ప్రకృతిలో అత్యధికంగా దొరికే ఐదవ మూలకము. కాల్షియమ్ జీవులన్నింటికి ముఖ్యమైనది. జీవుల
శరీరంలో అన్నింటికన్నా ఎక్కువగా ఉండే లోహము. ఇది ముఖ్యంగా ఎముకలలో ఉంటుంది.
కాల్షియం లోపం కారణంగా సమస్యలు ఎదుర్కొనే వారిని మనం చాలా మందిని చూస్తూ ఉంటాం. చిన్నపిల్లల్లో కనిపించే జాయింట్ పెయిన్స్, మహిళల్లో కనిపించే
కీళ్లనొప్పులు, 40 దాటిన వారిలో తరచు కనిపించే ఎముకలు, కండరాల నొప్పులకు కాల్షియం లోపమే కారణం అంటున్నారు నిపుణులు. ఎముకలు క్షీణించడానికి కూడా
ప్రధానం కారణం కాల్షియం లోపమే. అందుకే 40 ఏళ్లు దాటిన మహిళలు నిపుణుల సూచన మేరకు కాల్షియం మాత్రలు తీసుకుంటే భవిష్యత్తులో ఎలాంటి సమస్యలూ
తలెత్తవు. నిజానికి మనం నిత్య జీవితంతో తీసుకొనే ఆహార పదార్థాల్లో కాల్షియం పుష్కలంగా ఉండే పదార్థాలు అనేకం. చిన్నతనం నుంచీ మనం తినే తిండిలో ఆ
ఆహారపదార్థాలను తగినంతగా తీసుకోగలిగితే ఎటువంటి సమస్యలు లేకుండా చూసుకోవచ్చు.
ఎముకల ధృడత్వానికి, ఎముకల ఆరోగ్యానికి కాల్షియం అవసరమవుతుంది. చిన్నపిల్లల నుంచి, వృద్ధుల వరకు కాల్షియం ఎంత తీసుకోవాలన్నదీ వైద్య సలహా తీసుకుంటే
మంచిది. టీనేజ్ పిల్లలకు, గర్భిణీ స్త్రీలకు కాల్షియం అవసరం కొంత ఎక్కువగా ఉంటుంది. ఎముకల సాంద్రత పెరగడానికి తగినంత కాల్షియం కావాలి. కాల్షియం లోపం
ఏర్పడితే ఎముకలు అతి త్వరగా విరగడం, ఫెళుసుగా మారటం జరుగుతుంది. అందువల్ల కాల్షియం లభించే పదార్థాలేమిటో తెలుసుకుని, వాటిని తీసుకుంటే శరీరానికి
కాల్షియంలోపం ఏర్పడకుండా జాగ్రత్త పడవచ్చు.
కాల్సియం లభించే పదార్ధములు :
పాలు ,
రాజ్‌మా,
రాగులు,
శనగలు,
పెసలు,
నువ్వుల్లో కాల్షియం పుష్కలంగా ఉంది.
పెరుగులో కాల్షియం పుష్కలంగా ఉంది
చేపలు - ముఖ్యంగా చిన్న చేపలలో కాల్షియం సమృద్ధిగా దొరుకుతుంది.
మినుములు లాంటి గింజ ధాన్యాలలోనూ,
ములక్కాడలు.
బీన్స్,
సోయాబీన్,
మెంతికూర,
తోటకూర,
పాలకూర,
కోతిమీర,
నారింజ పండ్లలో కూడా కాల్షియం అధికంగా ఉంది.
కరివేపాకు లాంటి ఆకుకూరలు, తాజా కాయకూరల్లో కాల్షియం పుష్కలంగా లభిస్తుంది.
బాదం, ఎండు ద్రాక్ష, వేరుశెనగ కాయలు లాంటి వాటిలోనూ నిలవ పచ్చళ్లు, ఊరగాయలు, ఉప్పు అధికంగా వాడిన ఫాస్ట్‌ఫుడ్స్, స్నాక్స్ అప్పడాలు, ఒడియాలు లాంటివి
తక్కువగా తీసుకోవడమే మంచిది. ఎందుకంటే, ఆ పదార్ధాల్లో ఉండే సోడియం కాల్షియాన్ని నష్టపరుస్తుంది. నిద్రలేమికి, ఒత్తిడి, ఆందోళన లాంటివి కూడా కాల్షియం
స్థాయిని తగ్గిస్తుంది. మెనోపాజ్ స్థితికి చేరుకున్న మహిళల్లో ఈస్ట్రోజన్ ఉత్పత్తి తగ్గిపోతుంది. అందువల్ల ఎముకలు త్వరగా విరుగుతాయి. వృద్దాప్యంలో ఉన్నవారు ఆహార
పదార్ధాల్లో ఉప్పును తగ్గించి తినడం ద్వారా కాల్షియం లోపాన్ని నివారించవచ్చు. శరీరంలో కాల్షియం స్థాయి తగ్గితే వారిలో రక్తపోటు సమస్య కూడా ఏర్పడవచ్చు కనుక,
కాల్షియం, సమృద్ధిగా లభించ టానికి పాలు, పెరుగు తీసుకోవడం మంచిది. చిన్న వయస్సు నుంచే కాల్షియం లభించే పదార్థాలు తీసుకుంటే, వయస్సు పెరుగుతున్నా
కాల్షియంలోపం ఏర్పడకుండా ఉంటుంది.
