మన గుండెకు అత్యంత ఇష్టమైన
గ్రంథి కాలేయం. అందుకేనేమో! అన్ని శరీర భాగాలకు ఒకే మార్గంలో రక్త సరఫరా
జరిగితే కాలేయానికి మాత్రం రెండు మార్గాల్లో రక్తం అందుతుంది. శరీరంలోని
అతి పెద్ద గ్రంథి మాత్రమే కాదు.. మిగిలిన వాటి కన్నా భిన్నమైంది కూడా. ఒక
కిడ్నీని దానం చేస్తే కేవలం ఒక కిడ్నీతోనే ఉండాలి. కాని లివర్‌ని దానం
చేస్తే మాత్రం ఎంత ఇచ్చామో అంత తిరిగి పుడుతుంది. అందుకే ఎటువంటి భయం
లేకుండా చేయగల దానం కాలేయ దానం. ప్రపంచవ్యాప్తంగా కాలేయం
దెబ్బతింటున్నవాళ్లలో హెపటైటిస్ సి ఇన్‌ఫెక్షన్ ప్రధాన కారణం. హెపటైటిస్
ఇన్‌ఫెక్షన్ ఒకవైపు బాధిస్తుంటే.. మరోవైపు ఆల్కహాల్ తీసుకుంటూ కోరి మరీ
కాలేయాన్ని పాడుచేసుకుంటున్నారు. జాగ్రత్తగా చూసుకుంటే కాలేయం మార్పిడి
చేయాల్సిన అవసరమే ఉండదు.
ఆల్కహాల్ ఎక్కువగా తీసుకోవడం, వైరల్ ఇన్‌ఫెక్షన్లు సిర్రోసిస్‌కి దారితీస్తాయి. ట్రాన్స్‌ప్లాంటేషన్ తరువాత కూడా ఇన్‌ఫెక్షన్ వచ్చే అవకాశం చాలా చాలా తక్కువ. 1 శాతం ఉండొచ్చు. అయితే ఒకవేళ ఇన్‌ఫెక్షన్ వచ్చినప్పటికీ అది పెరిగి మళ్లీ సిర్రోసిస్‌కి దారితీసేసరికి ఓ పదిహేనేళ్లయినా పడుతుంది. కాబట్టి ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయించుకోవాలనే సూచిస్తారు. క్యాన్సర్ పేషెంట్ల విషయంలో కాలేయంలో 5 సెంటీమీటర్ల కన్నా చిన్నదైన ట్యూమర్ ఉన్నా, మూడు ట్యూమర్లు ఒక్కోటి 3 సెంటీమీటర్లు మించకుండా ఉన్నా ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయవచ్చు. క్యాన్సర్ కాలేయం చుట్టుపక్కలే ఉండే లింఫ్ గ్రంథులకు కూడా వ్యాపించకూడదు.
-హెపటైటిస్... ఫ్యాటీ లివర్.. సిర్రోసిస్... ఇలా సమస్య ఏదైనా కాలేయాన్ని పూర్తిగా పనికిరాకుండా చేయగల శక్తి వీటికి ఉంది. సాధారణంగా కాలేయంలో సమస్య రాగానే ట్రాన్స్‌ప్లాంటేషన్ అంటారేమోనని భయపడుతుంటారు. కాని ఏ సమస్య అయినా మరీ తీవ్రమై, లివర్‌ను మందుల సపోర్టుతో కూడా బతికించలేము అనుకున్నప్పుడు ట్రాన్స్‌ప్లాంటేషన్‌ను సూచిస్తారు. అక్యూట్ లివర్ ఫెయిల్యూర్, సిర్రోసిస్‌తో కాంప్లికేషన్స్ రావడం, ప్రైమరీ లివర్ క్యాన్సర్ (హెపటోసెల్ క్యాన్సర్) ఉన్నప్పుడు సాధారణంగా కాలేయ మార్పిడికి వెళ్లమని చెబుతారు. అయితే కొన్ని రకాల జీవక్రియలకు సంబంధించిన సమస్యలున్నప్పుడు కూడా ట్రాన్స్‌ప్లాంటేషన్ అవసరమవుతుంది. ఇలాంటివి పుట్టుకతోనే వస్తాయి. హీమోక్రోమెటోసిస్, ఆల్ఫా 1 ట్రిప్సిన్ లాంటి ఎంజైమ్ లోపాలు, సిస్టిక్ ఫైబ్రోసిస్, విల్‌సన్స్ డిసీజ్ లాంటి పుట్టుకతో వచ్చే లివర్ వ్యాధులు, ప్రైమరీ ఆక్జల్యూరియా (ఇది మూత్రంలో చేరడం వల్ల కిడ్నీలో రాళ్లు), ప్రైమరీ బిలియరీ సిర్రోసిస్ వంటి సమస్యలకు కాలేయ మార్పిడి తప్పనిసరి అవుతుంది.
