19 Aug 2015

కాటుక గురించి కొంచం తెలుసుకుందాము

కళ్ళకు కాటుకందమూ.. 

అంటూ ఒక పాటుంది. నిజమే మరి, కాటుకతో కళ్ళ అందం రెట్టింపవుతుంది. ఎంత చిన్న కనులైనప్పటికీ వాటికి కాటుక సింగారించినపుడు అవి అందంగా, పెద్దగా కనిపిస్తాయి. కాటుక వలన కళ్ళకు చలవే చేయడమే కాకుండా కళ్ళు మిలమిల మెరుస్తుం టాయి. కాటుకవల్ల కళ్ళు మరింత అందంగా ఉంటాయికదాని కాటుక సుద్దలు సుద్దలుగా లావు గా పెట్టుకుంటే ఉన్న అందం కూడా పోతుంది.

ప్రస్తుతం మార్కెట్లో ఎన్నో రకాల కాటుకలు దొరుకు తున్నాయి. అయితే వాటిల్లో ఏది మంచి కంపెనీయో, ఏది కాదో తెలీక సందేహంలో పడతాం. కనుక ముందుగా వాటి వివరాలు తెలుసుకుని ఆనక వాడటం మంచిది. లేకుంటే వాటి వలన కంటికి హాని కలుగవచ్చు. కొన్ని కాటుకలు వాడటం వలన కళ్ళకు మంటలు, దురదలు వస్తుంటాయి. అవి ఫలానా కాటుక ఉపయోగించినందు వలన వచ్చాయని గమనించినట్లయితే వేంటనే ఆ కాటుకను వాడటం మానేయాలి. కొన్నిరకాల కాటుకలను ఉపయోగించినందువల్ల క్రమంగా చూపు మందగించే ప్రమాదం కూడా వుంది. ఇలాంటి ఇబ్బందులకు దూరంగా వుండాలంటే మనం ఇంట్లోనే కాటుక తయారు చేసుకోవచ్చు. మనం చేసుకున్న కాటుక పరిశుభ్రంగా, ఆరోగ్యకరంగా, ఉపయోగకరంగా వుంటుంది. డబ్బు కూడా ఆదా చేసినట్లవుతుంది.

 ఇంట్లోనే కాటుక తాయారు చేసే విధానాలు కొన్ని

1. శుభ్రమయిన ప్రమిదలో మంచి ఆముదం పోసి, దానిలో దూదితో చేసిన వత్తిని ముంచి వెలిగించాలి. ఒక రాగి పాత్రను వెలుగుతున్న వత్తికి సుమారు రెండు మూడు అంగుళాల పైన ఉండేట్లు బోర్లించాలి. రాగి పాత్ర లోపలి భాగంలో అంటే మసి అంటుకునే వైపు మంచి గంధం పూత పూయలి. మధ్య మధ్యలో ఆముదాన్ని పోస్తూ బాగా మసి పట్టేలా చేసి, తర్వాత ఆ మసినంతటినీ జాగ్రత్తగా గీకి ఆముదంతో తడిచేసి, ఇందులో కొంచెం కర్పూరాన్ని కలిపి శుభ్రమయిన భరిణెలో నిలువ చేసుకోవచ్చు. ఇలా తయారుచేసుకున్న కాటుక కళ్ళకు మంచిది. కళ్ళను చల్లగా ఆరోగ్యవంతంగా వుంచుతుంది. కాటుక పెట్టుకున్న కళ్ళు కలువల్లా భాసిస్తాయనటంతో అతియోక్తి లేదు. కనుబొమలకు మంచి ఆకృతినిచ్చి, అందంగా ట్రిమ్‌ చేసినట్లయితే కాటుక కళ్ళు మరింత అందాలు చిందిస్తాయి.
-----------------------------------------------------------------------------

2.  నేత్ర సంజీవని కాటుక

కావలసిన పదార్థాలు :

దేశీ ఆవు పిడుక : ఒకటి
ఆవు నెయ్యి : 15 చెంచాలు
వంట ఆముదం : 15 చెంచాలు
భీమనేని కర్పూరం : 1/2 గ్రాము

