30 Jun 2015

మానవ జన్మ పుట్టుక లక్ష్యం ఏమిటి ?

రాళ్ళు కొట్టుకుని జీవించే ఒక అతను ఒక రోజున తన పని చేసుకుంటూ ఉండగా కను చూపులో ఒక రాయి ఎంతో ఆకర్షణీయంగా కనిపించింది.  దానికి మురిసి అతను ఆ రాయిని గుడ్డలో కట్టుకుని ఇంటికి తీసుకుని వెళ్లి భార్యకు ఇచ్చాడు.  ఆమె దాన్ని గూట్లో పెట్టింది.   కొన్ని రోజుల తరువాత కుంకుడు కాయలు కొట్టడానికి రాయి దొరక్క దాన్ని ఉపయోగించుకుంది తరువాత తరువాత  ఆ రాయిని అదే పనికి చాలా సార్లు వాడుకున్నది.  

ఒక రోజున వాళ్ళ పిల్లాడు రాళ్ళ ఆట ఆడుకోటానికి ఆ రాయిని తీసుకుని బయటకి వెళ్ళాడు.    కొద్ది సేపటికి అటుగా మిఠాయిలు అమ్ముకునే అతను వచ్చేటప్పటికి పిల్లలు అందరు ఆ మిఠాయి బండి చుట్టూ మూగారు.   ఈ పిల్లాడు కూడా రాళ్ళు  చేతిలో పట్టుకుని వెళ్ళాడు.    ఆ రాయి మిఠాయి వ్యాపారిని ఆకర్షించింది.  అతను బాబుతో ఆ రాయి నాకు ఇస్తావా  ..   నీకు ఒక చిక్కీ (పల్లీ పట్టీ) ఇస్తాను అన్నాడు.   పిల్లాడు సంతోషంతో ఆ రాయి అతనికి ఇచ్చేశాడు
 
సాయంత్రం చెత్త వస్తువులు ఏరుకునే అతని స్నేహితుడు చూసి ఆ రాయి గురించి అడిగితే అతను ఎవరో పిల్లాడి చేతిలో ఉంటె బాగుంది కదా అని ఒక చిక్కీ ఇచ్చి తీసుకున్నాను అని చెప్పాడు.   ఆ స్నేహితుడు ఆ రాయిని కోరగా అతనికి ఇచ్చేశాడు.  అతను ఆ రాయిని మిగతా చెత్త వస్తువులతో కలిపి చెత్త వస్తువులు కొనే వ్యాపారి వద్దకి పోయి వస్తువులని వివిధ రకాలుగా విభజించి అతనికి అమ్మగా అతను ఈ రాయిని చూసి అది ఏమిటి ఇవ్వవా అని అడిగాడు.   దానికి అతను కొంత రొక్కము తీసుకుని ఆ రాయి వ్యాపారి కి ఇచ్చేశాడు.  బాగుంది కదా అని వ్యాపారి దాన్ని బల్ల పైన పేపర్ వెయిట్ గా వాడ సాగాడు.  కొన్ని రోజులకి ఒక టోకు వ్యాపారి ఇతని దుకాణానికి వచ్చి ఆ రాయిని చూసి, అతనికి కొంత రొక్కం ఇచ్చి ఆ రాయిని తీసుకున్నాడు.    దాన్ని వజ్రాల వ్యాపారి వద్దకి తీసుకుని వెళ్లి పరీక్ష చేయిస్తే అది కొన్ని కోట్లు విలువ చేసే మేలిమి వజ్రం అని తేలింది.    


        అదే రాయి ని ఒకళ్ళు కుంకుడు కాయలు కొట్టుకో డానికి వాడుకున్నారు.  ఒకళ్ళు రాళ్ళ ఆట ఆడుకోటానికి వాడుకున్నారు.  ఒకళ్ళు ఒక చిక్కీ కోసం దాన్ని ఇతరులకి ఇచ్చేశాడు.   ఒకళ్ళు దాన్ని పేపర్ వెయిట్ గా వాడుకున్నారు. నిజంగా దాని గురించి తెలిసిన వ్యక్తి దాని విలువ రాబట్టుకున్నాడు.    అట్లాగే ఈ మానవ జన్మ ఎంతో విలువైనది.   ఎంతో అరుదుగా లభించేది.   దాన్ని దేనికోసం వాడుకోవాలి అన్నది వారి వారిుద్ి ప్రోదానికి
లోబడి ఉంటుంది.   ానితార్ తెలిసిిారు ఈ జన్మ సరిగా వాడుకుం జీవన్ముక్తి పొంద గలుగుున్నార.     లేని వారు ఈ జీవితాన్నిా చేసుకొనుచున్నారు.
జన్మలు అంటే ఏమిటి? అందులో మానవ జన్మకు గల కారణం ఏమిటి? మొదట మనం జన్మ అంటే ఏమిటో తెలుసుకుందాం. జన్మ అంటే మళ్ళి పుట్టడం అంటే చనిపోయిన వాళ్ళు మళ్ళీ పుట్టడమే జన్మ. కాని మానవ జన్మే అని మాత్రం చెప్పలేము ఎందుకంటే మరల మనం పొందే జన్మ మనం సంపాదించుకున్న జ్ఞానం మీద మాత్రమే ఆధారపడుతుంది.
అన్ని జన్మలలోనూ మానవజన్మ మాత్రమే ఉత్తమోత్తమమైనది, దుర్లభమైనది. మానవుడు తన జీవిత కాలంలో అనేక కర్మలను చేస్తువుంటాడు. ఆ కర్మలకు ఫలితాలను అనుభవించాలి. వాటినే కర్మఫలాలు అంటారు.అనేక జన్మలలో చేసిన కర్మఫలాలు ఆ జీవుడితో పాటుగా ప్రయాణిస్తుంటాయి.
అన్నీ పుణ్య కర్మల ఫలాలు మాత్రమే పక్వానికి వచ్చినపుడు ఆ జీవుడు దేవలోకాలలో దేవ జన్మ నేత్తుతాడు. అక్కడ ఆ కర్మఫలాల కారణంగా అనేక భోగాలను అనుభవిస్తాడు. అది భోగ భూమి. కనుక అక్కడ అతడికి ఏ కర్మలు చేసే అధికారం లేదు. అందువల్ల పరమాత్మను అందుకోవటానికి తగిన కర్మలచరించే అవకాశం లేదు. తన కర్మఫలాలననుసరించి భోగాలననుభావించి, ఆ కర్మ ఫలాలు క్షయం కాగానే క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి అన్నట్లు ఈ మర్త్య లోకాన్ని – మానవ లోకాన్ని చేరవలసిందే. మరల మరల మానవ జన్మనో, జంతు జన్మనో ఎత్తవలసిందే. ఈ దేవ జన్మలో కేవలం మనోబుద్దులుంటాయే  కానీ కర్మజేయుటకు సాధనమైన స్థూల శరీరం వుండదు. కనుక భాగవత్సాక్షాత్కారానికి ఉపయోగపడే జన్మకాదు ఈ దేవజన్మ.
ఇక అన్నీ పాపకర్మల ఫలాలు మాత్రమే పక్వానికి వచ్చినపుడు ఆ జీవుడు జంతువులూ, పశువులు, పక్షులు, క్రిములు, కీటకాలు మొదలైన జంతువులుగా నీచయోనులయందు జన్మిస్తాడు.ఆ జన్మలలో ఆ కర్మఫలాల కారణంగా అనేక బాధలు,దుఃఖాలు అనుభవిస్తాడు, హింసించబడుతాడు.ఈ జన్మలలో కర్మలుచేస్తున్న అవి అన్నియు బుద్దిపరంగా కాదు, అవి అన్నియు కేవలం ప్రకృతి ప్రేరణలతో పరతంత్రంగా చేస్తాయి. ఈ జంతు జన్మలలో శరీరం –మనస్సు ఉన్నాయి గాని బుద్ధి మాత్రం లేదు.కనుక ఈ జన్మలలో కూడా కేవలం కర్మఫలాలు అనుభవించడమే కానీ పరమాత్మనందుకొనుటకు తగిన జ్ఞానాన్ని పొందే అవకాశం లేదు. కనుక భాగవత్సాక్షాత్కారానికి ఈ జంతు జన్మ కూడ ఉపయోగపడదు.
ఇక పుణ్యపాప కర్మల ఫలాలు మిశ్రమంగా పక్వానికి వచ్చినపుడు ఆ జీవుడు మానవ జన్మనెత్తటం జరుగుతుంది. ఈ మనవ జన్మలో పుణ్య కర్మల ఫలంగా సుఖాలు మరియు పాప కర్మల ఫలంగా దుఖాలు అనుభవిస్తాడు. అయితే ఇలా కర్మఫలాలనుభవించటం మాత్రమేగాక, కొత్తగా కర్మలు చేసే అధికారం కూడా ఈ మనవజన్మలోనే వుంది.ఎందుకంటే స్వతంత్రంగా బుద్ధి అనే సాధనం ఉన్న జన్మ ఇది. కనుక పరమాత్మను అందుకోవటానికి తగిన కర్మలు చేసే అధికారం, జ్ఞానాన్ని పొందే అవకాశం ఉన్న ఈ మనవ జన్మ ఉత్తమోత్తమమైనది మరియు దుర్లభమైనది అని అన్నారు. ఈ మనవ జన్మ 84 లక్షల జీవరాసులలో పుట్టి గిట్టిన తరువాత లభించే అపురూప జన్మ ఈ మనవ జన్మ. కనుకనే ఈ మనవ జన్మను జంతూనాం నారా జన్మ దుర్లభం అని ఆచార్య శంకరులు వివేక చూడామణి గ్రంధంలో తెలియజేసారు. ఇట్టి ఈ అపురూపమైన, ఉత్తమోత్తమమైన మరియు దుర్లభమైన మనవ జన్మను పొందిన ప్రతి ఒక్కరు దీనిని సార్ధకం చేసుకోవాలి. 
సరే జన్మలు అయితే ఏవో ఒకటి వస్తూనే వున్నాయి కాని ఎందుకు మనం ఈ విధంగా మళ్ళీ మళ్ళీ పుట్టవలసి వస్తుంది.పుట్టిన మన జన్మ లక్ష్యం ఏమిటి? జంతు జన్మలు పొందిన వాటి లక్ష్యం అయితే ఒకటే, అవి మానవ జన్మ పొందడానికి కర్మలను ఆచరిస్తువుంటాయి. మరి మనిషిగా పుట్టిన మనం ఏమి చేస్తున్నాం? మన లక్ష్యం ఏమిటి అన్నది? అంటే మనవ జన్మను పొందిన ప్రతి ఒక్కరు దీనిని సార్ధకం చేసుకోవాలి. సార్ధకం చేసుకోవడం అంటే ఏమిటి అన్నది ఇక్కడ మనం తెలుసుకోవాలి.  
సార్ధకం చేసుకోవడం అంటే ఏమిటి? సాధారణంగా మనం అంతా (మనుషులందరూ) బాగా చదువుకోవాలి, మంచి ఉద్యోగాలు చేయాలి లేదా పెద్ద పెద్ద పదవులు చేపట్టాలి. బాగా సంపాదించి భార్యబిడ్డలతో సహా తను అనేక భోగాలు అనుభవించాలి.అయితే ఇక్కడ ఎవ్వరు తాము కోరుకున్నట్లుగా జీవించలేకపోతున్నారు. ఎన్ని సుఖాలు, భోగాలు అనుభవించిన ఈ మనస్సుకు ఎదో ఒక వెలితి వుంటుంది.దీనికి కారణం మనం అనుభవించేవి ఏవి కూడ నిత్యమైన, పరిపూర్ణమైన సుఖాలు కాదు. ఇవి అన్నియు అనిత్యమైన వస్తువుల ద్వార వచ్చే సుఖాలు. నిత్యమైన, పరిపూర్ణమైన, శాశ్వతమైన సుఖం కావాలంటే నిత్యవస్తువు, పరిపూర్ణవస్తువు, శాశ్వత వస్తువు ద్వారానే లభిస్తుంది. ఏమిటది? ఆ నిత్యమైన వస్తువు ఏకమైన పరమాత్మ మాత్రమే. నిత్య వస్త్వేకం బ్రహ్మ తద్వ్యతిరిక్తం సర్వం అనిత్యం అని తత్వబోధ లో శంకరాచార్యులవారు స్పష్టం చేసారు. అంటే నిత్య వస్తువు ఏకమైన పరమాత్మా మాత్రమే. దానికి వేరుగా ఉన్న సర్వమూ అనిత్యమైనవే అని అర్థం.
కనుక నిత్యమైన పరమాత్మతో ఐక్యత వలన లభించే సుఖం – ఆనందం అందుకునేవరకు మానవుడికి తృప్తిలేదు. అసంతృప్తి తీరదు. అట్టి శాస్వతానందాన్ని అందుకోవడమే జన్మను సార్ధకం చేసుకోవడమంటే. ఆ శాస్వతానందాన్నే మోక్షం,  ముక్తి అన్నారు
.
ఈ సృష్టిలో వున్న ప్రతి జీవి భగవంతునిలో ఐక్యం (పరమాత్మునిలో విలీనం అదియే మోక్షం) కావాలంటే ఇక్కడ చేసిన అన్ని కర్మలని సంపూర్ణంగా నిర్మూలించుకొని, అంటే ఆత్మ స్వరూపుడవైన నీవు వీటి అన్నిటినుండి విముక్తిని పొందాలి. ఈ విధంగా విముక్తిని పొందడమే ముక్తి అని కూడ అంటారు. దానికి సరియైన జన్మ ఈ ఒక్క మానవ జన్మ మాత్రమే, ఇది యే జన్మలలోనూ సాధ్యం కాదు. జంతు జన్మలలో అయితే మనస్సు మాత్రమే ఉంటాయి వాటికీ బుద్ధి వుండదు. అందువలన మనం అజ్ఞానంతో, అవివేకంతో మరియు అవిద్యతో ఏర్పరచుకున్న ఈ కర్మ బంధనాల నుండి విముక్తి పొందడానికి వున్న ఏకైక మార్గం ఈ మానవ జన్మే. ఈ మానవ జన్మలో మనిషికి దేవుడు ఒక ఆయుధాన్ని ప్రసాదించాడు అదియే బుద్ధి. దీని ద్వార శాశ్వతమైన, నిత్యమైన, సత్యమైన, సత్తు గల దానిని అంటే నాశనం లేనిది ఏది అని గ్రహించి అదే విధంగా జ్ఞానాన్ని గ్రహించి అంటే నేను ఎవరు? ఎందుకు పుట్టాను? ఎవరికోసం రావలసి వచ్చింది?
నా లక్ష్యం ఏమిటి? నా ధ్యేయం ఏమిటి? ఈ విధంగా తెలుసుకొని మనస్సును మరియు బుద్దిని అదుపులో వుంచుకొని పరమాత్మా తత్వాన్ని, నిత్య సత్యమైన దానిని సంపుర్ణముగా తెలుసుకొని అదే విధంగా ఆత్మానాత్మ వివేకాన్ని గ్రహించడమే జ్ఞానం అని అంటారు. ఎప్పుడైతే నీలో ఈ ధ్యాస అంటే దేవుని గురించి తెలుసుకోవాలని నీలో తపన మొదలవుతుందో అప్పుడు ఆ దేవుడే నీకు ఖచ్చితంగా మార్గాన్ని లేకపోతే ఒక మంచి సద్గురువును ప్రసాదిస్తాడు. ఇక్కడ సద్గురువును ప్రసాదిస్తాడు అంటే దేవుడు తెచ్చి నీ ముందర సద్గురువును పెట్టడు. నువ్వు ప్రయత్నించు దానికి భగవంతుడు సహకారం అందిస్తాడు అని.