ఆరోగ్యానికి కాల్షియం చాలా అవసరం...!
ఆరోగ్యంగా ఉండాలంటే శరీరంలో కాల్షియం చాలా అవసరం. ముఖ్యంగా ఆడవారిలో అధికంగా కాల్షియం లోపం వలనే వారు బలహీనంగా కనిపిస్తుంటారు. దీంతో ఇతరత్రా
రోగాలబారిన పడుతుంటారు. మీరు నిత్యం తీసుకునే పోషకాహారంలో కాల్షియం ఉండేలా చూసుకోవాలి. చిన్నప్పటినుంచే మనం తీసుకునే ఆహారంలో ఐరన్, కాల్షియం
అధికంగా ఉండే ఆహార పదార్ధాలను తీసుకోవడం ద్వారా ఆరోగ్యంగా ఉండొచ్చు. దంతాలు, ఎముకలు పటిష్టంగా ఉండాలంటే శరీరంలో తగిన కాల్షియం ఉండాలి. శరీరంలో
కాల్షియం తగ్గే కొద్దీ ఎముకలు బలహీనపడతాయి. పురుషులతో పోల్చినప్పుడు స్త్రీలకే అధిక కాల్షియం అవసరం అంటున్నారు వైద్యనిపుణులు. మహిళల్లో వయస్సు
పెరుగుతున్న కొద్దీ ఎముకలు పెళుసుగా మారతాయనడంలో సందేహం లేదు. దీనికి కారణం కాల్షియం కొరవడటమేనంటున్నారు వైద్యులు. వయస్సు పెరుగుతున్నా
ఎముకలు పటిష్టంగా ఉండాలంటే పాలను, పండ్లను అధికంగా తీసుకోవాలి. సి విటమిన్, కాల్షియం సప్లిమెంట్లను తింటే శరీరానికి కాల్షియం పుష్కలంగా అందుతుంది.
గోధుమలు, పాలిష్ చేయని బియ్యం, పీచుపదార్థాలు తింటే పూర్తిస్థాయిలో కాల్షియం అందుతుంది.
బంగారం కంటె విలువైంది ‘కాల్షియం’
కాల్షియం మన శరీరంలో ఉంటుంది. 99% మన ఎముకల్లో, పళ్ళలో నిక్షిప్తమై ఉంటుంది. మిగతాది కండరాల్లో, రక్తంలో ఉంటుంది. మన శరీరంలో కండరాలు,
నాడీమండలం పనిచేయడానికి కాల్షియం అవసరం. హార్మోన్ల ఉత్పత్తికి దీని అవసరం ఉంది.
ఎముకలు కాల్షియం ‘బేంకు’లాంటివి. పుట్టినప్పటినుంచీ 30-35 సంవత్సరాల వరకు మన ఎముకల్లో కాల్షియం నిల్వచేయబడుతుంది. ఆ తర్వాత ఈ నిల్వచేసేపని
ఆగిపోతుంది. డెబిట్ గాని క్రెడిట్ పని ఉండదు. ఈ వయసులో (35 సం. తర్వాత) మనం తినే ఆహారంలో సరిపడా కాల్షియం లేకుంటే అది ఎముకలనుంచే శరీరానికి
అందుతుంది. దాంతో ఎముకలు పల్చబడిపోతాయి. స్త్రీలలో అయితే ‘మోనోపాజ్’ సమయంలో ఈ పరిస్థితి తీవ్రంగా ఉంటుంది. ఎదుగుతున్న వయసులోనే ఆహారంలో
కాల్షియం సమృద్ధిగా ఉండేలా జాగ్రత్తపడితే ఈ సమస్యను చాలావరకు నివారించగలం.
ఈ మధ్య మనదేశంలో జరిగిన కొన్ని సర్వేల్లో విచారకరమైన విషయం తెలిసింది. అదేమిటంటే టీనేజీ ఆడపిల్లల్లో 20% మంది కాల్షియం లోపానికి గురవుతున్నారు.