తయారు చేయు విధానం :
ముందుగా ఆవు నెయ్యి మరియు వంట ఆముదం ఒక గిన్నెలో తీసుకొని బాగా కలపాలి తర్వాతా ఆవు పిదకను అందులో వేసి నానబెట్టాలి తర్వాతా 2 సగం ఇటుకలను ఒక దాని మీద ఒకటి పెట్టాలి తర్వాతా మూడు వైపులా మూడు ఇటుకలను నిలబెట్టాలి. తర్వాతా మధ్యలో పెట్టిన సగం ఇటుకల మీద నెయ్యి, వంట ఆముదం,నూనెలో నానిన పిడుకను పెట్టాలి. తర్వాత ఆ పిడుకను కాల్చాలి. ఆ పిడుకను కాల్చేటప్పుడు ఒక రాగి ప్లేటును ఈ మూడు నిలబెట్టిన ఇటుకల మీద బోర్లించాలి. ఈ పిదుక కాలేతప్పుడు వచ్చిన పొగ రాగి ప్లేటుకు పడుతుంది.ఆ పిదుక పూర్తిగా కాలిన తర్వాత ఆ ప్లేటు తీసి దాని మీద 2 నుండి 3 చుక్కలు నెయ్యి వేసి చెయ్యి శుబ్రంగా  కడుక్కుని తుడుచుకొని చూపుడు వేలుతో మొత్తం ప్లేటుకు పట్టిన నల్లటి పొగను తీసి ఒక కాటుక డబ్బాలో వేసుకోవాలి. ఇలా కర్పూరం పొడిచేసి కలుపుకోవాలి. ఈ విధంగా "నేత్ర సంజీవని కాటుక" తయారవుతుంది.
ఉపయోగాలు :
1). ఇది కండ్లను చల్లగా ఉంచుతుంది.
2). ఇది ఆరంబంలో ఉండే నేత్ర రోగాలను పోగొడుతుంది.
3). ఇది దృష్టిని పెంచుతుంది.
---------------------------------------------------------------

3. చందన కాటుక తయారీ

చందన  కాటుక  తయారీకి కావలసిన వస్తువులు;

1) వెడల్పాటి మట్టి ప్రమిదలు

(2) ప్రత్తి వత్తి , పురి పెట్టకుండా, మందంగా ,అర చేతిలో పరచి,

మధ్యలో కరక్కాయ పొడిని చల్లి ఉంచి, వత్తి ఆకారంలో మెలిపి,మలచాలి.

ఈ వత్తిని ఆముదములో నానబెట్టాలి.

(3) వెడల్పైన ఇత్తడి పళ్ళెము

(పెళ్ళిలో వరుని కాళ్ళు కడిగే పళ్ళెము సరి పోతుంది.)

(4) సాన రాయి మీద గంధపు చెక్కను, అరగ దీసి తీసిన గంధము

(5) ఇత్తడి పళ్ళెము అడుగున,

ఈ గంధమును మూడు పొరలుగా మందముగా పూత పూయాలి.

(6) ఆవు నెయ్యి;

7)తాటాకు రేకు ;

తయారు చేసే పద్ధతి ;

మూడు రాళ్ళు పేర్చి వాని పైన ,ఇత్తడి పళ్ళాన్ని పెట్టాలి.

దానిలో నీళ్ళు పోయాలి. కింద సెగ తగిలేటట్టుగా

ప్రమిదలో నిండా ఆముదం పోసి, నానిన వత్తిని వేసి వెలిగించాలి.

వత్తి వెలుగుకు జానెడు ఎత్తున ఇత్తడి పళ్ళాన్ని అమర్చాలి.

గాలి విసురు లేని చోట, గదిలో ఒక మూలగా ఇలా అమర్చాలి.

(గాలి తగిలితే ,ప్రమిద వెలుగు కదులుతుంది. సెగ సరిగా లేనిచో కాటుక తయారవదు)

ప్రమిదలోని ఆముదము ఐపోయేదాకా, కదల్చ కుండా అలాగే ఉంచాలి.

అంటే మర్నాటికి పళ్ళెము అడుగున ఉన్న గంధము మసి ఏర్పడుతుంది.
అప్పుడు ఈ ఇత్తడి పళ్ళాన్ని తిరగ వేసి, అక్కడి గంధపు మసిని నూరాలి.

రాగి చెంబు(తో శ్రేష్ఠము.)తో గానీ, ఇత్తడి చెంబుతో గానీ ,నూరాలి .

ఆవు నెయ్యిని వేస్తూ, నెమ్మదిగా నూరాలి.

బాగా మెత్తగా నూరిన తర్వాత, మంచి నీటిని 'ధార' వలె, నెమ్మదిగా,

ధారాళంగా(ఇంచు మించి రెండు కడవల నీరు)పోయాలి.
అలాగ తయారైన కాటుకను

'రాగి కాటుక కాయ' లోనికి తీసుకుని, భద్ర పరచుకోవాలి.

కానీ ఈ చందన కాటుక ఎక్కువ తయారౌతుంది.

No comments:

Post a Comment