అంటే మనం అజ్ఞానంలో వుంటూ కర్మలను ఆచరిస్తూ అన్నియు దుష్కర్మలె చేస్తే 10౦% మనం మానవ జన్మ పొందడం మాత్రం సాధ్యం కాదు. అన్ని దుష్కర్మలె (చెడ్డ పనులే) చేస్తే వాటి ఫలితాలను నీవు అజ్ఞానంతో ఏర్పరచున్న కర్మ బందనములు ఒక సూక్ష్మ శరీరాన్ని ధరించి ఆ కర్మ ఫలితాన్ని నరకంలో అనుభవించి మళ్ళీ ఇక్కడ ఈ కర్మ భూమిలో నీ జ్ఞాన సముపార్జన ఆధారంగా నీకు ఎదో ఒక జన్మ వస్తుంది. మరి సత్కర్మలు ఆచరిస్తే మానవ జన్మ ఎత్తవచ్చా అంటే 99% మానవ జన్మ ఎత్తే అవకాశాలు వున్నాయి. కానీ సత్కర్మలు చేస్తే వాటి ఫలితాలను నీవు అజ్ఞానంతో ఏర్పరచున్న కర్మ బందనములు ఒక సూక్ష్మ శరీరాన్ని ధరించి ఆ కర్మ ఫలితాన్ని స్వర్గంలో అనుభవించి మళ్ళీ ఇక్కడ ఈ కర్మ భూమిలో నీ జ్ఞాన సముపార్జన ఆధారంగా నీకు జన్మ వస్తుంది. నీవు సత్కర్మలు ఆచరించి కొద్దిగలో కొద్దిగా దేవుని గురించి తెలుసుకొని వుంటే నీవు మంచి యోగుల కుటుంబంలో జన్మిస్తావు. (ఈ విషయాన్నీ భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు అర్జునకు ధ్యాన యోగంలో చెప్తాడు. అర్జునా! ఎవరు అయితే నా జ్ఞానాన్ని గ్రహించి యోగాన్ని (కర్మ,జ్ఞాన మరియు ధ్యాన) అవలంబించి ఉంటారో వారికి ఇంకా ఏదైనా ఒకవేళ కర్మలు వుంటే వారికీ ఖచ్చితంగా ఒక మంచి జన్మ అది ఉన్నతమైన కుటుంబంలో వస్తుంది. ఇందులో ఏ మాత్రం సందేహం వుండదు అని శ్రీ కృష్ణుడు అర్జునకు వివరిస్తాడు)

కాలేయం. - ట్రాన్స్‌ప్లాంటేషన్

human-liverమన గుండెకు అత్యంత ఇష్టమైన గ్రంథి కాలేయం. అందుకేనేమో! అన్ని శరీర భాగాలకు ఒకే మార్గంలో రక్త సరఫరా జరిగితే కాలేయానికి మాత్రం రెండు మార్గాల్లో రక్తం అందుతుంది. శరీరంలోని అతి పెద్ద గ్రంథి మాత్రమే కాదు.. మిగిలిన వాటి కన్నా భిన్నమైంది కూడా. ఒక కిడ్నీని దానం చేస్తే కేవలం ఒక కిడ్నీతోనే ఉండాలి. కాని లివర్‌ని దానం చేస్తే మాత్రం ఎంత ఇచ్చామో అంత తిరిగి పుడుతుంది. అందుకే ఎటువంటి భయం లేకుండా చేయగల దానం కాలేయ దానం. ప్రపంచవ్యాప్తంగా కాలేయం దెబ్బతింటున్నవాళ్లలో హెపటైటిస్ సి ఇన్‌ఫెక్షన్ ప్రధాన కారణం. హెపటైటిస్ ఇన్‌ఫెక్షన్ ఒకవైపు బాధిస్తుంటే.. మరోవైపు ఆల్కహాల్ తీసుకుంటూ కోరి మరీ కాలేయాన్ని పాడుచేసుకుంటున్నారు. జాగ్రత్తగా చూసుకుంటే కాలేయం మార్పిడి చేయాల్సిన అవసరమే ఉండదు.


ఆల్కహాల్ ఎక్కువగా తీసుకోవడం, వైరల్ ఇన్‌ఫెక్షన్లు సిర్రోసిస్‌కి దారితీస్తాయి. ట్రాన్స్‌ప్లాంటేషన్ తరువాత కూడా ఇన్‌ఫెక్షన్ వచ్చే అవకాశం చాలా చాలా తక్కువ. 1 శాతం ఉండొచ్చు. అయితే ఒకవేళ ఇన్‌ఫెక్షన్ వచ్చినప్పటికీ అది పెరిగి మళ్లీ సిర్రోసిస్‌కి దారితీసేసరికి ఓ పదిహేనేళ్లయినా పడుతుంది. కాబట్టి ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయించుకోవాలనే సూచిస్తారు. క్యాన్సర్ పేషెంట్ల విషయంలో కాలేయంలో 5 సెంటీమీటర్ల కన్నా చిన్నదైన ట్యూమర్ ఉన్నా, మూడు ట్యూమర్లు ఒక్కోటి 3 సెంటీమీటర్లు మించకుండా ఉన్నా ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయవచ్చు. క్యాన్సర్ కాలేయం చుట్టుపక్కలే ఉండే లింఫ్ గ్రంథులకు కూడా వ్యాపించకూడదు.

-హెపటైటిస్... ఫ్యాటీ లివర్.. సిర్రోసిస్... ఇలా సమస్య ఏదైనా కాలేయాన్ని పూర్తిగా పనికిరాకుండా చేయగల శక్తి వీటికి ఉంది. సాధారణంగా కాలేయంలో సమస్య రాగానే ట్రాన్స్‌ప్లాంటేషన్ అంటారేమోనని భయపడుతుంటారు. కాని ఏ సమస్య అయినా మరీ తీవ్రమై, లివర్‌ను మందుల సపోర్టుతో కూడా బతికించలేము అనుకున్నప్పుడు ట్రాన్స్‌ప్లాంటేషన్‌ను సూచిస్తారు. అక్యూట్ లివర్ ఫెయిల్యూర్, సిర్రోసిస్‌తో కాంప్లికేషన్స్ రావడం, ప్రైమరీ లివర్ క్యాన్సర్ (హెపటోసెల్ క్యాన్సర్) ఉన్నప్పుడు సాధారణంగా కాలేయ మార్పిడికి వెళ్లమని చెబుతారు. అయితే కొన్ని రకాల జీవక్రియలకు సంబంధించిన సమస్యలున్నప్పుడు కూడా ట్రాన్స్‌ప్లాంటేషన్ అవసరమవుతుంది. ఇలాంటివి పుట్టుకతోనే వస్తాయి. హీమోక్రోమెటోసిస్, ఆల్ఫా 1 ట్రిప్సిన్ లాంటి ఎంజైమ్ లోపాలు, సిస్టిక్ ఫైబ్రోసిస్, విల్‌సన్స్ డిసీజ్ లాంటి పుట్టుకతో వచ్చే లివర్ వ్యాధులు, ప్రైమరీ ఆక్జల్యూరియా (ఇది మూత్రంలో చేరడం వల్ల కిడ్నీలో రాళ్లు), ప్రైమరీ బిలియరీ సిర్రోసిస్ వంటి సమస్యలకు కాలేయ మార్పిడి తప్పనిసరి అవుతుంది.

