి కూడా ఉపయోగిస్తారు. కాబట్టి పల్లేరు కాయలు, నువ్వుపువ్వులు, తేనె, నెయ్యి సమంగా తీసుకొని మెత్తని ముద్దగా నూరి కేశాలు రాలినచోట ప్రయోగించి రుద్దితే తిరిగి జుట్టు పెరుగుతుంది. నువ్వుల నూనెను తలకు మర్ధన చేయడం వల్ల చుండ్రును సులభంగా వదలగొడుతుంది.

12. జలుబు:  సాధారణంగా వచ్చే జలుబు తగ్గిస్తుంది. జలుబు ఎక్కువగా ఉన్నప్పుడు సింపుల్ గా నువ్వుల నూనె వాసన చూస్తే చాలు జలుబును తగ్గించి, శ్వాసతీసుకోవడానికి సులభం చేస్తుంది.

13. బాడీ మసాజ్: నువ్వుల నూనెను శరీరానికి మసాజ్ చేయడం వల్ల శరీరానికి రిలీఫ్ ను ఇచ్చి ఘాడంగా నిద్రపోయేలా చేస్తుంది. నువ్వుల నూనెతో బాడీ మసాజ్ చేయడం వల్ల ప్రతి రోజూ ఒత్తిడికి గురవుతుంటే నువ్వుల నూనె ఒత్తిడి తగ్గించి, టెంషన్ నుండి బయటపడేలా చేస్తుంది .

19 Aug 2015

పరమ శివుడు ఎప్పుడు ఏ స్తితి లో ఉన్నదీ తెలుసుకొని అభిషేకము చేస్తే వచ్చే ఫలితాలు

ఏ రోజు శివాభిషేకము చేయుదురో , ఆరోజు తిధిని 2 చేత హేచ్చించ్చగా, వచ్చిన మొత్తమును, మరల 5 చేత హేచ్చిన్చ్చ వలెను. ఈ విధము గా  హేన్చ్చిన్చ్చిన     మొత్తమును , 7 తో భాఘించగా,

 

1 శేషము వచ్చినచో, శివుడు కైలసామందున్నట్లు గాను,
2 శేషము వచ్చినచో,పార్వతీదేవి వద్ద వున్నట్లు గాను,
3 శేషము వచ్చినచో,వృషభ వాహనుడ్డై  వున్నట్లు గాను,
4 శేషము వచ్చినచో, సభా మధ్యమున వున్నట్లు గాను,
5 శేషము వచ్చినచో, భోజనాలయమున వున్నట్లు గాను,
6 శేషము వచ్చినచో, క్రీడాభావనమందు వున్నట్లు గాను,
0 శేషము వచ్చినచో, స్మసానమందు వున్నట్లు గాను, తెలుసు కోవలెను.


1. కైలాసము నందు శివుడున్నప్పుడు చేసిన శివపూజ, శివాభిషేకము వలన, సర్వ సౌఖ్యములు కలుగును 


2. పార్వతి దేవి వద్ద  శివుడున్నప్పుడు చేసిన శివపూజ, శివాభిషేకము వలన, సమస్త  సుఖములు కలుగును


3. వృషభ (నంది)  వాహనుడై  శివుడున్నప్పుడు చేసిన శివపూజ, శివాభిషేకము వలన, ఐశ్వర్య వృద్ధి  కలుగును 


4. సభా మద్యములో శివుడున్నప్పుడు చేసిన శివపూజ, శివాభిషేకము వలన, పుత్ర పౌత్రాభి వృద్ధి, కీర్తి  కలుగును 


5. భోజనాలయము న  శివుడున్నప్పుడు  చేసిన శివపూజ, శివాభిషేకము వలన,  జీవితాంతము తిండికి బట్టకి లోటుండదు

 
6. క్రీడా  భవనమునందు (పార్వతి దేవి తో)  శివుడున్నప్పుడు  చేసిన శివపూజ, శివాభిషేకము వలన,అసౌఖ్యము భార్య పుత్ర వియోగము, పరనిందలు పడుట, వృత్తి యందు నష్టము కలుగును.