-ప్రమాదాల్లో గాని, ఇతరత్రా కారణాల వల్ల గాని చనిపోయిన వ్యక్తి లేదా బ్రెయిన్ డెత్ అయిన దాత నుంచి సేకరించిన లివర్‌ను ట్రాన్స్‌ప్లాంట్ చేయడం ఒక పద్ధతైతే, పేషెంటు కుటుంబ సభ్యుల దగ్గరి నుంచి తీసుకున్న కాలేయాన్ని ట్రాన్స్‌ప్లాంట్ చేయడం మరో పద్ధతి. వీళ్లని లైవ్ డోనర్స్ అంటారు. సాధారణంగా న్యూరలాజికల్ కండిషన్స్ వల్ల చనిపోయిన వాళ్లను దాతలుగా ఎంచుకుంటారు. పెద్దవాళ్లు కాకుండా సాధ్యమైనంతవరకు వయసు తక్కువగా ఉన్నవాళ్లను ఎంపిక చేసుకుంటారు. గుండె, కిడ్నీ, ఊపిరితిత్తుల వంటి వాటికి సంబంధించిన జబ్బులున్నవాళ్లను, ఐసియులోని వాళ్ల నుంచి తీసిన కాలేయాన్ని మార్పిడి చేయకూడదు. అలా చేస్తే కాలేయ మార్పిడి ఫెయిల్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
-కెడావర్ దాతలు అందుబాటులో లేకపోవడం వల్ల 1998లో ఇలా లైవ్ డోనర్ నుంచి కాలేయాన్ని తీసుకోవడం ఆరంభమైంది. ఇందుకోసం కుడి లేదా ఎడమ లోబ్ మాత్రమే తీసుకుంటారు. దీన్ని ఒక చిన్నారికి, పెద్దవాళ్లకు ఒకరికి అమర్చవచ్చు. ఇప్పుడు 70 శాతం ట్రాన్స్‌ప్లాంటేషన్లు లైవ్ డోనర్ నుంచి తీసుకునేవే ఉంటున్నాయి.
-ఫ్యాటీ లివర్ ఉన్నవాళ్లు, స్థూలకాయం, బిఎంఐ 40 మించినవాళ్లు కాలేయదానానికి అర్హులు కారు.
-గుండె, ఊపిరితిత్తులు, కిడ్నీ జబ్బులుండకూడదు. క్యాన్సర్ పేషెంట్లయితే క్యాన్సర్ చికిత్స తీసుకుని, అది నయమైన అయిదేళ్ల వరకు దానం చేయకూడదు.
-అదుపులో లేని డయాబెటిస్, బీపీ ఉన్నవాళ్లు, పల్మనరీ హైపర్‌టెన్షన్ ఉన్నవాళ్లు ఇవ్వకూడదు.
-హెచ్‌ఐవి, హెచ్‌బివి, హెచ్‌సివీ ఉన్నవాళ్ల నుంచి కాలేయాన్ని తీసుకునేవాళ్లు కాదు. కాని ఇప్పుడు ఆయా రోగాలున్నవాళ్లకు లివర్ అవసరం అయినప్పుడు వాళ్ల నుంచి కూడా లివర్ తీసుకుంటున్నారు.