ట్రాన్స్‌ప్లాంటేషన్.. ఎలా?


-ప్రమాదాల్లో గాని, ఇతరత్రా కారణాల వల్ల గాని చనిపోయిన వ్యక్తి లేదా బ్రెయిన్ డెత్ అయిన దాత నుంచి సేకరించిన లివర్‌ను ట్రాన్స్‌ప్లాంట్ చేయడం ఒక పద్ధతైతే, పేషెంటు కుటుంబ సభ్యుల దగ్గరి నుంచి తీసుకున్న కాలేయాన్ని ట్రాన్స్‌ప్లాంట్ చేయడం మరో పద్ధతి. వీళ్లని లైవ్ డోనర్స్ అంటారు. సాధారణంగా న్యూరలాజికల్ కండిషన్స్ వల్ల చనిపోయిన వాళ్లను దాతలుగా ఎంచుకుంటారు. పెద్దవాళ్లు కాకుండా సాధ్యమైనంతవరకు వయసు తక్కువగా ఉన్నవాళ్లను ఎంపిక చేసుకుంటారు. గుండె, కిడ్నీ, ఊపిరితిత్తుల వంటి వాటికి సంబంధించిన జబ్బులున్నవాళ్లను, ఐసియులోని వాళ్ల నుంచి తీసిన కాలేయాన్ని మార్పిడి చేయకూడదు. అలా చేస్తే కాలేయ మార్పిడి ఫెయిల్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

ఎవరు దాత?


-కెడావర్ దాతలు అందుబాటులో లేకపోవడం వల్ల 1998లో ఇలా లైవ్ డోనర్ నుంచి కాలేయాన్ని తీసుకోవడం ఆరంభమైంది. ఇందుకోసం కుడి లేదా ఎడమ లోబ్ మాత్రమే తీసుకుంటారు. దీన్ని ఒక చిన్నారికి, పెద్దవాళ్లకు ఒకరికి అమర్చవచ్చు. ఇప్పుడు 70 శాతం ట్రాన్స్‌ప్లాంటేషన్లు లైవ్ డోనర్ నుంచి తీసుకునేవే ఉంటున్నాయి.
-ఫ్యాటీ లివర్ ఉన్నవాళ్లు, స్థూలకాయం, బిఎంఐ 40 మించినవాళ్లు కాలేయదానానికి అర్హులు కారు.
-గుండె, ఊపిరితిత్తులు, కిడ్నీ జబ్బులుండకూడదు. క్యాన్సర్ పేషెంట్లయితే క్యాన్సర్ చికిత్స తీసుకుని, అది నయమైన అయిదేళ్ల వరకు దానం చేయకూడదు.
-అదుపులో లేని డయాబెటిస్, బీపీ ఉన్నవాళ్లు, పల్మనరీ హైపర్‌టెన్షన్ ఉన్నవాళ్లు ఇవ్వకూడదు.
-హెచ్‌ఐవి, హెచ్‌బివి, హెచ్‌సివీ ఉన్నవాళ్ల నుంచి కాలేయాన్ని తీసుకునేవాళ్లు కాదు. కాని ఇప్పుడు ఆయా రోగాలున్నవాళ్లకు లివర్ అవసరం అయినప్పుడు వాళ్ల నుంచి కూడా లివర్ తీసుకుంటున్నారు.

ట్రాన్స్‌ప్లాంటేషన్.. ఎవరికి చేయాలి?


-కాలేయ మార్పిడి చేయించుకునేవాళ్లకు గుండెజబ్బులు, శ్వాసకోశ వ్యాధులు, కిడ్నీ సమస్యలు ఉండకూడదు. ఇలాంటి కొన్ని అంశాలను బేరీజు వేసుకుని ట్రాన్స్‌ప్లాంటేషన్ చేసిన తరువాత తొందరగా చనిపోవచ్చు అనుకుంటే తదనుగుణమైన నిర్ణయం తీసుకుంటారు. పేషెంటు ఇతరత్రా ఆరోగ్యంగానే ఉన్నాడనుకుంటే 60, 70 ఏళ్లు దాటినా చేస్తారు. సాధారణంగా ఎక్కువ వయసు వాళ్లలో రిస్కు ఎక్కువ. కాలేయ మార్పిడి చేయించుకున్నవాళ్లు జీవితాంతం ఇమ్యునో సప్రెసెంట్ మందులను వాడుతూ ఉండాలి. పొగ తాగడం, ఆల్కహాల్ తీసుకోవడం లాంటి అలవాట్లు ఉంటే మానేయాలి. ఆల్కహాలిక్ లివర్ ఉన్నవాళ్లకు ట్రాన్స్‌ప్లాంటేషన్‌కి ముందు ఆరు నెలల పాటు ఆల్కహాల్ ఆపేయాలని చెబుతాం. అలా ఆపేయగలిగితేనే ట్రాన్స్‌ప్లాంటేషన్‌కి వెళ్తాం. సర్వికల్, రొమ్ము, అండాశయ క్యాన్సర్ల వంటివి లేవని నిర్ధారణ చేసుకోవాలి. రోగి, దాతల రక్తం గ్రూపులు మ్యాచింగ్ అవ్వాలి.

ట్రాన్స్‌ప్లాంటేషన్ తరువాత...


-రెండు మూడు వారాల పాటు ఆస్పత్రిలో ఉండాల్సి వస్తుంది.
-డిశ్చార్జి అయిన తరువాత కుటుంబ సభ్యుల నుంచి సపోర్టు ఉండాలి.
-మందులను రెగ్యులర్‌గా, మర్చిపోకుండా వాడుకోవాలి. క్రమం తప్పకుండా డాక్టర్‌ను కలవాలి.
-మొదటి రెండు మూడు నెలల్లో అక్యూట్ రిజెక్షన్ అయ్యే అవకాశం ఉంటుంది. అందువల్ల ఇమ్యునో సప్రెసెంట్ మందులను జీవితాంతం వాడాల్సి ఉంటుంది.
అర్హతను నిర్ణయించే మెల్డ్ (ఎంఈఎల్‌డీ)
-కాలేయ మార్పిడిలో సరైన పేషెంటును, దాతను సెలక్ట్ చేసుకోవడం ముఖ్యం. ఎంత నైపుణ్యం గల సర్జన్ ఉన్నప్పటికీ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ను తట్టుకునే సామర్థ్యం పేషెంటుకు ఉండడం ముఖ్యం.
-పాశ్చాత్యదేశాల్లో అయితే యు.ఎన్.ఒ.ఎస్. లో రిజిస్ట్రేషన్ అయినవాళ్లకు మాత్రమే కాలేయ మార్పిడి చేస్తారు. ఇక్కడ కూడా మెల్డ్ (ఎంఇఎల్‌డి) స్కోరు 15 లోపు ఉన్నవాళ్లకు మాత్రమే కాలేయ మార్పిడి చేయించుకోవడానికి అర్హత ఉంటుంది. కాలేయంలో తయారీ విధులను నిర్వర్తించే కొన్ని కొన్ని ఎంజైమ్‌లు, అల్బుమిన్, బిల్‌రుబిన్, క్రియాటినిన్, క్లాటింగ్ ఫ్యాక్టర్లు తగిన మోతాదుల ఆధారంగా మెల్డ్ స్కోరును గణిస్తారు.
-20 శాతం మందిలో సిర్రోసిస్‌కి కారణం హెపటైటిస్ సి ఇన్‌ఫెక్షనే కారణం. ఇన్‌ఫెక్షన్ ఉన్నప్పుడే సకాలంలో సరైన వైద్యం తీసుకోవడమే కాకుండా, మందులను శ్రద్ధగా వేసుకుంటే ట్రాన్స్‌ప్లాంటేషన్ అవసరం రాకుండా చూసుకోవచ్చు.
 



http://namasthetelangaana.com/zindagi/కాలేయం-పదిలం-6-1-413239.aspx

జీలకర్ర గురించి తెలుసుకుందాం

.జీలకర్ర నల్ల మిరియాలు తర్వాత ప్రపంచవ్యాప్తంగా రెండవ స్థానంలో ప్రసిద్ధిచెందిన మసాలా దినుసు.[జీలకర్ర : జీలకర్రను మనం రోజువారీగా వాడుతూనే ఉంటాం. జీలకర్ర రెండు రూపాల్లో లభిస్తుంది. నల్లజీలకర్ర, మామూలు తెల్ల జీలకర్ర. నల్లజీలకర్రను షాజీర అంటారు. రెంటికీ ఔషధ గుణాలున్నాయి. వీటిని అనేక గృహ చికిత్సలకు వాడుతూ ఉంటారు .

 ఇది మనము వంట ఇంట్లో వాడుకునే పోపు(మసాలా) దినుసులలో ఒకటి .జీలకర్ర గింజలు క్యుమినమ్ సైమినమ్ (Cuminum cyminum) అనే ఏకవార్షిక మొక్క నుండి లభిస్తాయి. ఈ మొక్కలు గుల్మాలుగా సన్నని కొమ్మలతో సుమారు 20–30 cm పొడవు పెరుగుతాయి. దీని ఆకులు 5–10 cm పొడవు, pinnate or bipinnate, సన్నని దారాలవంటి పత్రకాలతో ఉంటాయి. ఆవ పువ్వులు చిన్నగా తెలుపు లేదా పింక్ రంగులో ఉంటాయి. దీని పండు కోలగా 4–5 mm పొడవుండి ఒకే ఒక్క గింజని కలిగువుంటాయి . గింజలనే వంటకాల లోనూ , ఔషధము గాను వాడుతారు . ప్రాచీన కాలము నుండీ ఇది వాడుకలో ఉంది . మొదటిలో ఇది ఇరాన్‌ ప్రాంతము లో విరివిగా ఉండేదని బైబిల్ లో ఉందని చెప్పుకుంటారు . గ్రీకులు, రోమన్లు వాడుకులో ఉందిని అంటారు . హిందూ వివాహములో జీలకర్ర బెల్లము తలపై పెట్టుకోవడం ఒక ముఖ్యమైన ఘట్టము .