 
0. స్మశానము నందు  శివుడున్నప్పుడు  చేసిన శివపూజ, శివాభిషేకము వలన,  మృత్యువు  సంభవించును.


గాన  శివ పూజ శివాభిషేకము చేయు వారు,  ఈ వివరములను గమనించి, 6, 0,  శేషములలో చేయకుండా  శుభ స్తానములైన 1,2,3,4,5 ,స్తానములలో శివుడున్నప్పుడు శివపూజ, శివాభిషేకము చేసుకోవలెను

తెలుగు తిధులు

క్రమ సంఖ్య

1. పాడ్యమి

2. విదియ

3. తదియ

4. చవితి

5. పంచమి

6. షష్టి

7. సప్తమి

8. అష్టమి

9. నవమి

10. దశమి

11. ఏకాదశి

12. ద్వాదశి

13. త్రయోదశి

14. చతుర్ధశి

15. పౌర్ణమి

16. అమావాస్య


కాటుక గురించి కొంచం తెలుసుకుందాము

కళ్ళకు కాటుకందమూ.. 

అంటూ ఒక పాటుంది. నిజమే మరి, కాటుకతో కళ్ళ అందం రెట్టింపవుతుంది. ఎంత చిన్న కనులైనప్పటికీ వాటికి కాటుక సింగారించినపుడు అవి అందంగా, పెద్దగా కనిపిస్తాయి. కాటుక వలన కళ్ళకు చలవే చేయడమే కాకుండా కళ్ళు మిలమిల మెరుస్తుం టాయి. కాటుకవల్ల కళ్ళు మరింత అందంగా ఉంటాయికదాని కాటుక సుద్దలు సుద్దలుగా లావు గా పెట్టుకుంటే ఉన్న అందం కూడా పోతుంది.

ప్రస్తుతం మార్కెట్లో ఎన్నో రకాల కాటుకలు దొరుకు తున్నాయి. అయితే వాటిల్లో ఏది మంచి కంపెనీయో, ఏది కాదో తెలీక సందేహంలో పడతాం. కనుక ముందుగా వాటి వివరాలు తెలుసుకుని ఆనక వాడటం మంచిది. లేకుంటే వాటి వలన కంటికి హాని కలుగవచ్చు. కొన్ని కాటుకలు వాడటం వలన కళ్ళకు మంటలు, దురదలు వస్తుంటాయి. అవి ఫలానా కాటుక ఉపయోగించినందు వలన వచ్చాయని గమనించినట్లయితే వేంటనే ఆ కాటుకను వాడటం మానేయాలి. కొన్నిరకాల కాటుకలను ఉపయోగించినందువల్ల క్రమంగా చూపు మందగించే ప్రమాదం కూడా వుంది. ఇలాంటి ఇబ్బందులకు దూరంగా వుండాలంటే మనం ఇంట్లోనే కాటుక తయారు చేసుకోవచ్చు. మనం చేసుకున్న కాటుక పరిశుభ్రంగా, ఆరోగ్యకరంగా, ఉపయోగకరంగా వుంటుంది. డబ్బు కూడా ఆదా చేసినట్లవుతుంది.

 ఇంట్లోనే కాటుక తాయారు చేసే విధానాలు కొన్ని

1. శుభ్రమయిన ప్రమిదలో మంచి ఆముదం పోసి, దానిలో దూదితో చేసిన వత్తిని ముంచి వెలిగించాలి. ఒక రాగి పాత్రను వెలుగుతున్న వత్తికి సుమారు రెండు మూడు అంగుళాల పైన ఉండేట్లు బోర్లించాలి. రాగి పాత్ర లోపలి భాగంలో అంటే మసి అంటుకునే వైపు మంచి గంధం పూత పూయలి. మధ్య మధ్యలో ఆముదాన్ని పోస్తూ బాగా మసి పట్టేలా చేసి, తర్వాత ఆ మసినంతటినీ జాగ్రత్తగా గీకి ఆముదంతో తడిచేసి, ఇందులో కొంచెం కర్పూరాన్ని కలిపి శుభ్రమయిన భరిణెలో నిలువ చేసుకోవచ్చు. ఇలా తయారుచేసుకున్న కాటుక కళ్ళకు మంచిది. కళ్ళను చల్లగా ఆరోగ్యవంతంగా వుంచుతుంది. కాటుక పెట్టుకున్న కళ్ళు కలువల్లా భాసిస్తాయనటంతో అతియోక్తి లేదు. కనుబొమలకు మంచి ఆకృతినిచ్చి, అందంగా ట్రిమ్‌ చేసినట్లయితే కాటుక కళ్ళు మరింత అందాలు చిందిస్తాయి.
-----------------------------------------------------------------------------

