2 May 2015

For Asthama Remedies


ఉష్ట్రాసనంతో..  , ఆస్తమ కు మరియు ఒత్తిడికి దూరం

వీపును వెనక్కి వంచడం ద్వారా శరీర ఊర్ధ భాగంలో ఇమిడి ఉన్న ఒత్తిడిని తొలగించవచ్చు. భుజాలు, ఛాతి భాగంలో ఉన్న గుండె, ఊపిరితిత్తులు రిలాక్స్ అవ్వడం వల్ల స్ట్రెస్ నుంచి బయటపడొచ్చు. అలా వీపును వెనక్కి వంచి ఒత్తిడిని తగ్గించే ఉష్ట్రాసనం ఈవారం...

 ఉష్ట్రాసనం
ముందుగా వజ్రాసనంలో కూర్చోవాలి. రెండు మోకాళ్లను ఒకదానికొకటి కొద్దిగా దూరంగా ఉంచాలి. వెనుకగా వేళ్లు భూమికి ఆనేటట్లు చూడాలి. రెండు చేతులను వెనుకగా తిప్పి కాలి మడమలను పట్టుకోవాలి. గాలి పీల్చుకుని నడుమును ముందుకు తోయాలి. తలను వీలున్నంతగా వెనక్కి వంచాలి. ఈ స్థితిలో మామూలుగా గాలి పీలుస్తూ ఉండగలిగినంత సమయం ఉండి గాలి వదిలేస్తూ సాధారణ స్థితికి రావాలి. ఈ విధంగా మూడుసార్లు రిపీట్ చేయాలి.

ఉష్ట్రాసనం  1
ముందుగా వజ్రాసనంలో కూర్చోవాలి. రెండు మోకాళ్లను ఒకదానికొకటి కొద్దిగా దూరంగా ఉంచాలి. వెనుకగా పాదాల వేళ్లను భూమికి ఆనేటట్లు చూడాలి. రెండు చేతులను వెనుకగా తిప్పి, అరచేతులను అరికాళ్లపై ఆన్చాలి. గాలి పీల్చుకుని నడుమును ముందుకు తోయాలి. తలను వీలున్నంతగా వెనక్కి వంచాలి. ఈ స్థితిలో మామూలుగా గాలి పీలుస్తూ ఉండగలిగినంత సమయం ఉండి గాలి వదిలేస్తూ సాధారణ స్థితికి రావాలి. ఈ విధంగా మూడుసార్లు రిపీట్ చేయాలి.

ఉష్ట్రాసనం 2
ముందుగా వజ్రాసనంలో కూర్చోవాలి. రెండు మోకాళ్లు ఒకదానికొకటి కొద్దిగా దూరంగా ఉంచాలి. వెనుకగా పాదాల వేళ్లు భూమికి ఆనేటట్లు చూడాలి. రెండు చేతులను వెనుకగా తిప్పి అరికాళ్లకు తగలకుండా, కాళ్లకు సమాంతరంగా నేలకు ఆన్చాలి. గాలి పీల్చుకుని నడుమును ముందుకు తోయాలి. తలను వీలున్నంతగా వెనక్కి వంచాలి. ఈ స్థితిలో మామూలుగా గాలి పీలుస్తూ ఉండగలిగినంత సమయం ఉండి గాలి వదిలేస్తూ సాధారణ స్థితికి రావాలి. ఈ విధంగా మూడుసార్లు రిపీట్ చేయాలి.

ఉపయోగాలు :
 వెన్నెముకను దృఢపరుస్తుంది.
ఊపిరితిత్తుల పనితీరును మెరుగుపరుస్తుంది.
 థైరాయిడ్ గ్రంథి పనితీరును క్రమబద్ధీకరిస్తుంది.
మరియు ఆస్తమ పూర్తిగా తగ్గుతుంది

జాగ్రత్తలు :
 గుండె జబ్బులు, హెర్నియా, వెన్నెముక సమస్యలు ఉన్న వారు చేయకూడదు.
 మోకాళ్ల నొప్పులు ఉన్నవారు మోకాలి కింద చిన్న దిండు ఉంచాలి.

గమనిక
ఈ ఆసనం చేయడానికి ముందు వార్మప్ తప్పనిసరిగా చేయాలి.

No comments:

Post a Comment