జీలకర్ర ఔషధ గుణాలు :

జీలకర్ర  రోగ నిరిధక శక్తిని పెంచుతుంది.ఇది యాంటీ ఆక్సిడెంట్స్ గుణాన్ని కలిగి ఉండటం వల్ల శరీరంలో చేరిన మురికిని మరియు ఫ్రీ రాడికల్స్'ను తొలగించి, వ్యాధులను తట్టుకొనే విధంగా శరీర రోగనిరోధక శక్తిని పెంచుతుంది
 * జీలకర్ర అజీర్ణ నివారిణిగా పనిచేస్తుంది. జీలకర్రలో కాల్షియం, ఫాస్ఫరస్, ఐరన్, సోడియం, పొటాషియం, విటమిన్ 'ఎ ', 'సి' లు ఎక్కువగా ఉన్నాయి
* కడుపులో వికారంగా ఉండి పుల్లని తేనుపులతో బాధపడేవారు కొంచం జీలకర్రను నమిలి రసం మింగితే ఉపశనం కలుగుతుంది.
* కడుపులో నులిపురుగులను నివారిస్తుంది. దీనిని తరుచు నమిలి రసం మింగుతుంటే కడుపులో ఉన్న నులిపురుగులను  నివారించడమే కాదు, ఉదర సంబంధ వ్యాధులు కూడా తగ్గుతాయి.
* జీలకర్రను కషాయంగా కాచి తాగుతుంటే ఎలర్జీ వలన కలిగే బాధలు తగ్గుతాయి. నల్ల జీలకర్ర కషాయాన్ని సేవిస్తే షుగర్, బీ.పీ.ని అదుపులో ఉంచుతుంది.
* గుండె నొప్పులు రాకుండా కాపాడుతుంది. డయేరియాతో బాధపడేవారు ఒక టీ స్పూన్ జీలకర్ర నీటిలో తీసుకుని ఒక టీస్పూన్ కొత్తిమీర రసం, చిటికెడు ఉప్పు కలిపి తీసుకుంటుంటే డయేరియా తగ్గుతుంది. భోజనం తర్వాత రోజుకు రెండుసార్లు ఇలా తీసుకోవాలి.
* నల్ల జీలకర్ర మూలశంకకు మంచి మందు.
* నిద్రలేమి సమస్యతో బాధపడేవారు నల్లజీలకర్రను వేయించి మగ్గిన అరటిపండుతో తీసుకుంటే నిద్రలేమి సమస్య పరిష్కారం అవుతుంది.
* గొంతు సంబంధిత సమస్యలతో బాధపడే వారికి కూడా జీలకర్ర చక్కటి ఔషధంలా పనిచేస్తుంది.
* నీళ్ళలో కొద్దిగా అల్లం వేసి బాగా కాయాలి. ఇందులో ఒక టీ స్పూన్ జీలకర్ర కలిపి తీసుకుంటే గొంతు నొప్పి, గొంతు మంట, జలుబు, జ్వరం తగ్గుతాయి.
* కనీసం వారానికి ఒకసారి జీలకర్ర రసాన్ని ఒక ఔన్స్  సేవిస్తే గుణం కనిపిస్తుంది.
* కఫ సమస్యలతో బాధపడేవారు జీలకర్ర కషాయం సేవిస్తే గుణం కనిపిస్తుంది.
* వాంతులతో బాధపడేవారు జీలకర్ర నమిలి రసాన్ని మింగితే వాంతులను  నివారిస్తుంది.
*ఫైనాఫిల్ రసం లో జీలకర్ర పొడిని కలిపి తీసుకుంటే ..  varicose vein వ్యాధి తగ్గుతుంది
గర్భిణీలు తీసుకుంటే మార్నింగ్ సిక్‌నెస్ తగ్గుతుంది. పిండం ఎదుగుదలకు సులువుగా ప్రసవం కావడానికి సహకరిస్తుంది. పిల్లల ఆహారంలోనూ దీనిని చేర్చవచ్చు. చాలామంది కుటుంబాలలో జీలకర్రను సహజసిద్ధమైన జీర్ణకారిగా పరిగణిస్తారు. ఎలర్జిక్ రియాక్షన్లనుంచి కాపాడుతుంది. నీరు, నిమ్మరసం, ఉప్పు, జీలకర్ర పొడి కలుపుకుని తాగితే డయేరియా అరికట్టబడుతుంది.
జీలకర్రలో పోషకాలు, ప్రొటీనులు, ఫ్యాట్, కార్బోహైడ్రేట్స్, ఐరన్, కాల్షియం, ఫాస్పరస్‌లు పుష్కలంగా ఉంటాయి. తరచూ నిద్రాభంగానికి గురయ్యేవారు, నిద్రలేమితో బాధపడేవారు జీలకర్రను ఏదో ఒక రూపంలో తీసుకుంటే మంచి ఉపయోగం.నిద్రాభంగానికి గురయ్యేవారు, నిద్రలేమితో బాధపడేవారు జీలకర్రను ఏదో ఒక రూపంలో తీసుకుంటే మంచి ఉపయోగం ఉంటుంది.

అనీమియా
రక్తంలో హీమోగ్లోబిన్ తయారు అవటానికి కావలసిన ముఖ్యమైన పోషకం అయినట్టి ఐరన్ మూలకాన్న్నిపుష్కలంగా కలిగి ఉంటుంది. శరీరంలో ఐరన్ తగ్గటం వల్ల అనీమియా వస్తుంది, ఇది ఎక్కువగా పిల్లలలో, ఆడ వాళ్ళలో, యక్తవయస్సు వాళ్ళలో ఎక్కువగా వస్తుంది. ఆహారంలో జీలకర్రని కలుపుకోవటం వలన ఐరన్'ని పొందవచ్చు .

జీర్ణక్రియ
జీలకర్ర కాలేయంలో పైత్యరసం తయారవటాన్ని ప్రోత్సహిస్తుంది, పైత్యరసం ఫాట్స్'ను విచిన్నం చేయటంలో మరియు పోషకాలను గ్రహించటంలో సహాయపడుతుంది. దీని వల్ల జీర్ణక్రియ రేటు పెరుగుతుంది. జీలకర్ర కడుపు నొప్పి, విరోచనాలు, ఓకారము, ఉదయపు అలసటను మరియు అజీర్ణము వంటి వాటిని తగ్గిస్తుంది.*కొత్తిమీరలో జీలకర్ర పొడి , ఉప్పు వేసి కలిపి తాగితే జీర్ణ శక్తి పెంపోందిస్తుంది . కడుపు లోని గ్యాస్ ని బయటకి నెట్టి వేస్తుంది , విరోచాలని తగ్గిస్తుంది .*నీటిని తీసుకొని దాంట్లో జీలకర్ర పొడిని మరియు కాస్త చిటికెడు మిరియాల పొడి .. యలుకుల పొడి వేసి బాగా సన్నని సెగ పైన పెట్టి కషాయం కాయలి  (కషాయం ఒక గ్లాస్ నీటికి అరా గ్లాస్ నీరు రావాలి ).. ఈ కాషాయన్ని వడకట్టి . పరగదుపున తాగితే రక్త పోటు తగ్గుతుంది . శరీరం లోని అనవసరపు కొవ్వుని కరిగిస్తుంది . షుగర్ వ్యాధిని నివారిస్తుంది . *అరటి పండుని తీసుకొని దాన్ని బాగా నలిపి దాంట్లో జీలకర్ర పొడిని కలిపి తింటే .. నిద్ర వొస్తుంది . అధిక బరువు తగ్గుతారు .

మొలలు (Piles)
వంటింట్లో సాధారణంగా ఉండే పదార్థాలు ఎక్కువగా మొలల వ్యాధులను తగ్గించలేవు. జీలకర్ర ఎక్కువగా ఫైబర్, యాంటీ-ఫంగల్, లాక్సైటీవ్స్, కార్మినేటివ్ గుణాలను కలిగి ఉండటం వల్ల దీన్నిమొలలకు  చికిత్సగా వాడతారు
*అల్సర్ : 
ఒక స్పూన్ నెయ్యి లో ఒక స్పూన్ జీలకర్ర పొడిని కలిపి రోజు పరగదుపున తీసుకుంటే శరీరం లో అల్సర్ మరియు పుండ్లు తగ్గుతాయి . spasmodic pain ని కోడా నివారిస్తుంది .

చర్మ వ్యాధులకు
జీలకర్ర విత్తనాలు విటమిన్ E’ ని కలిగి ఉండటం వల్ల చర్మాన్ని ఆరోగ్యంగానూ, ప్రకాశవంతంగాను చేస్తుంది. జీలకర్ర ఎక్కువ ఎస్సేన్షియల్ ఆయిల్స్'ని కలిగి ఉండటం వల్ల శుద్ధకారినిగా పనిచేస్తుంది మరియు యాంటీ-ఫంగల్ గుణాన్ని కాలిగి ఉండటం వల్ల చర్మాన్ని ఫంగల్ మరియు మైక్రోబియల్ అంటువ్యాధుల భారి నుండి కాపాడుతుంది. జీలకర్ర లేహ్యన్ని మొహానికి పూసుకోవటం వల్ల మొటిమలు, గజ్జి, సోరయాసిస్ వంటి చర్మ వ్యాధులను త్వరగా తగ్గిస్తుంది .
నిమ్మ రసం లో కాస్త జీలకర్ర పొడి ని వేసి కలిపి చెమట పొక్కులు ఎక్కడ వున్న వాటి పైన రాస్తే వెంటనే తగ్గిపోతాయి .
*నిమ్మ రసం లో కాస్త జీలకర్ర పొడి దాంట్లో చిటికెడు ఉప్పు మరియు నీరు కలిపి తాగితే శరీరానికి చలువ చేస్తుంది . మరియు కడుపులోని గ్యాస్ ని బయటకి నెట్టివేస్తుంది . శరీరం లోని పుండ్లను తగీస్తుంది .


జుట్టు రాలటం
జీలకర్రని వాడటం వల్ల వెంట్రుకల మందాన్ని పెంచి, బట్టతలని, జుట్టు రాలిపోవటాన్ని తగ్గిస్తుంది. సమాన మోత్తంలో ఆలివ్ ఆయిల్ మరియు జీలకర్ర ఆయిల్ బాగా కలిపి జుట్టికి రాయటం వలన వెంట్రుకల పెరుగుదలను ప్రోత్సహించి, జుట్టు రాలటాన్ని తగ్గిస్తుంది. జీలకర్ర ఆయిల్'ను కాప్సుల్ లేదా ఔషదాల తయారీలలో కూడా వాడతారు.
*కొబ్బరి నూనె లో కాస్త జీలకర్ర పొడి వేసి కాచి తలకి పట్టించి .. తరువాత తలస్నానం చేస్తే కళ్ళలో ఉండే వేడి తగ్గుతుంది  .. మరియు తలలో చుండ్రు ని నివారిస్తుంది . జుట్టు బలం గా ఉంటుంది .*తలలో ఏమి అయిన ఇన్ఫెక్షెన్ మరియు దురదలు , వేడి ఉన్నప్పుడూ ... బాగా కాచిన ఆవుపాలలో కాస్త మిరియాల పొడి మరియు జీలకర్ర పొడి 2 స్పూన్ లు వేసి బాగా కలిపి తలకి పట్టించి మర్దన చేయాలి తరువాత .. షాంపూస్ లేక కుంకుడు కాయలతో తల స్నానం చెయ్యాలి .
 