2.  నేత్ర సంజీవని కాటుక

కావలసిన పదార్థాలు :

దేశీ ఆవు పిడుక : ఒకటి
ఆవు నెయ్యి : 15 చెంచాలు
వంట ఆముదం : 15 చెంచాలు
భీమనేని కర్పూరం : 1/2 గ్రాము

తయారు చేయు విధానం :
ముందుగా ఆవు నెయ్యి మరియు వంట ఆముదం ఒక గిన్నెలో తీసుకొని బాగా కలపాలి తర్వాతా ఆవు పిదకను అందులో వేసి నానబెట్టాలి తర్వాతా 2 సగం ఇటుకలను ఒక దాని మీద ఒకటి పెట్టాలి తర్వాతా మూడు వైపులా మూడు ఇటుకలను నిలబెట్టాలి. తర్వాతా మధ్యలో పెట్టిన సగం ఇటుకల మీద నెయ్యి, వంట ఆముదం,నూనెలో నానిన పిడుకను పెట్టాలి. తర్వాత ఆ పిడుకను కాల్చాలి. ఆ పిడుకను కాల్చేటప్పుడు ఒక రాగి ప్లేటును ఈ మూడు నిలబెట్టిన ఇటుకల మీద బోర్లించాలి. ఈ పిదుక కాలేతప్పుడు వచ్చిన పొగ రాగి ప్లేటుకు పడుతుంది.ఆ పిదుక పూర్తిగా కాలిన తర్వాత ఆ ప్లేటు తీసి దాని మీద 2 నుండి 3 చుక్కలు నెయ్యి వేసి చెయ్యి శుబ్రంగా  కడుక్కుని తుడుచుకొని చూపుడు వేలుతో మొత్తం ప్లేటుకు పట్టిన నల్లటి పొగను తీసి ఒక కాటుక డబ్బాలో వేసుకోవాలి. ఇలా కర్పూరం పొడిచేసి కలుపుకోవాలి. ఈ విధంగా "నేత్ర సంజీవని కాటుక" తయారవుతుంది.
ఉపయోగాలు :
1). ఇది కండ్లను చల్లగా ఉంచుతుంది.
2). ఇది ఆరంబంలో ఉండే నేత్ర రోగాలను పోగొడుతుంది.
3). ఇది దృష్టిని పెంచుతుంది.
---------------------------------------------------------------

3. చందన కాటుక తయారీ

చందన  కాటుక  తయారీకి కావలసిన వస్తువులు;

1) వెడల్పాటి మట్టి ప్రమిదలు

(2) ప్రత్తి వత్తి , పురి పెట్టకుండా, మందంగా ,అర చేతిలో పరచి,

మధ్యలో కరక్కాయ పొడిని చల్లి ఉంచి, వత్తి ఆకారంలో మెలిపి,మలచాలి.

ఈ వత్తిని ఆముదములో నానబెట్టాలి.

(3) వెడల్పైన ఇత్తడి పళ్ళెము

(పెళ్ళిలో వరుని కాళ్ళు కడిగే పళ్ళెము సరి పోతుంది.)

(4) సాన రాయి మీద గంధపు చెక్కను, అరగ దీసి తీసిన గంధము

(5) ఇత్తడి పళ్ళెము అడుగున,

ఈ గంధమును మూడు పొరలుగా మందముగా పూత పూయాలి.

(6) ఆవు నెయ్యి;

7)తాటాకు రేకు ;

తయారు చేసే పద్ధతి ;

మూడు రాళ్ళు పేర్చి వాని పైన ,ఇత్తడి పళ్ళాన్ని పెట్టాలి.

