30 May 2015

కుక్కర్లో వండిన అన్నం తో ఆరోగ్య జాగ్రత్తలు

 కుక్కర్లో వండిన అన్నం తో ఆరోగ్య జాగ్రత్తలు

 
కుక్కర్లో వండిన అన్నం తినడం ద్వారా డయాబెటిస్ రావడం....సులభమే
ఆధునిక కాలానికి అనుగుణంగా మారుతున్న లైఫ్‌స్టైల్ ప్రభావం వంటమీద కూడా పడిందనే చెప్పాలి. వంటింటికి ఎన్నో రకాలైన ఎలక్ట్రానిక్ ఉపకరణాలు వస్తూ ఉన్నాయి. కార్యాలయాలకు వెళ్లే మహిళలకు కుక్కర్ వంటి ఉపకరణాలు ఎంతో సహకరించినా.. కుక్కర్లో వండిన అన్నాన్ని తినడం ద్వారా డయాబెటిస్ రావడం ఖాయమని తాజా అధ్యయనంలో తేలింది.
కుక్కర్లో వంట చేయడం చాలా సులభమే. అయితే ఆ ఆహారాన్ని తీసుకోవడం ద్వారా డయాబెటిస్ వచ్చే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆహారాన్ని ఉడికించి వంచే అన్నంలో 30 నుంచి 40 శాతం కార్బొహైడ్రేడ్ తగ్గిపోతుంది. ఇది రక్తంలోని చక్కెర శాతాన్ని పెంచబోదు. అయితే కుక్కర్లో అన్నం వండేటప్పుడు మాత్రం అన్నంలోని పిండి పదార్థాలు (కార్బొహైడ్రేడ్లు) పూర్తి శాతం అలాగే ఉండిపోతాయి.
కుక్కర్లో వండిన అన్నంలో గంజి అలాగే ఉండిపోతుంది. గంజిలో కెలోరీలు, గ్లూకోజ్ శాతం అధికం. ఈ రెండు రక్తంలోని చక్కెర శాతాన్ని ఉన్నట్టుండి పెంచేస్తాయి. కుక్కర్లో వండిన అన్నాన్ని తీసుకునే వారిలో కొంతమందికి కొత్తగా మధుమేహం వచ్చే అవకాశం ఉంది.
ఇంకా పీచు పదార్థాలతో కూడిన గంజి (కుక్కర్లో వండిన) అన్నాన్ని తీసుకోవడం అంత మంచిది కాదని, గంజి వార్చిన అన్నాన్ని తీసుకోవడం ద్వారానే రక్తంలోని చక్కెర శాతాన్ని నియంత్రిస్తుందని నిపుణులు అంటున్నారు. బియ్యం ఎంత ఉడికితే అంత మంచిదని, చాలా తక్కువ సమయంలో ఉడికించిన అన్నాన్ని తీసుకుంటే ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని వారు సూచిస్తున్నారు.
http://telugu.webdunia.com/

No comments:

Post a Comment