ఆస్తమా
జీలకర్ర విత్తనాలు తైమోక్వినోన్'ని కలిగి ఉందటం వల్ల అస్తమాని కలుగ చేసే అంటువ్యాధుల ఇన్ఫ్ల-మేషన్ లేదా మరియు కారకాలను తగ్గిస్తుంది. అంతే కాకుండా బ్రాంకో-డైలేటర్'గా పనిచేస్తుంది
నెలసరి
అన్ని వయస్సు గల ఆడవాళ్ళలో వచ్చే నెలసరిని క్రమంగా వచ్చేలా చేస్తుంది మరియు నెలసరిలో వచ్చే ఇబ్బందులను తగ్గిస్తుంది. ఇది అధికంగా యాంటీ ఆక్సిడెంట్ గుణాలని కలిగి ఉండటం వలన రుతుక్రమ సమయంలో ఇబ్బందులకు తట్టుకునేలా శరీరాన్ని ప్రోత్సహిస్తుంది

యాంటీ ఏజింగ్
జీలకర్ర విటమిన్ E’ని ఎక్కువగా కలిగి ఉండటం వల్ల, యాంటీ-ఏజింగ్'గా పనిచేసి చర్మం పైన ముడతలు రాకుండా చేస్తుంది. ఇది యాంటీ-ఆక్సిడెంట్ గుణాన్ని కలిగి ఉండటం వల్ల చర్మం పైన వచ్చే ముడతలను తేప్పించే ఫ్రీ రాడికల్స్'కి వ్యతిరేకంగా పనిచేస్తుంది..

*జీలకర్ర ని పొడి చేసుకొని ఉంచుకో కూడధు .. జీలకరా పొడి చేసుకొను వాడుకోవాలి అనుకుంటే ఒక గంట లోపు పొడిని వాడుకోవాలి లేకపొతే జీలకర్ర లో ఉండే essential oils ఆవిరి అయిపోతాయి



29 Jun 2015

మరణం తరువాత శరీరాన్ని విడిచిన ఆత్మ ఏమవుతుంది

మరణం తరువాత ఏమిటి? ఇది చాల మందికి ఉన్న సందేహం. మనం మనకు ఈ స్తూల శరీరం ఉన్నంతవరకు దాని గురించి పెద్దగా ఆలోచించము. ఎవరైనా చనిపోతే అప్పుడు నేను ఇంక బతికే ఉంటాను అని అనుకొని ఊరికే ఉండిపోతాము. 
 
ఇంకా కొందరు అయితే ఆత్మ ఇక్కడే తిరుగుతూ ఉంటుంది అని మరికొందరు స్వర్గానికో లేక నరకానికో తీసుకొని వెళ్లి ఉంటారని ఇలా ఎన్నో ఊహాగానాలు. కాని నిజంగా ఏమో మాత్రం ఎవరికీ తెలియదు.
ఈ మరణం తరువాత ఏమిటి అన్న సందేహానికి జవాబు కఠోరఉపనిషత్తు లో తెలుపబడింది. నచికేతుడు యమధర్మరాజును మూడు వరాలు అడుగుతాడు  అందులో ఒకటి మరణం తరువాత ఏమి జరుగుతుంది. అప్పుడు యమధర్మరాజు నచికేత ఇది చాల సూక్ష్మమైన విషయం. ఇది కాక ఏదైనా వేరే వరం కోరుకోమని అంటాడు. కాని నచికేతుడు పట్టుబడుతాడు.నాకు మృత్యువు తరువాత ఏమి జరుగుతుందో నీ ద్వారానే తెలుసుకోవాలి అని అంటాడు. 
 
అప్పుడు యమధర్మరాజు, ఓ నచికేత నీకు సనాతనము అయిన బ్రహ్మాన్ని గురించి మరియు చనిపోయిన తరువాత ఆత్మ ఏమవుతుందో కూడా చెబుతాను. ఇప్పుడు దాని గురించి తెలుసుకుందాం.
యమధర్మరాజు చెప్పినట్లు ఇది నిజంగా చాల సూక్ష్మమైన విషయం. మనిషి పుట్టినప్పటినుంది ఏవేవో పనులు చేస్తూ కాలాన్ని వెళ్ళదీస్తూ వుంటాడు. అయితే తను ఏమి సాధించాలి నేను ఎందుకు పుట్టాను అని మాత్రం ఆలోచించడు. ఎదో మంచి జీవితం మంచి భార్యా తరువాత పిల్లలు వీటితోనే సతమతమవుతూ తాను  ఎందుకు పుట్టానో కూడ తెలుసుకునేంత సమయం లేదు. కాని ఎదో ఒక రోజు నువ్వు కాదన్న ఎవరు కాదన్న మరణం మాత్రం నీ వెనకే వుంటుంది, అది ప్రతి ఒక్కరి జీవితంలో సంభవిస్తుంది. దీనిని కూడ మనం గమనించే పరిస్తితులలో ఉండము.
 
మరణం తరువాత ఏమి జరుగదు. నువ్వు నీ తల్లి కడుపులో నుండి వచ్చేటప్పుడు వెంట తెచ్చుకున్న నీ పాపపుణ్యాలను సమూలంగా నిర్ములించుకొని వుంటే నీవు (అంటే ఆత్మ) పరమాత్మునిలో అంటే పరమాత్ముని సాగరంలో విలీనం అవుతావు లేకపోతే నీ కర్మల అనుసారంగా నీవు ఒక సూక్ష్మ శరీరాన్ని ధరించి, సత్కర్మలు (మంచి పనులు) చేసి వుంటే స్వర్గానికి లేక దుష్కర్మలు (చెడ్డపనులు) చేసి వుంటే నరకానికి వెళతావు. దీనిని ఎవరు ఆపలేరు. 
 
ఒకవేళ నువ్వు ఈ శరీరంతో ఉన్నప్పుడు భగవంతుని జ్ఞానాన్ని గ్రహించి ఉంటే కొద్దిగలో కొద్దిగా తెలుసుకొని వుంటే నీకు మరల మనిషి జన్మ వస్తుంది అది ఒక మంచి యోగుల కుటుంబంలో.ఇందులో ఎటువంటి సందేహం అవసరంలేదు. ఇది స్వయంగా శ్రీ కృష్ణుడు అర్జునకు వివరించాడు. అట్లా కాక సంపూర్ణంగా జ్ఞానాన్ని గ్రహించి మనస్సును బుద్దిని అదుపులో వుంచుకొని యోగాన్ని అవలంబించి అన్ని కర్మలను తొలగించుకొని నువ్వు విముక్తడవు అయి వుంటే మాత్రం నువ్వు (ఆత్మ) ఆ పరంధామునిలో ఐక్యం అవుతావు.ఇందులో ఎటువంటి సందేహం అవసరం లేదు.
 
కాని మనకు తెలియదు మన కర్మలు అన్నియు అయిపోయినయో లేదో. కావున మనం మన ఈ స్తూల శరీరంను ధరించి ఉండగానే ఎటువంటి సందేహం లేకుండా ముక్తిని పొందే ఒక సదవకాశం వుంది. ఆ విధంగా మనం శరీరంతో ఉండగానే మనకు మరల జన్మలు రావు అని మనం నిశ్చింతగా ఉండాలంటే దానికి మనం చేయవలసిన పని సాధన(ధ్యానం) చేసి ఆ భగవంతునిని ఈ శరీర హృదయంలో సాక్షాత్కరించుకోవడమే. ఇది చేస్తే మనకు ఇంకా ఎటువంటి సందేహాలు వుండవు. అప్పుడు నీకు తెలియని విషయము అంటూ ఈ లోకంలో ఏది ఉండదు. అంటే అప్పుడు నీవు ఎవరు, దేవుడు ఎవరు, ఈ ప్రకృతి ఏంటి, అసలు ఇంతగా మభ్య పెడుతున్న ఈ మనస్సు ఏమిటి అన్న ప్రతి సందేహం తీరిపోతుంది. అప్పుడు తెలుస్తుంది మనస్సు అనేదే లేదు, మనస్సు అనేదే ఒక భ్రమ అని . అది తెలుసుకోవాలంటే మనం అందరం చేయవలసిన పని ఆ బ్రహ్మాండ కోటి నాయకుడైన ఆ వాసుదేవున్ని (పరమాత్మను) మన హృదయంలో దర్శించుకోవడమే.
 
ఈ విధంగా మరణించిన తరువాత వారు సంపాదించుకున్న జ్ఞానాన్ని అనుసరించి వారికీ మరల యేయే జన్మలు అనేది వారి మీదనే ఆధారపడి వుంటుంది. కొన్ని జీవాత్మలు శరీరం కోసం గర్భంలో ప్రవేసిస్తాయి.
అసలు మనిషి జీవిత లక్ష్యమే భగవంతునిని పొందడం అంటే జ్ఞానాన్ని గ్రహించి అతని తత్వాన్ని అందరికి తెలియపరచి ఆయనను నిరంతరం భక్తి శ్రద్దలతో స్మరిస్తూ ఆ దేవదేవునిని హృదయంలో సాక్షాత్కరించుకోవడమే మనిషి పుట్టుక యొక్క లక్ష్యం. ఇదియే గమ్యం ఇదియే శాశ్వతం. అసలు మనం పుట్టింది కూడ ఇందుకే.

Blood Groups ,బ్లడ్ గ్రూప్స్ గురించి తెలుసుకుందాము


రక్తం లో ఏమి ఉంటాయి :

  • 55 శాతము ప్లాస్మా ,
  • 45 శాతము సెల్స్ .... ఉంటాయి .
  • ప్లాస్మాలో 91% నీరే , 8% ఆర్గానిక్ మాలిక్యూల్స్ , 1% ఇనర్గానిక్ మాలిక్యూల్స్ ఉంటాయి .
  • సెల్స లో ఎర్రరక్తకణాలు (RBC),తెల్లరక్తకణాలు(WBC) , ప్లేట్ లెట్స్(platlets) ఉంటాయి .
  • ఒక లీటరు రక్తం లో --- ఎర్ర రక్తకణాలు =5-6 మిలియన్లు -ఆక్షిజన్ సరఫరా కు తోడ్పడతాయి ,
  • ----తెల్లరక్త కణాలు =4-11 మిలియన్లు ,--శరీరం లొ ఇంఫెక్షన్ పై దాడి చేసి రక్షణ కల్పిస్తాయి .
  • -------------------ప్లేట్ లెట్స్ కణాలు=1.5 - 4 మిలియన్లు ఉంటాయి -- రక్తం గడ్డ కట్టడానికి సహకరిస్తాయి .
  • ఎర్రరక్త కణాలు తగ్గితే అనీమియా అంటారు . ఎర్ర కణాలు శరీరము లో ఆక్షిజన్ సరఫరాకు ఉపయోగ పడతాయి . ఐరన్ , ఫోలిక్ ఆసిడ్ , విటమిను బి12 , విటమిను సి , తగినంత పోటీన్లు లేకపోవడం వలన రక్తహీనత ఏర్పడుతుంది .