దానిలో నీళ్ళు పోయాలి. కింద సెగ తగిలేటట్టుగా

ప్రమిదలో నిండా ఆముదం పోసి, నానిన వత్తిని వేసి వెలిగించాలి.

వత్తి వెలుగుకు జానెడు ఎత్తున ఇత్తడి పళ్ళాన్ని అమర్చాలి.

గాలి విసురు లేని చోట, గదిలో ఒక మూలగా ఇలా అమర్చాలి.

(గాలి తగిలితే ,ప్రమిద వెలుగు కదులుతుంది. సెగ సరిగా లేనిచో కాటుక తయారవదు)

ప్రమిదలోని ఆముదము ఐపోయేదాకా, కదల్చ కుండా అలాగే ఉంచాలి.

అంటే మర్నాటికి పళ్ళెము అడుగున ఉన్న గంధము మసి ఏర్పడుతుంది.
అప్పుడు ఈ ఇత్తడి పళ్ళాన్ని తిరగ వేసి, అక్కడి గంధపు మసిని నూరాలి.

రాగి చెంబు(తో శ్రేష్ఠము.)తో గానీ, ఇత్తడి చెంబుతో గానీ ,నూరాలి .

ఆవు నెయ్యిని వేస్తూ, నెమ్మదిగా నూరాలి.

బాగా మెత్తగా నూరిన తర్వాత, మంచి నీటిని 'ధార' వలె, నెమ్మదిగా,

ధారాళంగా(ఇంచు మించి రెండు కడవల నీరు)పోయాలి.
అలాగ తయారైన కాటుకను

'రాగి కాటుక కాయ' లోనికి తీసుకుని, భద్ర పరచుకోవాలి.

కానీ ఈ చందన కాటుక ఎక్కువ తయారౌతుంది.

top 10 Potassium Foods


Minerals Deficiency Symptoms


Magnesium foods





పిల్లల్లో మెల్లకన్ను వస్తే జాగ్రత్తలు


పేస్ ప్యాక్


పరమ శివునికి వేటితో అభిషేకము చేస్తే ఏమి ఫలితము కలుగుతుందో తెలుసుకుందాము

1. .గరిక నీటితో శివాభిషేకము చేసిన నష్టమైన ద్రవ్యము తిరిగి లభించును.

2 .నువ్వుల నూనెతో అభిషేకించిన అపమృత్యువు నశించ గలదు.
3 .ఆవు పాల అభిషేకం సర్వ సౌఖ్యములను ప్రసాదించును
4 .పెరుగుతో అభిషేకించిన బలము, ఆరోగ్యము, యశస్సు లభించును.
5 .ఆవు నేయితో అభిషేకించిన ఐశ్వర్య ప్రాప్తి కలుగును
6. చెరకు రసముతో అభిషేకించిన ధన వృద్ది కలుగును.
7 .మెత్తని చేక్కరతో అభిషేకించిన దుఃఖ నాశనము కలుగును


8 .మారేడు బిల్వదళ జలము చేత అభిషేకము చేసిన భోగభాగ్యములు లభించును.


9 .తేనెతో అభిషేకించిన తేజోవృద్ది కలుగును.
10. పుష్పోదకము చేత అభిషేకించిన భూలాభము కలుగును.
11. కొబ్బరి నీటితో అభిషేకము సకల సంపదలను కలిగించును.
12 .రుద్రాక్ష జలాభిషేకము సకల ఐశ్వర్యములనిచ్చును.
13 .భస్మాభిషేకంచే మహా పాపాలు నశించును.
14 .గందోదకము చేత అభిషేకించిన సత్పుత్ర ప్రాప్తి కలుగును.
15 .బంగారపు నీటితో అభిషేకము వలన ఘోర దారిద్రము
16 .నీటితో అభిషేకించిన నష్టమైనవి తిరిగి లభించును.


