10 Jul 2015

పిల్లల ఎదుగుదల లోని ముఖ్యమైన దశలు /ఎదుగుదల లోని ఆలస్యమును త్వరితంగా గుర్తించుట






   

పుట్టుక నుండి 6 వారాల వరకు

  • బిడ్డ వీపు మీద పడుకుని తల ఒక ప్రక్కగా తిప్పి ఉంటుంది.
  • అకస్మాతైన శబ్ధానికి అతడి శరీరం ఉలిక్కిపడి బిఱుసుగా మారుతుంది.
  • పిడికిలి గట్టిగా మూసివేయబడి ఉంటుంది.
  • అతడి హస్తానికి మోటుగా తగిలిన వస్తువును దగ్గరకు తీసుకోగలడు. దీనిని గ్రాస్ప్ రిఫ్లెక్స్ అంటారు.

6 నుండి 12 వారాల వరకు

  • అతడి మెడను బాగా నిలుపుట నేర్చుకుంటాడు.
  • వస్తువుల మీద చూపు నిలపగలుగుతాడు.

3 నెలలు

  • వెల్లకిలా పడుకున్నప్పుడు అతడి చేతులు మరియు కాళ్ళు సమానంగా కదల్చగలడు. సమన్వయముకాని లేక తుళ్ళిపడే కదలికలు కావు. బిడ్డ ఏడుపే కాకుండా గుడుగుడు అను, ఇతర శబ్ధములు చేయును.
  • బిడ్డ తల్లిని గుర్తించి మరియు ఆమె గొంతుకు స్పందించును.
  • బిడ్డ  చేతులు ఎక్కువగా తెరిచే యుండును.
  • బిడ్డను ఎత్తుకున్నప్పుడు, బిడ్డ తన తలను లిప్తకాలము కంటే ఎక్కువ కాలం నిలపలేడు

6 నెలలు

  • బిడ్డ తన చేతులను ఒక దానితో ఒకటి అంటించి ఆడుకుంటాడు
  • బిడ్డ తన చుట్టు ప్రక్కల చేయు శబ్ధములకు తలత్రిప్పును.
  • బిడ్డ తన వీపు నుండి పొట్టమీదకు , పొట్టమీదనుండి వీపు మీదకు తిరుగుతాడు
  • ఆధారంతో బిడ్డ కాసేపు కూర్చోగలడు.
  • బిడ్డను ఎత్తుకున్నప్పుడు, అతనికాళ్ళమీద కాస్త బరువును భరించగలడు.
  • అతని పొట్టమీదున్నప్పుడు, ఆ బిడ్డ తన చాపబడిన చేతులతో వాడి బరువును మోయగలడు.

9 నెలలు

  • శరీరం పైకి లేపకుండా తన చేతులతో ఆధారం లేకుండా కూర్చోగలడు
  • బిడ్డ తన చేతులతో మరియు మోకాలితో పాకగలడు.

12 నెలలు

  • బిడ్డ నిలబడుటకు పైకి లేస్తాడు.
  • మామ అను మాటలు అనుట ప్రారంభించును.
  • సామాన్లు పట్టుకుని నడవగలుగును.

18 నెలలు

  • సహాయం లేకుండా గ్లాసుపట్టుకొనగలడు మరియు వలకకుండా త్రాగగలడు.
  • బిడ్డ పడిపోకుండా, తూలిపోకుండా ఒక పెద్ద గది గుండా ఆధారం లేకుండా నడవ గలడు.
  • రెండు, మూడు మాటలు పలుకగలడు.
  • బిడ్డ తనంతట తానే తినగలడు.

2 సంవత్సరాలు

  • బిడ్డ పైజమా లాంటి బట్టలను తీసివేయగలడు.
  • బిడ్డ పడిపోకుండా పరిగెత్తగలడు.
  • బిడ్డ బొమ్మల పుస్తకం లోని బొమ్మల మీద ఆసక్తి కనబరచును.
  • బిడ్డ తన కేమి కావాలో తెలుపగలడు.
  • బిడ్డ ఇతరులు చెప్పిన మాటలు తిరిగి చెప్పగలడు.
  • బిడ్డ తన శరీరం లోని కొన్ని అవయవాలను గుర్తించగలడు.

3 సంవత్సరాలు

  • బిడ్డ బంతిని పైకి విసరగలడు ( ప్రక్కకు లేదా క్రిందకు కాకుండా )
  • నీవు అమ్మాయివా అబ్బాయివా అనే చిన్న ప్రశ్నలకు బిడ్డ సమాధానం చెప్పగలడు.
  • బిడ్డ వస్తువులను అవతలకు పెట్టడానికి సహాయపడును.
  • బిడ్డ కనీసం ఒక రంగు పేరైనా చెప్పగలడు.

4 సంవత్సరాలు

  • మూడు చక్రాల బండిని త్రొక్కగలడు.
  • పుస్తకాలలోని  పత్రికలలోని బొమ్మలను గుర్తించగలడు.

5 సంవత్సరాలు

  • బిడ్డ తన బట్టలకు గుండీలు పెట్టుకొనగలడు.
  • బిడ్డ కనీసం మూడు రంగుల పేర్లను చెప్పగలడు.
  • బిడ్డ పాదాలను ఒకదాని కొకటి మార్చి మెట్ల కిందకు దిగగలడు.
  • బిడ్డపాదాలు దూరంగా పెట్టి గెంతగలడు.
ఆధారము : డాక్టర్ యన్ డి టివి టీమ్

       

No comments:

Post a Comment