రక్త వర్గం ( రక్తం యొక్క రకం)-బ్లడ్ గ్రూప్ :

ఒక రక్త వర్గం ( రక్తం యొక్క రకం (బ్లడ్ గ్రూప్)) అనేది ఎర్ర రక్త కణాల(RBCs) ఉపరితలంపై ఉండే అనువంశికంగా పొందిన యాంటిజెనిక్ పదార్ధాలు ఉండటం లేదా లేకపోవడం పై ఆధారపడిన రక్తం యొక్క ఒక వర్గీకరణ. రక్తవర్గవ్యవస్థపై ఆధారపడిన ఈ యాంటిజెన్లు మాంస కృత్తులు, పిండి పదార్ధాలు , గ్లైకోప్రోటీన్లు, లేక గ్లైకో లిపిడ్లు అయి ఉండవచ్చు, వివిధ కణజాలాల యొక్కకణాల ఉపరితలంపై కూడా ఇవి ఉండవచ్చు. ఒక అల్లేలే (లేదా అతి సన్నిహితంగా బంధించబడిన జన్యువుల)మూలంగా గల ఈ ఎర్ర రక్తకణాల ఉపరితల యాంటిజెన్లు, సామూహికంగా ఒక రక్తవర్ణవ్యవస్థని ఏర్పరుస్తాయి.

రక్తం యొక్క రకాలు అనువంశికంగా తల్లిదండ్రుల నుండి వచ్చి ఇద్దరి గుణాలను కలిగి ఉంటాయి.మొత్తం 30 రకాల మానవ రక్తవర్గవ్యవస్థలు ఇంటర్నేషనల్ సొసైటీ అఫ్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ (ISBT)చే గుర్తించబడ్డాయి.

అనేక మంది గర్భిణీ స్త్రీలు వారి కంటే భిన్నమైన రక్తవర్గాన్ని కలిగిన పిండంను మోస్తారు, మరియు పిండం యొక్క RBCలకు విరుద్ధమైన ప్రతి రక్షకాలని తల్లి తయారు చేసుకోగలదు. కొన్నిసార్లు ఈ తల్లి ప్రతి రక్షకాలు చిన్న ఇమ్మ్యూనోగ్లోబ్యులిన్ IgGగా ఉండి, మాయను దాటి పిండం RBCల యొక్క హేమోలిసిస్ కి కారణమవుతుంది, ఇది తరువాత నవజాత శిశువు యొక్క హేమోలిటిక్ వ్యాధికి దారితీస్తుంది, ఈవ్యాధిలో పిండం యొక్క తక్కువ రక్త కౌంట్ తక్కువ నుండి తీవ్రస్థాయి వరకు ఉండవచ్చు.

  • రక్తవర్గ వ్యవస్థలు
ఇంటర్నేషనల్ సొసైటీ అఫ్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ (ISBT) వారిచే మొత్తంగా 30 మానవ రక్తవర్గ వ్యవస్థలుగుర్తించబడ్డాయి. ఒక పరిపూర్ణ రక్త వర్గం RBCల ఉపరితలంపై ఉన్న 30 రకాల పదార్ధాలను వివరిస్తుంది, మరియు ఒక వ్యక్తి యొక్క రక్తవర్గం, రక్తవర్గ యాన్టిజేన్ల యొక్క అనేక రకాల అవకాశాలున్న కలయిక. 30 రక్త వర్గాలలో,600 పైగా వివిధ రక్త వర్గ యాన్టిజేన్లు కనుగొనబడ్డాయి , వీటిలో చాలా రకాలు అరుదైనవి లేదా ఒక ప్రత్యేక సంస్కృతికి చెందిన సమూహాలలో ప్రధానంగా కనుగొనబడతాయి.

సర్వ సాధారణంగా, ఒక వ్యక్తి జీవిత పర్యంతం ఒకే రక్త వర్గాన్ని కలిగి ఉంటాడు, కానీ అత్యంత అరుదుగా ఒక వ్యక్తి యొక్క రక్తవర్గం అంటూ రోగాలు, పుండ్లు పెరగడం, ఆటోఇమ్మ్యున్ వ్యాధులలో ఒక అంటిజేన్ చేరుట లేదా అణచబడుట ద్వారా మారుతుంది. డెమి-లీ బ్రేన్నన్,అనే ఆస్ట్రేలియన్ పౌరునికి జరిగిన కాలేయ మార్పిడిలో అతని రక్త వర్గం మారిపోయిన అరుదైన సంఘటన దీనికి ఉదాహరణ. రక్త వర్గం మారే మరియొక సాధారణ కారణం ఎముక మజ్జ మార్పిడి. ఎముక మజ్జ మార్పిడి ఇతర రోగాలతో పాటు ఎక్కువగా లుకేమియా మరియు లిమ్ఫోమాస్ లకు జరుగుతుంది. ఒక వ్యక్తి వేరొక ABO వర్గం (ఉదా.A వర్గ రోగి O వర్గ దాత నుండి ఎముక మజ్జ పొందినపుడు ) కలిగిన వ్యక్తినుండి ఎముక మజ్జ పొందినపుడు ఆ రోగి యొక్క రక్త వర్గం దాత యొక్క వర్గంలోకి మారిపోతుంది.


కొన్ని రక్త వర్గాలు ఇతర వ్యాధుల వారసత్వంకు సంబంధించి ఉంటాయి ; ఉదాహరణకు , కెల్ యాన్టిజేన్ కొన్నిసార్లు మెక్లాయిడ్ సిండ్రోమ్ తో సంబంధం కలిగి ఉంటుంది. కొన్ని రక్త వర్గాలు అంటువ్యాధుల అనుకూలతపై ప్రభావాన్ని చూపిస్తాయి , ఉదాహరణకు డఫ్ఫీ యాన్టిజేన్ లోపం ఉన్న వ్యక్తులు ప్రత్యేక మలేరియా జాతులకు నిరోధకత చూపించడం . డఫ్ఫీ యాన్టిజేన్ దాని యొక్క సహజ ఎంపిక వల్ల ,మలేరియా ప్రాబల్యం ఉన్న ప్రాంత ప్రత్యేక సమూహాలలో తక్కువగా ఉంటుంది.


  • ABO రక్త వర్గ వ్యవస్థ --ABO blood group system
ABO వ్యవస్థ మానవ-రక్త మార్పిడిలో ఒక అతి ముఖ్యమైన రక్త వర్గ వ్యవస్థ. వ్యతిరేక -A ప్రతి రక్షకాలు మరియు వ్యతిరేక-B ప్రతిరక్షకాల సాహచర్యాన్ని "ఇమ్మునోగ్లోబ్యులిన్ M", IgM ప్రతిరక్షకాలు అంటారు. ABO IgM ప్రతిరక్షకాలు, జీవిత ప్రధమభాగంలో ఆహారము, బాక్టీరియా, మరియు వైరస్ ల వంటి పరిసర పదార్ధాలకు ప్రతిస్పందనగా ఏర్పడతాయి. ఇతర భాషలలో ABO లో "O" అనేది "0" (సున్న/శూన్యంగా) పిలువబడుతుంది.

  • Phenotype- Genotype
A-- AA లేక AO
B -- BB / BO
AB- AB
O -- OO

  • Rhesus blood group system

రీసస్ వ్యవస్థ మానవ-రక్త వ్యాపనంలో రక్త-వర్గ వ్యవస్థలో రెండవ అతిప్రధానమైనది. RhD అంటిజేన్ అతి ప్రధానమైన రీసస్ అంటిజేన్ ఎందుకంటే ఐదు ప్రధాన రీసస్ అంటిజెన్స్లో ఇది ఎక్కువ ఇమ్మునోజేనిక్ గా ఉంటాయి. RhD- నెగిటివ్ వ్యక్తులు అటువంటి అంటి-RhD IgG లేదా IgM ప్రతిరక్షకాలను కలిగి ఉండకపోవడం సాధారణం, ఎందుకంటే యాంటి-RhD ప్రతిరక్షకాలు సాధారణంగా పరిసర పదార్ధాలకు వ్యతిరేక సున్నితత్వంతో తయారుకావు. ఏదేమైనా, RhD-నెగిటివ్ వ్యక్తులు IgG అంటి-RhD ప్రతి రక్షకాలను సున్నితత్వపు సంఘటన నుండి తయారు చేసుకోగలవు: గర్భధారణ సమయంలో తల్లి గర్భం లోని పిండం యొక్క రక్త వ్యాపనం లేదా కొన్ని సార్లు RhD పాజిటివ్ RBCల తో రక్త వ్యాపనం. ఈ సందర్భాలలో Rh వ్యాధి కలుగ గలదు.


1. తల్లిదండ్రులిద్దరూ 'ఒ' గ్రూపు వారైతే బిడ్డ 'ఒ' గ్రూపుకే చెందుతుంది. 'ఎ', 'బి' గ్రూపు కానేకాదు.

2. తల్లిదండ్రులళో ఒకరు 'ఒ' మరొకరు 'ఎ' అయినా లేదా ఇరువురూ 'ఎ' గ్రూపుకి చెందిన వారైతే బిడ్డ 'ఎ' లేదా 'ఒ' గ్రూపుకి చెందుతుంది. 'బి'కి గాని, 'ఎబి'కి గాని చెందదు.

3. తల్లిదండ్రులలో ఒకరు 'బి' మరొకరు 'ఒ' అయినా, ఇరువురూ 'బి' అయినా బిడ్డ 'ఒ' లేక 'బి' గ్రూపు అవుతుంది. 'ఎ' లేక 'ఎబి' గ్రూపు అవదు.

4. తల్లిదండ్రులలో ఒకరు 'బి' మరొకరు 'ఎ' అయితే బిడ్డ నాలుగు గ్రూపులలో 'ఎ'గాని, 'బి'గాని, 'ఎబి'గాని, 'ఒ' గాని కావచ్చు.

తల్లిదండ్రులలో ఒకరు 'ఎబి' మరొకరు 'ఒ' అయితే బిడ్డ 'ఎ' గాని 'బి'గాని 'ఎబి'గాని అయితే బిడ్డ 'ఒ'వర్గం తప్ప మిగతా ఏ వర్గమైనా కావచ్చు. ఇవే కాకుండా యం.యస్(MS),ఆర్.హెచ్(Rh factor) మొదలైన వాటిగా బ్లడ్ గ్రూప్ లు తిరిగి వర్గీకరించబడ్డాయి. ఏదైనా బిడ్డకి సంక్రమించే బ్లడ్ గ్రూపులు, తల్లిదండ్రుల ద్వారా సంక్రమించే క్రోమోజోమ్ లు అందులో బ్లడ్ గ్రూపులకి సంబంధించిన రసాయనాల మీద ఆధారపడి వుంటుంది. బ్లడ్ గ్రూపులు వంశపారంపర్యం, తండ్రి/తల్లి బ్లడ్ గ్రూపు ఏది అయితే అదే పిల్లలకు వస్తుంది .




దనియాలు గురించి భాగం 1

ధనియాలను ఇంగ్లీష్‌లో కొరియాండర్ అనీ పిలుస్తారు.