దీనికి కారణం సమతుల్యాహారానికి బదులు ఈ పిల్లలంతా పిజ్జాలు, బర్గర్‌లు తినడమేనని తెలిసింది. ఇంకా వీళ్ళంతా మంచినీళ్ల స్థానంలో సాఫ్ట్ డ్రింక్సు (పెప్సీలు,
కోలాలు) తాగుతున్నారు. ఇంత చిన్నవయసులోనే కాల్షియం కొరత ఏర్పడితే మరి ‘మోనోపాజ్’ నాటికి వారి పరిస్థితి ఎట్లా ఉంటుందో ఊహించుకోండి. ఈ రోజుల్లో
ఆడపిల్లలు ‘జీరో’ సైజు క్రేజ్‌లో పడి అసలు తిండే సరిగా తినడం లేదు. దీనికి తగ్గట్టుగా టీవీల దగ్గర కూర్చునే సమయం ఎక్కువయింది. దీనివల్ల శరీరానికి సరైన
వ్యాయామం లేక కాల్షియం లోపానికి దోహదమవుతోంది. ఈ పరిస్థితినుంచి బయటపడాలంటే కాల్షియం లోపం వల్ల కలిగే నష్టాల గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.
మనలో కాల్షియం కొరత ఉన్నప్పుడు, శరీరంలో మిగతా పనులకు (నాడీమండలం, కండరాలు పనిచేయడానికి, హార్మోన్ల ఉత్పత్తికి) ఎముకల్లో ఉన్న కాల్షియం
ఉపయోగించుకోవలసి వస్తుంది. అందువల్ల ‘చిల్లుల ఎముకలు’ ఏర్పడి ‘ఆస్టియోపరోసిస్’కి దారితీస్తుంది. ఆ తర్వాత తుంటి ఎముకలు, వెన్నెముక, మణికట్టు, కటి
ఎముకలు, పక్కటెముకలు ఒక్కటేమిటి ఎక్కడయినా సరే ఈజీగా విరిగిపోయే ప్రమాదం ఉంది. అసలు కాల్షియం ఎముకల దృఢత్వం కోసమే కాకుండా, ఇంకా చాలా
వాటిలో ఉపయోగపడుతుంది.
కాల్షియం ఉపయోగాలు :
మొత్తం శరీరం ఆరోగ్యంగా ఉండటానికి, మనిషి నార్మల్‌గా ఎదగడానికి, కండరాలు, నరాలు సరిగా పనిచేయడానికి, గుండె సరిగా పనిచేయడానికి, రక్తం గడ్డ కట్టడానికి,
రక్తపోటును నార్మల్‌గా ఉంచడానికి, మన శరీరంలో ఇనుము సరయిన రీతిలో ఉపయోగపడ్డానికి, శరీరంలోని హార్మోన్లు సరిగా పనిచేయడానికి (ముఖ్యంగా థైరాయిడ్,
పారాథైరాయిడ్ హార్మోన్లు), శరీరంలోని కణాల నిర్మాణంలో, విటమిను బి12 వంట బట్టడానికి.
కాల్షియం తగ్గినందువల్ల కలిగే నష్టాలు :
ఆస్టియో మలాషియ (ళిరీశిలిళిళీబిజిబిబీరిబి) : ఎముకల్లో లవణీకరణ (ళీరిదీలిజీబిజిరిచిబిశిరిళిదీ ళితీ ళీబిశిజీరిని) జరుగదు. దీనివల్ల చిన్నపిల్లల్లో రికెట్సు వస్తుంది.
దీనివల్ల ఎముకలు మెత్తబడతాయి, వంగిపోతాయి. దీనివల్ల పిల్లల్లో విల్లమ్ముల మాదిరి వంగిన కాళ్ళు (లీళిగీలిఖి జిలివీరీ), అతిపెద్ద నుదిటిభాగం (జిబిజీవీలి
తీళిజీలినీలిబిఖి), సొట్టపడిన ఛాతిభాగం (చీలిబీశితిరీ లినిబీబిఖీబిశితిళీ), పిట్ట ఛాతీ (చీలిబీశితిరీ బీబిజీదీరిశితిళీ).
ఆస్టియోపేనియా (ళిరీశిలిళిచీలిదీరిబి) : ఎముకల్లో ఉండాల్సిన కాల్షియం సాంద్రత కంటే తక్కువగా ఉండటం. తగిన చర్య తీసుకోకపోతే ఆస్టియోపరోసిస్‌కి దారితీస్తుంది.
ఆస్టియోపరోసిస్ (ళిరీశిలిళిచీళిజీళిరీరిరీ) : ఇంతకుముందే చెప్పుకున్నాం. ‘చిల్లుల ఎముకలు’ ఏర్పడతాయి. ఎముకలు బలాన్ని కోల్పోయి, సపోర్ట్ చేసే శక్తిని
కోల్పోతాయి. చిన్నగా కిందపడ్డా ఎముకలు విరుగుతాయి.
