ఒక లఘువుని ('అ' అనే
లఘువు పలికే సమయాన్ని నిమేషము అని అంటారు).
ఒక రెప్పపాటుకి కూడా నిమేషము అని పేరు.
ఇటువంటి నిమేషములు 15 అయితే ఒక కాష్ట అని పేరు. ఇటువంటి కాష్టలు 30 అయితే
ఒక కళ. ఇటువంటి కళలు 30 అయితే దానికి ఒక ''క్షణం'' అని
పేరు. ఇటువంటి 12 క్షణములు ఒక ముహూర్తం. 30 మూహూర్థములు
ఒక రాత్రి ఒకపగలు(మన కాలమానం ప్రకారం ఒకరోజు). 24 గంటల కాలానికి
ముప్పై ముహూర్తములు అంటారు. ఇటువంటి అహోరాత్రములు(ఒక పగలు ఒకరాత్రి అంటే ఒకరోజు) 15 ఐతే
ఒక పక్షం. ఇటువంటి పక్షములు రెండు ఐతే (30 రోజులు) ఒక మాసం. నెలకి ముప్పై ముప్పైలు 900 ముహూర్తములు
ఉన్నాయి.
ఇలాంటి మాసములు రెండు అయితే ఒక ఋతువు. ఇలాంటి ఋతువులు 6 అయితే
ఒక సంవత్సరం. ఈ సంవత్సరానికి 3ఋతువులు ఒక అయినం. ఉత్తరాయణం, దక్షిణాయనం.
ఈ రెండుకలిసి ఒక సంవత్సరం. ఈ సంవత్సరకాలం దేవతలకి ఒక రోజు. ఇక యుగములు 4ఉన్నాయి.
కృతయుగం, త్రేతాయుగం,
ద్వాపరయుగం, కలియుగం.
కృతయుగానికి మాంధాత యుగపురుషుడు. త్రేతాయుగానికి రాముడు యుగపురుషుడు.
ద్వాపరానికి ధర్మరాజు యుగపురుషుడు. ధర్మరాజు పేరు మీద యుధిష్టిర శకం అని ఒక శకం
కూడా ఉన్నది. కృతయుగానికి 17,28,000 సంవత్సరాల కాలం ఉంది. త్రేతాయుగానికి 12,96,000 సంవత్సరాలకాలం
ఉంది. ద్వాపరయుగానికి 8,64,000 సంవత్సరాలకాలం ఉంది. కలియుగానికి 4,32,000. సంవత్సరాలకాలం
ఉంది. ప్రస్తుతం కలియుగం మొదటి పాదంలో 5113సంవత్సరాల కాలం గడిచింది. కలియుగం 4,32,000 సంవత్సరాలని
2,3,4తో గుణిస్తే వరుసగా ద్వాపర, త్రేతా, కృతయుగముల
కాలం వస్తుంది.
ఈ నాలుగు యుగాలని ఒక దివ్యయుగం అంటారు. ఈ దివ్యయుగానికి 43,20,000 సంవత్సరాల
కాలం పడుతుంది. ఇలాంటి దివ్య యుగాలు (432 కోట్ల సంవత్సరాలు) 1000 గడిస్తే
బ్రహ్మదేవుడికి ఒక పగలు. (432 కోట్ల సంవత్సరాలు) ఇంతే కాలం ఒక రాత్రి. ఇటువంటి 864 కోట్ల
సంవత్సరాలు ఒక రోజు. ఇలాంటి ఒకరోజు గడిపిన ఆయనకి పితామహుడు అని పేరు. ఈ మన్వంతరాలు
14 ఉన్నాయి. ఒక్కో మనువు 71 మహాయుగాలు రాజ్యపాలన చేస్తాడు. బ్రహ్మ పగటికాలంలో
14 మంది మనువులు వెళ్ళిపోతున్నారట. ఒక మనువు వెళ్లి ఇంకో మనువు
వచ్చేకాలంలో మహాప్రళయం వస్తుంది. 71 యుగాలు ఒక మనువు పాలించి వెళ్ళిపోయి మరొక మనువు
వచ్చే సరికి ఈ మధ్యకాలంలో ప్రళయం వస్తుంది. మనువు ఉన్నంతకాలం ఇంద్రుడు కూడా
ఉంటాడు. స్వాయంభువ మనువు, స్వారోచిస మనువు ఇలాంటి మనువులు 7గురు
వల్లిపోయారు.
ఇప్పుడు వైవస్వత మనువు కాలం నడుస్తుంది. ఇప్పటికి 7మహాప్రళయాలు
గడిచాయిఈ మహాకల్పంలో. ఈప్రళయం ఆదియుగం కాలం పాటు ఉంటుంది. అంటే 17,28,000 సంవత్సరాలకాలం
పాటు ప్రళయం ఉంటుంది. ఈ ప్రళయ కాల సమయంలో మొత్తం నీటితో నిండిపోయి ఉంటుంది సృష్టి
అంతా! ఈ ప్రళయం అంతా బ్రహ్మ నిద్రించే సమయంలో జరుగుతుంది. బ్రహ్మ నిద్రలేచే
సమయానికి ప్రళయం వెళ్ళిపోతుంది. నిద్రలేవగానే బ్రహ్మ సృష్టి మళ్లి మొదలుపెడతాడు. ఈ
ప్రళయానికి నైమిత్తిక కల్పము అని పేరు. బ్రహ్మదేవుడు నిద్దుర పోయే సమయం, ఈ
ప్రళయకాల సమయానికి నైమిత్తిక కల్పం అని పేరు. ఇటువంటివి ముప్పై దినములు బ్రహ్మకి
ఒక నెల. అటువంటివి 12 అయితే ఒక సంవత్సరం. అటువంటి నూరు సంవత్సరాలు
బ్రహ్మ యొక్క ఆయుర్దాయం. దీనిని ఒక మహా కల్పం అని పేరు. దీనికి పూర్వ, అపర
అని రెండు భాగములు. పూర్వ మహా కల్పాన్ని పద్మ కల్పం అంటారు. అపరానికి వరాహ కల్పం
అని పేరు. ఇప్పుడు మనం శ్వేత వరాహ కల్పంలో ఉన్నాం.
No comments:
Post a Comment