ధనియాల గింజలను కూరపొడి, సాంబారు పొడి తయారీలకు, కూరల తాళింపుకోసం వాడటం ఆనవాయితి. వంటింట్లో ఉపయోగించే సుగంధద్రవ్యాల్లో ఆరోగ్యాన్ని అన్ని ఆరోగ్యాన్ని ఇచ్చేవే. అయితే వాటికి తగువిధంగా వాడటం ముఖ్యం. ఉదాహరణకు పసుపును సౌందర్యసాధనంగా ఉపయోగిస్తారు. అలా మిరియాలు, జీలకర్ర, ఆవాలు, ధనియాలు.. ఇలా అన్ని ఆరోగ్యానికి ఆసరాఇచ్చేవే. వీటిలో ధనియాలు చేదు,కారం, వగరు రుచులను కలిగి ఉంటుంది. వీటిని వంటింట్లో సాంబారు, చారు వంటి వాటిల్లో ఉపయోగిస్తారు. మంచిరుచితో పాటు, సువాసన కూడా ఉంటుంది. సాంబారు, చారుల్లో సువాసన కోసం కొందరు, ఆరోగ్యం కోసం కొందరు ఉపయోగించే కొత్తిమీర కాయలే ఈ ధనియాలు. అయితే కేవలం వంటింటి దినుసుగానే కాకుండా ధనియాలను ఔషధంగా కూడా వాడవచ్చు.

ఇటీవల జరిగిన అధ్యయనాల్లో ధనియాలు కార్మినేటివ్‌గా (గ్యాస్‌నుంచి ఉపశమనం కలిగించేదిగా) పనిచేస్తుందని తేలింది. అలాగే రిఫ్రిజిరెంట్‌గా (శరీరాన్ని చల్లపరిచేదిగా), డైయూరిటిక్‌గా (మూత్రాన్ని జారిచేసినదిగా), ఏఫ్రోడైజియాక్‌గా (లైంగిక శక్తిని పెంచేదిగా), యాంటీ స్పాస్‌మోడిక్‌గా (అంతర్గత అవయవాల్లో నొప్పిని తగ్గించేదిగా), హైపోగ్లైసీమిక్‌గా (రక్తంలో గ్లూకోజ్‌ని తగ్గించేదిగా) పనిచేస్తుందని తేలింది. ఇన్ని సుగుణాలున్న ధనియాలను చూస్తుంటే ప్రకృతి ప్రసాధించిన ఒక వరంగా మనం భావించాలి. మనదేశంలో పెరిగి ఇతర మసాలా దినుసులతో పాటు ధనియాలు కూడా సంవత్సరం పొడవునా పండిస్తారు. కొత్తిమీర చెట్టునుండి కాచే ఈ ధనియాల కాయలను ఎండవెట్టి, తర్వాత గింజల రూపంలో లేదా, పౌడర్ రూపంలో వీటిని ఉపయోగించుకుంటారు. ధనియాల్లో అనేక పోషకాంశాలున్నాయి. న్యూట్రీషియన్ చార్ట్ ప్రకారం ఇందులో ఫైబర్ 8%, కాల్షియం 2.9%, ఉండి ఆరోగ్యానికి మేలు చేస్తాయి. మనం రెగ్యులర్ గా తీసుకొనే ఆహారాల్లో ధనియాలు కూడా ఒక గొప్పపోషకాంశాలున్న ఆహారంగా వీటిని రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవాలి. ధనియాలను రేటింగ్ సిస్టమ్ లో మొదటి వరుసలో ఉంటుంది. ఎందుకంటే ధనియాల్లో అనేక పోషకాంశాలతో పాటు అద్భుతమైన జబ్బులను నయం చేసి లక్షణాలు పుష్కలంగా ఉన్నట్లు కనుగొన్నారు. యూరప్ లో దీన్ని యాంటీ డయాబెటిక్ ప్లాంట్ గా పిలుస్తారు. మరి, ధనియాల వల్ల వీటితో పాటు మరిన్ని హెల్త్ బెనిఫిట్స్ తెలుసుకోవాలంటే ఈ క్రింది అంశాలను చదవాల్సిందే...

1. బ్లడ్ షుగర్ లెవల్స్ ను కంట్రోల్ చేస్తుంది: 
మధుమేహం నివారించడంలో చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. మధుమేమం రాకుండా నిరోధించడానికి మరియు ఉన్న వ్యాధిన నయం చేయడానికి ఖచ్చితమైన పరిష్కారం ఇది. ప్రకృతిపరంగా లభించిన ధనియాలలో అనేక వైద్యపరమైన లక్షణాలు కలిగి ఉండటం వల్ల సహజ రూపంలో మన తీసుకోవడం వల్ల రక్తంలో చెక్కర స్థాయిలను తగ్గిచవచ్చని అనేక పరిశోధనులు, అధ్యయనాలు చెబుతున్నాయి.

2. టైఫాయిడ్ నుండి కోలుకొనేలా చేస్తుంది: 
టైఫాయిడ్ కు కారణం అయ్యే హానికరమైన సాల్మోనెల్లా బ్యాక్టీరియాతో పోరాడుతుందని రుజువయ్యింది. ఆహారం వల్ల కలిగే అనారోగ్యంకు సాల్మొనెల్లా కారణం అవుతుంది . కాబట్టి, మీ రెగ్యులర్ డైట్ లో ధనియాల పొడిని చేర్చుకోవడం వల్ల ఆహారం వల్ల వచ్చే ఘోరమైన వ్యాధులను నివారించే గుణాలు ఇందులో పుష్కలంగా ఉన్నాయి.

3. ఒక దట్టమైన హెర్బ్ (మూలిక):
 ధనియాల పొడిలో ఫైటోన్యూట్రియంట్ లక్షణాలు పుష్కలంగా ఉండటం వల్ల ఇది అనేకు ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తుంది . ధనియాల పొడిలోని వాలుటైల్ ఆయిల్, ఫైటో న్యూట్రియంట్స్ అంటే లినలూల్, బోర్నియోల్, కార్వోని, ఎపిజినిన్, క్యాంపోర్ మరియు మరికొన్ని ఔషధగుణాలు ఇందులో పుష్కలంగా ఉన్నాయి.

4. మొటిమలు మరియు మచ్చలును నివారిస్తుంది:
ధనియాల పొడి వల్ల మరో ఉత్తమ ప్రయోజనం, మొటిమలు మరియు మచ్చలను నివారిస్తుంది. మొటిమలు అనేవి టీనేజ్ వారిలో ఒక పీడకలగా ఉంది. ధనియాల పొడి మరియు పసుపు లేదా ధనియాల రసంతో మిక్స్ చేసి మొటిమలున్న ప్రదేశంలో అప్లై చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

5. కొలెస్ట్రాల్ నియంత్రిస్తుంది:  కొలెస్టరాల్ ఆధిక్యత ధనియాల పొడి కొలెస్టరాల్‌ని నియంత్రణలో ఉంచుతుంది. రెండు చెంచాలు ధనియాలను నలగ్గొట్టి ఒక గ్లాసు నీళ్లకు చేర్చి మరిగించి చల్లారిన తరువాత వడపోసుకొని తాగాలి. ఇలా రెండుపూటలా కొన్ని నెలలపాటు చేస్తే మంచి ఫలితం కనిపిస్తుంది.

6. అంటువ్యాధులను నివారిస్తుంది:
అంటువ్యాధులు అంటే చికెన్ పాక్స్ వంటివి ఒకరి నుండి మరొకరికి వ్యాప్తి చెందుతాయి. ఇంటువంటి అంటువ్యాధులకు కారణం అయ్యే జర్మ్ (సూక్మక్రిముల)తో పోరాడటానికి మరియు చంపడానికి ధనియాల్లోని ఔషధగుణాలు అద్భుతంగా సహాయపడుతాయని కొన్ని స్టడీస్ నిరూపించబడ్డాయి.

7. రుతు సమస్యలను నియంత్రించే ఒక ఉత్తమ ఔషదం:
ఆరోగ్యకరమైన సుగంధ ద్రవ్యాల్లో ఆరోగ్యకరమైన లక్షణాలున్నాయి. అధిక బహిష్టుస్రావం ఆరు గ్రాముల ధనియాలను అర లీటర్ నీళ్లకు కలిపి సగం నీళ్లు మాత్రం మిగిలేంతవరకూ మరిగించాలి. దీనికి పటిక బెల్లం చేర్చి గోరువెచ్చగా ఉన్నప్పుడే తీసుకోవాలి. ఇలా మూడునాలుగు రోజులు చేస్తే బహిష్టు సమయాల్లో జరిగే రక్తస్రావాధిక్యత తగ్గుతుంది. అంతే కాదు, రుతుక్రమం క్రమంగా వచ్చేలా సహాయపడుతుంది.

8. ఫీరాడికల్స్ ను తొలగిస్తుంది:
ధనియాలు(కొత్తిమీర, ధనియాలు, లేదా పొడి) ఇలా ఏరూపంలోనైనా సరే తీసుకోవడం వల్ల వివిధ రకాల యాంటీఆక్సిడెంట్స్ ను మన శరీరానికి అంధిస్తుంది. దాంతో మన శరీరంలోని ఫ్రీరాడికల్స్ ఎదుర్కోవడానికి సహాయపడుతుంది. ఈ లక్షణాలన్ని కలగలిసి ఉన్నందు వల్లే దీన్ని ఔషధాగుణాలున్న మసాలా దినుసుల్లో టాప్ లో ఉంచారు.