-కాలేయ మార్పిడి చేయించుకునేవాళ్లకు గుండెజబ్బులు, శ్వాసకోశ వ్యాధులు, కిడ్నీ సమస్యలు ఉండకూడదు. ఇలాంటి కొన్ని అంశాలను బేరీజు వేసుకుని ట్రాన్స్‌ప్లాంటేషన్ చేసిన తరువాత తొందరగా చనిపోవచ్చు అనుకుంటే తదనుగుణమైన నిర్ణయం తీసుకుంటారు. పేషెంటు ఇతరత్రా ఆరోగ్యంగానే ఉన్నాడనుకుంటే 60, 70 ఏళ్లు దాటినా చేస్తారు. సాధారణంగా ఎక్కువ వయసు వాళ్లలో రిస్కు ఎక్కువ. కాలేయ మార్పిడి చేయించుకున్నవాళ్లు జీవితాంతం ఇమ్యునో సప్రెసెంట్ మందులను వాడుతూ ఉండాలి. పొగ తాగడం, ఆల్కహాల్ తీసుకోవడం లాంటి అలవాట్లు ఉంటే మానేయాలి. ఆల్కహాలిక్ లివర్ ఉన్నవాళ్లకు ట్రాన్స్‌ప్లాంటేషన్‌కి ముందు ఆరు నెలల పాటు ఆల్కహాల్ ఆపేయాలని చెబుతాం. అలా ఆపేయగలిగితేనే ట్రాన్స్‌ప్లాంటేషన్‌కి వెళ్తాం. సర్వికల్, రొమ్ము, అండాశయ క్యాన్సర్ల వంటివి లేవని నిర్ధారణ చేసుకోవాలి. రోగి, దాతల రక్తం గ్రూపులు మ్యాచింగ్ అవ్వాలి.
-రెండు మూడు వారాల పాటు ఆస్పత్రిలో ఉండాల్సి వస్తుంది.
-డిశ్చార్జి అయిన తరువాత కుటుంబ సభ్యుల నుంచి సపోర్టు ఉండాలి.
-మందులను రెగ్యులర్‌గా, మర్చిపోకుండా వాడుకోవాలి. క్రమం తప్పకుండా డాక్టర్‌ను కలవాలి.
-మొదటి రెండు మూడు నెలల్లో అక్యూట్ రిజెక్షన్ అయ్యే అవకాశం ఉంటుంది. అందువల్ల ఇమ్యునో సప్రెసెంట్ మందులను జీవితాంతం వాడాల్సి ఉంటుంది.
అర్హతను నిర్ణయించే మెల్డ్ (ఎంఈఎల్‌డీ)
-కాలేయ మార్పిడిలో సరైన పేషెంటును, దాతను సెలక్ట్ చేసుకోవడం ముఖ్యం. ఎంత నైపుణ్యం గల సర్జన్ ఉన్నప్పటికీ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ను తట్టుకునే సామర్థ్యం పేషెంటుకు ఉండడం ముఖ్యం.
-పాశ్చాత్యదేశాల్లో అయితే యు.ఎన్.ఒ.ఎస్. లో రిజిస్ట్రేషన్ అయినవాళ్లకు మాత్రమే కాలేయ మార్పిడి చేస్తారు. ఇక్కడ కూడా మెల్డ్ (ఎంఇఎల్‌డి) స్కోరు 15 లోపు ఉన్నవాళ్లకు మాత్రమే కాలేయ మార్పిడి చేయించుకోవడానికి అర్హత ఉంటుంది. కాలేయంలో తయారీ విధులను నిర్వర్తించే కొన్ని కొన్ని ఎంజైమ్‌లు, అల్బుమిన్, బిల్‌రుబిన్, క్రియాటినిన్, క్లాటింగ్ ఫ్యాక్టర్లు తగిన మోతాదుల ఆధారంగా మెల్డ్ స్కోరును గణిస్తారు.
-20 శాతం మందిలో సిర్రోసిస్‌కి కారణం హెపటైటిస్ సి ఇన్‌ఫెక్షనే కారణం. ఇన్‌ఫెక్షన్ ఉన్నప్పుడే సకాలంలో సరైన వైద్యం తీసుకోవడమే కాకుండా, మందులను శ్రద్ధగా వేసుకుంటే ట్రాన్స్‌ప్లాంటేషన్ అవసరం రాకుండా చూసుకోవచ్చు.
http://namasthetelangaana.com/zindagi/కాలేయం-పదిలం-6-1-413239.aspx

ట్రాన్స్‌ప్లాంటేషన్.. ఎలా?

ఎవరు దాత?

ట్రాన్స్‌ప్లాంటేషన్.. ఎవరికి చేయాలి?

ట్రాన్స్‌ప్లాంటేషన్ తరువాత...

No comments:
Post a Comment