17 .అన్నముతో అభిషేకించిన అధికార ప్రాప్తి, మోక్షము మరియు దీర్ఘాయువు లభించును. శివపూజలో అన్న లింగార్చనకు ప్రత్యేక ప్రాధాన్యత కలదు  పెరుగు కలిపిన అన్నముతో శివ లింగానికి మొత్తంగా అద్ది (మెత్తుట) పూజ చేయుదురు  ఆ అద్దిన అన్నాన్ని అర్చనానంతరము ప్రసాదముగా పంచి పెట్టెదరు, చూడటానికి ఎంతో చాలా బాగుంటుంది అన్న లింగార్చన).


18.ద్రాక్షా రసముచే అభిషేక మొనర్చిన ప్రతి దానిలో విజయము లభించగలదు.
19 .ఖర్జూర రసముచే అభిషేకము శత్రుహానిని హరింప జేస్తుంది.
20 .నేరేడు పండ్ల రసముచే అభిషేకించిన వైరాగ్య సిద్ది లభించును.
21.కస్తూరి కలిపిన నీటిచే అభిషేకించిన చక్రవర్తివ్తము లభించును.
22 .నవరత్నోదకము చే అభిషేకము ధాన్యము, గృహ, గోవృద్దిని కలిగించును.
23 .మామిడి పండ్ల రసము చేత అభిషేకము చేసిన దీర్ఘ వ్యాధులు నశించును.
24 .పసుపు నీటితో అభిషేకించిన మంగళ ప్రదము అగును  శుభ కార్యములు జరుగ గలవు.


Thanks to http://www.teluguone.com/

హెల్తీఫుడ్ అంటే తెలుసా.?

హెల్తీఫుడ్ అంటే ఏది రోజూ ఎలాంటి ఆహారం తీసుకోవాలి. వారంలో ఎన్ని రోజులు మాంసాహారం తీసుకోవచ్చు అనే అనుమానం అందరిలోనూ ఉంటుంది. మీకూ ఈ అనుమానముంటే.. ఈ కథనం చదవాల్సిందే. తాజా కూరగాయల్లోనూ, పండ్లలోనూ యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. కాబట్టి వారంలో ఐదు రోజులు పండ్లు, కూరగాయలు తీసుకోండి.

ముఖ్యంగా పళ్లలో మెదడును రక్షించే యాంటీ యాక్సిండెంట్లు పుష్కలంగా ఉంటాయి. కాలిఫ్లవర్‌లలో ఎక్కువ శక్తి ఉంటుంది. కాబట్టి వీటిని ఎక్కువగా తీసుకోవాలి. వీటిని తీసుకోవడానికి అంతగా ఇష్టపడని మహిళల్లో మెదడు వారి వయస్సు కంటే ఒకటి రెండెళ్లు తక్కువగా ఉంటుంది. యాపిల్స్, గ్రేప్స్, ఆనియన్స్, వైన్, టీ, డార్క్ చాకెలెట్‌లో కూడా యాంటీఅక్సిడెంట్లు ఉన్నాయి. వారంలో ఐదు రోజులు వీటిని తీసుకుంటే యాంటీ యాక్సిడెంట్లకు కొదవే ఉండదు.

అలాగే ఆలివ్‌ఆయిల్, నట్స్, సన్‌ఫ్లవర్ సీడ్స్, అవొకొడస్‌లో యాంటీ అక్సిడెంట్‌గా పనిచేసే ఇ-విటమిన్ పుష్కలంగా ఉంటుంది. ఇది అల్జీమర్స్ వ్యాధికి బాగా పనిచేస్తుంది. తరచుగా వీటిని తీసుకునేవారిలో అల్డీమర్ వ్యాధి బారిన పడే అవకాశం 67 శాతం తగ్గిపోతుంది. కాబట్టి వీటిని వారంలో ఒకరోజైనా మీ మెనూలో ఉండేలా చూసుకోవాలి.

వారానికి రెండు సార్లు చేపలు తీసుకుంటే రక్తంలో ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్ డీహెచ్ఏ లెవల్స్ అత్యధిక స్థాయిలో ఉంటాయి. దీంతో మెదడులోని కణాలు సమర్థంగా పనిచేస్తాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
Thanks to http://meekosamblog.blogspot.in/