నిద్రపట్టకపోవడం, టెటనీ (శిలిశిబిదీగి) - ఫిట్సులా రావడం, మెన్సస్‌కి ముందు క్రేంప్స్ రావడం (చీజీలిళీలిదీరీశిజీతిబిజి బీజీబిళీచీరీ). కండరాలు పట్టేసి, తీవ్రమైన నొప్పి
కలగడం, రక్తపోటు పెరగడం., నెలలు నిండకుండా పిల్లలు పుట్టడం, పెద్దపేగుల్లో కేన్సరు, బ్రెస్ట్ కేన్సరు రావడానికి అవకాశం. పై నష్టాలన్నీ జరగకుండా ఉండాలంటే మన
ఆహారంలో కాల్షియం సరయిన మోతాదులో ఉండాల్సిందే.
రోజువారీ మనం తీసుకోవాల్సిన కాల్షియం
వయసు కాల్షియం మి.గ్రాముల్లో
0-6 నెలలు 210
7-12 నెలలు 270
1-3 సం|| 500
4-8 సం|| 800
9-13 సం|| 1300
14-18 సం|| 1300
19-50 సం|| 1000
51 సం|| పైన 1200
పై మోతాదుల్లో కాల్షియం మన శరీరానికి అందాలంటే ఎటువంటి ఆహారం తినాలి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో వచ్చే సంచికలో తెలుసుకుందాం.
కాల్షియం సప్లిమెంట్‌తో గుండెకు చేటు : పరిశోధనలు --
ఎముకల క్షీణతను నివారించడానికి మహిళలు తీసుకునే కాల్షియం సప్లిమెంట్ల వల్ల గుండె ఆరోగ్యానికి హాని కలుగుతుందని స్పష్టమైన రుజువు బయటపడింది. కాల్షియం
సప్లిమెంట్ వాడడాలని సూచించడంలో ఏకాభిప్రాయం కొరవడింది. మెనోపాజ్ దశకు చేరుకున్న చాలా మంది మహిళల ఎముకల ఆరోగ్యం కోసం వైద్యులు ఈ సప్లిమెంట్
బిళ్లలను సూచిస్తుంటారు. కొన్నిసార్లు ఈ బిళ్లల్లో విటమిన్-డి కూడా ఉంటోంది. అయితే కాల్షియం సప్లిమెంట్లను విటమిన్-డితో తీసుకోవాలా లేదా అనే విషయంపై స్పష్టత
లేదు. ఇది గుండెకు ప్రభావితం చేస్తుంది. ఉమన్స్ హెల్త్ ఇనిషియేటివ్ ఏడేళ్లపాటు 36,000 మందిపై అధ్యయనం చేసింది. విటమిన్-డితో ఉన్న కాల్షియం సప్లిమెంట్
తీసుకోవడం వల్ల గుండెపై ఎలాంటి ప్రమాదం లేదని కనుగొన్నారు. కానీ ఇందులో పాల్గొన్న చాలా మంది సొంతంగా కాల్షియం సప్లిమెంట్లను తీసుకుంటున్నారు.
వీటి వల్ల అస్పష్టమైన దుష్ప్రభావాలున్నాయి. న్యూజిలాండ్‌కు చెందిన పరిశోధకులు బృందం ఈ ఫలితాలను పునర్ విశ్లేషణ చేసింది. అధ్యయనంలో పాల్గొనే ముందు
కాల్షియం సప్లిమెంట్ తీసుకోని 16,718 మంది మహిళలను పరిశీలించారు. యాదృశ్ఛికంగా కాల్షియం, విటమిన్-డి తీసుకున్న మహిళల్లో మధ్యస్థంగా 13 నుంచి 22
శాతం గుండెజబ్బులు వచ్చే ప్రమాదం అధికంగా ఉందని వెల్లడైంది. ముఖ్యంగా గుండెపోటు. కాల్షియం సప్లిమెంట్ తీసుకున్న తర్వాత రక్తం-కాల్షియం స్థాయిలో
ఆకస్మికమైన మార్పులను పరిశోధకులు పసిగట్టారు. వీటి వల్ల ప్రతికూల ప్రభావాలుంటాయి. రక్తంలో అధిక కాల్షియం స్థాయికి, ధమనులు గట్టిపడడానికి సంబంధం ఉంది.
ఇది ఫలితాలను వివరించడానికి తోడ్పడుతుంది. వృద్ధులు కాల్షియం సప్లిమెంట్ వాడే ముందు ఒకసారి ఆలోచించుకోవాలని ఫలితాలు సూచిస్తున్నాయి. అంతేకాక ఈ
అంశంపై మరిన్ని అధ్యయనాలు, చర్చ జరగాల్సిన అవసరముంది.
No comments:
Post a Comment