28 Jun 2015

అంగీరసుడు చేసిన ఆత్మజ్ఞానబోధ



కర్మబంధము, ముక్తికార్యము, కారణము స్థూలసూక్షము. ఈ ద్వంద్వ సంబదితమే దేహము అనబడును. జీవుడంటే వేరెవరూ కాదు.
అంతఃకరణానికీ, తద్వ్యాపారాలకీ, బుద్ధికీ సాక్షి సత్, చిత్ ఆనందరూపీ అయిన పదార్థమే ఆత్మ అని తెలుసుకో. దేహము కుండవలె రూపాదిగా వున్న పిండ శేషము ఆకాశాది పంచభూతాల వలన పుట్టినది అయిన కారణంగా ఈ శరీరము ఆత్మేతరమైనదే తప్ప ఆత్మమాత్రము కాదు. ఇదేవిధంగా ఇంద్రియాలుగానీఅగోచరమైన మనస్సుగానీ, అస్థిరమైన ప్రాణముగానీ ఇవేవీ కూడా  ‘ఆత్మకాదు అని తెలుసుకో. దేనివలనైతే దేహేంద్రియాలన్నీ భాసమానాలవుతున్నాయో అదే ఆత్మగాతెలిసికొని ఆత్మపదార్థమే నేనై వున్నానుఅనే విచికిత్సను పొందు. ఏ విధంగానైతే అయస్కాంతమణి తాను ఇతరాచలచేత ఆకర్షించబడకుండా ఇనుమును తాను ఆకర్షించునో అదేవిధంగా తాను నిర్వికారియై బుద్ధ్యాదులను సైతము చలింప చేస్తుందో దానిని ఆత్మవాచ్యమైన నేనుగా గుర్తించు. దేని సాన్నిధ్యము వలన జడాలైన దేహేంద్రియమనః ప్రాణాలు భాసమానాలౌతున్నాయో అదే జనన మరణ రహితమైన ఆత్మగా భావించు. ఏదైతే నిర్వికారమై నిద్రాజాగ్రత్ స్వప్నాదులనూ, వాటి ఆద్యంతాలనూ గ్రహిస్తున్నదో అదే నేనుగా స్మరించు. ఘటాన్ని ప్రకాశింపచేసే దీపం ఘటితమైనట్లే దేహేతరమై నేను అనబడే ఆత్మచేతనే దేహాదులన్నీ భాసమానాలవుతాయి. దేహేంద్రియ మనః ప్రాణాహంకారాల కంటే విభిన్నమైనది జనితత్వ అస్తిత్వ వృద్ధిగతత్వ, పరిణామత్వ, క్షీనత్వ, నాశాంగ తత్వాలనే షడ్వికారాలు లేని దానినే ఆత్మగా అదే నీవుగా --- ఆ నీవే నేనుగా నేనే నీవుగా త్వమేవాహంగా భావించు. ఈ విధంగా త్వం” (నీవు అనే పదార్థ జ్ఞానాన్ని పొంది, తత్కారణాత్ వ్యాపించే స్వభావము వలన సాక్షాద్విధిముఖంగా తచ్ఛబ్దార్థాన్ని గ్రహించాలి. (తత్ శబ్దానికి బ్రహ్మఅని అర్థం.)
సాక్షా ద్విధిముఖాత్ అంటే – “సత్యం జ్ఞానమనంతరం బ్రహ్మ అనే వాక్యలద్వార సత్యత, జ్ఞానం, ఆనందాలవల్లనే ఆత్మనరయగలగాలని అర్థము. ఆ ఆత్మ’  సంసార లక్షణావేష్టితం కాదనీ, సత్యమనీ, దృష్టి గోచరము కాదని, చీకటి నెరుగనిదనీ లేదా చీకటికి అవతలిదనీ, పోల్చి చెప్పడానికి వీలు లేనంతటి ఆనందమయమనీ, సత్య ప్రజ్ఞాది లక్షణయుతమనీ, పరిపూర్ణమనీ పూర్వోక్త సాధనలవలన తెలుసుకో దేనినైతే సర్వజ్ఞం పరేశం సంపూర్ణ శక్తిమంతంగా వేదాలు కీర్తిస్తున్నాయో ఆ బ్రహ్మ నేనేఅని గుర్తించు. ఏది తెలుసుకుంటే అన్నీ తెలిసిపోతాయో అదే ఆత్మ అదే నువ్వు. అదే నేను తదను ప్రవిశ్యఇత్యాది వాక్యాల చేత జీవాత్మరూపాన జగత్ప్రవేశము ప్రవేశిత జీవులను గురించిన నియంతృత్వము కర్మ ఫలప్రదత్వమూ సర్వజీవ కారణ కర్ర్తుత్వమూ దేనికైతే చెప్పబడుతూ వుందో అదే బ్రహ్మ’  గా తెలుసుకో.
ఓ జిజ్ఞాసా ! అద్వయానంద పరమాత్మయే ప్రత్యగాత్మే ఆ పరమాత్మ ఈ ప్రకారమైన తాదాత్మ్యత ఏనాడు సిద్ధిస్తుందో అప్పుడు మాత్రమే తత్శబ్దార్థం తనేనని త్వంశబ్దం సాధనమేగానీ, ఇతరం కాదని తేలిపోతుంది. అహం బ్రహ్మాస్మి అనే వాక్యార్థబోధ స్థిరపడే వరకూ కూడా శమ దమాది సాధన సంపత్తితో శ్రవణమననాదికాల నాచరించాలి. ఎప్పుడైతే శృతివల్లనో, గురుకటాక్షము వల్లనో తాదాత్మ్యబోధ స్థిరపడుతుందో, అప్పుడీ వర్తమాన సంసార లంపటం దానికదే పుటుక్కున తెగిపోతుంది. అయినా కొంతకాలము ప్రారబ్ధకర్మ పీడిస్తూనే ఉంటుంది. అది కూడా క్షయమవడంతో పునరావృత్తి రహితమైన స్థాయిన చేరతాము. దానినే ముక్తి మోక్షము అంటారు. అందువల్ల ముందుగా చిత్తశుద్ధి కోసం కర్మిష్టులుగా వుండి, తత్ఫలితాన్ని  దైవార్పణం చేస్తూండడం వలన ప్రారబ్దాన్ననుసరించి ఆ జన్మలో గానీ, లేదా ప్రారబ్ధ కర్మఫలము అధికమైతే మరుజన్మలోనైనా వివిధ మోక్షవిద్యాభ్యాస పరులై, జ్ఞానులై, కర్మబంధాల్ని త్రెంచుకొని ముక్తులవుతారు.అని అంగీరసుడు చెప్పగా ......ధనలోభుడు నమస్కరించెను

Braahmma Kaalam ( బ్రహ్మ యొక్క కాలం ఎంతో తెలుసా ? )

ఒక లఘువుని ('' అనే లఘువు పలికే సమయాన్ని నిమేషము అని అంటారు). 
ఒక రెప్పపాటుకి కూడా నిమేషము అని పేరు. ఇటువంటి నిమేషములు 15 అయితే ఒక కాష్ట అని పేరు. ఇటువంటి కాష్టలు 30 అయితే ఒక కళ. ఇటువంటి కళలు 30 అయితే దానికి ఒక ''క్షణం'' అని పేరు. ఇటువంటి 12 క్షణములు ఒక ముహూర్తం. 30 మూహూర్థములు ఒక రాత్రి ఒకపగలు(మన కాలమానం ప్రకారం ఒకరోజు). 24 గంటల కాలానికి ముప్పై ముహూర్తములు అంటారు. ఇటువంటి అహోరాత్రములు(ఒక పగలు ఒకరాత్రి అంటే ఒకరోజు) 15 ఐతే ఒక పక్షం. ఇటువంటి పక్షములు రెండు ఐతే (30 రోజులు) ఒక మాసం. నెలకి ముప్పై ముప్పైలు 900 ముహూర్తములు ఉన్నాయి. 
ఇలాంటి మాసములు రెండు అయితే ఒక ఋతువు. ఇలాంటి ఋతువులు 6 అయితే ఒక సంవత్సరం. ఈ సంవత్సరానికి 3ఋతువులు ఒక అయినం. ఉత్తరాయణం, దక్షిణాయనం. ఈ రెండుకలిసి ఒక సంవత్సరం. ఈ సంవత్సరకాలం దేవతలకి ఒక రోజు. ఇక యుగములు 4ఉన్నాయి. కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం. కృతయుగానికి మాంధాత యుగపురుషుడు. త్రేతాయుగానికి రాముడు యుగపురుషుడు. ద్వాపరానికి ధర్మరాజు యుగపురుషుడు. ధర్మరాజు పేరు మీద యుధిష్టిర శకం అని ఒక శకం కూడా ఉన్నది. కృతయుగానికి 17,28,000 సంవత్సరాల కాలం ఉంది. త్రేతాయుగానికి 12,96,000 సంవత్సరాలకాలం ఉంది. ద్వాపరయుగానికి 8,64,000 సంవత్సరాలకాలం ఉంది. కలియుగానికి 4,32,000. సంవత్సరాలకాలం ఉంది. ప్రస్తుతం కలియుగం మొదటి పాదంలో 5113సంవత్సరాల కాలం గడిచింది. కలియుగం 4,32,000 సంవత్సరాలని 2,3,4తో గుణిస్తే వరుసగా ద్వాపర, త్రేతా, కృతయుగముల కాలం వస్తుంది. 
ఈ నాలుగు యుగాలని ఒక దివ్యయుగం అంటారు. ఈ దివ్యయుగానికి 43,20,000 సంవత్సరాల కాలం పడుతుంది. ఇలాంటి దివ్య యుగాలు (432 కోట్ల సంవత్సరాలు) 1000 గడిస్తే బ్రహ్మదేవుడికి ఒక పగలు. (432 కోట్ల సంవత్సరాలు) ఇంతే కాలం ఒక రాత్రి. ఇటువంటి 864 కోట్ల సంవత్సరాలు ఒక రోజు. ఇలాంటి ఒకరోజు గడిపిన ఆయనకి పితామహుడు అని పేరు. ఈ మన్వంతరాలు 14 ఉన్నాయి. ఒక్కో మనువు 71 మహాయుగాలు రాజ్యపాలన చేస్తాడు. బ్రహ్మ పగటికాలంలో 14 మంది మనువులు వెళ్ళిపోతున్నారట. ఒక మనువు వెళ్లి ఇంకో మనువు వచ్చేకాలంలో మహాప్రళయం వస్తుంది. 71 యుగాలు ఒక మనువు పాలించి వెళ్ళిపోయి మరొక మనువు వచ్చే సరికి ఈ మధ్యకాలంలో ప్రళయం వస్తుంది. మనువు ఉన్నంతకాలం ఇంద్రుడు కూడా ఉంటాడు. స్వాయంభువ మనువు, స్వారోచిస మనువు ఇలాంటి మనువులు 7గురు వల్లిపోయారు. 
ఇప్పుడు వైవస్వత మనువు కాలం నడుస్తుంది. ఇప్పటికి 7మహాప్రళయాలు గడిచాయిఈ మహాకల్పంలో. ఈప్రళయం ఆదియుగం కాలం పాటు ఉంటుంది. అంటే 17,28,000 సంవత్సరాలకాలం పాటు ప్రళయం ఉంటుంది. ఈ ప్రళయ కాల సమయంలో మొత్తం నీటితో నిండిపోయి ఉంటుంది సృష్టి అంతా! ఈ ప్రళయం అంతా బ్రహ్మ నిద్రించే సమయంలో జరుగుతుంది. బ్రహ్మ నిద్రలేచే సమయానికి ప్రళయం వెళ్ళిపోతుంది. నిద్రలేవగానే బ్రహ్మ సృష్టి మళ్లి మొదలుపెడతాడు. ఈ ప్రళయానికి నైమిత్తిక కల్పము అని పేరు. బ్రహ్మదేవుడు నిద్దుర పోయే సమయం, ఈ ప్రళయకాల సమయానికి నైమిత్తిక కల్పం అని పేరు. ఇటువంటివి ముప్పై దినములు బ్రహ్మకి ఒక నెల. అటువంటివి 12 అయితే ఒక సంవత్సరం. అటువంటి నూరు సంవత్సరాలు బ్రహ్మ యొక్క ఆయుర్దాయం. దీనిని ఒక మహా కల్పం అని పేరు. దీనికి పూర్వ, అపర అని రెండు భాగములు. పూర్వ మహా కల్పాన్ని పద్మ కల్పం అంటారు. అపరానికి వరాహ కల్పం అని పేరు. ఇప్పుడు మనం శ్వేత వరాహ కల్పంలో ఉన్నాం.